Posts

NA RUDRO RUDRAMARCHAYAET-24

Image
     న రుద్రో రుద్రమర్చయేత్-24    ************************     జటాజూటధారి-శివాచంద్రమౌళి    నిటాలాక్ష నీవే-సదా మాకు రక్ష.    ప్రియమిత్రులారా ఈనాటి బిల్వార్చనలో మనము జట శబ్దమును అర్థముచేసుకునే ప్రయత్నమును చేద్దాము.   శిష్తరక్షన-దుష్టశిక్షణ చేయగల స్వామి ప్రకటన శక్తి జట.   భగీరథుని అనుగ్రహించినది స్వామి. జటాజూట సహకారమేకదా .శాపగ్రస్తుదైన చంద్రుని శిరోలంకారముగా మలచినది స్వామి జటాజూటమే.స్థితికార్య సంకేతము స్వామి జటాజూటమే.జీవుల శరీర నాడుల ముడులు స్వామి జటాజూటములే.  దక్షయజ్ఞ సందర్భముగా ఆ జటనుండి ఉద్భవించిన వీరభద్రుడు దక్షుని అహమును నశింపచేసినాడు కదా.   స్వామి ఆకాసతత్త్వమును చెప్పునది స్వామి ఊర్థ్వ కేశపాసమే కదా.   ఎన్నో పుణ్నదులను ప్రవహింపచేస్తున్నది స్వామి జటయే.   నమకములో జట శబ్దమును,  2.వ అనువాకము 5వ మంత్రము  " నమో హరికేశాయ ఉపవీతినే " స్వామిని హరికేశునిగా వర్ణించినది.    నల్లని కేశములుగా కనుక అన్వయించుకుంటే   నమః శివాభ్యాం-నవ యవ్వనాభ్యాం"   ఆకుపచ్చని కేశములుగా అన్వయించుకు...

NA RUDRO RUDRAMARCHAYAET-22

Image
   న రుద్రో రుద్రమర్చయేత్-23  *********************** " స్వస్తి ప్రజాభ్య: పరి-పాలయంతాం  న్యాయేన మార్గేణ మహీం మహీశ:  గో-బ్రాహ్మణేభ్య: శుభమస్తు నిత్యం  లోకా: సమస్తాత్ సుఖినో భవంతు."             శాంతిమంత్రం.  విశ్వపరిపాలనలో గోవులను-బ్రాహ్మణులను సంరక్షించుటచే సమస్తలోకములు సుఖముగా నుండునుగాక.  ఇది" విశ్వశ్రేయో మంత్రము"   .ఇందులో వచ్చిన గో-బ్రాహ్మణ శబ్దములు అత్యంత  ముఖ్యమైనవి.సంస్కారవంతమైనవి.గో శబ్దము సకల దేవతా స్వరూపము.దేవతలనగా ఇంద్రియములు అనే అర్థమును కూడా చెబుతారు.అదేవిధముగా పంచభూతములను కూడా అన్వయిస్తారు.సమస్త వాక్కులను కూడా గో శబ్దముగా భావిస్తారు.అంటే ఒక విధముగా విశ్వమును గో శబ్దముతో సంకేతిస్తూ,దానిలో దాగిన,దానిలోనే కాదు,తనలో దాగియున్న ఈశ్వరచైతన్యమును-తాను చూస్తున్న చైతన్యమును బిబ-ప్రతిబింబములుగా. గ్రహించగలిగిన వాడు బ్రాహ్మణుడు.తనలోపల/తన చుట్టు ఉన్న ఈశ్వరచైతన్యమును గుర్తించి,గౌరవించుటయే బ్రహ్మజ్ఞానమని పెద్దలు చెబుతారు.  అహం బ్రహ్మాస్మి-నేను బ్రహ్మము కంటే వేరుకాదు అను తత్త్వమును అర్థముచేసుకొని ఆరాధించువేళ ...

NA RUDRO RUDRAMARCHAYAET-21

Image
    న రుద్రో రుద్రమర్చయేత్-21   *********************** ఓం నమ శివాయ-నిందాస్తుతి ****************  నారి ఊడదీయమనగానే జారిపోవచేసావు  అమ్ములు దాచేయమనిన గమ్మున దాచేసావు  విల్లుకనబడకూడనిన వల్లె యని అన్నావు  పినాకమే కానరాని పినాకపాణివి నీవు  మంచపుకోడును కూడ కనిపించకుండ చేసావు  ఖట్వాంగధారివైన ఖండోబా దేవుడవు  పరశును మొద్దుచేయమంటే పదును తీసేసావు  ఖండపరశు కానరాని పరమేశుడివి నీవు  లేశమైన లేకుండా ఆశాపాశమును తీస్తావు  పాశుపతాస్త్రములేని  పశుపతివి నీవు  రుద్రములో చెప్పారని వద్దనక చేస్తుంటే  తెలితక్కువంటారురా ఓ తిక్కశంకరా.  నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.  ఘోరేభ్యో-అఘోరేభ్యో -రెండును తానైన రుద్రునకు నంస్కారములు.        ప్రియమిత్రులారా ఈనాటి మన బిల్వార్చనను ఘోరస్వభావమైన "క్రోధము" పదమును అర్థమునుతెలుసుకునే ప్రయత్నముగా చేద్దాము. పరమాద్భుతము రుద్రనమక ప్రారంభమే,  " నమస్తే రుద్ర"మన్యవ" ఉతో త ఇషువ నమః  నమస్తే అస్తు ధన్వనే బాహూభ్యాముతతే నమః".  ఉభయనమస్కార ఋక్కుతో మన్య శబ్ద ప్రస్తావనముతో...

NA RUDRO RUDRAMARCHAYAET-18

Image
  న రుద్రో రుద్రమర్చయేత్-20  *********************  రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం  నానారత్న విభూషితం మృగమదా మోదాంకితం చందనమ్ |  జాతీ చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా  దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతామ్ ||   శివ మానసపూజ స్తొత్రం-ఆదిశంకర విరచితం.    ప్రియ మిత్రులారా మనము ఈ రోజు బిల్వార్చనను "స్థపతి" పద అర్థమును తెలుసుకునే ప్రయత్నముతో చేసుకుందాము.   నమకములో సైతము ఈ పద ప్రసక్తి,  2వ అనువాకము-9వ యజస్సు  " నమో రోహితాయ స్థపతయే వృక్షానాం పతయే నమః" ఉభయనమస్కార యజస్సు.   వృక్షలను ప్రతిష్టించు ఎర్రని రంగుగల రుద్రునకు నమస్కారములు.    కేవలము వృక్షములను మాత్రమే స్థాపించువాడా రుద్రుడు అనే సందేహమునకు సమాధానము రావాలంటే రుద్రుని అనుగ్రహముతో మరింత నిశితముగా "స్థపతి" సబ్దమును అర్థము చేసుకొనుటకు ప్రయత్నించవలసినదే.  "సర్వత్ర స్థాతాయచ-సర్వత్ర పాతాయచ స్థపతిః."  అంతటను నుండువాడు-అంతటను పాలించువాడును స్థపతి.  మనము సూర్యునిగా అన్వయించుకుంటే గ్రహగోళాదులను స్థాపించువాడు.  రుద్రునిగా అన్వయి...

NA RUDRO RUDRAMARCHAYAET-15

Image
  ఈనాటి బిల్వార్చనను మనము రుద్రుని యొక్క చోరత్వమును తెలియచేయు కథ-కథనము గురంచి తెలుసుకునే ప్రయత్నము చేద్దాము. నమకము 3వ అనువాకములోని 2 నుండి 7 యజుస్సులు స్వామి యొక్క చోర వైభవమును ప్రస్తుతిస్తున్నాయి. మనము 2 వాక్యముల/పాదముల స్తుతిని ఋక్కు అని పిలుస్తారని చెప్పుకున్నాము.అదేవిధముగా ఒక్క వాక్యముగా/పాదముగా చెప్పబడిన స్తుతిని యజస్సు అంటారు. నమకము స్వామి యొక్క అనుగ్రహమును ప్రస్తావిస్తూనే దానికి కారణమైన జీవుల పాపకర్మ ఫలితములను స్వామి ఎలా దొంగిలించివేస్తాడో చెబుతున్నది. ఈ సందర్భములో మనము నమకములో చెప్పబడిన కొన్ని చోర శబ్దములను,వాటి అన్వయమును తెలుసుకునే ప్రయత్నము చేద్దాము. హర హర మహాదేవ శంభో. రండి.బిల్వార్చన చేద్దాము. " నమో నిషంగిణే ఇషుధిమతే తస్కరాణాం పతయే నమః." ఇది మనము చర్చింకోబోయే యజస్సు. ఇది కాక, 1. స్తేనానాం-గుప్తచోరునిగా-వానినాయకునిగా, 2.స్తాయునాం-ప్రభువును సేవిస్తూ కన్నుగప్పి దోచుకునే వానిగా,వారి నాయకునిగాను, 3.పరివంచకునిగా,మోసముతో ప్రభువును దోచుకునే వానిగా, 4స్తాయువు మోసముచేస్తాడు కాని నిశ్శబ్దముగా, 5. ఊష్ణతాం-ప్రభువుకు రావలిసిన ధాన్యపు గింజలు ఇవ్వకుండా న్యాయప్...