Posts

AALO REMBAAVAAY-15

Image
   పాశురము-15  ***********  ప్రతి నాదము- హరి అష్టాక్షరి  ప్రతివాదము -హరి స్పష్టాకృతి.    పదిమంది గోపికలు ప్రగతికి కరదీపికలు.పరిపూర్ణ వైష్ణవ ప్రతిరూపములు,కొందరు భగవదాదేశము కనుక పరమార్థతత్త్వమును బోధించవలెననుకొనువారు,ఇంకొందరు తమను సమీపించినవారికి సన్మార్గమును చూపువారు,కొందరు తమ ధర్మముగా అడుగకున్నాను ఆదుకోవాలనుకొనువారు,   మరికొందరు తమకుతామె కుతూహలముతో కృష్ణసన్నిధిని చేర్చువారు,బహుముఖములుగా భాసించుచు పాశురములుగా మనలను ఆశీర్వదించువారు.   లేతచిలుక ప్రస్తావన సంకేతముగా మనలను సంస్కరించబోతున్న గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ,గోపికలను మేల్కొలుట యను రెండవ భాగము నందలి చివరి/ప్రస్తుత పాశురమును అనుసంధానము చేసుకుందాము.పది ఇంద్రియములు పరిశుద్ధములైనవి కనుక ఇక వాదోపవాదములుండవు.సూటిపోటి మాటలుండవు.పరాచికములుండవు.పరిహాసములుండవు.  లెక్కలుండవు-ఎక్కువతక్కువలుండవు.ఒక్కటే లక్ష్యము.ఒక్కటే లక్షణము.అరమరికలను అధిగమించిన పరిపూర్ణ పారమార్థికము.  ఎల్లే! ఇళంగిళియే ఇన్నం ఉరంగుదియో శెల్లెన్మ్రాళే యే మిన్ నంగవీర్ పోదాగిన్రే వల్లై ఉన్ కట్టురైగళ్ పండే ఉన్...

AALO REMBAAVAAY-14

Image
 పాశురము-14 ***********  ప్రతి పదము-పరమ పథమే  పతి పదము-పరమపదమే.  నంగాయ్-నాణాదాయ్-నావుడయాయ్ అంటు గోపికను మేల్కొలుపుతున్న గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ,  "నెగిళిందు-కూంబిణగాం" అను ముకుళితము-వికసనము "  అను పరమార్థమైన పదములను ,పాశురమును అనుసంధానము చసుకునే ప్రయత్నమును చేద్దాము.  ఉంగళ్ పుళక్కడై తోటత్తు  వావియుల్   శెంగుళునీర్వాయ్  నెగిళిందు ఆంబల్వాయ్ కూంబిణగాం  శెంగళ్పొడి కూరై వెణ్పల్ తవర్ తవర్  తంగళ్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోదందార్  ఎంగళై మున్నమెళుప్పువాన్ వాయ్పేశుం  నంగాయ్! ఎళుందిరాయ్! నాణాదాయ్! నావుడైయాయ్  శంగొడు శక్కరం ఏందు తడక్కైయన్  పంగయ కణ్ణానై  ప్పాడు ఏలోరెంబావాయ్.    లక్ష్మీనారాయణులు లీలగా ఒకసారి దాగుడుమూతలాడుకొనుచున్నారట.స్వామికి కనిపించకుండా/స్వామిని పట్టుకోనీయకుండా మహాలక్ష్మి పద్మములున్న తోటలోనికి వచ్చి,వాటిని విప్పారకూడదని శాసించి తాను అందులో ఒక విశాలమైన అందమైన పదముములో కూర్చుండి దానిని ముకుళింపచేసినదట.స్వామి అమ్మను వెతుకువెతుకుతు తోటలోని పద్మములన్ని ముకుళించియుండుటన...

AALO REMBAAVAAY-13

Image
   పాశురం-13  *********  నన్నాళాల్-పుళ్ళుం శిలబినకాణ్ అను పదములు మనకు ప్రథమపాశురములో నన్నానాళ్-పుళ్ళుం శిలంబినకాణ్ పుళ్లరయన్ అంటు మరల ప్రస్తావించుట లోని అంతరార్థమును అనుగ్రహించనున్న గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటు,పాశురమును అనుసంధానమును చేసుకుందాము. పదమూడవ పాశురం **************** పుళ్ళిన్వాయ్ కీండానై ప్పొల్లా అరక్కనై క్కిళ్ళి క్కళైందానై క్కీర్తిమై పాడిప్పోయ్ పిళ్ళైగళ్ ఎల్లారుం పావై క్కళం పుక్కార్ వెళ్ళి ఎళుందు వ్యాళంఉరంగిట్రు పుళ్ళుం శిలంబినకాణ్! పోదరికణ్ణినాయ్! కుళ్లక్కుళిర క్కుడైందే నీరాడాదే పళ్ళికిడత్తియో? పావాయ్! నీ నన్నాళాల్ కళ్ళం తవిరందు కలందేలో రెంబావాయ్ .  ఓం నమో భగవయే వాసుదేవాయ నమః.  ************************  పొల్లా అరక్కన్-నల్లా అరక్కన్ అని జన్మను బట్టి రక్షసులే అయినప్పటికి,కర్మను బట్టి ఒకరు (విభీషణుడు) స్వామిచే రక్షింపబడినాడు.మరియొకరు (రావణుడు) అదే శ్రీరామునిచే శిక్షింపబడినాడు.దానికి కారణము రావణుని ఇంద్రియలోలత్వము.  అదేవిధముగా పొల్లా అరక్కన్ - 1. పొల్లా-మాయావి యైన,  భావ మాలిన్యముతో నిండిన బాహ్య సౌందర్యముతో అసురుడు అక్కడ...

AALO REMBAAVAAY-12

Image
   పాశురము-12  ************ తాదాతంత్యతను వీడి  జాగరూకము కమ్మా...   ఒక్కొక్క సారి భాషను అధిగమించి భావము భాసిస్తుందనుటకు, ఈ ఉపాధికి గోదమ్మ అనుగ్రహించిన "తాదాతంత్యతను వీడి  జాగరూకము కమ్మా:...దాసోహములు తల్లి.  అంత్యత -పరాకాష్ఠ దశలో నున్న   తాదాత్-మమేక భావము.  మనము మేల్కొలుపుచున్నది గోపికల రూపములో నున్న ఆళ్వారులను.వారు స్వామికి-చేతనులకు మధ్యనున్న నిచ్చెనలవంటివారు.  వారెందరెందరినో స్వామి సమక్షమునకు చేర్చు ప్రక్రియలో కిందమెట్టుమీదనున్న చేతనులకు సహాయపడుటయే స్వామిసేవగా భావించు స్వభావము కల సహృదయులు.వారి చేయూతకై నిచ్చెన కిందిమెట్టుపై వేచియున్న చేతనులెందరో.  వారు అంతర్ముఖమును వీడితేకాని అది సాధ్యపడదు.  కనుక గోదమ్మ బాహ్యమునకు దోషముగా కనిపించే ఉదాహరణములతో వారి గుణ వైభవమును మనకు అందిస్తుంది .  మనము నిత్యానుష్ఠానమే ప్రధానము అనుకునే సమయములో దానిని సైతము వదిలివేసిన ,సంపన్నుని చెల్లెలా అని ప్రస్తుత గోపికను మేల్కాంచమంటున్నది.      ఓశై పడుత్త తైరరవం అని చల్లచిలుకు శబ్దమును,   ఎరుమై సిరువీడు మేయాన్ పరందన కాణ్ మిక్క...

AALO REMBAAVAAY-11

Image
  పాశురము-11  *************  కుండలినిశక్తిలా చుట్టుకునియున్న జీవాత్మా  నీవు అనేక గ్రంధులను ఛేదించుకొనుచు ముగిల్వణ్ణన్ అను  సహస్రారమును  చేరవలసిన పున్మయిల్ వనమయూరివి.తాదాతంత్యతను వీడి  జాగరూకము కమ్మా అంటూ అన్యాపదేశముగా యోగరహస్యములనందించుచున్న గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటు,అమ్మ అనుగ్రహించినంతమేరకు పాశురమును అనుసంధానము చేసుకునే ప్రయత్నము చేద్దాము.    కట్రుక్కరవై కణంగళ్ పలకరందు    శెట్రార్తిరళలియం శెన్రు శెరుచ్చెయ్యుం    కుట్రం ఒన్రిల్లాద కోవలరం పొర్కిడియె    పుట్రు రవల్గున్ పునమయిలే పోదారాయ్    శుట్రుత్తు తోళీమార్ ఎల్లారుం వందు నిన్    మూట్రం పుగుందు ముగిల్ వణ్ణన్ పేర్పాడ    శిట్రాదే-పేశాదే సెల్వన్ పెండాట్టి, నీ    ఎట్రుక్కు ఉరంగుం పొరుళేలో రెంబావాయ్.    నమో భగవతే శిఖి పింఛాయ నమః.    ************************  ప్రస్తుత పాశురములో :కుట్రం ఒన్రిల్లాద" ఒక్క దోషమును,లేశమైనను కానరాని గోపిక నిదురలేపబడుచున్నది.  మరొక్క విషయము కణంగళ్ -సమూహములు...

AALO REMBAAVAA10

Image
   పాశురము-10  *************  మనకు రామావతార విశేషములను పరిచయముచేస్తున్న గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటు,పదవ పాశురమును అనుసంధానము చేసుకునే ప్రయత్నమును చేద్దాము.  ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. *************************** పాదములలదుకున్నవి వేదగంధమును పెదవులందించునుగద నాదగంధమును నలువనందించిన నడుమున కమలగంధంబు మెడమీడ నడయాడు తులసిగంధంబు నిస్తులమైన నుదుటను కస్తురిగంధంబు ఎన్నిగంధంబులు తన్ను బంధించుచున్నను గోద పూమాలల గంధంబు మోదమందించుట నిర్వివాదము ఆహా!.సర్వసుగంధునకు.    తులసిగంధముతో పరిమళించు ప్రస్తుత పాశురములో,  నోట్రుం చువర్కం పుగుగిన్ర అమ్మణాయ్ మాట్రావుం తారారో వాసల్ తిరవాదార్ నాట్రా తుళాయ్ ముడి నారాయణన్ నమ్మాళాల్ పోట్రా పరైతర్రుం పుణ్ణెయనాళ్ పండొరునాళ్  కూట్రత్తిన్ వాయ్ వీళ్దం కుంబకరణనుం తోట్రుం ఉనక్కే పెరున్ తుయిల్ తాన్ తందానో అట్ర అనందన్ ఉడయాయ్ అరుంగలమే తేట్రమాయ్ వందు తిరవేలో రెంబోవాయ్.       ఐదవ గోపికను గోదమ్మ "అమ్మణాయ్"( స్వామిని) అంటు మేల్కొలుపుతోంది.బాహ్యమునకు ఈమె నివాసము శ్రీకృష్ణుని ఇంటి పక్క ఇల్లు.ఎప్పుడు స్వామి తనన...

AALO REMBAAVAAY-08

Image
       పాశురము-08       ************   గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటు,అనుగ్రహించినంతమేరకు పాశురమును అనుసంధానము చేసుకుందాము.  కీళ్వానం వెళ్ళెండ్రు ఎరుమై సిరువీడు  మేయాన్ పరందన కాణ్ మిక్కుళ్ళ పిళ్ళైకళుం  పోవాన్ పోగిన్రారై పోగామల్ కాత్తు  కూవువాన్ వందునిన్రోం కోగులం ఉడయ  పావాయ ఎళుందిరాయ్ పాడి పరై కొండు  మావాయ్ పిళందనై మల్లనె మాట్రినాయ్  దేవాదిదేవనై శెన్రునాం సేవిత్తాల్  అవావెన్రు ఆరాయంద్రు అరుళేలో  రెంబావాయ్.   ఓం నమో నారాయణాయ   ********************  తెల్లవారుచున్నది.తూరుపున వెలుగురేఖలు కనబడుచున్నవి.పశువులు చిరుమేతకు తరలినవి. దేవాదిదేవుని నోమునకు వెళ్లుచున్నవారిని/వెళ్లుటకు సిద్ధమగుచున్నావరిని,కొంతసమయము నిలువమని మేము నిన్ను మేల్కొలుపుటకు వచ్చి,నీ గుమ్మము ముందర నిలబడి నిన్ను పిలుస్తున్నాము.అన్నది వాచ్యార్థము.  కోగులం ఉడయ-కుతూహలము కొత్తచిగురులు తొడుగుచుందగా   1.తూరుపుదిక్కు చీకట్లను పారద్రోలుచు వెలుగు రేఖలను ప్రసరించుటకు కుతూహల పడుచున్నది.   2.పశువులు (ఎరుమై) కొంచము...