Posts

AALO REMBAAVAAY-21

Image
       పాశురము-21   ************  " సరికాదని దరిచేరననకు జితబాణులము కాదయ్యా    నినుకాదని మరలగలేము జితగుణులము  మేమయ్యా."    వారికి ఎవరు సహాయము చేసినారో-ఏమి ఉపాయము చూపినారో  కాని,ఇప్పుడు వారిమధ్య, " దూరములేదు-దూషణములేదు  దురుసుతనములేదు-దుడుకుతనము లేదు  దురితములు లేవు-దుఃఖములు లేవు  వ్రతము ధ్యాసలేదు-వంటి సోయలేదు  అపేక్ష మాసినది-ఆపేక్ష మురిసినది.    గోపికల ఇంద్రియము కృష్ణకేంద్రీకృతము గావించిన , 'పుగళందు పోత్తియాం వందోం" అనిపించిన గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ,అనుగ్రహించినంతమేరకు పాశురమును అనుసంధానము చేసుకునే ప్రయత్నమును చేద్దాము. ఇరవై ఒకటవ పాశురము ********************* ఏట్ర  కలంగళ్  ఎదిర్ పొంగి మీదళప్ప మాట్రాదే పాల్శొరియం వళ్ళల్ పెరుం పశుక్కళ్ ఆట్ర పడైత్తాల్ మగనే అరివురాయ్ ఊట్రం ముడైయాయ్ పెరియాయ్ ఉలగినిల్ తోట్రమాయ్ నిన్ర శుడరే తుయిళెలాయ్ మాట్రార్ ఉనక్కు వలితుళైందు  ఉన్ వాశల్ కణ్ ఆట్రారు వందు ఉన్ అడిపడియు మాపోలే పోట్రియాం వందోం పుగళేందో రెంబావాయ్.      ప్రస్తుత...

AALO REMBAVAY-20

Image
     పాశురము-20    ************  "ఉక్కముం-తట్టొళియం  లేక తీరదు మా ఆర్తి   నిక్కము  సురపక్షపాతివని చేరు నిను అపకీర్తి."   ఇప్పటివరకు మన గోపికలు గోదమ్మతో కలిసి నీలమ్మను నిద్రలేపుతున్నారు.కాని నీలమ్మ స్వామితో నున్నదో ఏమో వీరికి సమాధానమును ఇచ్చుటలేదు.అయినను విచిత్రము వీరు మనకెందుకులే అని నీలమ్మ ఇంటిని వదిలివెళ్ళుటలేదు.నోము చేయుతలుపును వీరిని విడనాడుటలేదు.పూర్తిగా మనలను మైమరపించే ఆత్మస్వరూప-స్వభావములను అర్థమయ్యే రీతిలో మనకు ఆచరించుటకు ఊతగా భగవానుని యోగ-క్షేమ కారకత్వమును అందించుచున్న గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ,పాశురమును అనుసంధానము చేసుకునే ప్రయత్నమును చేద్దాము.    ముప్పత్తు మూవర్ అమరర్కు మున్శెన్రు కప్పం తవిర్కుం కలియే ! తుయిలెళాయ్ శెప్పం ఉడయాయ్ ! తిఱలుడైయాయ్ శేత్తార్కు వెప్పం కొడుక్కుం విమలా!తుయిలెళాయ్ శెప్పన్మెల్-ములై చ్చెవ్వాయ్ చ్చిఱుమఱుంగళ్ నప్పినై నంగాయ్ తిరువే తుయిలెళాయ్ ఉక్కముం తట్టొళియుం తందు ఉన్ మణాళనై ఇప్పోదో ఎమ్మై నీరాట్టు ఏలోర్ ఎంబావాయ్.      ప్రస్తుత పాశురములో 1. స్వామికి ముప్పదిమూడుక...

AALO REMBAAVAAY-19

Image
     పాశురము-19    ***********  "పెరుమాళ్ళు -పిరాట్టి ఇంతవరకు ఒకరికొకరు   పంచశయన మిథునమంటున్నది వారు "ఒకేఒకరు."    ఆహా గోపికలదేమి భాగ్యము.ఎన్నితపముల మనలకు  ఫలము.గోదమ్మ వారికి-వారితో పాటుగా నీలాకృష్ణుల శయనసౌందర్యమును దర్శింపచేస్తున్నది.    చేతనులకు వారు అనవరతము మునిగితేలుచున్న సంసారములోని సింగారమును చూపిస్తు ముక్తిసోపానములను ఎక్కిస్తున్నది. అవిభక్తమైన పరమాత్మానుగ్రహమును అర్థమయ్యేటట్లుగా వారి రహస్య సన్నివేశములను సదస్యముగా వివరిస్తూ, ఆరి ఓడిలోని చేర్చుచున్న గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటు,పంచేంద్రియ తర్పణ పాశురమును అమ్మ అనుగ్రహించినంతమేరకు అనుసంధానము చేసుకునే ప్రయత్నమును చేద్దాము. కుత్తువిళక్కెరియ క్కోట్టుక్కాల్ కట్టిల్మేల్ మెత్తెన్ర పంచశయనత్తిల్ మేలేరి కొత్తలర్ పూంగుళల్ నప్పిన్నయై కొంగైమేల్ వెత్తుకిడంద మలర్మార్పా వాయ్ తిరవాయ్ మైత్తిడం కణ్ణిణాయ్ నీ ఉన్ మణాలనై ఎత్తనై పోదుం తుయిలెళ ఒట్టయ్ కాణ్ ఎత్తన ఏలుం పిరివాట్ర గిల్లయాల్ తత్తువ మన్రు తగవేలో రెంబావాయ్.         ప్రస్తుత పాశురములో   1.ఏ...

AALO REMBAAVAAY-18

Image
  పాశురము-18   ***********  "ఒప్పుకున్న తప్పులన్ని పురుషకార లాలనలో  తప్పిపోవ దండనలు పురుషోత్తమ పాలనలో."    పిరాట్టి అనుగ్రహమనే పురుషకారమును మనకు అందిస్తున్న గోదమ్మకు అనేకానేక దాసోహములను  సమర్పించుకుంటు,పంచేంద్రియ పరమార్థమునందించు విశేషానుగ్రహ పాశురమును అనుసంధానము చేసుకునే ప్రయత్నమునుచేద్దాము.  ఉందు మదగళిట్రన్ ఓడాద తోళ్వలియన్  నందగోపాలన్ మరుమగళే! నప్పిన్నాయ్  కందం కమళుం కుళలీ కడై తిరవాయ్  వందు ఎంగుం కోళి అళైత్తనగాణ్; మాదవి  పందల్ మేల్ పల్కాల్ కుయిల్ ఇనంగళ్ కూవిణగాన్  పందార్ విరలి; ఉన్ మైత్తునన్ పేర్పాడ  శెందామరైక్కైయ్యాల్ శీరార్ వళై యెళుప్ప  వందు తిరవాయ్ మగిందేలో రెంబావాయ్.   నప్పిన్నాయ్-యశోద సోదరుదైన కుంభగోపుని-ధర్మదల కుమార్తె.సుగంధ కేశసౌందర్యము కలది. శెందామరల వంటి చేతులు కలది.శీరార్వళై -ఐశ్వర్యవంతమైన కరకంకణములు కలది.అంతే కాదు  "పందార్ విరలి" చేతిలో కందుకమును/బంతిని ధరించి యున్నది.  నప్పిన్నాయ్ -అనగా  నప్పినాయ్ అమ్మవారిని ముద్దుగా తమిళభాషలో పిలుచుకునే పేరు.అంటే లక్ష్మీదేవి.లక్ష్మీదేవి అంశలు మూ...

AALO REMBAAVAAY-17

Image
   పాశురము-17  *********  "శయ్య శయనిస్తున్నది అతిశయము మీర  శ్యామసుందరు లీల కనుడు కనులార."  ఆధ్యాత్మిక మయమైన నందగోప పాలకుని శయనమందిరమునకు అత్యంత భక్తిశ్రధ్ధలతో, ప్రవేశించిన వారలై,అపురూప భావనము-ఆరాధ్య సేవనముతో,వారు ఎన్ పెరుమాన్-ఎన్ పెరుమాట్టి-త్రివిక్రమ-బలరామ అని వారి మహోన్నతత్త్వమును కీర్తిస్తూ,వారిని నలుగురిని తాము నోముచేయుచున్న ప్రదేశమునకు విచ్చేసి,నోమును సుసంపన్నము చేయమని ప్రార్థిస్తున్న వారితో పాటుగా మనలను అనుగ్రహిస్తున్న గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటు,పాశురమును అనుసంధానము చేసుకునే ప్రయత్నమును చేద్దాము.  అంబరమే తణ్ణీరే శోరే అరం శెయ్యం  ఎంబెరుమాన్ నందగోపాల! ఎళుందిరాయ్  కొంబనార్కెల్లాం కొళుందే! కులవిళక్కే  ఎంబెరుమాట్టి! యశోదాయ్! అరివురాయ్  అంబరం ఊడరత్త ఓంగి ఉలగలంద  ఉంబర్కోమానే ఊరంగాదు ఎళుందిరాయ్  శెంపోర్ కళలడి శెల్వా బలదేవా  ఊంబియున్ నీయుం ఉరంగేలే రెంబావాయ్. అంబరమే-తన్నీరే-శోరే ను ,అన్నము పరబ్రహ్మ స్వరూపము.అటువంటి అన్నమును-నీటిని-వస్త్రములను ధర్మముగా దానము చేయువాడు. "వైకుంఠము-విరజానది- ఉపనిషత్తులను అంబరమ...

AALO REMBAAVAAY-16

Image
       పాశురము-16    ***********   హరి  "నీవేకావాలంటున్నది ప్రతితలపు   నీవెవరవంటున్నది ప్రతి తలుపు"    ఆ తలుపు 1 అష్టాక్షరి-ప్రణవము ఒక రెక్క-మంత్రశేషము మరొకటి 2.ద్వయి మంత్రము-పూర్వ ఖండము  ఒక రెక్క-ఉత్తరఖండము మరొకటి 3.చరమశ్లోకము-పూర్వార్థము ఒక రెక్క-ఉత్తరార్థము మరొకటి.   ఆ తలుపు "నేశన్నిలైకడవం-గట్టుగా  బిగించబడిన గడియను కలిగిఉంది.అన్వయప్రధానమైన     ఆ తలుపునకు "ఆచార్యసిద్ధి" అను గడియవేసిఉన్నది.దానిని తెరచుశక్తి" ఆచార్య సమాశ్రణమే" కలిగియున్నది.  "ఉన్నిమీషతి-అథోనిమీషతి" భగవాన్ అన్న ఆర్యోక్తిని సవరిస్తూ "ఆచార్యాన్ సర్వం ఉన్నిమీషతి"  బుద్ధి కర్మానుసారిణి -కర్మఫలితములను అనుభవించుటకు తగిన బుద్ధులను ప్రసాదించువాడు భగవంతుడైతే,బుద్ధులను సవరించి ఉద్ధరించువాడు ఆచార్యుడు    అన్న ఆచార్యవైభవ ప్రస్తావనమును తెలిపిన గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ.అనుగ్రహించినంతమేరకు అనుసంధానమును చేసుకునే ప్రయత్నమును చేద్దాము.  నాయగనాయ్ నిండ్ర నందగోపనుడయ  కోయిల్ కాప్పానే కొడితోన్రుం తోరణ...

AALO REMBAAVAAY-15

Image
   పాశురము-15  ***********  ప్రతి నాదము- హరి అష్టాక్షరి  ప్రతివాదము -హరి స్పష్టాకృతి.    పదిమంది గోపికలు ప్రగతికి కరదీపికలు.పరిపూర్ణ వైష్ణవ ప్రతిరూపములు,కొందరు భగవదాదేశము కనుక పరమార్థతత్త్వమును బోధించవలెననుకొనువారు,ఇంకొందరు తమను సమీపించినవారికి సన్మార్గమును చూపువారు,కొందరు తమ ధర్మముగా అడుగకున్నాను ఆదుకోవాలనుకొనువారు,   మరికొందరు తమకుతామె కుతూహలముతో కృష్ణసన్నిధిని చేర్చువారు,బహుముఖములుగా భాసించుచు పాశురములుగా మనలను ఆశీర్వదించువారు.   లేతచిలుక ప్రస్తావన సంకేతముగా మనలను సంస్కరించబోతున్న గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ,గోపికలను మేల్కొలుట యను రెండవ భాగము నందలి చివరి/ప్రస్తుత పాశురమును అనుసంధానము చేసుకుందాము.పది ఇంద్రియములు పరిశుద్ధములైనవి కనుక ఇక వాదోపవాదములుండవు.సూటిపోటి మాటలుండవు.పరాచికములుండవు.పరిహాసములుండవు.  లెక్కలుండవు-ఎక్కువతక్కువలుండవు.ఒక్కటే లక్ష్యము.ఒక్కటే లక్షణము.అరమరికలను అధిగమించిన పరిపూర్ణ పారమార్థికము.  ఎల్లే! ఇళంగిళియే ఇన్నం ఉరంగుదియో శెల్లెన్మ్రాళే యే మిన్ నంగవీర్ పోదాగిన్రే వల్లై ఉన్ కట్టురైగళ్ పండే ఉన్...