Posts

SIVATANDAVASTOTRAMU-PRATIPADAARTHAMU-BHAAVAMU.

Image
    శివతాండవ స్తోత్రము-రావణకృతము   ************************** 1.జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికామ్ | డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండతాండవం తనోతు నః శివః శివమ్ || 1 ||  శివతాండవము జరుగు పవిత్రస్థలమును గురించి చెప్పబడినది మొదటి భాగము.  జటాటవి- అడవి వలె జటలున్న ప్రదేశమునుండి,  గలజ్జల- పవిత్రమైన జలము,  ప్రవహించి_ ప్రవాహ  పావిత-పవిత్రమొనరించిన,స్థలే-స్థలము అది.శివజటాజూటమునుండి గంగాజలము సంప్రోక్షించబడి పునీతమైన ప్రదేశములో తాండవము  ప్రారంభమగునట.అదియె వికార రహితమైన మన హృదయసీమ. గలేవ లంబ్య లంబితాం భుజంగ తుంగ మాలికాం.   స్థలమును గంగ పవిత్రమొనరించినది.వెంటనే, భుజంగములు గళమున మాలుకలుగా తమను తాము అలంకరించుకొని తరించినవి.  .డమడ్దమ నినాదవడ్దమర్వయం,  గంగమ్మను,వాసుకిని అనుసరిస్తు,డమరుకం డమడమ నినాదముతో స్వామి చేతిని అలంకరించి,అర్వయం -ప్రకాశించుచున్నది. చకార చండతాండవం తనోతు నః శివః శివమ్-అనుగ్రహమును అర్థించు చమకమునకు ఫలముగా స్వామి తన తాండవముతో మనలను అనుగ్రహించుగాక.ఓం నమః శివాయ. 2.జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్...

PARUGULELA PATTUKONAGA-OM NAMASIVAYA

Image
      పరుగులేల పట్టుకొనగ-ఓం నమః శివాయ   ******************************  స్పూర్తినిచ్చిన సిద్ధార్ శివవాక్కియర్ కు నమస్కారములతో (ఓడి-ఓడి-ఓడి-ఓడి-పరుగులు తీసి తీసి పట్టుకోగలవా) ఈ చిన్ని ప్రయత్నము.పెద్దలు తప్పులు సవరించగలరు.  1.వ్రాసి వ్రాసి వ్రాసి వ్రాసి నీటిమీది వ్రాతలే    మాసి మాసి మాసి మాసి ముసురుకున్న మాయలో    చూసి చూసి చూసి చూసి మోసపోయి శంకరా    రోసి రోసి రోసి రోసి సమసిపోయిరెందరో.      ఓ పరమేశా!మాయముసుగులో నిన్ను కనలేక స్థిరముగా నిలువని నీటి ప్రవాహముపై నీ నామమును వ్రాసి,నిన్ను దర్శించాలని పరుగులు తీసి తీసి కనుగొనలేక కనుమరుగు అయినవారెందరో.అట్టి అజ్ఞానమును మన్నింపుము.  2.నీది ఏది? నాది ఏది? నీదినాది కానిదేది?    జననమంటు-మరణమంటు ఆటలాడుచున్నదేది?    రాజు అంటు-గురువు అంటు మాటలాడుతున్నదేది?    వేరుచేసి చూపుచున్న" నేను"  అన్న భ్రాంతియే.      ఓ మహేశా! నేను అన్న దేహభ్రాంతి నిన్ను నా నుండి వేరుగా భ్రమింపచేస్తూ,చావు పుట్టుకలగురించి,నీవు-నేను అన్న ద్వంద్వముల గురించి వి...

HAPPY PONGAL-2024

Image
  మకర సంక్రమణ శుభాకాంక్షలు ************************************ శ్రీకరమని దినకరుడు మకరములో ప్రవేశించె సౌరమాన కళలతో సంక్రాంతిగ ప్రకాశించె భూమాత నింగిసాగు రంగవల్లులనే తిలకించె పుష్యమాస పులకింతను ఆ గాలి ఆలకించె భోగిమంటగా అగ్ని కంటకములను తొలగించె మంచుపూల అంచలా జలమేమో అంజలించె గాలిపటము సాక్షిగా గగనమే పులకించె పంచభూతములు సాక్షిగా పండుగ తానేగుతెంచె. సింగారపు ధర్మమై గంగిరెద్దు దీవించె ఏలిక పోలికనెరిగి హరినామము నర్తించె అంత రంగ నాథుని ఆరాధన ఫలించె లోక కళ్యాణముగా గోదా కళ్యాణము గావించె పండుగ తనతో పాటు పారమార్థికతను తెచ్చె కడుపునింప సిద్ధమయ్యి కర్షకుడు తరియించె బోసి పళ్ళను దీవింపగ భోగిపళ్ళు పండించె ఉమ్మడి సంపద విలువను గుమ్మడేమొ తెలియపరిచె కర్మ భూమి ధర్మపు మర్మమేమో వివరించె పొంగుచున్న సంతోషము పొంగలిగ రుచించె అణువణువు అర్పించిన పశుగణమును పూజించె వ్యవసాయముతో పాటు వస్తువ్యాపారము నేర్పించె గొబ్బెమ్మల కథలతో నిబ్బరాలు చూపించె ఉన్మాదము వదిలిన భువి స్వర్గమునె తలపించె చక్కటి మార్గము చూపుతు "సంక్రాంతి సంతసించె

AALO REMBAAVAAY-30

Image
    కళ్యాణ పాశురము-30   ***********  " ప్రతి ఒక మాతృమూర్తి సాక్షాత్తుగా కరుణతో గోదరక్షగా   ప్రతి ఒక్కరి ఆర్తి తీర్చి లక్ష్యము చేర్చు గోవిందుని సాక్షిగా."   ఇంతవరకు మనము తెలుసుకున్న విషయములన్ని కేవలము అమ్మ అనుగ్రహము వల్లనే తక్క  స్వయముగా సంపాదించుకొన్నది కాదని "అడియేన్" భావిస్తున్నది. వంగక్కడల్ కడైంద మాధవనై కేశవనై తింగళ్ తిరుముగత్తు చ్చేయిళైయార్ శెన్రు ఇరెంజి అంగు అప్పరై కొండ అత్తై అణిపుదువై ప్పైంగమలత్తణ్ తెరియల్ పట్టర్ పిరాందై శంగత్తమిళ్మాలై ముప్పదుం తప్పామే ఇంగుం ఇప్పరిశు ఉరైపార్ ఈరిరండుమాల్ శెంగణ్ తిరుముగుత్తు చ్చెల్వత్తిరుమాలాల్ ఎంగుం తిరువరుళ్ పెత్తు ఇంబరువర్ ఎంబావై.  అంగు-అప్పుడు-ఇంగుం-ఇప్పుడు ఎప్పుడైన స్వామి పాలసముద్రమును చిలుకునపుడు సహాయముచేసినను,గోకులములో పెరుగు సముద్రము చిలుకునపుడు సహాయపడటమునకు కారణము కేవలము మనమీది అవ్యాజవాత్సల్యమే.  అదే విషయమును త్యాగరాజు "ఓడను నడిపే ముచ్చట గనరే" అని తాదాత్మ్యతతో దర్శించి ధన్యులైనారు.  అదే కరుణను గోదా రంగనాథులు మనపై వర్షిస్తున్నారనుటకు, ఓం నమో నారాయణాయ **********************- అనుగ్రహముగ నామది శ...

AALO REMBAAVAAY-29

Image
    శాత్తుమరై పాశురము-29  ******************  "ఆలకించనీయననదు నీ అనురాగపు ఆంతర్యము   ఆలసించగనీయదు  అనుమతింప నిత్యకైంకర్యము"     మంగళప్రదమైన పాశురములో ఇష్టప్రాప్తి-అనిష్ట నిర్మూలనము ను స్పష్టము చేయించి ఇటు ఏడుతరములను-అటుఏడు తరములను స్వామి అనుగ్రహప్రాప్తులను (మన పూర్వీకులను-ఉత్తర వంశస్థులను) ఉద్ధరించుటయే కాక,రంగనాధుని అనుగ్రహమును పొంది-కొత్త పెళ్ళికూతురుగా ముస్తాబవబోతున్న గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ,వారనుగ్రహించనంతమేరకు (వింజామర) పాశురమును అనుసంధానము చేసుకునేందుకు ప్రయత్నమును చేద్దాము.  ఇరువది తొమ్మిదవ పాశురం ********************** శిత్తం శిరుకాలే వందు ఉన్నై చ్చేవిత్తు ఉన్ పొత్తామరై అడియే పోత్తుం పొరుళ్ కేళాయ్ పెత్తం మేయ్ తుణ్ణం కులత్తిల్ పిరందు నీ కుత్తేవల్ ఎంగళై కొళ్ళామల్ పోగాదు ఇత్తైపరై కొళివాన్ అన్రుగాణ్ గోవిందా ఎత్తెక్కుం, ఏళేళు పిరవిక్కుం ఉందన్నోడు ఉత్తోమేయావోం; ఉనక్కేనాం,అత్చెయ్ వోం  మత్తైనం కామంగళ్ మాత్తు ఏలోరెంబావాయ్.   గోపికలు ప్రథమ పాశురము నుండి స్వామి పఱ ను తమకు అనుగ్రహిస్తాడని-దానిని స్వీకరించి నోమును ...

AALO REMBAAVAAY-28

Image
     పాశురము-28    ************ " కానల గోవుల మేపుతున్నది జ్ఞానసంబంధములేనిది మా ఉపాధి   కానిల గోకులమ్మను జననసంబంధము ఉన్నది ఓ దయానిధి"    "స్వధర్మో- నిధనం శ్రేయః" అన్న ఆర్యోక్తిని నిరూపిస్తూ,పరంధాముని ప్రసన్నునిగా చేసుకొను సిద్ధోపాయమును సైతము అందించుచున్న గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ అమ్మ అనుగ్రహించిన మేరకు పాశురమును అనుసంధానము చేసుకునే ప్రయత్నమును చేద్దాము.  నిన్నటి పాశురములో గోపికలు అర్థించినవాటిని స్వామి తప్పక అనుగ్రహిస్తాడన్న విశ్వాసముతో వారు భావనావీధులలో బాహ్యమును మరచి భగవదానుభవమును ఆస్వాదిస్తున్నారు. "కన్నని చూచునొక్కతె-కనుసన్నల దాచునొక్కతె బింకముపోవు నొక్కతె-బిగి కౌగిట దాచునొక్కతె జలమును చల్లు నొక్కతె-జలజంబును తురుమగ కోరునొక్కతె దరహాసము చేయుచు దాగునొక్కతె-దరిచేరగ పిలుచు నొక్కతె పరిహాసముచేయుచు నొక్కతె-పర్యంకమున పరుండబెట్టొకతె తనవాడే-తనవాడే -తనావాడేననుచును తాదాత్మ్యము తోడుగ పరవశులైన పడతులతో -పలు-పలు లీలల ప్రకటనములతో యదుకులభూషణుని పొదివిన యమునాతటి ఎంతటి భాగ్యశాలియో రసరమ్యతనొంది తరించెను రమణీరమణుల రాసలీలలన్."   ఇరువది ఎని...

AALO REMBAAVAAY-27

Image
       పాశురము-27       ************   "సమవర్తిత్వము సాధించునుకదా స్వామి నీదు తీర్మానము   సమాశ్రయణము అందచేసినది మాకదే పెద్ద సన్మానము."    మాలే మణివణ్ణా పాశురములో తమ నోమునకు కావలిసిన వస్తువులను అర్థిస్తున్నట్లుగా సాక్షాత్తుగా విభవోపేతుడైన స్వామిని అర్థించారు. ఇప్పుడు వారు కోరుకొనునది స్వామి సమాగమము.జీవాత్మ తన బాహ్యలక్షణములను విడిచి,పంచసంస్కారములను పొంది, పరమాత్మను సమీపించి స్వామి గుణవైభవములను అనుభవించగలుగుట.ఐహికములో తనలో సంకోచించుకు పోయిన శౌర్యం,వీర్యం,ధై ర్యం,చాతుర్యం,ఔదార్యం  ,మాధుర్యం,జాజ్వల్యం,ఔచిత్యం అను స్వామి అష్టగుణములను     ముక్తపురుషుడై వ్యాకోపింపచేసుకొని స్వామి సారూప్యమును-సాలోక్యమును-సాంగత్యమును అంతకు మించి సాయుజ్యమును చేరుటను మనకు అందించిన రామానుజ సోదరికి అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ,గోవిందానుభూతినందించు, "అక్కార్ అడిసెల్" అను కూడారై అను విశేష పాశురమును అనుగ్రహించినంతమేరకు అనుసంధానము చేసుకుందాము.అమ్మ కూడి ఇరందు కుళిరేందో అని స్వామి సంపూర్ణ సమాగమ సావకాశమును కల్పించు సమాశ్రయణములను వివరించిన విధానమ...