Posts

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(DVAADAsAATMAN NAMOSTUSTUTE-15)

Image
  నక్షత్ర గ్రహ తారాణాం అధిపో విశ్వభావనః । తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మ-న్నమోఽస్తు తే ॥ 15 ॥  ప్రస్తుత శ్లోకములో నమస్కార ప్రక్రియ ప్రవేశింపబడినది.అంతేకాదు ఖగోళ వాసులైన నక్షత్రములు-తారలు-గ్రహములు-ఉపగ్రహములలో అంతర్యామిగా దాగి విశ్వరచన చేసిన పరమాత్మ   పర-వ్యూహ-అర్చా-అంతర్యామి తత్త్వములు పన్నెండు విధములుగా /ద్వాదశాత్మన్ గా ప్రస్తుతింపబడుతున్నాడు.  సామాన్య వ్యవహారములో నక్షత్రము-తారలు ఒక్కటిగానే భావింపబడుతున్నప్పటికిని,వైజ్ఞానికముగా సందర్శించిన వారు నక్షత్రములలో అశ్వనీ మొదలైన 27 వాటికి  ప్రాముఖ్యతనిచ్చి వాటిని స్వయంప్రకాశములుగా/పగటిపూటను సైతము మనకు గోచరించువానిగాను భావిస్తారు.  తారలు అసంఖ్యాకములైనప్పటికిని వాటిని స్వయంప్రకాశములుగా కాక రాత్రియందు మాత్రమే ఆకాశమున కనిపించువానిగా సూర్యశక్తికి కనుమరుగు స్వభావము కలవానిగా భావిస్తారు.  అదేవిధముగా సూర్యుడు నక్షత్రమని వైజ్ఞానికులు-నవగ్రహములో ఒక గ్రహముగా ఐతిహాసికులు భావిస్తారు.అదే విధముగా చంద్రుని ఉపగ్రహముగానే అంగీకరిస్తారు వైజ్ఞానికులు.సూర్య కిరనములనుండి తమ చల్లదనమును-చక్కదనమును కల వెన్నెలనందించుచునాడని భావిస్తారు....

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(SARVABHAVODBHAVA-14)

Image
  ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః । కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వభవోద్భవః ॥ 14 ॥  ప్రస్తుత శ్లోకము స్వామి యొక్క మందలాకార విశిష్టతను మరింత ప్రస్పుటముచేస్తూ స్వామి యొక్క తపనగునమును మరిత నొక్కిచెప్పుతున్నది.  అసలు మండలము అంటే ఏమిటి? ఆతపీ మండలము అంటే ఏమిటి? అనే విషయములో దాగిన అద్భుతములను తెలుసుకునే ప్రయత్నము చేద్దాము.  "మండలం వర్తులాకారం" అన్నది ఆర్యోక్తి.వృత్తాకారముగా ప్రజ్వరిల్లుతున్న కిరణముల శోభను మండలముగా భావించుత ఒక విధానము.  అంటే ఒక బిందువును కేంద్రముగా చేసుకుని సమానదూరములోనున్న ప్రదేశములలో సమాన వేగముతో వేడిని-వెలుగును ప్రసరించుటకు అనుకూలమైన విధానము.అదియే వృత్తాకారముగా నున్న సూర్యమండలము.  మండలిని మరికొందరు,  " మంజతే అనేన ఇతి మణిభూషాయాం మండలి"  అనేక ప్రకాసవంతమైన కిరణములనే మణి భూషణములతో ప్రకాశించు స్వభావము కల స్వరూపము మండలి.ఐతిహాసిక కథనము ప్రకారము శమంతకమణి సూర్య ప్రసాదముగా సత్రాజిత్తునకు లభించినదని చెబుతారు.   మండలీ సబ్దమును స్వామి కిరణ ప్రవర్తన విశేషముగా భావిస్తారు.   వృత్తాకారముగా నున్నది మందలము.అంతే కాదు ఆతపీ స్వభావమును కలిగియున్...

ANIVERCHANEEYAM-ADITYAHRDAYAM(PLAVAMGAMA-13)

Image
  వ్యోమనాథ-స్తమోభేదీ ఋగ్యజుఃసామ-పారగః । ఘనావృష్టిరపాం మిత్రః వింధ్యవీథీ ప్లవంగమః ॥ 13 ॥   తన హిరణ్యగర్భమునుండి వెలువరచు శక్తి కిరణములద్వారా జగములకు తాపమును కలిగించుచు-తాపమును తొలగించుచున్న శంఖుడు-ఇంద్రియములనుండి-ద్వారా ఆనందమును కలిగించుచున్న పరమాత్మ  ఖం-అపరిమిత తత్త్వముతో/ప్రకాశముతో ఆనందమును అందించు శంఖ నాముడైన సూర్యుడు ప్రస్తుత శ్లోకములో ప్లవంగముగా మారి సర్వులను తరింపచేయుచున్నాడు.  ప్లవంగము అన్న పదమునకు "పడవ" అను అర్థమును సమన్వయించుకుంటే "వింధ్యవీధి"  కఠినతరమైన కనుమల మార్గములో సూక్ష్మముగా తానుండి మనలను దాటించువాడు.  అపరిమితమైన వీధి ఆకాశమార్గముననుండి తన కిరణముల ద్వారా మనకు కావలిసినవి సృష్టించి-పెంచి-మనకు అనుగ్రహించువాడు.  అలలతో నిండిన సంసారసాగర్మును దాటించుటకు పదవ అయినవాడు ఆ పరమాత్ముడు.  వ్యోమనాథునిగా కీర్తింపబడు పరమాత్మయే సూర్యభగవానుడు.  "విశ్వం వ్యయతి సంహృతోతి వ్యోమః" అన్నది ఆర్యోక్తి.  ఈ విషయమునే శిశిరనాసనః అంటూ కిందటి శ్లోకము ప్రస్తావించినది.  శిశిరము తొలగుట వసంతము చిగురించుటకు సంకేతము.మోడు ఆకులు రాలితే కాని కొత్త చిగురు కనిపించ...

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(HIRANYAGARBHA-11)

Image
  హిరణ్యగర్భః శిశిరః తపనో భాస్కరో రవిః । అగ్నిగర్భోఽదితేః పుత్రః శంఖః శిశిరనాశనః ॥ 12 ॥  ప్రస్తుత శ్లోకములో పరమాత్మ హిరణ్యగర్భునిగా,అగ్ని గర్భునిగా,తపనునిగా,భాస్కరునిగా,రవిగా,అదితిపుత్రునిగా,శంఖునిగా,శిశిరనాశనునిగా వర్ణించారు.  హితమును-రామణీయకతను కలిగించునది హిరణ్యము.(కేవలము బంగారమను లోహము మాత్రమే కాదు.)జలమయిమైన సమయములో తన శక్తిని బీజముగా దానిలోనికి ప్రవేశింపచేసిన పరమాత్మ హిరణ్యగర్భుడు.స్థూల పినఃసృష్టికి కారణభూతుడు.  స్థూలములో నిండిన ఉపాధులలో తన చైతన్యమును నిబిడీకృతము చేసి వానిని చైతన్యవంతము చేసే అద్భుత శక్తియే అగ్నిగర్భుడు.  జడములలో కలిగించు ప్రతిస్పందన శక్తి యొక్క చైతన్యమే అగ్నిగర్భముగా కీర్తింపబడుతున్నది.   అదే విధముగా శిశిరః-శిశిరనాశనః అని శిశిరము అను పదమును రెండుసార్లు ప్రస్తావించబడినది.  శిశిర పదమును స్థూలములో అన్వయించుకుంటే ఋతు స్వరూప-స్వభావములను పోషణమునకు అనుకూలముగా అనుగ్రహించు పరమాత్మ అని అన్వయిస్తారు.  శిశిరమును పోషణరహిత-తన స్వస్వరూపమును అర్థముచేసుకొనలేని /ప్రతిస్పందనములేని జడలక్షణముగా అన్వయించుకుంటే దానిని నశింపచేసే చైతన్యము ఆ పరమాత్మ. ...

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(MAARTAANDAKAHA--12)

Image
  హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తి-ర్మరీచిమాన్ । తిమిరోన్మథనః శంభుః త్వష్టా మార్తాండకోంఽశుమాన్  ఐతిహాసిక ప్రకారముగా సూర్యభగవానుడు అదితి గర్భమును జారి మృతమైన అండమునుండి ఉద్భవించినాడనుటకు నిదర్శనముగా చెబుతుంటే సనాతన కథనము ప్రకారము పరమాత్మ బ్రహ్మసైతము జలముగా మారిన మృతాందముగా నున్న సమస్త జగమును పునర్నిర్మించుటకై జలములో తన రేతస్సును ప్రవేశపెట్టి పునః సృష్టిని జరిపిస్తాడని కీర్తిస్తున్నది.  ప్రస్తుత శ్లోకములోని ప్రతిపదము అనేకానేక సమన్వయములకు సంకేతముగా ఉంటున్నది.అవే,  హరిదస్వః,సహస్రార్చి,సప్తసప్తి,మరీచిమాన్,తిమిర ఉన్మథనః,శంభు,త్వష్ట,మార్తాండ,అంశుమాన్ అని వర్ణిస్తున్నారు.  హరిదశ్వః నమోనమః ..................  హరి అను సబ్డమునకు పలు అర్థములను అందిస్తునారు వ్యాఖ్యాతలు.  హరించు-తొలగించు అను అర్థమును అన్వయించుకుంటే చీకట్లను అతి త్వరగా హరించగలుగు /అతి వేగముగా పరుగెత్తు చైతన్యశక్తిని/గుర్రములుగా కలవాడు.  హరిత్ అను శబ్దమును దిక్కుగా కనుక అన్వయించ్య్కుంటే దిక్కుల వైపునకు తన కాంతిని అతిత్వరగా వ్యాపిస్తూ చీకట్లను తొలగించువాడు.  హరి శబ్దమును విష్ణు పరముగా అన్వయించు...

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(SAPTASAPTIMAREECHIMAAN)-10

Image
  ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ । సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః ॥ 10 ॥   పూర్వభాగ పరిచయమును ముగించుకొని,ప్రస్తుత శ్లోకము నుండి మనము ఆ పరమాత్మ యొక్క నేకానేక గౌణ నామములద్వారా జగత్పాలనా విశషములను అర్థముచేసుకునే ప్రయత్నమును చేద్దాము.  ఆదిత్యుడు,సవితుడు,సూర్యుడు,ఖగుడు,పూషుడు,గభస్తిమానుడు,హిరణ్యసద్రుశుడు,భానుడు,సువర్ణరేతస్సుడు,దివాకరుడు అనే నామ ప్రాశస్త్యము వివరింపబడుతోంది.  ఆదిత్య నమోనమః   ...............  దితి ఖండింపదగినది.విడదీయబడునది.దానికి విరుద్ధముగా అఖండముగా అవిభాజ్యముగా నున్నది అదితి.అదియే అఖండము.  అదియే "ఆత్మజ్ఞానము-అసలు వీడనిది."స్థిరముగా మనలో నిలిచి మనలను ఉద్ధరించునది.దానిని అనుగ్రహించువాడే ఆదిత్యుడు.  సవితః నమోనమః  .............  సువి ప్రాణ సవిత.ప్రసవము అని మనము ఉపయోగించు పదము సవితాశక్తియే.సృష్టి చేయుటకు,విస్తరించుటకు అనుకూలమైన సూర్యశక్తియే సవిత అని గౌణనామముగా ఉపయోగించబడుతున్నది.  సూర్య  ......  సువతి రమయతి సూర్య అన్నది ఆర్యోక్తి.సుష్టు ఇరయతి సూర్యః.వాయు సంచారమునకు తగిన ఉష్ణమును అందించువాడు సూర్యుడు...

ANIRVACHANEEYAM ADITYAHRDAYAM(PRAJA-PRANA)-10

Image
  పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః । వాయుర్వహ్నిః ప్రజాప్రాణః ఋతుకర్తా ప్రభాకరః ॥ 9 ॥  పితరో నమః  ***********  పరమేశ్వరుని ఇంద్రియములే/శక్తులే దేవతలు అని పెద్దలు చెబుతారు.ప్రస్తుత శ్లోకము గనములకు సంకేతమైన బహువచనమును అన్వయించుచున్నది.   పితృగణమును-వసుగణమును,సాధ్యగణమును,అశ్వినీదేవతలను ఇద్దరిని,మరుత్ గణములను,మనుగణములను,వాయుగణములను,వహ్నిగణములను,ఋతుగణములను,ప్రభాకిరణములను ప్రస్తావించుచున్నది.  రుద్రములో చెప్పినట్లు"పత్తీనాం పతయే" మార్గములను ఏర్పరచి నడిపించుపరమాత్మ కిరణ సమూహములే బహు రూపములతో,తత్త్వములతో సమీకరింపబడుతూ సహాయపడుచున్నవి.  పితరో నమః  *********  " మాతాచ-పితాచ పితరో" ఆర్యోక్తి.తల్లి-తండ్రులే పితరులు.  జీవునికి జన్మజన్మలయందు ఉపాధికి తగిన అనుగుణమైన ఆహారమును అందించు వ్యవస్థయే పితృదేవతా వ్యవస్థ. పితృయానమునకు సహాయపడు కిరణ సమూహములు.  సనాతన ధర్మముననుసరించి ఉపాధిని వీడిన జీవుడు వసు రూపమును,రుద్ర రూపమును,ఆదిత్యరూపమును క్రమముననుసరించి పొందుతాడని దానికి అనుగుణమైన కర్మలను ఆచరించవలసిన బాధ్యత వారసులదని నమ్ముతుంది.ఒక విధముగా జీవుల వివిధ ఉప...