Posts

KURYAAT KATAAKSHAM KALYAANI-01

Image
 " కుర్యాత్ కటాక్షం కళ్యాణి-కదంబ వనవాసిని."      మొదటి శ్లోక అర్చనము.     ***********************  ప్రార్థన  *****      "కదాకాలేమాతః కథయ కవితాలక్తక రసం     పిబేయం విద్యార్థి తవచరణ నిర్ణేజనజలం     ప్రకృత్యా మూకానాం అపిచ కవితా కారౌతయా     కదాదత్తే వాణీ ముఖకమల తాంబూలరసతాం.          (ఆదిశంకరుల సౌందర్య లహరి.)      శ్లోకము-01.    ********  " చేటీ భవన్ నిఖిల ఖేటీ కదంబవనవాటీషు నాకిపటలీ   కోటీర చారుతర కోటీ మణికిరణకోటీ కరంబిత పదా   పాటీరగంధి కుచశాటీ కవిత్వ పరిపాటీం అగాధిప సుతా   ఘోటీ ఖురాత్ అధిక ధాటీం ఉదార ముఖవీటీ రసేన తనుతాం"  పద విన్యాసము.  ***********   జగదంబ,  భవత్-కూడియున్నది  చేటీ భవత్-చెలికత్తెలను/దాసీజనమును కూడియున్నది.  ఖేటీ-చేటీ-భవత్  దేవతా స్త్రీలను-చెలికత్తెలుగా సేవించుచుండగా-కూడియున్నది.వారికి సేవా సౌభాగ్యమును  అనుగ్రహించుచున్నది.  నిఖిల-ఖేటీ-చేటీ-భవత్  సమస్త-దేవతాస్త్రీల-సేవలన...

kURYAAT KATAAKSHAM KAKYANI-INTRODUCTION

Image
     శ్రీ  మాత్రే నమః    ************     ప్రియ మిత్రులారా!   దేవీ శరన్నవరాత్రోత్సవ  శుభకామనలు    " వాగర్థావివ సంవృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే     జగతః పితరౌ వందే పార్వతీ  పరమేశ్వరౌః"      ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరులు శబ్దము-అర్థము వలె,శాశ్వత అవిభాజ్య సంబంధము కలవారు  శబ్దార్థ సంభావితమైన సులక్షణ వాగ్ఝరికై మహాకవి/కవికుల తిలకుడు,తన నిజనామమును కనుమరుగు చేసి ఆ కాళికాదేవి దాసునిగా జగద్విఖ్యాతిని గాంచిన కాళిదాస ప్రణీతమైన మరొక అద్భుత-అసమాన స్తోత్ర రాజము "దేవీ దశ శ్లోకిగా" పేరుగాంచిన,13 శ్లోకముల,  అశ్వధాటీ స్తోత్రరాజము.    ఈ స్తోత్రము లోని ప్రతి శ్లోకము రసరమ్య గుళికయే.శబ్ద సౌరభ లతికయే.పరమార్థ ప్రకాశ కరదీపికయే.    స్తోత్రమును పరిచయము చేసికొనిన తదుపరి దాని విశేష వైభవమును ఆకళింపు చేసుకునే ప్రయత్నమును చేద్దాము..  జగద్గురువులు ఆదిశంకరులు తన సౌందర్యలహరి  స్తోత్రములో స్తుతించినట్లు(38 వ శ్లోకం)    సమున్మీలిత్ సంవిత్ కమలముగా మన హృదయమును కల్మషరహితమైన బంగరుకమలముగా మన మ...

ANUBAMDHAM ADITYAHRDAYAM WITH RUDRAM-PART-02

Image
   పరమాత్మ రుద్రములో రుద్రునిగాను-ఆదిత్యహృదయములో మండలాంతరగత సూర్యునిగాని రెండు నామములతో కీర్తిస్తున్నప్పటికిని,నమకము ప్రథమ అనువాకములోని 7-8 శ్లోకంలు పరమాత్మయొక్క ప్రసారగుణమును-ప్రసాదగుణమును వివరించుటలో ఏకాభిప్రాయముతోనే ఉన్నవి.   ఏడవ మంత్రము అసౌ-అన్న సంబోధనతో ఆయననే అసమానమైన పరమాత్మ.అవ్యాజకరుణమూర్తి.అనుగ్రహప్రదాత.  కనకనే చీకటిపై-జడత్వముపై -పాపములపై తనకున్న  "హేడ" కోపమును తొలగించుటకు,నిర్మూలించుటకు ఉదయమునుండి-అస్తమయము వరకు మనలను తాకుచున్నాడు.  రుద్రా-ఇమాంగుం అభితః-ఉదయ సంకేతముగా రుద్రుడు/సూర్యుడు భూమి మీద విస్తరిస్తున్నాడు.  అంతేకాదు-మరియును అని చెప్పుటకు"ఉత" అనే శబ్దము ప్రయోగింపబడినది.  రుద్రుడు భూమి మీద సూర్యునిగా ఎలా విస్తరిస్తున్నాడో చెప్పాలంటే అభితః దిశః-అన్ని దిశలయందును/దిక్కులయందును విస్తరిస్తున్నాడు.  రుద్రుడు అన్ని దిక్కులయందు విస్తరిస్తున్నప్పుడు మూడు రంగులతో  తామ్ర-అరుణ-బభ్రు-ఎర్రని రంగు-కొంచము లేత ఎరుపు రంగు-బంగరు రంగుతో ప్రకాశిస్తున్నాడు.  ఇక్కడ దిక్కులు-రుద్రులుగా ప్రస్తుతింపబడు సూర్యకిరణములు పరస్పరాశ్రితములు.   ఏకం-అ...

ANUBAMDHAM ADITYAHRDAYAM WITH NAMAKAM -PART-01

Image
   మనుగడలోని ప్రశాంతతను అడ్డుకొనునది రోదనము.  స్వస్వరూపమును తెలిసికొననీయనిది రోదనము.  రోదనం ద్రావయతి ఇతి రుద్రః.  దుఖమును-శోకమును ద్రవింపచేయువాడు కనుక పరమాత్మ  రుద్రునిగా సంకీర్తింపబడుతున్నాడు.అంటే భద్రతను చేకూర్చు పరమాత్మయే రుద్రుడు.  ఆదిత్యహృదయ స్తోత్రము సైతము పరమాత్మ ప్రసన్నతను సూర్యమండలముగా భావిస్తూ,ప్రసాదగుణమును సూర్య రూపముగా ప్రస్తుతిస్తున్నది.  అంతే కాదు అనేకానేకములుగా మండలమునుండి విస్తరిస్తున్న కిరణములను అనేకానకములుగా విస్తరించుచున్న రుద్రులుగా భావిస్తున్నారు.భాసిస్తున్న కిరణములు భవసాగరమును దాటించు రుద్రులు అన్నమాట.  పరమాత్మ రుద్రములో రుద్రునిగాను-ఆదిత్యహృదయములో మండలాంతరగత సూర్యునిగాని రెండు నామములతో కీర్తిస్తున్నప్పటికిని,నమకము ప్రథమ అనువాకములోని 7-8 శ్లోకంలు పరమాత్మయొక్క ప్రసారగుణమును-ప్రసాదగుణమును వివరించుటలో ఏకాభిప్రాయముతోనే ఉన్నవి.   ఏడవ మంత్రము అసౌ-అన్న సంబోధనతో ఆయననే అసమానమైన పరమాత్మ.అవ్యాజకరుణమూర్తి.అనుగ్రహప్రదాత.  కనకనే చీకటిపై-జడత్వముపై -పాపములపై తనకున్న  "హేడ" కోపమును తొలగించుటకు,నిర్మూలించుటకు ఉదయమునుండి-అస్...

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(SARVASATRUVINASAKAM)

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(ARGHYASEVITAAYA NAMAHA)

Image
   సనాతన పూజావిధానములో జలమునకు ప్రాధాన్యత ఉంది.పూజా ప్రారంభమునందు చేయు ఆచమనీయము,షోదశపూజలో చేయు అర్ఘ్యము-పాద్యము-శుద్ధ ఆచమనీయము,శుద్ధోదక స్నానము,ఉదకశాంతి ఎంతో ముఖ్యమైనవి.   బాహ్యమునకు సుచియై చతిలో జలమును గాయత్రీమంత్రపూర్కముచేస్ ఊర్ధ్వ దిశగా చేయు సంధ్యావందన ప్రకృఇయగా భావిస్తారు.కొందరు మూడు సంధ్యలయందును సూర్యునికి అర్ఘ్యమును సమర్పించే విధానమును పాటిస్తారు.   దీనివలన వాతావరణ పారిశుభ్రమునకు ఆటంకము కలిగించే సూక్ష్మజీవులు నశించి పర్యావరణము పచ్చగా ఉంటుందని సమర్థిస్తారు.ఇది కాదనలేని అంసమే.   ఆధ్యాత్మికముగా ఆలోచిస్తే గరుడ పురాణములో చెప్పబడినట్లు మనకు సూర్యునికి మధ్య అడ్డముగా మందేహులు అనే అసురులు ముసురుకుంటారని వారిని మంత్రపూరిత(గాయత్రీ) జలముతో-దోసిలి నింపుకుని పైకి విసిరిన అద్దకులు తొలగిపోవునని భావిస్తారు.అదియును కాదనలేని విషయమే.   శ్రీ లలితారహస్య సహస్ర నామ స్తోత్రములో చెప్పబడినట్లు,  కేవాలా-కైవలానర్ఘ్యా-కైవల్యపదదాయిని" అన్న శ్లోకమును విచారిస్తే అర్ఘ్య అన్న పదమును గడియగా భావించి,గడియలులేని కైవల్యమును కేవలానర్ఘ్యగా అమ్మను అనుగ్రహించేదానిగా కీర్తిస్తారు.  మన-...

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(VISVAKARMA-TVASHTA NAMOSTUTE)

Image
   ఋగ్వేద "హిరణ్యగర్భ సూక్తము" పరమాత్మ యొక్క త్వష్ట నామధేయమును సోదాహరణముగా వివరించుచున్నది.  సామాన్యార్థములో మలచువాడు-తొలచువాడు గా వ్యవహరింబడు త్వష్ట.కాని సకలభువనభాండములను పద్ధతిగా ప్రకటించిన పరమాత్మ విశ్వకర్మ.అంతే కాదు పంచభూతములు ఏ విధముగా ఒకదానినొకటి సమన్వయపరచుకుంటూ ప్రపంచముగా ప్రకాశించాలో నిర్దేశిస్తూ,వాటికి అడ్దుగా ఉన్న వాటిని తీసివేస్తూ ,  వేదెఒపాసనగా . " కస్మైదేవాయ హవిః విధేయ? అన్న ప్రశ్నకు సమాధానముగా  " ఏకస్మై దేవాయ-ప్రణతోస్మి" అని సమాధానమిచ్చినది  హిరణ్యగర్భసూక్తము. "తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశత్" తనచే సృష్టింపబడిన సకలచరాచరములందు ప్రవేశించు పరమాత్మకు ప్రణామములు.హిరణ్య శబ్దమునకు విజ్ఞానమును సమన్వయించుకుంటే,  యస్యేమె హిమవంతొ,సముద్రో,దిక్పాలక ప్రస్తుతిస్తున్నారో వారే విశ్వకర్మ.వారే త్వష్ట.ప్రపంచ వనరులను ,నింగి-నేలలను నిర్దిష్ట పరచు నిత్యచైతన్యమా,నిన్ను ఆపోహ యత్ బృహతి విశ్వం అయాన్ గర్భం  దధానా జయంతి అగ్నిం-తతో దేవానాం...అని ప్రస్తుతిస్తున్నది వేదము.   తం సూర్యం ప్రణమామ్యహం.