Posts

KURYAAT KATAAKSHAM KALYAANI-04

Image
   కుర్యాత్ కటాక్షం కళ్యాణి-04    ******************    ప్రార్థన    ******  గతైర్మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం  కిరీటం తేహైమం హిమగిరిసుతే కీర్తయతి యః  సనీడే యత్ ఛాయాత్ చురణశబలం చంద్రశకలం  ధనుఃశౌనాసీరం కిమితి నః బధ్నాతిధిషణాం.   శ్లోకము.   ****** " బాలామృతాంశు నిభఫాలామనంగరుణ చేలానితంబఫలకే  కోలాహల క్షపితకాలామరాకుశల కీలా శోషణ రవిః  స్థూలాకుచే జలదనీలాకచే కలిత లీలా కదంబ  విపినే  శూలాయుధా ప్రణుతి శీలావిభాతు హృది శైలాధిరాజ తనయా."  పూర్వ స్తోత్ర ప్రస్తావనము.  ****************    మందార మకరందమాధుర్యమును గ్రోలుమధుపంబు బోవునే మదనములకు--పోతన  మహాకవి.   అదేవిషయమునుమరింతనొక్కి వక్కాణిస్తూ,తల్లీ నీ పాద రజ మకరందమును, అనన్య భక్తితో గ్రోలుటకు నామనసును  తుమ్మెదగా మార్చి  నన్ను  అనుగ్రహింపుము .తల్లీ !సంసారమనేసర్పము విషపుకాటులతో నన్ను సతమతము చేస్తున్నది.దానిని ఆడుముంగిసవై అదృశ్యము చేసి నన్ను నీ సేవకు సంసిద్ధముచేయి అని ,మహాకవిప్రస్తుత శ్లోకములో అకుశలతలను తొలగించమని వేడుకుం...

KURYAAT KATAAKSHAM KALYAANI-03

Image
   కుర్యాత్ కటాక్షం కళ్యాణి-03    ****************  ప్రార్థన   దృశాద్రాఘీ   యస్యా దరదళిత నీలోత్పల రుచా   దవీయాంసుం" దీనం స్నపయ కృపయా మామపి శివే"   అనేనాయం ధన్యో భవతి న చతే హానిరియతా   వనేవా హర్మేవా సమకర నిపాతో హిమకరః.   శ్లోకము   ******  " యాళీ భిరాప్త తనుతాళీనకృత్ ప్రియక   పాళీషు   ఖేలత  భవ    వ్యాళీ నకుల్యసిత చూళీభరా     చరణ ధూళీ లసత్   మునిగణా    యాళీ భృతి శ్రవసి తాళీదళం వహతి యాళీక శోభితిలకా    పాళీకరోతు మమకాళీ మనః స్వపద నాళీక సేవన విధౌ."  స్తోత్ర పూర్వ ప్రస్తావనము   ***************     అమ్మా నీవు కదంబవనములో చెలులతో సఖ్యముగావిహరిస్తూ,సమస్త దేవతాగణముచే పాదసంసేవనమును స్వీకరిస్తూ వారిని అనుగ్రహిస్తున్నావు.తపోధనులైన వ్యాస వాల్మీకాదులకు నీ అనుగ్రమును సోపానముచేసి ఉద్ధరించుచున్నావు.భక్తరక్షణాశీలా      సనకాది సమారాధ్యా-నీవు అసంఖ్యాక   మునిగణములను  నీ పాదరజముతో (సామీప్య భక్తానుగ్రహముతో ) తేజోవంతు...

KURYAAT KATAAKSHAM KALYAANI-02

Image
    కుర్యాత్ కటాక్షం కళ్యాణి-శ్లోకము02   *************************  ప్రార్థన     తనీయాంసం పాంసుం తవచరణ పంకేరుహ భవం     విరించి సంచిన్నన్విరచయతి లోకానవికలం     వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం     హర సంక్షుద్యైనం భజతి భసితోద్ధూలన విధిం.  శ్లోకము     ద్వైపాయన ప్రభృతి శాపాయుధా త్రిదివ సోపాన ధూళి చరణా   పాపాపహ స్వమను జాపానులీన జన తాపాపనోద నిపుణా   నీపాలయా సురభి ధూపాలకా దురిత కూపాత్ ఉదంచయతు మాం   రూపాధికా శిఖరిభూపాలవంశ మణిదీపాయితాం భగవతి.    స్తోత్ర పూర్వ పరిచయము    దేవతా సమూహములచే కదంబవనములో సేవింపబడుతూ,వారి కిరీట కాంతులచే ప్రకాశమును-మంచిగంధపు సువాసనలీను చేలాంచలమును ధరించి పరిమళమును అనుగ్రహింపచేస్తున్న జగజ్జననిని,తాంబూలరసమును ప్రసాదించి,అప్రతిహత ఆశుధారను అనుగ్రహించమనిన స్తుతిని మననము చేసుకుంటూ,ప్రస్తుత శ్లోకములోనికి ప్రవేశిద్దాము.  పద విన్యాసము.  జగజ్జనని- కరుణామయి.  1.చరణా-పాదపంకజములు కల తల్లి    ధూళి- చరణా-పరాగ పాద పంకజములు కల తల్లి    సోపాన- ...

KURYAAT KATAAKSHAM KALYAANI-01

Image
 " కుర్యాత్ కటాక్షం కళ్యాణి-కదంబ వనవాసిని."      మొదటి శ్లోక అర్చనము.     ***********************  ప్రార్థన  *****      "కదాకాలేమాతః కథయ కవితాలక్తక రసం     పిబేయం విద్యార్థి తవచరణ నిర్ణేజనజలం     ప్రకృత్యా మూకానాం అపిచ కవితా కారౌతయా     కదాదత్తే వాణీ ముఖకమల తాంబూలరసతాం.          (ఆదిశంకరుల సౌందర్య లహరి.)      శ్లోకము-01.    ********  " చేటీ భవన్ నిఖిల ఖేటీ కదంబవనవాటీషు నాకిపటలీ   కోటీర చారుతర కోటీ మణికిరణకోటీ కరంబిత పదా   పాటీరగంధి కుచశాటీ కవిత్వ పరిపాటీం అగాధిప సుతా   ఘోటీ ఖురాత్ అధిక ధాటీం ఉదార ముఖవీటీ రసేన తనుతాం"  పద విన్యాసము.  ***********   జగదంబ,  భవత్-కూడియున్నది  చేటీ భవత్-చెలికత్తెలను/దాసీజనమును కూడియున్నది.  ఖేటీ-చేటీ-భవత్  దేవతా స్త్రీలను-చెలికత్తెలుగా సేవించుచుండగా-కూడియున్నది.వారికి సేవా సౌభాగ్యమును  అనుగ్రహించుచున్నది.  నిఖిల-ఖేటీ-చేటీ-భవత్  సమస్త-దేవతాస్త్రీల-సేవలన...

kURYAAT KATAAKSHAM KAKYANI-INTRODUCTION

Image
     శ్రీ  మాత్రే నమః    ************     ప్రియ మిత్రులారా!   దేవీ శరన్నవరాత్రోత్సవ  శుభకామనలు    " వాగర్థావివ సంవృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే     జగతః పితరౌ వందే పార్వతీ  పరమేశ్వరౌః"      ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరులు శబ్దము-అర్థము వలె,శాశ్వత అవిభాజ్య సంబంధము కలవారు  శబ్దార్థ సంభావితమైన సులక్షణ వాగ్ఝరికై మహాకవి/కవికుల తిలకుడు,తన నిజనామమును కనుమరుగు చేసి ఆ కాళికాదేవి దాసునిగా జగద్విఖ్యాతిని గాంచిన కాళిదాస ప్రణీతమైన మరొక అద్భుత-అసమాన స్తోత్ర రాజము "దేవీ దశ శ్లోకిగా" పేరుగాంచిన,13 శ్లోకముల,  అశ్వధాటీ స్తోత్రరాజము.    ఈ స్తోత్రము లోని ప్రతి శ్లోకము రసరమ్య గుళికయే.శబ్ద సౌరభ లతికయే.పరమార్థ ప్రకాశ కరదీపికయే.    స్తోత్రమును పరిచయము చేసికొనిన తదుపరి దాని విశేష వైభవమును ఆకళింపు చేసుకునే ప్రయత్నమును చేద్దాము..  జగద్గురువులు ఆదిశంకరులు తన సౌందర్యలహరి  స్తోత్రములో స్తుతించినట్లు(38 వ శ్లోకం)    సమున్మీలిత్ సంవిత్ కమలముగా మన హృదయమును కల్మషరహితమైన బంగరుకమలముగా మన మ...

ANUBAMDHAM ADITYAHRDAYAM WITH RUDRAM-PART-02

Image
   పరమాత్మ రుద్రములో రుద్రునిగాను-ఆదిత్యహృదయములో మండలాంతరగత సూర్యునిగాని రెండు నామములతో కీర్తిస్తున్నప్పటికిని,నమకము ప్రథమ అనువాకములోని 7-8 శ్లోకంలు పరమాత్మయొక్క ప్రసారగుణమును-ప్రసాదగుణమును వివరించుటలో ఏకాభిప్రాయముతోనే ఉన్నవి.   ఏడవ మంత్రము అసౌ-అన్న సంబోధనతో ఆయననే అసమానమైన పరమాత్మ.అవ్యాజకరుణమూర్తి.అనుగ్రహప్రదాత.  కనకనే చీకటిపై-జడత్వముపై -పాపములపై తనకున్న  "హేడ" కోపమును తొలగించుటకు,నిర్మూలించుటకు ఉదయమునుండి-అస్తమయము వరకు మనలను తాకుచున్నాడు.  రుద్రా-ఇమాంగుం అభితః-ఉదయ సంకేతముగా రుద్రుడు/సూర్యుడు భూమి మీద విస్తరిస్తున్నాడు.  అంతేకాదు-మరియును అని చెప్పుటకు"ఉత" అనే శబ్దము ప్రయోగింపబడినది.  రుద్రుడు భూమి మీద సూర్యునిగా ఎలా విస్తరిస్తున్నాడో చెప్పాలంటే అభితః దిశః-అన్ని దిశలయందును/దిక్కులయందును విస్తరిస్తున్నాడు.  రుద్రుడు అన్ని దిక్కులయందు విస్తరిస్తున్నప్పుడు మూడు రంగులతో  తామ్ర-అరుణ-బభ్రు-ఎర్రని రంగు-కొంచము లేత ఎరుపు రంగు-బంగరు రంగుతో ప్రకాశిస్తున్నాడు.  ఇక్కడ దిక్కులు-రుద్రులుగా ప్రస్తుతింపబడు సూర్యకిరణములు పరస్పరాశ్రితములు.   ఏకం-అ...

ANUBAMDHAM ADITYAHRDAYAM WITH NAMAKAM -PART-01

Image
   మనుగడలోని ప్రశాంతతను అడ్డుకొనునది రోదనము.  స్వస్వరూపమును తెలిసికొననీయనిది రోదనము.  రోదనం ద్రావయతి ఇతి రుద్రః.  దుఖమును-శోకమును ద్రవింపచేయువాడు కనుక పరమాత్మ  రుద్రునిగా సంకీర్తింపబడుతున్నాడు.అంటే భద్రతను చేకూర్చు పరమాత్మయే రుద్రుడు.  ఆదిత్యహృదయ స్తోత్రము సైతము పరమాత్మ ప్రసన్నతను సూర్యమండలముగా భావిస్తూ,ప్రసాదగుణమును సూర్య రూపముగా ప్రస్తుతిస్తున్నది.  అంతే కాదు అనేకానేకములుగా మండలమునుండి విస్తరిస్తున్న కిరణములను అనేకానకములుగా విస్తరించుచున్న రుద్రులుగా భావిస్తున్నారు.భాసిస్తున్న కిరణములు భవసాగరమును దాటించు రుద్రులు అన్నమాట.  పరమాత్మ రుద్రములో రుద్రునిగాను-ఆదిత్యహృదయములో మండలాంతరగత సూర్యునిగాని రెండు నామములతో కీర్తిస్తున్నప్పటికిని,నమకము ప్రథమ అనువాకములోని 7-8 శ్లోకంలు పరమాత్మయొక్క ప్రసారగుణమును-ప్రసాదగుణమును వివరించుటలో ఏకాభిప్రాయముతోనే ఉన్నవి.   ఏడవ మంత్రము అసౌ-అన్న సంబోధనతో ఆయననే అసమానమైన పరమాత్మ.అవ్యాజకరుణమూర్తి.అనుగ్రహప్రదాత.  కనకనే చీకటిపై-జడత్వముపై -పాపములపై తనకున్న  "హేడ" కోపమును తొలగించుటకు,నిర్మూలించుటకు ఉదయమునుండి-అస్...