Posts

KADAA TVAAM PASYAEYAM-04

Image
కదా త్వాం పశ్యేయం-04 *********************** " జిహ్వ చిత్త శిరోంఘ్రి హస్త నయన శ్రోతైః అహం ప్రార్థితం. నమామి భగవత్పాదం శంకరంలోక శంకరం.". " త్వత్పాదాంబుజం అర్చయామి పరమంత్వాం చింతయామన్వహం త్వాం ఈశం శరణం వ్రజామి వచసా" అని శరణు వేడుతూ.ఈనాటి బిల్వార్చనను ప్రారంభిద్దాము. లేడు-కలండన్నవాడు కలడో-లేడో అంటూ తికమకపడుతున్న శంకరయ్యను చూస్తూ, మీరింకా ఆ చిన్నపిల్ల మాటనే నమ్ముతున్నట్లున్నారు.ఆ పిల్లకు ఎవరు ఏమనిచెప్పారో,ఏమి అర్థముచేసుకుందో కాని మీరు మాత్రం నా మాటలపై సందేహముతో నున్నారనిపిస్తున్నది శంకరయ్యగారు అన్నాడు మనసులో ఎక్కడ మనసు మార్చుకుని, " కంచిత్కాలముమామహేశ భవతః పాదారవిందార్చన" అంటాడేమో అన్న అనుమానముతో. శివయ్య మాటలకు తెప్పరిల్లిన శంకరయ్య అయితే ఆ చిన్నపిల్ల అలా ఊహించుకుందా! పాపం అన్నాడు, జాలిగా. అంతేగా.అంతేగా.కాకపోతే ఎంతమంది మా ఊళ్ళో అనుకుంటారు ... అయినా నాకెందుకులెండి ఆ విషయాలు. ఏదో మీతోపాటు వచ్చి నా పనిచేసుకు పోతాను.ఒకవేళ మీరు పట్టుకోవద్దులే అంటే ........ ఆలోచనలో పడ్డాడు శంకరయ్య.అసలు నేను కదా వాడిని నమ్మనిది.పట్టుకోవాలనుకున్నది.ప్...

KADAA TVAAMPASYAEYAM-03

Image
     కదా  త్వాం   పశ్యేయం-03     **************** " జిహ్వ చిత్త శిరోంఘ్రి  హస్త నయన శ్త్రోతైః అహం ప్రార్థితం   నమామి భగవత్పాదం శంకరం  లోకశంకరం."     " నిత్యానంద రసాలయం సురముని స్వాంతాంబుజాశ్రయం      స్వఛ్చం సద్విజసేవితం కలుష హృత్వాసనా నిష్కృతం     శంభుధ్యాన సరోవరం వ్రజమనోహంసావతం స్థిరం" అయిన ఆ పరమేశ్వరుని హృదయఫలకమునందు స్థిరముగా నిలుపుకుని ఈనాటి బిల్వార్చనను ప్రారంభిద్దాము.పాహిమాం  పరమేశ్వరా .        తెల్లబోయి చూస్తున్న శంకరయ్యను సమీపించి,ఆయన ఎంతమంది వెంట ఉన్నా ఏమీలేనివాడేనట అన్నాడు.    విన్న శంకరయ్య అంటే బీదవాడా? బిచ్చమెత్తుకుంటాడా? అసలు ఏమిచేస్తుంటాడట?   ఆసక్తిగా అడిగాడు శివయ్యను.    పక్కా బిచ్చగాడు.ఆ విషయము తెలిసికొని ఒకాయన వెళ్ళిచూస్తే అప్పుడే ఒక పుర్రెను పట్టుకుని బిచ్చమెత్తుకోవడానికి బయలుదేరుతున్నాడట.  ఈయనకేమి లేదు-నాకేమి ఇస్తాడు అనుకుని,ఆకలిగా ఉంటే,నేను నీతో వస్తాను.నీకు గారడేఏలు బాగా వచ్చుకదా.నన్ను కోతినిచేసి నీతో పాటుగా తీసుకువెళ్ళి ఆడ...

KADAA TVAAM PAsYAEYAM-02

Image
   కదా  త్వాం పశ్యేయం-02    ******************   " జిహ్వ చిత్త శిరోంఘ్రి హస్త నయన శ్రోతైః అహం  ప్రార్థితం.    నమామి భగవత్పాదం శంకరంలోక శంకరం.".   ' స్తవై బ్రహ్మాదీనాం జయజయ వచోభిర్నియమినా     గణానాం కేళీభిర్మదకల మహోక్ష్స్య కకుది"     బ్రహ్మాదులు-నియమపాలితులైనమునులు-పరవస్త్స్తున్న ప్రమథగణములు - అంబా సమేతముగా తనపై నున్న స్వామి అనుగ్రహమును వహిస్తూ నందీశ్వరుడు చేయుచున్న జయ-జయ-జయ-జయ ధ్వానములను మనోఫలకముపై ముద్రించుకుని,ఈ నాటి బిల్వార్చనను ప్రారంభిద్దాము.   "జయ జయ జయ పార్వతీ పరమేశ్వరా" నమో నమః.             కొంచము సేపు విశ్రాంతి తీసుకుని మార్గబంధు సహాయముతో పయనము ప్రారంభించారు శంకరయ్య-శివయ్య.   మౌనముగా వారి పాదాలుకదులుతున్నాయి.కాని శంకరయ్య మనసులోని పదాలు మాత్రం పరుగులు తీస్తున్నాయి.  ఇదేనేమో    "గురోస్తు మౌనంవ్యాఖ్యానం-           శిష్యాస్తు ఛ్చిన్న సంశయా అంటే"    పొరబడుతున్న శంకరయ్య మనసు ప్రత్యర్థి        ...

KADAA TVAAM PASYAEM-01

Image
        కదా త్వాంపశ్యేయం-01    **********************  " జిహ్వ చిత్త శిరోంఘ్రి హస్త నయన శ్రోతైః అహం  ప్రార్థితం.    నమామి భగవత్పాదం శంకరంలోక శంకరం.".   ప్రపంచ పదార్థములను గుర్తించగలిగి-ప్రకటించకలగటమును ఐహిక జ్ఞానముగాను,అవ్యక్త చైతన్య ఉనికిని గుర్తించి-దర్శించి ధన్యత చెందగలిగేది ఆధ్యాత్మిక జ్ఞానము.అదిలేనిది అజ్ఞానము.ఒక వస్తువును మరొకటిగా భావించి-భాషించుట అన్యథా జ్ఞానము.అన్యథా జ్ఞానము అజ్ఞానము కన్న అనర్థదాయకమని దానిని తొలగించుకొనుట అతి కష్టమని పెద్దలు అనుభవముతో చెబుతారు.  ఈనాటి బిల్వార్చనము లో సదాశివుడు,     మనకు అజ్ఞానమును-అన్యథా జ్ఞానమును పరిచయము చేస్తూ పదములను కదిలిస్తున్నాడు  రెండు ఆట బొమ్మలతో మాట్లాడిస్తూ..నమామి పరమేశ్వరా.    అటుగా వెళుతున్న  శంకరయ్య-శివయ్యలకు ఇద్దరు వ్యక్తులు వాదించుకుంటూ-వారు పోట్లాడుకుంటున్నారా అనిపించేటట్లు కనిపించారు.చాలా సేపటికిందనే  వాదన ప్రారంభమైనట్లున్నది.గొంతులు రాచుకుంటున్నాయి.మధ్యలో ఆపి దాహమును తీర్చుకుంటున్నారు.కండువాతో నుదుటిమీద పట్టిన తుడుచుకుంటున్నారు.క...

KADAA TVAAM PASYAEM-INTRODUCTION

Image
                    శివస్వరూపులారా!     అగ్ని స్వరూప నక్షత్ర కృత్తికా /కార్తిక మాసమున సత్యము-శివము-సుందరమైన అంబాసమేతముగా ,  "కలాభ్యాం-చూడాలంకృత శశికలాభ్యాం' అంటూ  వచ్చేశాడు.అశేషఫలములను అందిస్తానంటున్న వారిరువురిని అంతఃకరణ శుద్ధితో  ఆహ్వానించేద్దాము.        ' ఐంకార-హ్రీంకార-రహస్య యుక్త     శ్రీంకార-గూఢార్థ-మహా విభూత్యా     ఓంకార-మర్మ-ప్రతిపాదినీభ్యాం     నమో నమః శ్రీ గురుపాదికాభ్యాం"    గుడివైపుగా మెల్లగా నడచి వెళుతున్న సాంబయ్య చెవిని పడింది శ్లోకం చిత్తవృత్తులను చిత్రముగా మలుస్తూ. నేనసలే నాస్తికుడిని.దేవుడే లేడు కదా.నాకెందుకు వాళ్ళేమి చెప్పుకుంటే అంటూ ముందుకు సాగాడు.మనిషి కంటె వేగముగా మనసు ముందుకు సాగుతోంది.అసలు మనసును మభ్యపెట్టి ఆటలాడుచున్న ఆ "టక్కరి" నాకు కనిపించాలేకాని,........పళ్ళునూరుతున్నాడు.   శివుని కరుణ అర్థము కానిది      కాని   శివుని కరుణ అద్భుతమైనది.  " క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం-క్రీడా మృగా...

INTRODUCTION

Image
   ప్రియ మిత్రులారా ,శరత్ నవరాత్రోత్సవ శుభాకాంక్షలు.    శ్రీ మాత్రే నమః.  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తియే    జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌః"    పార్వతీ-పరమేశ్వరులు శబ్దము-అర్థము వలె-పూవు-తావి వలె,శబ్దము-అర్థము వలె నిత్య సంబంధము కలవారు.తన రఘువంశ కావ్యారంభములో వారిని,వాగర్థ ప్రతిపత్తికై/ప్రతిభా-పాటవములకై వాగర్థస్వరూపులైన వారిని నమస్కరించి వరప్రసాదుదైన మహా కవి కాళిదాశుని కనికరించిన తల్లి ,మనలనందరిని కనికరించుచున్నదా యనునట్లు మహాకవిచే మరొక అమృత లహరి/అద్భుత వాగ్ఝరి అయిన 'కాళికా దసశ్లోకి" అను మరొక 13 శ్లోకము అంబాస్తుతిని మానవాళికి అనుగ్రహింపచేసినది.అతివేగముగా అమ్మ వారి అనుగ్రహమును పొందగలిగిన స్తోత్ర రాజము అమ్మవారిక్షిప్రప్రసాద గుణమునునకు ప్రతీకగా "అశ్వధాటీ స్తొత్రముగా" వాసికెక్కినది.వేగముగా పరుగులు తీయుచునంబ ఆడుగుఱ్ఱపు డెక్కల సవ్వడి వంటి శబ్ద వేగముతో,కళ్లకు గంతలు కట్తుకుని అటు-ఇటు చూడని ఏకాగ్రత కు మారుగా,గమ్యమును చేర్చుటకు పూనుకొనిన ఆ జగజ్జనని సాక్షిగా,ఏ మాత్రము అర్హత-అనుభవము -పాండిత్యము లేని ఈ ఉపాధి దుస్సాహసమును చేయుచున్నది. 13 శ్లోక...

KURYAAT KATAKSHAMKALYAANI-13

     ప్రార్థన  ప్రదీప జ్వాలాభిః దివసకర నీరాజన విధిః   సుధాసూతే చంద్రో ఫలజలం వైరర్ఘ్యరచనా  స్వకీయైః అంభోభిః సలిలవిధి సాహిత్యకరనం  త్వదీయాభి@ః వాగ్భిః తవ జననివాచాం స్తుతి రియం.. శ్లోకం   ఇంధాన కీల మణిబంధా భవే హృదయ బంధా వతీవ రసికా   సంధావతీ భువన సంధారణేప్యమృత సింధా వుదార నిలయా   గంధానుభావ ముహురంధాలి పీత కచబంధా సమర్పయతు మే   శం ధామ భానుమపిః ఉంధానం ఆశుపద సంధానః అప్యనుగతా.