Posts

KADAA TVAAM PASYAEYAM-17

Image
      కదా    త్వాం పస్యేయం-17   *************************  " జిహ్వ చిత్త శిరోంఘ్రి నయన శ్రోతైః అహం  ప్రార్థితం    నమామి  భగవత్పాదం  శంకరం  లోకశంకరం."  "రోదస్తోయహృతః శ్రమేణ పథికశ్చాయాం తరోర్వృష్టితో   భీతః స్వస్థగృహం గృహస్థమతిథిం దీనః  ప్రభుం   దీపం సంతమసాకులశ్చ శిఖినం శీతావృతస్థం తథౌ   చేతః సర్వపాపహం వ్రజసుఖం శంభోపదాంభోరుహం."        ఏవిధముగా నీటి ప్రవాహములో మునిగిపోతున్న వానికి దుంగ ఆధారమవుతుందో,అలిసిపోయినబాటసారికి వృక్షము ఆశ్రయమవుతుందో,జడివానలో తడుస్తున్న వానికి స్వగృహం సంరక్షణమును ఇస్తుందో,చీకటులను తొలగించి,దీపము ప్రకాశమును ఇస్తుందో,అదే సాపేక్షతానుసారముగా ,నా మనసు చుట్టుముట్టిన భయములను మహేశ పాదపద్మములు తొలగించునుగాక అన్న గట్టినమ్మకముతో త్రికరణ శుద్ధిగా పాదనమస్కారమును చేస్తూ,ఈనాటి బిల్వార్చనమును ప్రారంభిద్దాము.   ఈనాటి శంకరయ్య గమ్యము కొరకు పయనిస్తున్న పథికుడు/బాటసారి.స్వామి  కరుణ ఆయనకు దేనిని  ఆశ్రయముగా అందిస్తుందో,ఏ సంఘటనము ద్వారా భక్తిని పెంపొందింపచేస్తుంద...

KADAA TVAAM PASYAEYAM-16

Image
          కదా త్వాంపశ్యేయం-16 ******************* " జిహ్వ చిత్త శిరోంఘ్రి నయన శ్రోతైః అహం ప్రార్థితం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం" " ఆద్యావిద్యా హృద్గతా నిర్గత ఆసీత్ విద్యాహృద్వా హృద్గతా త్వత్ ప్రసాదాత్ సేవే నిత్యం శ్రీకరం త్వత్ పదాబ్జాం భావే ముక్తే భాజనం రాజమౌళి" ఆదినుండి నాలో నిలిచిన అవిద్య తొలగిపోయినది నీ కరుణతో.సుజ్ఞానము కలిగే శుభసూచకములు గోచరించుచున్నవి.నష్టో మోహః సద్గతి కదా లబ్ధ్వా? ఆ అశుతోషుని, శంకరయ్యతోపాటు,మన మనోఫలకముపై స్థిరముగా నిలుపుకుని, ఈ నాటిబిల్వార్చనమును ప్రారంభిద్దాము. అద్భుతమైన శివుని కరుణ కొంచము కొంచము అర్థమవుతోంది పరమార్థము వైపునకు పయనమును సూచిస్తూ. " ఓం నమః శివాయ" సద్దుమణుగుతున్న శంకరయ్య ఆలోచనలు పూర్వభావములను రద్దుచేస్తున్నాయి.పెద్దవవుతున్న కొత్త ఆలోచనలు వాస్తవమును తెలుపుటకు సిద్ధమవుతున్నాయి. అది పద చలనమో-ప్రదక్షిణమో తెలియని స్థితిలో నున్న శంకరయ్యను ఒక విచిత్రదృశ్యము కట్టిపదవేసినది. శివయ్య లేడు.గిరిజలేదు.గురువుగారు లేరు.తాతగారు లేరు.బాలుడు లేడు.తుమ్మెదలు లేవు.పక్షులు లేవు...

KADAA TVAAM PASYAEYAM-15

Image
            కదా త్వాం పశ్యేయం-15 ********************** " జిహ్వ చిత్త శిరోంఘ్రి నయన శ్రోతైః అహం ప్రార్థితం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం". " దూరీకృతాని దురితాని దురక్షరాణి దౌర్భాగ్య దుఃఖ దురహంకృతి దుర్వచాంసి సారం త్వదీయ చరితం నితరం పిబంతాం గౌరీశ మాం ఇహ సముద్ధర సత్కటాక్షైః" శంకరయ్యతో పాటుగా నేనుకూడా చేసిన అపరాధములను క్షమించి,మహాదేవుడు మనందరిపై తనకృపావీక్షణములను ప్రసరించమని త్రికరణశుద్ధిగా ప్రార్థిస్తూ,ఈ నాటి బిల్వార్చనమును ప్రారంభిద్దాము. పక్షులన్నీ కలిసి క్షమాపణమును అర్థిస్తున్నాయి. ఆశ్చర్యముతో వాటినిచూస్తున్నాడు శంకరయ్య. ఇంతలో అటువైపు వెళుతున్నా వారు ఒక్క క్షణము ఆగి, ఓ అర్జున వృక్షమా!, నీవు మూడు వేదములు- నమామి నీవు మనోహరమైన దానివి-నమామి నీవు-త్రిగుణములను-త్రిపురములను- త్రిశరీరములను జయించిన దానివి-నమామి నీవు ఆదివి-ప్రారంభుము నీవే-నమామి నీవు త్రినయనం-సూర్య-చంద్ర-అగ్నులను నేత్రములుగా గలదానివి-నమామి. నీవు జటాభారోదరాం-నీ జటలలో సర్వమును చుట్టుకున్నదానివి-నమామి నీవు చలత్+ఉరగ...

KADAA TVAAM PASYAEYAM-14

Image
     కదా  త్వాం పశ్యేయం-14    **********************  "జిహ్వ చిత్త శిరోంఘ్రి నయన శ్రోతైః అహం ప్రార్థితం  నమామి భగవత్పాదం  శంకరం  లోక శంకరం."   " ప్రాక్పుణ్యాచలమార్గదర్శిత సుధామూర్తిః ప్రసన్నః శివః     సోమః సద్గుణ సేవితో మృగధరః పూర్ణః "తమో మోచకః"    చేతః పుష్కర లక్షితో భవతి చేత్ ఆనంద పాథోనిధిః    ప్రాగల్భ్యన విజృంభతే సుమనసాం వృత్తి సదా జాయతే."   తమోమోచకుని,చీకట్లను మనసులో పూర్తిగా తొలగించేవానిని చిత్తములో స్థిరముగా నిలుపుకుని,ఈనాటి బిల్వార్చనమును ప్రారంభిద్దాము.    ఆశ్చర్యముతో తుమ్మెదలు-అప్రయత్నముగా శంకరయ్య చేస్తున్న శివనామ మహాత్మయమా  అన్నట్లుగా కదిలివచ్చింది శివయ్య కనికరము పరమానందలహరిలా పరవళ్ళు తొక్కుతూ .....   తడిపి వేస్తోంది తనతో పాటుగా మహాదేవ తత్త్వమును మరింత దర్శింపచేయుటకు.    తాతగారు తాతగారు ఏంచేస్తున్నారండి అంటు వచ్చిన పిలుపుతో శంకరయ్య తన్మయత్వము నాదార్చనము బహిర్ముఖుని చేసినది.   తాతగారు బయటకు వచ్చి రండి రండి అంటూ,  ఇప్పుడే ఆ మార్గబంధువి మనసారా స్మరిద్ద...

KADAA TVAAM PASYAEYAM-13

Image
. (ఏక బిల్వం శివార్పణం)     కదా  త్వాం పశ్యేయం-13   ********************  "జిహ్వ చిత్త శిరోంఘ్రి నయన శ్రోతైః అహం ప్రార్థితం   నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం."  " నాలం వా పరమోపకారక మిదంత్యేకం పశూనాంపతే   పశ్యన్ కుక్షి గతాంశ్చరాచర గణాన్ బాహ్యస్థితాన్ రక్షితుం   సర్వామర్త్య పలాయనౌషధం అతిజ్వాలాకరం భీకరం   నిక్షిప్తం గరళం గళేన గిళితం నోద్గీర్ణ మేవ త్వయా!       అని తన కరుణకు దృష్టామతరముగా ప్రకాశించుచున్న గరలకంఠుని మన మనోఫలకముపై స్థిరముగానిలుపుకుని,ఈనాటి బిల్వార్చనమును  ప్రారంభిద్దాము.  శంకరయ్య ,  తెలియని సందిగ్ధములో నున్న మనసు నుండి  తేరుకుని,ఆ బాలుని వంకచూస్తూ,సూటిగా నీ తుమ్మెద పరమకరుణాతరగమును నేను నమ్ముటకు,  నాలం వా?-దృష్టాంతమున్నదా?  అదియును నమ్మశక్యమైనది అని బాలుని ప్రశ్నించాడు.    శంకరయ్యనోటినుండి ప్రశ్న వచ్చినదో లేదో తుమ్మెదలన్నీ ఏకకంఠముతో,  "కంచిత్ కాలం ఉమామహేశ భవతః పాదారవిందార్చనైః   కంచిత్ ధ్యాన  సమాధిభిశ్చ నతిభి కంచిత్ కథా కర్ణనైః   కంచిత్ తవ ఈక్షణేశ...

KADAA TVAAM PASYAEYAM-12

Image
కదా త్వాం పశ్యేయం-12 ************************* " జిహ్వ చిత్త శిరోంఘ్రి నయన శ్రోతైః అహం ప్రార్థితం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం."… " జనన మృతి యుతానాం సేవయా దేవతానాం "న భవతి సుఖాలేశః" సంశయో నాస్తి తత్ర అజనిమం అమృతరూపం సాంబమీశం భజంతే య ఇహ పరమ సౌఖ్యం తేహిధన్యా లభంతే." ఆ పరమసౌఖ్యప్రదుడైన పరమేశ్వరుని మన మనోఫలకమునందు స్థిరముగా నిలుపుకుని ఈనాటి బిల్వార్చనను ప్రారంభిద్దాము. ఇంతకీ వీళ్ళు చెప్పే మహాదేవుడు ఒక్కడేనా లేక ఆ విప్రుడు చెప్పినట్లు,ఈ తాతగారు చెబుతున్నట్లు అనేకులా అన్న సందేహము , "కమర్థం దాస్యేహం భవతు" అన్న లక్ష్యమునకు అడ్డుగోడ కడుతూనే ఉంది (ధీకుల్యా) ఈశ్వరానుగ్రహమను "కిల్బిషరజమును" తన ప్రవాహలహరులచే పూర్తిగా నిర్మూలిస్తూ,"దిశంతీ విజయతాం" దీవెనలను అందిస్తున్నది. అదేసమయమున తన తుమ్మెదలతో ఆటను ఆపి అక్కడికి వస్తూ,ఆ తాతగారి మనవడు , ఏమిటి? మీరింకా ఇక్కడే,ఇలానే కూర్చుని ఉన్నారా? మాతాతయ్య కాసేపు నిద్రపోయి,కాసేపు శ్లోకములు పాడుకుని,మెల్లగా సాయంత్రం-అదే ప్రదోష సమయమంటాడులెంది అప్పుడు పూజచేసుకునికాని ...

KADAA TVAAMPASYAEYAM-11

Image
          కదా త్వాం పశ్యేయం-11 ******************** " జిహ్వ చిత్త శిరోంఘ్రి నయన శ్రోతైః అహం ప్రార్థితం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం." " అసారే సంసారే నిజభజనదూరే జడధియా భ్రమంతం " మాం అంధం" పరమకృపయా పాతుం ఉచితం మదన్య కో దీనః తవ కృపణ రక్షాతి నిపుణః త్వత్ అన్యం కో వా మే త్రిజగతి శరణ్యః పశుపతే." భావ శరణాగతి సమర్పణము భక్తి అనే పుష్పమును ప్రకాశింపచేస్తుంది.పరిమళింపచేస్తుంది.పరమాత్మ పాదపద్మములను చేర్చి పరవశింపచేస్తుంది. కాని పుష్పమును పొందాలంటే మొక్కయొక్క వేరునకుకదా పోషణము అవసరము. చర్మచక్షువులకు ఈ సిద్ధాంతము చిత్రముగా అనిపించవచ్చును.కాని ఈశ్వరచిద్విలాసము అదేకదా.గో క్షీరమును గ్రహించవలెనన్న గోమాత పొదుగును/శిరములను మాత్రమే స్పృశించవలెను.ఇది మరొక సాపేక్ష సిద్ధాంతము.సర్వాంతర్యామి సత్కృపను పొందవలెనన్నను "సర్వస్య శరణాగతి" యొక్కటే మార్గము. మనము రోజు చూసే పరమాత్మ సృష్టి అందచేయుచున్న సాపేక్ష సిద్ధాంతమును మన మనోఫలకముపై స్థిరముగా నిలుపుకుని ఈనాటి బిల్వార్చనను ప్రారంభిద్దాము. నాదం తనుమనిశం-శంకరం-నమామి మనసా-వచసా-శిరసా అ...