Posts

IDEYAM TVAAM PASYAAMI-01 /KADAA TVAAM PASYAEYAM-27

Image
   " ఇదేయం    త్వాం పశ్యామి-01"  (కదా  త్వాం  పశ్యేయం-27)  ***************************  " జిహ్వ చిత్త శిరోంఘ్రి నయన శ్రోతైః అహం ప్రార్థితం    నమామి భగవత్పాదం  శంకరం లోకశంకరం."   మహేశుని అనుగ్రహ ఆవిష్కరణము శంకరయ్యకు ఈ విధముగా తన స్వరూప-స్వభావములను దర్శింపచేస్తున్నది.కనుక "ఇదేయం  త్వాం పశ్యామి" ఇన్ని విధములుగా/ఈవిధముగానిన్ను నేను దర్శించగలుగుతున్నాను.    సర్వం  శివ సంకల్పమస్తు.  "   " స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితా గాన ఫణితౌ    పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేష్వ చతురః    కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయికోహం? పశుపతీ    పశుం మాం  సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభు."  "ప్రీతిర్భవతి మయికోహం?   రాజాశ్రయమును పొందుటకు తగిన అర్హతలు లేని,కనీసము నన్ను నేను తెలిసికోలేని  పశువును పశుపతివైన నీవు తప్ప ఎవరు రక్షించగలరు?అని శరణు వేడుతూ  ఈనాటి బిల్వార్చనమును  ప్రారంభించుకుందాము.   అనుగ్రహిస్తున్న ఆదిదేవుని వైపు ఆకర్షితుదగుచున్నాడో,ఆనందానుభూతిని ...

KADAA TVAAM PASYAEYAM-- 26

Image
   కదా  త్వాం  పశ్యేయం-26   *****************    "జిహ్వ చిత్తశిరోంఘ్రి నయన శ్రోతైః అహంప్రార్థితం   నమామి భగవత్ పాదం శంకరం లోకశంకరం."   "ఆనందామృత పూరితా హరపదాంభోజ వాలోద్యతా    స్థైర్యోపఘ్నముపేత్య భక్తి లతికాశాఖోపశాఖాన్వితా    ఉచ్చైర్మానసకాయమాన పటలీ మాక్రమ్య నిష్కల్మషా    నిత్యాభీష్ట ఫలప్రదా భవతు మే సత్కర్మ సంవర్ధితా."  పరమేశ్వర పాదపద్మములనే పాదునకు విస్తరిస్తున్న మనసును పందిరిగా చేసి,భక్తి యను తీగెను,అమృతజలములతో తడుపుతూ,దుష్కర్మలను కలుపులను తీసివేస్తున్న సమయమున 'నిత్యాభీష్టములను" ఫలములను అందించుటకు సిద్ధముగానున్న శంకరానుగ్రహమను వృక్షరాజమునకు నమస్కరిస్తూ,ఈనాటి బిల్వార్చనమును ప్రారంభిద్దాము.  ' మా రేడు నీవని నీ పూజచేయ మారేడు దళములు నీసేవకు    గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని గంగను తేనా నీసేవకు"   శివ శివ శంకర-భక్తవశంకర    శంభో హర హర నమోనమో".    సమీపిస్తున్న శంకరయ్య సందేహమునకు సమాధానముగా మీరు ఇప్పటివరకు చూచినవి-వినినవి-తెలుసుకొనునవి ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుని,ఆలోచిస్తే సర్వము అ...

KADAA TVAAM PASYAEYAM-25

Image
        కదా  త్వాం  పశ్యేయం-25     *********************  "జిహ్వ చిత్త శిరోంఘ్రి నయన శ్రోతైః అహం ప్రార్థితం   నమామి భగవత్ పాదం  శంకరం లోక శంకరం"   " వక్షస్తాడనమంతకస్య కఠినాపస్మార సం మర్దనం     భూభృత్ పరయటనం నమత్సుర శిర కోటీర సంఘర్షణం     కర్మేద మృదులస్య తావకపద ద్వంద్వస్య కింవ ఉచితం     మచ్చేతో మణిపాదుకా విహరనం శంభో సదానీంకురు."   శంభో! నీవు బాలమార్కందేయుని రక్షించుటకు నీ మృదు పాదముతో కఠినమైన యముని హృదయమున తన్నినావు.  అట్టి నీ మృదుపాదము నా అజ్ఞానమనే   కఠినత్వమును సైతము తొలగించమని ప్రార్థించుచున్నాను.అందులకు నీ పాదపద్మములు మరింత కందిపోకుండా,నా హృదయమనే మణిపాదుకలను స్వీకరించి,నన్ను అనుగ్రహించు తండ్రీ!  అని ప్రార్థించుచు,ఈనాటి బిల్వార్చనమును ప్రారంభిద్దాము.  పిల్లలతో పాటుగా శంకరయ్య సైతము, "    "అనుక్షణము శివనామమే  అనుచు శివుని కానరే       ఘనుడు శంకరుడు మనలను కరుణ చూచి ఏలగా   నమః సోమాయ-శివాయ   నమః సోమాయ -శివాయ    నమ...

KADAA TVAAM PASYAEYAM-24

Image
      కదా  త్వాం  పశ్యేయం-24     *********************  "జిహ్వ చిత్త శిరోంఘ్రి నయన శ్రోతైః అహం ప్రార్థితం   నమామి భగవత్ పాదం  శంకరం లోక శంకరం"   " నిత్యం  యోగి మనః సరోజదళ  సంచారక్షమస్త్వక్రమః     శంభో తేన కథం కఠోర యమరాడ్వక్షః కవాట క్షతిః     అత్యంతం  మృదులం త్వదంఘ్రియుగలం హా మే మనశ్చింతయ     త్యేవత్ లోచన గోచరం కురువిభో హస్తేన సంవాహయే."    స్వామి యోగుల మానసములలో సంచరించుటకు  అనుకూలములుగా నీ పాదపద్మములు ఎంత సున్నితముగా నున్నవోకదా/సుకుమారమైన నీ పాదపద్మములు ఆ బాలుని (మార్కండేయుని) రక్షించుట కు అతికఠినమైన హృదయముకల యముని ఛాతిని తన్ని ఎంత కందిపోయినవో.వాటిని ఈ అభాగ్యునకు గోచరము కానిచ్చినచో ...వానినికందనీయక నా చేతులలో అలంకరింపచేసి,సేవించుకుంటాను.  " లోచన గోచరంకురు విభో" అని స్వామిని ప్రార్థిస్తూ,ఈ నాటి బిల్వార్చనమును ప్రారంభించుకుందాము.   అందరు హుటాహుటిగా మోటబావి దగ్గరకు వెళ్లారు.అప్పుడే పొలమునకు నీరుచేర్చి,తన రెందు చేతులలో రెండు తామరపుష్పములను ధరించి,వాటి వంక చూస్తూ,మాట్ల...

KADAA TVAAM PASYAEYAM-23

Image
     కదా  త్వాం  పశ్యేయం-23    ************************  "జిహ్వ చిత్త శిరోంఘ్రి నయన శ్రోతైః అహం ప్రార్థితం   నమామి భగవత్ పాదం శంకరంలోకశంకరం"  " స్తవైః బ్రహ్మాదీనాం, "జయజయ" వచోభిః నియమినాం    గణానాం కేళిభిః, మదకల మహోక్షస్య కకుది    స్థితం,  నీలగ్రీవం, త్రినయనం, ఉమాశ్లిష్ట వపుషం,   "కదా  త్వాం  పశ్యేయం" కరదృతమృగం ఖండపరశుం."  ప్రస్తుత శ్లోకములో నాదము నాలుగువిధములుగా నినదింపబడుతూ,నీలగ్రీవుని స్తుతిస్తున్నది. 1. మొదటి విభాగము స్తోత్రము.బ్రహ్మ మొదలగు వారు, స్వామి యొక్క పరాక్రమమునకు సంకేతముగా గండ్ర గొడ్డలి,ప్రసన్నత సంకేతముగా మృగమును చెరొక చేతి యందు ధరించి అంబా సమేతుడై అనుగ్రహించుచున్నారు.అని స్తుతించుచున్నారు.( సామీప్యాను గ్రహము -దేవతాగణములకు) 2.నియమినాం జయజయ వచోభిః  నియమపాలనా పరులైన మహర్షులు స్వామికి"మంగళాశాసనములను -జయజయ శంకర అంటూ చేస్తున్నారు.( ఇదికూడా సామీప్యానుగ్రహమే-ఋషులకు) 3 కేళిభి సేవనం కరోమి అంటున్నారుప్రమథులు.(ఇదికూడా సామీప్యానుగ్రహమే-కింకరులకు) 4.మహోక్షము వీరందరిని మించిన  అనుగ్రహ...

KADAA TVAAM PASYAEYAM-22

Image
    కదా   త్వాం   పశ్యేయం-22    *************************  " జిహ్వ చిత్త శిరోంఘ్రి నయన శ్రోతైః అహం ప్రార్థితం    నమామి భగవత్పాదం శంకరం  లోకశంకరం."  " కదా వా  త్వాం గిరిశ తవ భవ్యాంఘ్రి యుగలం   గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్   సమాశ్లిష్టాఘ్రాయ బ్రహ్మాద్యై ముదమనుభవిష్యామి హృదయే."  ఓ గిరిశ! వాక్కులకు అధిపతి,   నేను ఎప్పుడు నీ దివ్య పాదపద్మములను గ్రహించి,నా శిరముతో,కన్నులతో,వక్షముతో తాకి,నీ దివ్య పదాంబుజముల సుగంధములను ఆఘ్రాణింపగలను స్వామి.నాకు ఆ భాగ్యమును ప్రసాదింపుము అని పరమేశ్వరుని ప్రార్థిస్తూ,ఈ నాటి బిల్వార్చనమును  ప్రారంభిద్దాము.   " చిదానంద రూపా-శివోహం శివోహం     చిదానంద రూపా-శివోహం శివోహం     మనో బుద్ధ్యహంకార చిత్తానినాదం      చిదానందరూపా-శివోహం శివోహం         "శివోహం " అంటూ శివ స్వరూపమై,    శోభాయమానముగా .......అడుగులను కదుపుతున్నది మల్లికార్జున దర్శనమునకై మహోత్సాహము.   మంగళవాయిద్యములు,సావధాన ఘోషలతో సహవాసమ...

KADAA TVAAM PASYAEYAM-21

Image
కదా త్వాంపశ్యేయం-21 ****************** "పాపోత్పాత విమోచనాయ రుచిరైశ్వర్యాయ స్తోత్ర ధ్యాన నతి ప్రదక్షిణ సపర్యాలోకనాకర్ణనౌ జిహ్వ చిత్త శిరోంఘ్రి నయన శ్రోతైరహం ప్రార్థితో మామా జ్ఞాపయ తన్నిరూపాయ ముహుర్మామేవ మామేవచః." ఓ! మృత్యుంజయా ! ఓ మహేశా! ఎంతటిచమత్కారి నీఅనుగ్రహము.ఆనవాలు లేనట్టు మా పాపములు తొలగించివేసినది.ఎంతటి చతుర నీ కరుణ.వాటిని తిరిగి మా దరిచేరనీయనని,మా మనస్సును నిన్ను ధ్యానింపుమని,శిరమును నీకు నమస్కరించమని,చెవులకు నీ దివ్యకథలను ఆలకింపమని,పాదములను నీకు ప్రదక్షిణములను చేయమని,కన్నులకు నీ దివ్య విగ్రహమును దర్శించమని,అని కొత్త ఆటలను పరిచయము చేస్తూ,వాటి నన్నింటిని సమన్వయపరుస్తున్నది సహృదయతతో. స్వామి నీకు నీ కరుణకు లేశమంతయును భేదములేదు కదా ఖేదహరణములో. అట్టి నీ అవ్యాజకరుణను మామీద అనవరతము వర్షించనిమ్మని ఆ ఆదిదేవుని ప్రార్థిస్తూ,ఈ నాటి బిల్వార్చనమును ప్రారంభిద్దాము. గురువుగారు శంకరయ్యను చూస్తూ,ప్రారంభించు అన్నట్లుగా సైగచేసారు. ముచ్చెమటలు పోస్తున్నాయి శంకరయ్యకు.తనకు ఏమి తెలుసనిచెబుతానన్నాను నిన్న.అని మహేశా ఎందులకీ పరీక్ష .అంతలోనే,...