Posts

CHAKRESVARI-PARICHAYAMU

Image
   " కదంబ వనవాసినీం కనకవల్లకీ ధరిణీం    మహార్ణమణిహారిణీం ముఖసముల్లస్ద్వారుణీం    దయా విభవకారిణీం విశదరోచనాచారిణీం    త్రిలోచచన కుటుంబుణీం త్రిపురసుందరీం ఆశ్రయే."    శ్రీచక్రములో బిందురూపముగా ఏకాత్మకమైనపరమాత్మ,సృష్టిచేయ సంకల్పించి కామేశుడై,  మహత్తు-అహంకారము  శివశక్తులు  స్థావర-జంగమము  ప్రకృతి-పురుషులు గా   ప్రకటింపబడుతూ,   పంచకృత్యాసక్తులై,  పురోభవ గా శ్లాఘింపబడు పరమేశ్వరి, మూడు అవస్థలను-జాగ్రత్-నిద్రా-సుషుప్తులను మూడు కాలములను-భూత-వర్తమాన-భవిష్యత్తులను మూడుకూటములను-వాగ్భవ-మధ్య-శక్తి మూడు కార్యములను-సృష్టి-స్థితి-సంహారములను మూడు గుణములను-సత్వ-రజో-తమో గుణములను విస్తరించి తాను పర్యవేక్షించుచున్నది.  ఆ పరాశక్తియే ఒక ఆనందమయ దివ్యరూపమును సంతరించుకున్నది కనుక"త్రిపురసుందరి"గా,సర్వాంగసుందరిగా సంకీర్తింపబదుతుంది.   సర్వాంగసుందరి నవావరనములలో తన వంటి రూపురేఖా లావణ్యములు కలిగిన త్రిపురలను విస్తరింపచేసి నవమావరనములో తాను మహాత్రిపురసుందరిగా పూజింపబడుతున్నది.  త్రిపురాను ఉపసర్గనుపొందిన,  1.త్రిపుర ...

AMGADEVIS-PARICHAYAMU-02

Image
   " హంస హంసాయవిద్మహే    పరమహంసాయ ధీమహి    తన్నోహంసః ప్రచోదయాత్"   హంస మానవ ఉపాధి చేస్తున్న శ్వస ప్రక్రియ.పరమ హంస లోపలి చైతన్యము జ్వలిస్తున్న విశ్వాస ప్రక్రియ.  పరమేశ్వరి సర్వారుణ-అనవద్యాంగి అనికీర్తిస్తున్నదిలలితా రహస్య సహస్రనామస్తోత్రము.అంటే షడంగ శక్తులూనవద్యములు.లోపరహితములు.శ్రేయోదాయకములు.   షడంగదేవతల ప్రస్తావనము అంగన్యాస/కరన్యాసముల పూజాప్రక్రియలో వస్తుంది.   పరమానందము ఎక్కడో లేదు అది పరమాత్మనివాసమైన మన హృదయము లోనే ఉన్నదను విషయము మన మిథ్యాప్రపంచ వ్యామోహము అడ్డుగా నిలిచి,అర్థము కానీయకున్నది.   దానినితొలగించుకొనినతరువాత,  ప్రతిశబ్దము  ఓంకారమే  ప్రతి దృశ్యము మమకారమే  పంచభూతములు స్నేహితమే  పంచకృత్యములు పరమార్థమే.    క్షణభంగురములకు తావులేదు.   సర్వమంబామయం జగం.ప్రపంచము-పరమేశ్వరి అవిభ్  సర్వము అనాజ్యములు.అందులో నేనొక భాగము అను ఎరుకకలిగిన నాడు,సాధకుడు, 1.తనహృదయమున ప్రాణశక్తిని గుర్తించగలుగుతాడు.ఆ ప్రాణ శక్తికి తెలియని విషయములేదు.జ్ఞానమే హృదయము.కనుకనే ఆ పరమేశ్వరి  అరుణాం కరుణా తరంగితాక్షిమ...

AMGADEVIS-PARICHAYAMU-01

Image
    సనాతనములో ఉపాసనా విధానములు, ఉపాధి సహిత-ఉపాధి రహిత అని రెండు విధములుగా చెప్పబడినది.  ద్వంద్వ భావనతో ఎదురుగా ఒకయంత్రమునో/మూర్తినో/మేరువునో అసీనము చేసి తాను జీవుడనను భావనతో స్తోత్రము చేయుచు ఆ యాస్థలములలో/ఆవరణములలో పుష్పార్చనకాని,హరిద్ర-కుంకుమార్చనము కాని చేయు విధానము.  ఆపరమేశ్వరి అనుగ్రహము అవ్యాజముగా ప్రసరించినచో ఆ సాధకుడు చేయుచున్న అజపావిధానమే వానిలో తానొక ఉపాధి మాత్రమే కాదని దానిలో దాగిన ఆదిశక్తి చైతన్య స్వరూపుణియై ప్రాణశక్తి తానై అనేకానేక శక్తులుగా పంచేంద్రియములుగా భాసిస్తున్నదని తెలిసికొనిన వేళ తనకుఇన్నాళ్ళు అడ్డుగా నున్న మిథ్యాప్రపంచమును గుర్తించగలిగి,ఏకాగ్రచిత్తముతో పారమార్థికము వైపు పయనించగలుగుతాడు.  పరిపక్వతనొందిన అర్చన తన లోని షడంగములను అమ్మౌంకిని గుర్తించుటకు-అమ్మ అనుగ్రహమునుపొందుటకు సాధనములుగా మలచుకుంటాడు.  అమ్మ, "షదంగ దేవతాయుక్త" అను దివ్యానుభూతికిలోనవుతాడు.  హంస సోహం/సోహమ్హంసను గుర్తించి,  దేవిఖద్గమాల స్తోత్రమును పారాయణము చేయునపుడు,  మమఖడ్గ సిద్ధ్యర్థం మూలమంత్రేణ షడగన్యాసంకుర్యాత్" అంటూ, "ఐం-క్లీం_సౌ" అను మంత్రమును మూడుసార్లుకాన...

NITYA DEVIS-PARICHAYAMU

Image
    " ఆద్యాయాం లలితాదేవీ-అన్యాత్ పంచదశాంగనా"    లలితా నిత్యరూపేణా అన్నది ఆర్యోక్తి.     పరదేవతా ప్రకాసమే ప్రతిబింబములుగా "బిందు సమన్విట"త్రికోణము చుట్టు ఎనిమిదవ ఆవరణముగా శ్రీచక్రములో అలరారుచున్నది నిత్యామండల సంకేత నామముతో.  ఉత్పత్తి నాశనము లేనిదినిత్యామండలము.  ఆత్మచైతన్యము వైపు సాధకుని దృష్టిని శాశ్వతముగానిలుపునదినిత్య మండలము.  15 మంది నిత్యాశక్తులు అమ్మవారి రూపలావణ్యములతో నున్నప్పటికినివృద్ధి-క్షయ విషయములో వ్యత్యాసము కలదు.  అమ్మవారు షోడశి నిత్యకళ.  ఏకం-అనేకం,అనేకం-ఏకము నకు ఉదాహఋఅనముగా ఈపదిహేను శక్తులు శూన్యము నుండి-సంపూర్ణం వరకు,సంపూర్నమ్నుండి శూన్య వరకు పున్నమి-అమావాస్య నామములో కాలశక్తులుగా/జ్ఞానశక్తులుగా ,  కుండలినీ శక్తిని,నిద్రాణమైనకుండలినీ శక్తిని జాగృతపరచి,సాధకుడు తనౌనికిని కనుగొనుటకు సహాయపడుతుంటాయి.  ఆదిశంకరవిరచితసౌందర్యలహరిస్తోత్రము ఈపదహారు కళలను "షోడశాక్షరీ" మంత్రముగా భావించి కీర్తిస్తుంది.  నిత్యాశక్తులు తమకళలను సూర్యునినుండి చంద్రుని వద్దకు చేరుస్తూ ప్రకాశిస్తుంటాయి.   వైదికులు సూర్యుని ఆత్మస్వరూ...

SREERAMANAVAMI-2024

Image
  " జానక్యా: కమలా మలాంజలి పుటే  యా: పద్మరాగయితా:    న్యస్తా రాఘవ మస్తకేచ  విలసత్ కుంద  ప్రసునాయితా:    స్రస్తా: శ్యామల కాయకాంతి  కలితా: యాఇంద్ర నీలాయితా:    ముక్తాస్థాం శుభదాం భవంతు భవతాం "శ్రీరామ వైవాహికాం"   రారా మాఇంటి దాక ! సీతారామా ********************************** స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధి   నామ సంవత్సర చైత్ర శుద్ధ నవమి, బుధ  వారము 177_04-2024,  ఉదయము గంటలు 11-30 నిమిషాలకు,  ఆశ్లేష  నక్షత్ర యుక్త   మిథున లగ్న పుష్కరాంశ  సుముహూర్తమున   యస్.బి.ఐ కాలనీ - కొత్తపేట్ లో  భక్తాగ్రేసరులచే   లోక కళ్యాణా రార్థము దిగ్విజయముగా /కన్నులపందుగగా జరుగుచున్న,      శ్రీ సీతారామ కళ్యాణములో **************************   తరియిస్తున్నాడు భద్రుడు తాను పెళ్ళివేదికగా   జటాయువు వేస్తున్నది పందిరి ఆకాశమంత   వసతులు చూస్తున్నాడు స్వయముగా వాల్మీకి   అతిథులను స్వాగతిస్తున్నాడు ఆదరముతో సుగ్రీవుడు   కుశలము అడుగుతున్నాడు మర్యాదగ కుబేరుడు  ...

SVAMINI-YOGINI PARICHAYAMU

Image
     చేతనులు ప్రపంచముతో అనుబంధమునేర్పరచుకుంటే మోహము.పరమేశ్వరితో అనుబంధమేర్పరచుకుంటే మోక్షము.కనుకనే,  "మనసేవ మనుష్యాణాం కారణం బంధ-మోక్షకం" అన్నారు పెద్దలు.  శ్రీదేవి ఖడ్గమాలలో తొమ్మిది ఆవరనలు ఉన్నాయి.  అంచలంచలు లేనిమోక్షము చాలా కష్టము కనుక సాధకుడు అణిమ శక్తితో తన పయనమును ప్రారంభించి బిందువునకు చేరవలసి ఉంటుంది.  ఇది స్థూలము నుండి సూక్ష్మ దిశగా పయనము.  కారణము,  బిందువు త్రికోణముగా తన విస్తరణను ప్రారంభించి త్రైలోక్య మోహన చక్రము వరకు విస్తరించి హద్దులను ఏఋపరచినది.   తొమ్మిది విభాగములు ఒక్కొక్కచక్రేశ్వరి కొంతమంది యోగినులతో/సహాయక శక్తులతో నిండియుంటుంది.  ఆనిర్ణీత చక్ర ప్రాంతమునకు అధికారిణి పరిపాలిని చక్రేశ్వరి.ఆమెను స్వామిని అనికూడా అంటారు.పరమేశ్వరి అంశయే స్వామిని.భగవతి.  భగవతి/స్వామిని అధీనములో మరికొన్ని శక్తులు సాధకుని స్వామిని దగ్గరకు చేర్చుటకు సిద్ధముచేసి సహాయపడుతుంటాయి.   మనకు అర్థమయ్యే విధముగా చెప్పుకోవాలంటే స్వామిని దగ్గరకు /భగవంతుని దగ్గరకు చేర్చగల "గురువులు" ఈ యోగినులు.  అహం బ్రహ్మాస్మి అన్న విషయము అర్థముకావాలంటే జగ...

KHADGAMALA-PARICHAYAMU

Image
   " తాదృశం ఖడ్గమాప్నోతి యేన హస్తస్థితేనవై    అష్టాదశ మహాద్వీపం సమ్రాడ్భోక్తా భవిష్యతి"    పరమేశ్వరుడు-పరమేశ్వరికి వివరించినది ఈ "ఖడ్గమాలా స్తోత్రము"  ఖడ్గము అంటేస్తుతివచనములు.ఖడ్గమాల అంటే బిందు-తికోణములుగా ప్రకటింపబడిన పరమేశ్వ-పరమేశ్వరి ప్రస్తుత వచనముల హారము.  మరొక అన్వయము ప్రకారము చేతనుని ఆవరించియున్న అమంగళములను/అజ్ఞానమును తొలగించి,స్వస్వరూపమును తెలియచేయు సాధనము.  ఒకే తత్త్వమును వివరించు రెండు విధములైన అనుగ్రహములు  1.శ్రీ చక్రము 2.దేవీ ఖడ్గమాల  ఒకటి రేఖా యంత్రము.రెండవది మాలా మంత్రము.మహా మాలా మంత్రము.  స్థూలముగామనచుట్తు-సూక్ష్మముగా లోగుట్టు తానే నిండిన చైతన్యమే ఆ దేవీ.  స్తోత్ర సంకల్పములో "మమఖడ్గ సిద్ధ్యర్థే"అని సాధకుడు తల్లి అనుగ్రహమనే ఆయుధమును సాధనముగా అభ్యర్థిస్తూ,మూలాధారము నుండి బిందువు వరకు ఒక్కొక్క మాయ అనే మూటను విడిచిపెడుతూ తల్లి ఒడిని చేరగలుగుతాడు.  ఈ పయనములో తొమ్మిది ఆవరణములను దాటవలసి వస్తుంది.  ప్రతి ఆవరణములోను చక్రేశ్వరి ఇతర సహాయక శక్తులతో సాధకునికి సహాయపడుతుంటుంది.  మొదటి మూడు చక్రములపయనమునందు స...