Posts

SAHO SVAATAMTRAMAA-2024

Image
     సాహో  స్వాతంత్ర్యమా (78)    ***************** శ్రీ పింగళి వెంకయ్యచే మంగళ సంకేతముగా చెక్కబడిన శిల్పమురా మన చక్కనైన పతాక. అల్లూరి వీరత్వము, ఆనందుని వివేకము భారత భాగ్య విధానపు సౌభాగ్యము గాగ "తాకాలనుకుంటే పీకలు కోసేస్తాం" అను కర్తవ్యదీక్ష సాక్షి" కాషాయపు రంగు." బాపూజీ ఆశయాలు, అమ్మ థెరెస్సా ఆచరణలు తేటతెల్ల పరచుచున్న వెలిసిపోని వెల్లరా "వందేం అహింసా పరమో ధర్మ:" అను శాంతి కపోత సంకేతం "తెలుపు రంగు". పంచభూతములు శుచిగ పంచభక్ష్య రుచులుగ కర్షకునికి కూతురుగా,క్షుత్తునకు మాతగా "సుజలాం,సుఫలాం,సస్య శ్యామలాం" అను పచ్చతోరణపు కుచ్చు మెచ్చుకోలు "ఆకుపచ్చ రంగు." నిరంతర ప్రయత్నమనే నీలివృత్త నృత్యముతో వ్యాకులత నిర్మూలనమనే ఆకుల సమానతతో ధర్మపు నడిబొడ్డుయైన అశోక ధర్మ చక్రముతో జనగణమన గళముతో జనగణముల మంగళముతో "జై కిసాన్" పొలముగ,"జై జవాన్" బలముతో కోటలలో పేటలలో కోటి కోటి కాంతులతో ఎగురుతోంది పతాక- ఎద నిండిన ఏరువాక. అమ్మలార రండి రండి-అయ్యలార రారండి పిల్లా పాపలు అందరు పరుగు పరుగున రండి శ్రీ పింగళి వెంకయ్య,శ్రీ బంకించంద్ర చటర్జీ శ్రీ రవీ...

CHAKRESVARI AMTE?

GURUMAMDALAM AMTE?

Image
    " అనంత సంసార సముద్రతార     నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యాం     వైరాగ్య సామారాజ్యద పూజనాభ్యాం     నమోనమః శ్రీ గురుపాదుకాభ్యాం."    "గు"కారో అంధకారస్య  "రు" కారో తత్ నివారనం.  వృత్తాకారముగా సంకేతించబడినది మండలము.అనేకానేక గురువు స్వరూపప్రకాశముగా అజ్ఞాననమనే చీకటిని తొలగించి స్వస్వరూపమును దర్శింపచేయునది గురు పాదము.    పరమేశ్వరుడు ఆదిగురువు.పరమేశ్వరి ఆది శిష్యురాలు.వారు జగత్కళ్యానమునకై అనేకానేక నామరూపములతో గురు-శిష్యులుగా అజ్ఞానంధకారమును తొలగిస్తున్నారు.    ఈ జగత్ సత్యమునే "దేవీఖడ్గమాల స్తోత్రము" గురుమండలముగా కీర్తిస్తున్నది.  అంటే,  కేంద్రస్థానమైన బిందువును చేరాలంటే ఎన్నో వృత్తములను ఆవృతము చేయగలగాలి సాధకుడు.అది గురువు సహాయములేకుండా సాధ్యము కాదు.   దేవీ ఖడ్గమాల స్తోత్రము గురువులను,దైవ,సిద్ధ,మానవ అని మూడు విభాగములుగా కీర్తిస్తున్నది.   ఔఘ అన్నశబ్దము సమూహము సమూహమును సూచిస్తుంది.      సాక్షాత్తుగా పరమేశ్వరుడే ఆదిగురువై పార్వతిదేవి సందేహమును తీరుస్తున్నట్లు( చేతనులను ఉద్ధరించుటకై ...

tTOMMIDAVA AAVARANA-SARVANAMDAMAYA CHAKRAMU AMTE?

Image
   హ్రీంకారాసన గర్భితానలశిఖాం సౌః క్లీం కళాం భిభ్రతీం  సౌవర్ణాంబరధారిణీం వరసుధా ధౌతాం త్రినేత్రోజ్జ్వలాం  వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాం ఉజ్జ్వలాం  త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం.  ఇప్పటిదాకా నాప్రయాణములో జరిగిన వింతలు ఇప్పుడు మనము ఎక్కడికి వెళుతున్నాము అని ప్రశ్నిస్తున్నాయి.  "మూలప్రకృతిరవ్యకా వ్యక్తావ్యక్త స్వరూపిణి   వ్యాపినీవివిధాకారా విద్యావిద్యా స్వరూపిణి" గా అమ్మ అనుగ్రహిస్తున్నది.ఇప్పటివరకు మనము అమ్మ యొక్క వ్యక్తరూపమును-విస్తరన వైభవమును దర్శించాము.ఇప్పుడు,  నేను అని నేను భ్రమించిన ఉపాధి,నాలోని నేనుని కనుగొని అవ్యక్తముగా/బిందురూపముగా నున్న "సర్వానందమయ చక్రములోనికి" ప్రవేశిస్తున్నది.నేను ఇంతవరకు దర్శించిన యోగినీ మాతలు,సిద్ధి మాతలు,ముద్రా మాతలు,చక్రేశ్వరులు ,శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి" అని కీర్తిస్తూ ఆ పూర్ణ బిందువులో లీనమయిపోతున్నారు.   ఆవరనములు సైతము అంతర్ధానమయిపోయినాయి.    అంతలోని నన్నెవరో "శ్రీచక్రము అంటే" అని ప్రశ్నిస్తున్నారు.   అమ్మదయ ఉంటే అర్థము కానిదేముంటుంది.      ...

ANIMIDAVA AVARANAM-SARVASIDDHIPRADAMAMTE?

Image
    "మహామహాజ్ఞప్తే-మహామహాగుప్తే    మహామహానందే-మహామహాస్కందే"       శ్రీచక్రధారిణి నమస్తే.  "మ"కారము/మూలాధారము నుండి ప్రయాణమైన నా కుండలిని ప్రయాణము సహస్రార/ఆకాశ తత్త్వమును చేరుతున్నట్లున్నదేమో, 'మహా-మహా" అంటూ నాదము నన్ను ఆవరణములోనికి నడిపిస్తున్నది.      మహాద్భుతము.  పరమేశ్వరి నాదమయయై ప్రణవముగా నినదిస్తున్నది.  మహేశ్వరి మంకెన పూవులా మెరిసిపోతున్నది       "సర్వసిద్ధిప్రద చక్రము" అని వ్రాసియున్నది.   నాపాపిటలో కదలికలు ప్రారంభమగుచున్నాయి.మహావాక్యములు వ్యతిరేకార్థములు అని ఇన్నాళ్ళు అనుకున్న నా అభిప్రాయము మారిపోతున్నది.   నీవు పరమాత్మవు అనిన నేను ఇప్పుడు నేను పరమాత్మను అని అనాలనుకుంటున్నాను.నీవు-నేను ఒకటేనన్న సత్యమును బిగ్గరాగా అరచి,అందరికి వినపడేలాచెప్పాలనిపిస్తున్నది.   ఆశ్చర్యముగా నాఇంద్రియములుసైతము తమప్రవృత్తిని మార్చుకుంటున్నాయి.  నా కన్నులు ఆవరణ ప్రకాశమునుచూడగలుగుతున్నాయి.  నాచెవులు ఓంకారమును వినగలుగుతున్నాయి.  నాముక్కు సుగంధపరిమళమును ఆఘ్రాణింపగలుగుతున్నది.  నా నాలుక మధ...

ADAVAMAJILEE-SARVAROGAHARACHAKRAMU AMTE?

Image
    సర్వజ్ఞే సర్వశక్తే సర్వమంగళకారిణి   సర్వజ్ఞానప్రదే దేవి సర్వేశ్వరి నమోస్తుతే"     పరమేశ్వరి అనుగ్రహముతో ఇంకొకమెట్టుఎక్కి ఎనిమిది కోణములున్న "సంహార ఆవరణత్రయ చక్ర"మొదటి భాగమైన "సర్వరోగహరచక్రము"లోనికిప్రవేశించాను.  ఏటు చూసినను బ్రహ్మశబ్దముతో కూడిన పదములు,  బ్రహ్మచారి,బ్రహ్మపదార్థము,బ్రహ్మముడి,బ్రహ్మజెముడు,బ్రహ్మరాక్షసి,బ్రహ్మరథం,బ్రహ్మ అస్త్రం,బ్రహ్మ ఆనందం,బ్రహ్మాండం, ఎక్కువగా ఆకర్ష్స్తూ,"బ్రహ్మమొక్కటే అన్నది సారాంశం' అన్న పదములు నన్ను ఆశ్చర్య పరుస్తుంటే,ఎన్నెన్నో సందేహములు నన్ను ఆక్రమించాయి.             

ARAVAMAJILEE-SARVARAKSHAAKARACHAKRAMU AMTE?

Image
   'రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభా   రాజత్కృపా రాజపీఠ నివేశిత నిజాశ్రితా" సత్యం-శివం-సుందరమయమిన స్థితికిచేరుటకు ద్వారమైన/జ్ఞానప్రదమైన "సర్వజ్ఞా సదనమూన ప్రవేశించుటకు పరమేశ్వరి వాత్సల్యము నన్నొక మెట్టు పైకెక్కించినది.      ప్రాకామ్యసిద్ధిమాత-సర్వవశంకరి ముద్రా మాత నా వెంటనేఉండి నన్ను నడిపిస్తున్నారు.     లోపలివైపునకు విచ్చుకొనియున్న పదితేజోమయ త్రికోణములతో వృత్తాకారముగానున్నది ఆ ఆవరనము,"అంతర్దాశము" అన్న నామము నన్ను మరింత ఆకర్షించినది.దీనినే "సర్వరక్షాకరచక్రమూ అని కూడా పిలుస్తారట.    ఆశ్చర్యము.అచ్చము మా అమ్మలాగానే ఉన్న పదిమంది అమ్మలు పరమవాత్సల్యముతో నన్ను ఏం నాయినా వచ్చావా అంటూ పలుకరిస్తున్నారు.నేను వారి దగ్గరిగా వెళ్లే లోపలనే,  'గర్భము అనగా ఆధారము   సర్వజీవసృష్టికి తల్లిగర్భము ఆధారము   నిగర్భము అనగా నిక్షిప్తపరచబడిన ఆధారము   సకలజ్ఞాన సిద్ధికి ఈ పదితల్లుల అనుగ్రహము ఆధారము"     అని చెబుతున్నారు.బహుశా నన్ను ఉద్ధేశించియేనేమో.     పిల్లలకు ఇష్టమైన పోషకమైన పదార్థములను దాచి తల్లి వారికి ఎలా తగినంత తినిప...