Posts

TANOTU NAH SIVAH SIVAM-07@ SIVATANDAVASTOTRAMU

Image
      తనోతు నః  శివః శివం-07   **********************   "వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ"     మూలపదార్థమును అన్వేషించే మనసు తిరిగి సాకారమును సాధనముగా చేసుకుందా      మనుకున్నట్లున్నది.           " ఈశుని మ్రోలా-హిమగిరి బాలా  కన్యతనము ధన్యమైన గాథను " వినిపిస్తూ-     కనిపించేటట్లు చేస్తున్నది ఈశ్వరానుగ్రహము.    స్వామి భూత భర్తరి-సకలజీవులను సంరక్షించేవాడు.జగత్కళ్యానమునకై పలుమార్లు     పార్వతిని పరిణయము చేసుకుంటాడు -పరిపాలనమును నిర్వహిస్తాడు.         అదేజరుగబోతున్నట్లున్నది  ఇప్పుడు.            మన్మథుని క్షమించి మంగళగౌరిని ను వివాహమాడిన మహాదేవుడు     మరొకసారి తన సృష్టి ప్రకటనమును విస్తృతము చేస్తున్నాడు.         అది ప్రపంచముగా భాసించుచున్న పార్వతీదేవికి-ప్రపంచవిస్తరనమును గావిస్తున్న     పరమేశ్వరునికి మనదృష్టిల...

TANOTU NAH SIVAH SIVAM-06@SIVATANDAVASTOTRAMU

Image
    తనోవ నః శివః శివం-06    ****************   "వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః  పితరం  వందే పార్వతీ పరమేశ్వరౌ"    మహాద్భుతమైనది ప్రస్తుత చరణము  శివశక్త్యాత్మకతను మరింత ప్రస్పుటము చేస్తోంది  " ధరాధరేంద్ర నందిని విలాస బంధుబంధుర    స్పురత్ దిగంతసంతతి  ప్రమోద మాన మానసే    కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపది    క్వచిత్ దిగంబరే మనో వినోదమేతు వస్తుని."      సర్వమంగళా దేవి సమక్షములో మహాదేవుడు మహదానందముతో తాందవిస్తున్నాడు.  1.ధరేంద్ర నందనందిని విలాస బంధు బంధుర         లీలగా తనను తాను అలంకరించుకొనినది జగన్మాత.ఆలంకారములకు లక్ష్యము  మహాదేవుని ప్రమోద మానసునిచేయుటయే.     అవలీలగా తాండవిస్తున్నాడు త్రయంబకుడు.ఆ తాండవమునకు   లక్ష్యము మహాదేవిని ప్రమోద మానస చేయుటయే.   వారిరువురి పరస్పరావలోకన లక్ష్యము వారి సంతతిని ప్రమోదమానసులను చేయుటయే.      అమ్మది విలాసము-అయ్యది వినోదము.   అమ్మ నందిని-ఆనందప్రదాయిని.   అ...

TANOTU NAH SIVAH SIVAM-05@SIVATANDAVASTOTRAMU

Image
        తనోతు నః శివః శివం-05   *****************    " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ"      "శివగంగ శివమెత్తి పొంగగా       నెలవంక సిగపూవు నవ్వగా       హరిహరాత్మకమగుచు       అఖిలప్రపంచమ్ము          ఆనందమయముగా       భవతిమిరహంశుదా        విశాలాక్షికై నిటాలాక్షుడే          " నటకా వతంసుడై"       తకధిమితక యని           నటనం  ఆడెనే.(శ్రీ  వేటూరి)      తన తాందవముతో తత్త్వదర్శనమును అనుగ్రహిస్తున్నాడు మహాదేవుడు.   కిశోర చంద్రుడు ముసిముసిగా నవ్వుకొనుచున్నాడు తన ప్రతిరూపమునుచూస్తూ.రెండవ కిశోరచంద్రుడు తనకు అండగా వస్తున్నాడని.     ఆ ప్రదేశమంతా వేయి వెన్నెలలతో వెలిగిపోతున్నది.   ఆదిశంకరులు దర్శించి,అత్యంత మనోహరముగా కీర్తించినట్లుగా,  " శరజ్జ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటా...

TANOTU NAH SIVAH SIVAM-05@ SIVATANDAVASTOTRAMU

Image
      తనోతు నః శివః శివం-05   *****************    " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ"      తన తాందవముతో తత్త్వదర్శనమును అనుగ్రహిస్తున్నాడు మహాదేవుడు.   కిశోర చంద్రుడు ముసిముసిగా నవ్వుకొనుచున్నాడు తన ప్రతిరూపమునుచూస్తూ.రెండవ కిశోరచంద్రుడు తనకు అండగా వస్తున్నాడని.     ఆ ప్రదేశమంతా వేయి వెన్నెలలతో వెలిగిపోతున్నది.   ఆదిశంకరులు దర్శించి,అత్యంత మనోహరముగా కీర్తించినట్లుగా,  " శరజ్జ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం" గా ప్రవేశించిది నాట్యవేదికకు ఆ ఆనందదాయిని నందిని అద్భుత సహచరియై ఆనందతాందవమునకై.     ఆ అద్భుత సౌందర్యరాశీని వీక్షించగలగటం స్తుతించగలగటము సామాన్యురాలినైనా నా తరమా?    అమ్మ అనుగ్రహము దానికి మార్గమును చూపించింది  త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే కథమపి తులయితు.     తల్లీ నీ సౌందర్యమును వర్ణించుటకు బ్రహ్మాదులే సమర్థులు కామంటున్నప్పుడు నేనేంత? కాని నిన్ను దర్శించగల శక్తిగల  నేత్రము కేవలము సదాశివునిది మాత్రమే.కనుకనే ,ఏవిధము...

TANOTU NAH SIVAH SIVAM-04@SIVATANDAVASTOTRAMU

Image
        తనోతు నః శివః శివం-04       *********************  "వాగర్థావివ సంపృక్తౌ  వాగర్థ ప్రతిపత్తయే   జగతః  పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ."                (మహాకవి కాళిదాసు)    మనలను తరింపచేయుటకు మహాదేవుడు మనోహరముగా తాండవమును ప్రారంభించాడు.తననుదుటి శోభలను మరింత శోభాయమానము చేస్తూ.     ఆ శోభలను తిలకించి పులకించిపోదాం. 1 జటా కటాహ సంభ్రమ భ్రమ న్నిలింప నిర్ఝరీ    ఎంతటి వాక్చమత్కారము.భ్రమ -సంభ్రమ అంటూ   భ్రమణము-తిరుగుతోందిట గంగమ్మ.కాని మామూలుగా తనకు నచ్చినట్లు కాదు.తాండవ ప్రారంభమునకు ముందు ప్రశాంతముగా ప్రవహించిన ఝరీ-నదీప్రవాహము/నిర్ఝరీ-జీవనదీప్రవాహము/నిలింప నిర్ఝరీ-దివ్యమైన జీవనదీ ప్రవాహమునకు,  సంభ్రమ-భయముతో కూడిన ఆశ్చర్యము కలిగినదట.    దానికి కారణము జటాటవి అనుకున్న స్వామి కేశపాశము "జటాకటాహము"గా తన రూపును సవరించుకున్నది.     ( నామిత్రులు ఇచ్చిన సలహామేరకు ఒక్కసారి గంగావతరణమును తలచుకుంటాను.) గంగమ్మ తానెటు పోవాలో తెలియక ఉన్నవేళ మహాదేవుడు తన జటలో...

TANOTU NAH SIVAH SIVAM-03@SIVATANDAVA STOTRAMU

Image
          తనోతు నః శివః శివం-03    ******************    " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ."        (మహాకవి కాళిదాసు)   మహాదేవుని కరుణ మాటలలో చెప్పలేనిది.మనసుతో ఆస్వాదించవలసినది.    గంగమ్మను-వాసుకిని-డమరకుమును ప్రపంచమునకు పరిచయము చేసిన విశ్వేశ్వరుడు తన విశ్వరచనమును మరింత విస్తృతము చేస్తున్నాడు.   "గంగాతరంగ కమనీయ జటాకలాపం-"   తనజటల స్వరూపమును మార్చివేస్తున్నాడు.  చిక్కులతో విడదీయరాని అటవి గమ్మత్తుగా పెద్ద గంగాళముగా తన రూపును సవరించుకుంటోంది.ఇది గంగమ్మకు ఒకపెద్ద సవాలు.తన పాటికి తాను ప్రశాంతముగా ప్రవహిస్తూ,స్వామి జటలను పావనముచేస్తూ,నాట్యవేదికను పవిత్రమొనరించానని తన సామర్థ్యమునకు పొంగిపోదా మనుకుంటే,           అబ్బే1  ఆ అవకాశమే లేకుండా చేస్తోంది స్వామి జట.ఎటువెళ్ళాలో తెలియక భయముతో కూడిన ఆశ్చర్యముతో సుడులుతిరగ తప్పదనుకుంటోంది పాపం.   మహాదేవుడు తన లలాటమును విష్ణుపాదముల నుండి ఆవిర్భవించిన గంగాతరంగ భ్రమణము యొక...

TANOTU NAH SIVAH SIVAM-02@ SIVATANDAVA STOTRAMU

Image
      తనోతు నః శివః శివం-02     *****************  " వాగర్థా వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తియే    జగతః పితరం వందే "పార్వతీ పరమేశ్వరౌ".    వాక్కు+అర్థము ఏవిధముగా అవిభాజ్యములై పారవతీ పరమేశ్వర రూపములో ఉన్నాయో అట్టి పరమేశ్వర తత్త్వమునకు వాగర్థ ప్రసాదనమునకై నేను నమస్కరించుచుచున్నాను.(మహాకవి కాళిదాసు)  పూర్ణబిందువు ను పరమాత్మ తత్త్వముగా అన్వయించుకొను ఆగమశాస్త్రపండితులకు ,  శ్రీవిద్యారహస్యాన్వితమైన "శ్రీచక్రము"-ఉపనిషత్సమానమైన "శివ తాండవ స్తోత్రము" పరస్పరము బింబ-ప్రతిబింబములే.   చరణములోని నాలుగు పాదములు నాలుగు ప్రత్యేక విశవ్షములతో ప్రస్తావింపబడినవి. 1.ప్రపథమముగా గంగాజల ప్రవాహము నాట్య సభాస్థలిని పవిత్రమొనరించినది.    జటాటవీ గలజ్జల ప్రవాహ పావితస్థలే.      స్థలే-ప్రదేశము-పావిత స్థలే-పునీతముచేయబడిన ప్రదేశము,గలత్-ప్రవహ జలే-ప్రవాహ జలముతో పునీతము చేయబడినది ఆ నాట్యస్థలి.ఆ ప్రవాహ జలము తన పయనమును,  జటాటవి-మహాదేవుని అటవి వంటి జడల మధ్యనుండి ప్రారంభించినది.    శ్రీ చక్ర పరముగా అన్వయించుకుంటే ఇది భూపు...