Posts

TANOTU NAH SIVAH SIVAM-14@ SIVATANDAVASTOTRAMU

Image
      తనోతు నః శివః శివం-14    ********************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పారవతీ పరమేశ్వరౌ"    అత్యద్భుతమైనది ప్రస్తుత చరణము.స్తోత్రకర్త సృష్టి-స్థితి-సంహార-తిరోధాన-అనుగ్రహమను పంచకృత్యములను గౌరీప్రియునిగా నిర్వహిస్తున్న తాండవము.కీర్తిస్తున్నాడు.  " చర్మాంబరాయ శవభస్మ విలేపనాయ    భాలేక్షణాయ మణికుండల మండితాయ    మంజీరపాద యుగళాయ జటాధరాయ    "దారిద్ర్య దుఃఖ దహనాయ" నమశ్శివాయ.     చరణము     ********  కరాళభాళ పట్టికా ధగద్ధగ ద్ధగ జ్వల  ధనంజయ హుతీకృత ప్రంచండ  పంచసాయకే  ధరాధరేంద్ర "నందినీ" కుచాగ్రచిత్ర పత్రక  ప్రకల్పనైక శిల్పిని "త్రిలోచనే" రతిర్మమ.     1  స్వామి  సూర్యచంద్రులుగా ప్రకాశిస్తున్న  జగదంబ  కుచాగ్రములపై ఆహారములను-ఔషధములను సృష్టిస్తున్నాడు చిత్ర పత్రకమను పేరుతో   2. ఆ రచనమునకు కారణం స్థితి కార్యము.   3.సృష్టి స్థితులలకు అడ్దముగా నిలిచిన అజ్ఞానమును/అహంకారమును (మన్మథ బాణములను )...

TANOTU NAH SIVAH SIVAM-13@ SIVATANDAVASTOTRAMU

Image
. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ." మహాదేవుడు మన్మథ పంచబాణములను దహించివేసి వాని సౌశీల్య సౌందర్యమును అలంకారముగా మలచుకుని,తన విశాలఫాలభాగనందు అలంకరించుకుని "కామేశ్వరుడై" కన్నులపండుగ చేస్తున్నాడు. స్వామి లలాటము యజ్ఞవేదికగా ప్రజ్వలిస్తున్నదికదా.దానిని కొనసాగిస్తూ (చమకము) ఋత్విక్కులు , ఇధ్మశ్చమే-బర్హిశ్చమే-వేదిశ్చమే-ధిష్టియాశ్చమే- అంటూ యజ్ఞ నిర్వహణకై మా అందరికి సమిధలు-దర్భలు-ద్రోణకలశములు-సుక్కులు-స్రవములు మొదలగునవి సంవృద్ధిగా అందీయమని అర్థిస్తున్నారు. మరొకవైపు పామరజనులు పయశ్చమే-రసశ్చమే-ఘృతంచమే-మధుచమే అంటూ అభిషేకమునకు కావలిసిన పాలు-పండ్లరసములు-నేయి-తేనె మొదలగు వాటిని అర్థిస్తున్నారు. మరికొందరు తిలాశ్చమే-ముద్గాశ్చమే-గోధూమాశ్చమే అంటుండగా మరికొందరు కృష్ట పచ్యంచమే-అకృష్టపచ్యంచమే దున్నినదైనా లేక దున్ననిదైనా సరే భూమిని అడుగుతున్నారు. కొందరు పశువులను-,మరి కొందరు సంతతిని అభ్యర్థిస్తున్నారు. స్వామి తాను నేరుగా ప్రసాదించుట రివాజు కాదుకనుక శక్తివ...

TANOTU NAH SIVAH SIVAM-13@SIVATANDAVASTOTRAMU

Image
. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ." మహాదేవుడు మన్మథ పంచబాణములను దహించివేసి వాని సౌశీల్య సౌందర్యమును అలంకారముగా మలచుకుని,తన విశాలఫాలభాగనందు అలంకరించుకుని "కామేశ్వరుడై" కన్నులపండుగ చేస్తున్నాడు. స్వామి లలాటము యజ్ఞవేదికగా ప్రజ్వలిస్తున్నదికదా.దానిని కొనసాగిస్తూ (చమకము) ర్త్విక్కులు,స్వామిని, ఇధ్మశ్చమే-బర్హిశ్చమే-వేదిశ్చమే-ధిష్టియాశ్చమే- అంటూ యజ్ఞ నిర్వణకై మా అందరికి సమిధలు-దర్భలు-ద్రోణకలశములు-సుక్కులు-స్రవములు మొదలగునవి సంవృద్ధిగా అందీయమని అర్థిస్తున్నారు. మరొకవైపు పామరజనులు పయశ్చమే-రసశ్చమే-ఘృతంచమే-మధుచమే అంటూ అభిషేకమునకు కావలిసిన పాలు-పండ్లరసములు-నేయి-తేనె మొదలగు వాటిని అర్థిస్తున్నారు. మరికొందరు తిలాశ్చమే-ముద్గాశ్చమే-గోధూమాశ్చమే అంటుండగా మరికొందరు కృష్ట పచ్యంచమే-అకృష్టపచ్యంచమే దున్నినదైనా లేక దున్ననిదైనా సరే భూమిని అడుగుతున్నారు. కొందరు పశువులను-మరికొందరు ,మరి కొందరు సంతతిని అభ్యర్థిస్తున్నారు. స్వామి తాను నేరుగా ప్రసాదించలేనని శక...

TANOTU NAH SIVAH SIVAM-12@SIVATANDAVASTOTRAMU

Image
    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ"    'సర్వంబు తానుగా శర్వుడాడెను నేడు     నృత్యంకర! ప్రమథ గణ కింకర"   నః-మా అందరికి   మహా కపాలి-విశ్వనకు శీర్షము వంటి (సహస్రశీర్షా పురుషః)   అస్తు సంపదే-సంపదలను అనుగ్రహించును గాక.         ప్రస్తుత స్తోత్రములో  స్వామి మన్మథుని భక్షించి వెన్నెలల ద్వారా జగములను రక్షించుచున్నాడట.అంటే ధర్మ సంస్థాపనమును తన తాందవము ద్వారా/నిలింప తాందవము ద్వారా అమలుచేస్తున్నాడట.   పాహి పరమేశ్వరా-పాహిజగదీశ్వరా  ఇన్నిలోకములన్ని ఒకటియై (నీ) కన్ను చూపించు  " ఓ ఆది భిక్షు! ఓ జగత్చక్షు"   చరణము   ******  " లలాట చత్వర జ్వలద్ధనంజయ స్ఫులింగ భా    నిపీత పంచసాయకాం నమన్నిలింప నాయకం    సుధామయూఖ లేఖయా విరాజమాన శేఖరం    మహాకపాలి సంపదే శిరోజటాలమస్తు నః."       1.లలాట చత్వర జ్వలత్ ధనంజయ స్ఫులింగ భా        ...

TANOTU NAH SIVAH SIVAM-11@SIVATANDAVASTOTRAMU

Image
     తనోతు నః శివః శివం-11    *******************  "వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే   జగతః పితరం  వండే పార్వతీ పరమేశ్వరౌ"    " కనిన జనని కన్న ఘనదయ దాయక      ఇదియ అనుగ్రహము అరుణాచల " అంటున్నాడు రావణుడు.(ఇది నా ఊహ)    తన తల్లి నిత్యశివపూజ-సైకత లింగము సముద్ర తరంగములచే రూపు మారుట-తల్లి ఆవేదనము-ఆత్మలింగమును అభ్యర్థించుటకై తన కైలాస ప్రయాణము-స్వామి దర్శనమునకు అనుమతించని నందీశ్వరునిపై/స్వామిపై ఆగ్రహం కైలాసమును కదిలించబోయి   తన అహంకారము అన్నీ అదృశ్యమైనవి.   స్వామి తాండవమును తన్మయుడై చూడగలుగు దర్శనశక్తి లభించినది.   "అళగు సుందరముల వలె చేరి నేను    నీవు ఉందము అభిన్నమై అరుణాచలా" అంటున్నాడు.   అవ్యాజకరుణ తథాస్తు అన్నదా అన్నట్లుగా,     "ఓం జాతవేదసే సునవా మసోమ" అంటూ దుర్గా సూక్తము      శ్రవణానందమును కలిగిస్తున్నది.     మరొక పక్కన  " తాం ఆవహజాతవేదో లక్ష్మీం అనపగామినీం" అంటూ శ్రీసూక్తము శృతి శుభగముగా వినిపిస్తున్నది.   " త్రయంబకం యజామహే సుగంధిం...

TANOTU NAH SIVAH SIVAM-10

Image
      తనోతు నః  శివః  శివం-10     ********************  "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తియే     జగతః  పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ".     పరమేశ్వరుడు తన తాండవములో విస్తరిస్తున్న జటలను పిల్లనాగులతో బంధించుకుంటు మనందరికి సంపదలను వర్షిస్తూఅడట.మొదటి చరణ్ అములో శుభములను వర్షిస్తున్న స్వామి శుభములతో పాటుగా సంపదలను వర్షిస్తున్నాడట ప్రస్తుత తాండవములో.సిరి-సంపదలను అనుగ్రహిస్తాడన్న మాట.ధన-ధాన్యాలు అంటుంటాము  అదేకదా.మనపైననే మాత్రమే కాదు మన తదుపరి తరములవారిపై కూడ అనవతర అనుగ్రహవర్షము.    ధన్యోస్మి మహాదేవా.    "సహస్రలోచన ప్రభ్యుత్యశేష లేఖ శేఖర   ప్రసూన ధూళి ధోరణి విధూసరాంఘ్రి పీఠభూః   భుజంగరాజ మాలయ నిబద్ధ జాటజూటక   శ్రియై చిరాయ జాయతాం చకోర బంధుశేఖరః."       "శుభమంగళం-నిత్య జయమంగళం"        అజాయమాన-బహుధా విజాయతే'           పుట్టుక లేని పరమాత్మ ఎన్నో అద్భుతములను సృష్టిస్తున్నాడు.     స్వామి సంపదలతో కూడిన మంగళములను జ...

TANOTU NAH SIVAH SIVAM-09@SIVATANDAVASTOTRAMU

Image
          తనోతు నః శివః శివం-09      *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తియే    జగతః పితరం  వందే పార్వతీపరమేశ్వరౌ."     పరమాత్మ తనతాండవమును మరింత ప్రకాశవంతమే కాక పరిమళభరితము గావింపనున్నాడనుటకు సంకేతముగా ప్రసూనమాలలు-ప్రసూనమాలాధారణముచేసిన  అశేషదేవతా పాదనమస్కారములు-అదేఅదనుగా వారి ప్రసూనములలోని పుప్పొడి స్వామి పాదపీఠమునకు అభిషేకమై-అలంకారమై-ఆత్మార్పణమై ఆనందించబోవుచున్నదేమో అనిర్వచనీయముగా.      "పర చిదంబర నటం హృది భజ."              జగదంబ   " పంచమీ పంచభూతేశి పంచసంఖ్యోపచారిణి"      అమ్మ పంచభూతేశి.పంచభూతములకు ఈశ్వరి.పంచభూతములుగా ప్రకటితమైన పంచమి స్వామిని పంచసంఖ్యలతో పాదసేవనము చేయాలని తలచినది.  " దివ్"  అను ధాతువునకు ప్రకాశము/తేజము అని భావము.అమ్మ తన ప్రకాశమును కొన్ని ప్రత్యేక ఉపాధులలో నిక్షిప్తముచేసి "లేఖ/దేవత/దేవుడు" అంటూ పేరు పెట్టినది.వారికి తమ తండ్రిని చూపించి-సేవింపచేయాలనుకున్నది.పరిమళభరిత ప్రసూనముల మాలలను వారిచ...