Posts

TIRUPALLIELUCHCHI-08

Image
 ముందియ ముదల్నడు ఇరుదియం ఆణా మువ్వరం అరికిలాల్ యవర్మట్రు అరివార్ పందణై విరళియుం నీయుం, నిన్ అడియార్ పలంకుడి తొరుం ఎళుయుం అరుళియ పరనే శెందడల్ పురైతిరు మేనియుం కాట్టి తిరుపెరుం తురైయురై కోయిలుం కాట్టి అందణన్ ఆవదుం కాట్టి వందండాయ్ ఆరముదయె పళ్ళి ఎళుందరుళాయె. ..... "యత్ త్రికాలే అపి తిష్ఠతి తత్ సత్." ఏదిసర్వకాల సర్వావస్థలందును స్వయం ప్రకటితమో అదియే సత్తు. దాని ప్రకశనమే చిత్తు. ఉన్నదాని ఉనికిని తెలిసికొనుట సత్చిత్. తెలుసుకొనుటవలన లభించు దివ్య అనుభూతియే అలౌకికానందము.అదియే "సచ్చిదానందము." ప్రస్తుత పాశురములో తిరుమాణిక్యవాచగరు చెలుల సంభాషణ ము ద్వారా మనకు ఆ దివ్యమైన అనుభూతిని, ఆరముదయె-మధురాతిమధురమైన మకరందమా అని సంబోధింపచేస్తున్నారు. ఆ మందార మకరందమును ఆస్వాదింపగలిగే మధుపముగా మన మనసు మారాలంటే మన ఇంద్రియములు స్వామి అనుగ్రహపాత్రములై ఉండాలి. మన కర్మలు స్వామి యొక్క నిజతత్త్వమును,తెలుసుకొనగలగాలి. మున్ముదల్ ఆణాయ్-ప్రపంచ సృష్టికి ముందున్నది ముదల్ ఆణాయ్-సృష్టి ప్రారంభమునందున్నది నడు ఆణాయ్-మధ్యమ స్థితిలో నుండునది ఇరుదియం ఆణాయ్-ప్రళయమునందుండునదియును అనగా స్వతంత్ర ప్రకటనముకల నిత్య సత్యముగా...

TIRUPALLI ELUCHCHI-08

Image
     తిరుపళ్ళి ఎళుచ్చి-08    ****************   "కృపాసముద్రం  సుముఖం త్రినేత్రం    జటాధరం పార్వతీ వామభాగం    సదాశివం  రుద్రం అనంతరూపం    చిదంబరేశం హృది భావయామి"   సందర్భము   ********    ఆత్మనాథుని దర్శనభాగ్యమును పొందిన సౌభాగ్యవతులు మంగళనాథుని దర్శించుకుంటున్నారు.ఆత్మావలోకనముతో "బాహ్యాభ్యంతరస్థితుడైన" పరమాత్మ ఉనికిని తెలుసుకోగలుగు ఉపాధికి మంగళాశీస్సులు లభించుచుచున్నవి.    ఎళుచ్చి    ******అదుపళచువ ఎన అముదెన అరిదర్కు అళిదెన ఎళిదెన అమరరుం అరియార్ ఇదు అవన్ తిరువురు ఇవన్ అవన్ ఎనవే ఎంగళై ఆండుకొండు ఇంగెళుందు అరుళం మధువళిర్ పొళి తిరు ఉత్తరకోశ మంగై ఉళ్ళాయ్ తిరుపెరుంతురై మన్నా ఎదు ఎమ్మై పనికొళ్ళుం ఆరందు కేట్పోం ఎం పెరుమాన్ పళ్ళి ఎళుందరుళాయె ....... ఉత్తర కోశ మంగళనాథర్ పోట్రి ************************** అరుణగిరినాథర్ తో పాటుగ్ అ మాణిక్యవాచగరు చే ప్రస్తుతింపబడిన, మంగళాంబ సహిత మంగళనాథుని కోవెల తమిళనాడులోని పరమక్కడి సమీపములో పాండ్యరాజులచే నిర్మింపబడినది.ఈ దివ్య క్షేత్రము ఉత్తరకోశ గా ప్రసిధ్ధిచ...

TIRUPALLI ELUCHCHI-06

Image
    తిరుపళ్ళి ఎళుచ్చి-06   ****************  "కృపాసముద్రం సుముఖం త్రినేత్రం   జటాధరం పార్వతీ వామభాగం   సదాశివం రుద్రం  అనంతరూపం   చిదంబరేశం హృది భావయామి."   సందర్భము   *********   స్వామి తన కళ్యాణ ఘట్ట దర్శనమును అనుగ్రహించిన విధానమును తిరు మాణిక్యవాచగరు మనకు వివరిస్తున్నారు.    ఎళుచ్చి    ******    పప్పర విట్టిరుందునరుం నిన్ అడియార్ పందనై వందరుదా అవరుం పలరుం మైపురు కణ్ణియ మానుడత్త ఇయల్బీ వణంగు కిరార్ అనంగిన్ మణవాలా శెప్పొరు కమలంగళ్ మలరుందన్ వయల్సోల్ తిరుపెరుంతురైయురై శివపెరుమానే ఇప్పిరప్ప అరుందెమ్మై ఆండరుపురియం ఎం పెరుమాన్ పళ్ళి ఎళుందరుళాయె. భవబంధ విమోచనాయ పోట్రి ************************ ప్రస్తుత పాశురములో తిరుమాణిక్యవాచగర్ స్వామీ నీవు మానుడత్తి ఇయల్బీ-తగిన వరుడవు ఎవరికి నీవు సరియైన వరుడవు అంటే, మైపురు కన్నియ-లేడి కనుల మా అమ్మకు/ఉమాదేవికి ఇది వాచ్యార్థము. సహజకవి బమ్మెర పోతమాత్యులు వివరించినట్లు, "తగు నీచక్రి విదర్భరాజ సుతకున్ తథ్యంబు వైదర్భియుం తగునీ చక్రికి" అన్నట్లుగా ఉమాదేవి నీకు తగిన కన్య-స్వామి నీవ...

TIRUPALLIELUCHCHI-05

Image
    తిరుపళ్ళి ఎళుచ్చి-05   *****************  "కృపా సముద్రం  సుముఖం త్రినేత్రం   జటాధరం పార్వతీ వామభాగం   సదాశివం రుద్రం అనంతరూపం   చిదంబరేశం హృది భావయామి."    సందర్భము    *********  ఎందరో మహానుభావులు స్వామి అవ్యాజ అనుగ్రహముతో వారి మనోఫలకములలో స్వామి రూప-గుణ-విభవములను దర్శిస్తూ-పులకరిరిస్తున్నారు.విచిత్రము వారిలో దాగి స్వామి కూడా నర్తిస్తున్నాడు.అదే కుండలినిని జాగృత పరుస్తూ వారికి సహస్రా సహస్ర దివ్యకాంతులను పరిచయము చేస్తున్నాడు.ఆనంద భాష్పములు స్రవిస్తుండగా వారు మైమరచి స్వామి వైభవమును కీర్తిస్తున్నారు.వారిలో దాగిన స్వామి వారితో పాటుగా అనిశము నాదమై నినదిస్తున్నాడు.అజపామంత్రమునుచ్చరిస్తూ ఆదిదేవుడు వారికి ఆలంబనగా నిలిచి ఆశీర్వదిస్తున్నాడు.పంచభూతతత్త్వమును పరిచయము చేస్తున్నాడు.అదియే పూదంగళ్ అని మాణిక్య వాచగరు ప్రారంభించిన ఎళుచ్చి ప్రారంభ పదము.వారిని దర్శించిన మన శివనోము నోచుకుంటున్న కన్నియలు మనకు ఆ లీలా విశేషములను అందిస్తున్నారు.     ఎళుచ్చి.     ****** పూదంగ తోరున్ నిన్రాన్ ఎనిన్ ఆళ్ళాళ్ పొక్కిలన్ వరవిలన్ ఎ...

TIRUPALLIELUCHCHI-04

Image
    తిరుపళ్ళి  ఏలుచ్చి-04   ******************  "కృపాసముద్రం  సుముఖం  త్రినేత్రం   జటాధరం  పార్వతీ వామభాగం   సదాశివం  రుద్రం అనంతరూపం   చిదంబరేశం  హృది భావయామి."   సందర్భము   *********   శివనోమును ప్రారంభింపబోతున్న మన కన్నియలకు స్వామి నేత్ర పుండరీకములు,ముఖబింబము,స్వామిని సేవిస్తున్న నాదము అనుగ్రహించాయి .అసలు స్వామి నోము సంకల్పమే నోము సాఫల్యము.దానికి వారు చేయుచున్న సన్నాహములు-స్నానములు-సన్నుతులు స్వామి కటాక్షమే.ప్రతి అడుగు వారిని స్వామి పాదపద్మములకు చేర్చుచున్నదే.  నానారూపములకు భక్తి నర్తిస్తూ ఏ విధముగా నానారక అనుగ్రహపాత్రులను చేస్తుందో మనకు తిరు మాణిక్యవాచగరు వివరిస్తున్నారు.   ఎళుచ్చి.   *******  తిరుపళ్ళి ఎళుచ్చి-04 ******************* ఇన్నిశయై వీణయర్ యాళినుర్ ఒరుపాల్ ఇరుక్కొండుం తోత్తిరం ఇయంబినార్ ఒరుపాల్ తున్నియ పిణై మలర్ కయ్యనర్ ఒరుపాల్ తొళుకయ్యర్ అళుకయ్యర్ తునళ్కయ్యర్ ఒరుపాల్ సెన్నియల్ అంజలి కుప్పినార్ ఒరుపాల్ తిరుప్పెరుంతురై శివపెరుమానే ఎన్నయుం ఆండ్రుకొండుం ఇన్నరుళ్ పురియం ఎం పెరుమ...

TIRUPALLIELUCHCHI-03

Image
    తిరుపళ్ళి ఎళుచ్చి-03   *****************  "కృపాసముద్రం సుముఖం  త్రినేత్రం   జటాధరం  పార్వతీవామభాగం   సదాశివం  రుద్రం అనంతరూపం   చిదంబరేశం  హృది భావయామి."   సందర్భము   *********  చిదంబరేశుని అవ్యాజానుగ్రహముతో సూర్యోదయమును దర్శించిన కన్నియలకు పరమాత్మ చైతన్యము నాదచైతన్యముగా ఏ విధముగా ప్రకృతిని ప్రకటింపచేస్తున్నదో చూస్తూ,"నాదం  తనుమనిశం" అని సంకీర్తిస్తు,శివనోమునకు తరలుచున్నారు.   ఎళుచ్చి   *******కూవిన పుంకుయిల్ కూవిన కోళి కురుగుకళ్ ఇయంబిన ఇయంబిన శంగం ఓవినై తారకై ఒళి ఒళి ఉదయత్తు ఒరుప్పుడు కిన్రాడు విరొప్పుడు నమక్కు తేవన చెరికళల్ కాడినై కాట్టాయ్ తిరుంపెరుంతురై యురై శివపెరుమానే యాం వరుం అరివరియాయ్ యమక్కు అడియాయ్ ఎం పెరుమాన్ పళ్ళి ఎళుందరుళాయె. ........ ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినాం కామదం మోక్షదం తస్మాత్ ఓంకారాయ నమోనమః" *********** ప్రస్తుత పాశురములో తిరుమాణిక్య వాచగరు బ్రాహ్మీముహూర్తము ఏ విధముగా పరమాత్మకు నాదార్చననో చేయుచున్నదో వివరిస్తున్నారు. పోట్రి-అరుణన్ పాశురములలో ఏ విధముగా పరమాత్మ ముఖ...

TIRUPALLI ELUCHCHI-02

Image
     తిరుపళ్ళి ఎళుచ్చి-02    ***************  "కృపాసముద్రం సుముఖం  త్రినేత్రం   జటాధరం పార్వతీ వామభాగం   సదాశివం  రుద్రం  అనంతరూపం   చిదంబరేశం హృది భావయామి."     స్వామి పుండరీకనేత్రములను దర్శించిన మన భాగ్యశాలురు వాటీని వికశింపచేసిన స్వామిదయను ప్రసరింపచేసిన సూర్యబింబము వైపునకు మరలినవి.వారి మనోనేత్రము సూర్యబింబమును స్వామి ముఖబింబముగా దర్శింపచేస్తున్నది.  తిరుపళ్ళి ఎళుచ్చి-02 ****************** అరుణన్ ఇందిరన్ దిశై అణుగినన్ ఇరుళ్పోల్ అగండ్రదు ఉదయం మలత్తిరు ముగత్తిన్ కరుణన్ శూరియన్ యలయళ నయన కడిమలర్ మలరమర్క అణ్ణవన్ కణ్ణా తిరన్ నిరై అరుపదం మురల్వన్ ఇవైయోం తిరుపెరుంతురై శివపెరుమానే అరుళిరి తరవరం ఆనందమలయే అలకడలే పళ్ళి ఎళుందరుళాయె ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివః స్స్కందః ప్రజాపతిః మహేంద్రో ధనదః కాలో యమః సోమోహ్యపాంపతిః ********** పోట్రి పదముతో ప్రారంభమయిన తిరుపళ్ళి ఎళుచ్చి లో స్వామి ముఖక మలముల -పాదపద్మముల కాంతిని కెందామరలు తంతో వెంట తెచ్చుకొని,సూర్య కిరణముల స్పర్శానుగ్రహముచే వికసనమును పొంది ప్రకాశిస్తున్నట్లుగా వివరించారు తిరుమా...