SAUNDARYA LAHARI-28


  సౌందర్య లహరి-28.

 పరమ పావనమైన  నీపాదరజ కణము
 పతిత పాలకమైన పరమాత్మ స్వారూపము

 నీ చేలమును కోరగ  నేను కుచేలుడిని కాను
 ఆప్తుడవని వరమడుగని  అభిమానము తోడుగా

 నీ సారధ్యమును కోరగ  నేను అర్జుడిని కాను
 నన్నునేను తెలుసుకొన్న  భగవద్గీత  తోడుగా

 నీకు సహాయమును చేయ నేను సుగ్రీవుడను కాను
 వానరుడనై చూపగ వనమునున్న సీతమ్మ జాడగా

 నలుగుముద్దతో పాటుగ నీ ఒడిలో కూర్చున్నది మనసు
 నా ఉపాఖ్యానములో సఖ్యభక్తి సంతసించుచున్న వేళ

 నీ మ్రోలనేనున్న  నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి  ఓ  సౌందర్య లహరి.



  " పట్టి విడువరాదు రామా ,నా చేయి" అని సంకీర్తనలతో పాటుగ సఖ్యమును కోరి,ధన్యుడైనాడు త్యాగరాజస్వామి. భగవంతునికి-భక్తునికి మధ్యగల స్నేహభావమే  సఖ్య సేవనము.హీనాధికములకు ఇందులో చోటులేదు.అర్జునుడు,కుచేలుడు,సుగ్రీవుడు,మానిక్య వాచగరు పరమాత్మకు సఖులుగా తరించినారు.మరెందరో మహదానందమును పొందినారు.ఇది బాహ్యమునకు కనిపించే స్నేహము కాదు.జీవాత్మ-పరమాత్మల అనుసంధానము.మహోత్కృష్టము.పరమాత్మతో అర్జునునిలా చుట్టరికము లేనప్పటికిని,సుధామునిలా చిన్న నాటి స్నేహము లేనప్పటికిని,సుగ్రీవునిలా రాజకీయ ఒప్పందములు లేనప్పటికిని, నేను చిన్ని గణపతితో పాటుగా అమ్మ ఒడిలో అమ్మ నిర్హేతుక కృపతో కూర్చున్న సమయమున,నా చేతిని ఎప్పుడు విడిచి పెట్టకమ్మా.అనేక నమస్కారములు.

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)