Posts

Showing posts from 2019

PARICHAYAMU

Image
     శ్రీగోదాం అనన్య శరణం శరణం ప్రపద్యే    ********************************* " శ్రీ విష్ణుచిత్త కులనందన కల్పవల్లీం శ్రీ రంగనాథ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్య శరణం - శరణం ప్రపద్యే".    శ్రీవైష్ణవ సాంప్రదాయానుసారము "ఆళ్వారులు" అనగా దైవభక్తిలో అనవరతము మునిగియున్న జ్ఞానగనులు.బధ్ధజీవులను తమతో పాటు తిప్పుకొనుచు,భగవత్తత్త్వము అను సముద్రములో అనవరతము మునకలను వేయిస్తు,ప్రకృతిలోని ప్రతివస్తువులోను-ప్రతిచర్య లోను పరమాత్మను దర్శింపచేస్తూ,బ్రహ్మానందమును చేర్చువారు.మార్గదర్శకులుగా సామాన్యుల వలె కనిపిస్తూ సర్వమును అర్థముచేయించగల దైవాంశ సంభూతులు.దివ్య నమస్కారములు .  " భూతం నరస్య మహదహ్వయ భట్టనాథ   శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్   భకాంఘ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్   శ్రీమత్ పరాంకుశ మునిం ప్రణతోస్మి నిత్యం."   ఆళ్వారులులలో ఒకరైన ఆండాళ్ తల్లి (సాక్షాత్తు భూదేవియే) తనను తాను ఒక సామాన్య గోపిక వలె భావించుకొని,వివిధ స్వభావములు కలిగిన గోపికలను ఎంతో ఓర్పుతో-నేర్పుతో తనతో కలుపుకొనుచు,అందరు కలిసి పర ...

00

 జై శ్రీమన్నారాయణ. ***************** భగవత్ బంధువులారా!సవినయ నమస్కారములు.   సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించు సమయము ధనుర్మాసము. మన శరీరము పంచేంద్రియములకు ప్రతీక."ధనుస్సు" అనే పదమునకు శరీరము అనే అర్థమును కూడ పెద్దలు నిర్వచించారు కదా.మన మనస్సు శరముతో పోల్చబడినది."పరమాత్మ అనుగ్రహము" అను గురి చూస్తు,మన శరీరమును ధనువులా సారించి,మనసు అనే బాణముతో,సర్వస్య శరణాగతి అను విలు విద్యను ఉపయోగించి,పరమాత్మ అనుగ్రహమునకు పాత్రులమగుటయే "ధనుర్మాసము" అని ఆర్యోక్తి.   క్షమాపణ నమస్కారములతో నేను ఆండాళ్ తల్లి విరచిత తిరు-పావై దివ్య వ్రతమును మీతో పంచుకొనుటకు ప్రయత్నిస్తాను.ఎందుకంటే పరమాత్ముని గుణవైభవ సంకీర్తనమును పదిమందితో కలిసి చేసి,పరమానందమును పంచుకొనుట ఈ వ్రత లక్ష్యము కనుక.పరమాద్భుతమైన ఈ ద్రవిడ ప్రబంధము నవవిధభక్తి సమ్మేళనము.నవనీతచోరుని దివ్యలీలా తరంగము.  మార్గళి మాలను సంస్కరించి,సుగంధభరితము చేయుట పెద్దసన్మానముగా భావించి పెరుమాళ్ స్వరూపులు నన్ను ఆశీర్వదించెదరు గాక. ధన్యతనందించే ధనుర్మాస వైభవమును మనసా,వచసా,కర్మణా స్తుతించి,ఆచరించి,దర్శించి కృతకృత్యులైన మహాను భావులు ఎందర...

PRARTHANA

Image
  ప్రార్థన  **********  శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం  యతీంద్ర ప్రణవం వందే రమ్యజా మాతరం మునిం  లక్ష్మీనాథ సమారంభం నాథయామున మధ్యమా  అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం  యోనిత్యమచ్యుత  పదాంబుజ యుగ్మరుక్మ  వ్యామోహతస్తత్ ఇతరాణి తృణాయమానే  అస్మద్గురో భగవతోస్య దయైక సింధో    రామానుజస్య చరం శరణం ప్రపద్యే.  సంభవామి యుగేయుగే  సాక్ష్యము హరి కళత్రము  ధర్మ సంస్థాపనమే లక్ష్యమైన ఆండాళ్ తల్లి అనుగ్రహము.  శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తీయుని పుణ్యముగా  పసిపాపగ  ప్రకటించబడినది తులసివనములో  విష్ణుకథాశ్రవణము-పుష్పమాలాలం కరణములు  వివాహమాడదలచినది స్వామిని స్థిరచిత్తముతో  గోపకన్యగా మారినది-గోపికలను పిలిచినది  తిరు పాశురములు వ్రాసినది-వ్రతములు చేసినది  చూడికొడిత్తాల్ మనకు మోక్షమార్గము చూపించినది  రంగనాథుని దేవేరిగా  శ్రీరంగమున కొలువైనది  నిత్య నిర్గుణ నిరంజనుని నిరతము మది నిలుపుకొని  పరమార్థము...

FALASRITI

Image
భగవత్ బంధువులారా! మీరు కుప్పల తప్పులు అనినా ! కుప్పిగంతులే అనినా చొప్పదంటు పలుకులనినా నప్పిన్నాయ్ కరుణతో ఫలశృతి ముద్దుమోము చూడమంటు అద్దము చూపిస్తాడు విసనకర్రను ఇస్తాడు ఆ ముసిముసి నవ్వులవాడు మనతో జలకములాడుతాడు జలజనాభుడు చూడు పఱ ను అందిస్తాడు ఏ అరమరికలు లేనివాడు ఆడతాడు-పాడుతాడు వీడలేను అంటాడు సరసను కూర్చుంటాడు పరమాన్నము తింటాడు యమునకు రమ్మంటాడు మనసును ఇమ్మంటాడు పట్టు విడుపు లేనివాడు మనలను పట్టుకునే ఉంటాడు మాయను తెలిసిన వాడు సాయము చేస్తుంటాడు చెంతనే ఉంటాడు చింతలు తీర్చేస్తాడు కొండను ఎత్తిన వాడు మన గుండెలోన ఉంటాడు నెమలి ఈక నిస్తాడు నెనరులు చూపిస్తాడు దాసోహమనగానే తను దాసుడిలా మారతాడు. అమ్మ చేయి విడువకుంటే అన్నీ తానే అవుతాడు. కాయేన వాచా మనసే ఇంద్రియైర్వా బుద్ధి ఆత్మమానా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్ యత్ సకలం పరస్మై నారాయణా! ఇతి సమర్పయామి. మనో వాక్కాయ కర్మలతో చేసిన సకలము నారాయణుని పాద పద్మములను చేరుగాక. ( ఓం తత్ సత్.) సాహితీభూషణులు-సరస్వతీ పుత్రులు గుంపు నిర్వాహకులు, ఎంతో పెద్దమనసుతో, నా ఈ చిన్ని ప్రయత్నమును మనసారా ప్రోత్సహించి,వారి గుంపులోన...

MARGALI MALAI-30

Image
 మారగళి మాలై-30  *****************    ముప్పదవ పాశురం   **************  వంగక్కడల్ కడైంద మాధవనై కేశవనై  తింగళ్ తిరుముగత్తు చ్చేయిళైయార్ శెన్రు ఇరెంజి  అంగు అప్పరై కొండ అత్తై అణిపుదువై  ప్పైంగమలత్తణ్ తెరియల్ పట్టర్ పిరాందై  శంగత్తమిళ్మాలై ముప్పదుం తప్పామే  ఇంగుం ఇప్పరిశు ఉరైపార్ ఈరిరండుమాల్  శెంగణ్ తిరుముగుత్తు చ్చెల్వత్తిరుమాలాల్  ఎంగుం తిరువరుళ్ పెత్తు ఇంబరువర్ ఎంబావై.   తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో  *********************.  శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము  శ్రీ గోదారంగనాథుల అనుగ్రహము అనవరతము  జీవులను ఓడలు తిరుగాడుచున్న క్షీరసాగర స్వామి  మాధవా! కేశవా! పర (ము) ను మాకందించినావు  సూడికొడుత్తాల్ నిను పూమాలలతో సేవించినది  పాడికొడుత్తాల్ గా పావన పాశురములు పాడినది  అఖిలాండకోటి దేవతలు అర్చకస్వాములైనారు  ముక్తపురుషులు తల్లి పల్లకి మోస్తున్నారు  తామరపూసలదండలు దాల్చిన పెరియాళ్వార్  తామరదళ నేత్రునికి మామ కాబోతున్నాడు  లోకకళ్యాణమునక...

MARGALIMALAI-29

Image
  మార్గళి మాలై-29   ****************    ఇరువది తొమ్మిదవ పాశురం    **********************  శిత్తం శిరుకాలే వందు ఉన్నై చ్చేవిత్తు ఉన్  పొత్తామరై అడియే పోత్తుం పొరుళ్ కేళాయ్  పెత్తం మేయ్త్తు ఉణ్ణం కలత్తిల్ పిరందు నీ  కుత్తేవల్ ఎంగళై కొళ్ళామల్ పోగాదు  ఇత్తైపరై కొళివాన్ అన్రుగాణ్ గోవిందా  ఎత్తెక్కుం, ఏళేళు పిరవిక్కుం ఉందన్నోడు  ఉత్తోమేయావోం; ఉనక్కేనాం,అత్చెయ్ వో  మత్తైనం కామంగళ్ మాత్తు ఏలోరెంబావాయ్.   తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో   " గోవింద-గోవింద-గోవింద"   ఈ కైంకర్య సేవాభాగ్యాభ్ర్థనా పాశురములో,   " మత్తైనం కామంగళ్ మాత్తు." ఆ ఒకే ఒక కోరిక తప్ప మాకు ఇంకేమి కోరికలు లేవు అని అంటున్నారు వశీకరణావస్థలోనున్న గోపికలు ఆ వంశీధరునితో.(పిల్లనగ్రోవిని ధరించిన వానితో) అంవాస్థలు అని మనకు సందేహము వస్తే పరమాత్మ తత్త్వ పరిచయము-ప్రమాణము-ప్రసాదము కలుగుతకు ప్రతి జీవి నాలుగు దశలను దాటి వస్తాడు. అవి,  1.యతనామావస్థ- ఈ దసలో లౌకిక కోరికలను ప్రయత్నముతో అరికట్టుతుంటాడు.  2.వ్యతిరేకావస్థ- అవి లేక...

MARGALI MALAI-28

Image
    మార్గళి మాలై-28    ****************   ఇరువది ఎనిమిదవ పాశురం   ********************* కరవైగళ్ పిన్శెన్రు కానం శేరిందు ఉణ్ణోం అరివొన్రుం ఇల్లాద అయ్ కులత్తు ఉందన్నై ప్పిరవి పిరందననై పుణ్ణియం నుం ఉడైయోం కురైవొన్రుం ఇల్లాద గోవిందా! ఉందన్నోడు  ఉరవేల్ నమక్కు ఇంగు ఒళిక్క ఒళియదు!! అరియాద ప్పిళ్ళైగళోం! అంబినాల్ ఉందన్నై చ్చిరుపేర్ అళైత్తనవుం శీరి అరుళాదే ఇరైవా! నీ తారాయ్ పరై ఏలోరెంబావాయ్.   తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో.  శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము  శ్రీగోదా రంగనాథుల అనుగ్రహము అనవరతము  పశువుల మేపుటకు పచ్చిక వెంటను పరుగిడు వారము  కర్మానుష్ఠానములెరుగని గొల్లకులము వారము  శరణము-సందర్శనము-భోగము అను మూడిటితో  నిన్నుచేరి యున్నాము శుధ్ధసత్వ గోపికలము  భక్తి-జ్ఞానము-అర్హత ఏమాత్రము లేకున్నవారలము  మా కులములో పుట్టినవాడవు నీవను సాకు తప్ప  మనవ్రతమునకు మెచ్చెను మాధవుడు మనవాడేనట  రమణీయమైన స్వామితో రాసలీలను పేరిట  పండువెన్నెలలోన నేడు పరమార్థమునందుకొనగ  యమునా తటికి రారాదో! ...

MARGALI MALAI-27

Image
  మార్గళి మాలై-27   ****************    ఇరవై ఏడవ పాశురం    ****************  కూడారై వెల్లుం శీర్ గోవిందా! ఉందన్నై  ప్పాడిపరై కొండు యుం పెరు శెమ్మానం  నాడు పుగుళుం పరిశినాల్ నన్రాగ  శూడగమే తోళ్వళైయే తోడే శెవిపూవే  పాడగమే ఎన్రనైయ పల్కలనుం యాం అణివోం  ఆడై ఉడుప్పోం ; అదన్ పిన్నే పార్చోరు  మూడ,నెయ్ పెయ్దు ముళంగై వళివార  కూడి ఇరుందు కుళిరుందు ఏలోరెంబావాయ్!   తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో.  *********************  శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము  శ్రీ గోదారంగనాథుల అనుగ్రహము అనవరతము  గోవింద! హనుమకు సీతమ్మ అందించిన హారము మాదిరి  ఆదరమున మా అమ్మ నీలమ్మతో ఆభరణములను అందించు  అనుకూలురు-ప్రతికూలురు-ఉదాసీనులను కలుపుకొని  ఆండాళ్ తల్లితో పాటుగ నిన్ను సేవింపగ వచ్చినాము  పరమపురుష! వండినాము పరమాన్నమను నైవేద్యమును  కర్ణిక చుట్టు రేకులవలె కూర్చుని ప్రసాదమును తిందాము  అహం అన్నం అని మేమమనగా అహమన్నాదో అనుచు నీవు,  అహం అన్నం నేననుచు నీవు అందించుటయే ...

MARGALI MALAI-26

Image
 మార్గళి మాళై-26  ***************    ఇరువదు ఆరవ పాశురం    *********************   మాలే! మణివణ్ణా! మార్గళి నీరాడు వాన్  మేలైయార్ శెయననగళ్ వేండువన కేట్టియేన్  ఞాలాత్తై యెల్లాం నడుంగ మారల్వన  పాలన్న వణ్ణత్తు ఉన్ పాంజశన్నియమే  పోలవన శంగంగళ్ పోయ్ ప్పాడు  ఉడైయనవే  శాలప్పెరుం పరయే, పల్లాండు ఇశైప్పారే,  కోళ విళక్కే,కొడియే,వితానమే  ఆలిన్ ఇలైయాం! అరుళ్ ఏలోరెంబావాయ్!    తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో *********************  శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము  శ్రీ గోదా రంగనాథుల అనుగ్రహము అనవరతము.    వీడని వ్యామోహమా! మా తోడునీడ నీవేకదా  మమ్ము నీదరిచేరుటకు  దారియైన వ్రతము కొరకు   పాంచజన్యమును పోలిన తెల్లనైన శంఖములు   సుదర్శనపు కాంతులీను శ్రేష్టమైన మణిదీపములు   పరమాత్ముని సేవింపగ పర అను వాయిద్యములు   పల్లాండ్లను పాడగలుగు ప్రసిధ్ధ గాయకులు   వ్రతస్థలమున పాతుటకు చక్కనైన పతాకలు   అవి మంచులోన తడవకుండ మేలైన...

MARGALI MALAI-25

Image
  మార్గళి మాలై-25  ***************   ఇరవై ఐదవ పాశురం   *****************  ఒరుత్తు మగనాయ్ పిరందు,ఓర్ ఇరవిల్  ఒరుత్తు మగనాయ్ ఒళ్త్తు వళిర  తరిక్కిలాన్ ఆంగితాన్ తీంగు నినైనద  కరుత్తై పిళ్ళైపిత్తు క్కంజన్ వయిత్తిల్  నెరుప్పెన్న నిన్ర నెడుమాలే! ఉన్నై  అరుత్తిత్తు వందోం ; పరై తరువదియాగిల్ తిరుత్తక్క శెల్వముం శేవగమం యాంపాడి వరుత్తముం తీరందు మగిళిందు ఏలోరెంబావాయ్!    తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో  శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము  శ్రీగోదా రంగనాథుల అనుగ్రహము అనవరతము.  ఒకతల్లి గర్భమున రాతిరి పుట్టినవాడు  మరొకతల్లి ఇంటచేర యమునను దాటినవాడు  హింసింపదలచిన కంసుని దుష్టప్రవృత్తిని  నిర్భయముగ తానె వెడలి నివృత్తిచేసినవాడు  అష్టాక్షరిగా పుట్టి-ద్వయమంత్రముగా పెరుగుతు  ఆబాల గోపాలమున అడుగో ఆడిపాడుచున్నాడు  "పర" మాకు ఇచ్చినను-లేకున్నను సమ్మతమే   కదలనిభక్తి కైంకర్యపు పరంపరలు ప్రసాదించు  భక్తిప్రపత్తులతో స్వామి జన్మవైభవమును కీర్తింపగ  ఆండాళ్ అమ్మవెంట తర...

MARGALI MALAI-24

Image
  మార్గళి మాలై-24  ***************    ఇరువది నాలుగవ పాశురం    *************************  అన్రు ఇవ్వులగం అళందాయ్ !అడిపోత్తి  శెన్రంగు త్తెన్నిలింగై శెత్తాయ్! తిరల్ పోత్తి   పొన్ర చ్చగడం ఉదైత్తాయ్! పూగళ్ పోత్రి  కన్రు కుణిలా ఎరిందాయ్! కళల్ పోత్తి  కున్రు కుడైయా ఎడుత్తాయ్! గణం పోత్తి  వెన్రు పగై కెడుక్కుం నిన్ కైయల్ వేల్ పోత్తి  ఎన్రెన్రున్ శేవగమే ఏ తిప్పరై కొళివాన్  ఇన్రుయాం వందోం ఇరంగు ఏలోరెంబావాయ్.  తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో.   శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము   శ్రీ గోదారంగనాథుల అనుగ్రహము అనవరతము   నాడు భూమిని కొలిచిన వామన పాదములకు మంగళం   లంకకేగి రావణు కూల్చిన రామ పాదములకు మంగళం   శకటాసురుని కూల్చిన స్వామి పాదములకు మంగళం   వత్సాసుర కపిత్సాసుర సంహారి పాదములకు మంగళం   గోవర్ధనగిరి నీత్తిన గోవిందుని పాదములకు మంగళం   శుభకర కరమున నున్న వేలాయుధమునకు  మంగళం   ఒకటా? రెండా? మూడా? ఎన్నని కీర్తించగలము   మాధవా! దయతో మంగళ హారతులను స...

MARGALI MALAI-23

Image
  మార్గళిమాలై-23   *************        ఇరవదిమూడవ పాశురం       *********************  మారిమలై ముళింజిల్ మన్నికొడందు ఉరంగం  శీరియసింగం అరిఉత్తు త్తీవిళిత్తు  వేరి మయిర్ పొంగ వెప్పాడుం పేరొందు ఉదరి  మూరి నిమిరిందు ముళంగి పురప్పట్టు  పోదరుమా పోలే ,నీ పూవై పూవణ్ణా! ఉన్  కోయిల్ నిన్రు ఇంగనే పోందరుళి,కోప్పడయ  శీరియసింగాసనత్తు ఇరుందుయాం వంద కారియం ఆరాయందు అరుళ్ ఏలోరెంబావాయ్.   తల్లికి క్షమాపణాభ్యర్థనలతో.  శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము  శ్రీగోదా రంగనాథుల అనుగ్రహము అనవరతము  వర్షాకాలములోన కొండగుహలో నిదురించుచున్న  సింహ కిశోరము మేల్కొని కాళ్ళను చేరచాచి  జూలును విదిలిస్తు-గంభీర గర్జనను చేస్తూ  అడవిని పాలింప గుహవీడి వెడలు శోభ  ఓ పురుష సింహమ! నిదురను చాలించి నీవు  ధీర గంభీర నడకను దారిని ఉధ్ధరిస్తూ  విరగబూసిన అవిసెల విభవమలర.ప్రేమతో  గోకులమును పాలింప వేగమే కదలిరమ్ము  కువలయమునంతటిని కూర్మితో  కుశలమడుగుచును  సింహాసన...

MARGALI MALAI-22

Image
  మార్గళి మాలై-22     ***********        ఇరువదిరెండవ పాశురం    ************************   మార్గళి మాలై-22   ************  అంగన్ మాల్యాలత్తు !అరశర్ అభిమాన  బంగమాయ్ వందు నిన్ పళ్ళికట్టిల్ కీళే  శంగవిందుప్పార్ పోల్ వందుతలై ప్పెయిదోం  కింగిణివాయ్ చ్చెయద తామరై పూప్పోలే  శెంగణ్ శిరిచ్చిరిదే ఎమ్మేల్ విళియావో?  తింగళుం ఆదిత్తియనుం ఎళుందార్ పోల్  అంగణ్ ఇరండు గొండు ఎంగుల్మేల్ నోక్కదియేల్  ఎంగళ్మేల్ శాబం ఇళిందు ఏలో రెంబావాయ్.    తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో.    ***********************  శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము  శ్రీ నీళా రంగనాథుల అనుగ్రహము అనవరతము  సుందర-సువిశాల భూమండలమేలిన రాజులు  నీ ముందర నిలబడినారు జితబాణులు నిరహంకారులు  సుందర-సువిశాల సంసారాంబుధి మునిగిన భామలు  నీ ముందర నిలబడినారు జితగుణులు నిరహంకారులు  మారాకను ప్రశ్నించుట మా పాపపు శాపము పంచుట మావాడవు నీవనుకొను మమ్ముల దూరమునుంచుట  ఉదయించనీ సూర...

MARGALI MALAI-21

Image
  మార్గళి మాలై-21   ******************    ఇరవైఒకటవ పాశురం    ****************   ఏత్తి కలంగళెదిర్పొంగి మీదళిప్ప   మాత్తాదే పాల్ శొరియం వళ్ళన్ పెరుం పశుక్కళ్   ఆత్తపడైత్తాన్ మగనే! అరివురాయ్   ఉత్తముడైయాయ్! పెరియాయ్! ఉలగినిల్   తోత్తమాయ్ నిన్ర శూదరే!తుయిళెలాయ్;   మాత్తార్ ఉనక్కు వలితులైందు ఉన్ వాశర్ కణ్   అత్తాదు వందు ఉన్ అడిపణియు మాపోలే   పోత్తియాం వందోం పుగళందు ఏలోరెంబావాయ్.    తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో.  శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము  శ్రీనీలా కృష్ణుల అనుగ్రహము అనవరతము.  తల్లడిల్లు గోపికలకు తలుపును తెరిచినది నీల  మరువలేదు మీ ప్రార్థనలను నేనును మీ పక్షమే  స్వామికి నివేదించ తగిన సమయమునకై వేచితిని  మరియొక మాట మగువలార! భగవానుని మరిమరి  మానవుడు-మన వాడను భావనను కలుగచేయవలెనుగా  గోపాలురు-గోసంపద-గోపికలను జ్ఞప్తిచేయు విధముగ  యశోద-నందులను మరిమరి కీర్తించండి  యదుకుల భూషణుడను లీలలను చాటండి  దాసోహులు గోపికలు దర్శన ధన్యత గ...

MARGALI MALAI-20

Image
 మార్గళి మాలై-20  *****************     ఇరువదవ పాశురం     ***************    ముప్పత్తు మూవర్ అమరర్క్కు మాన్శెన్రు    కప్పం తవిర్ క్కుం కలియే! తుయివెళాయ్!    శెప్ప ముడైయాయ్! తిరలుడైయాయ్! శెత్తార్క్కు    నెప్పం కొడుక్కుం విమలా! తుళెలాయ్    శెప్పన్న మెన్మాలై! చెవ్వాయ్,చ్చిరు మరుంగుల్    నప్పిన్నై నంగాయ్! తిరువే! తుయివెళాయ్   ఉక్కముం తట్టొళియుం తందున్ మణాళనై   ఇప్పోదే ఎమ్మై నీరాట్టు ఏలో రెంబావాయ్.    తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో.   శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము   శ్రీనీలా కృష్ణుల అనుగ్రహము అనవరతము   ముప్పదిమూడుకోట్ల దేవతలకు తాను ముందుండి   భయమును తొలగింపచేయు అభయమూర్తి మేలుకో   తప్పుదారి శత్రువులకు వెన్నులో వణుకును పుట్టించి   ధర్మమును రక్షించిన నిర్మలమూర్తి మేలుకో   అద్దము-విసనకర్ర-వస్త్రములను నోమునకు అందీయగ   సద్గుణపరిపూర్ణా! ఓ నీలా ప్రసన్నురాలివై నిదురలే   ఇతరములేవి కోరని నిష్కళంక మనసులము   స్వ...

MARGALI MALAI-19

Image
 మారగళి మాలై-19  ******************    పంతొమ్మిదవ పాశురం    *****************  కుత్తు విళక్కిరియె క్కోట్టుక్కాల్ కట్ట్ల్ మేల్  మెత్తెన్ర పంచ శయనత్తిన్ మే లేరి  కొత్తు అలర్ పూంగుళల్ నప్పిన్నై కొంగైమేల్  వైత్తుకిడంద మలర్మార్పా! వాయ్ తిరవాయ్  మైత్తిడం కణ్ణనాయ్ ! నీ ఉన్ మణాళనై  ఎత్తనై పోదుం తుయిల్ ఎళ ఒట్టాయ్ కాచ్  ఎత్తనై ఏలుం పిరవాత్త గిల్లాయాల్!  తత్తువం అన్రు తగవు ఏలో రెంబావాయ్.    తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో..  శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము  శ్రీ నీలా కృష్ణుల అనుగ్రహము అనవరతము  సకలశాస్త్రములు వెలుగుచున్నవి గుత్తిదీపములుగా  సమసిపోయినది అహము మంచపు దంతపు కోళ్ళగా  దయార్ద్రత మారినది తాను మెత్తని పరుపుగా  పతితపావనత్వము పరిమళపు పూలగుత్తులుగా  పరస్పరము పరవశించు ప్రత్యేక సమయమున  విశదమైనది తల్లి విభుని విడలేకయున్నావని  తలుపుతీయకున్న మానె పలుకైన పలుకవేమి  తగదమ్మా జాగునీకు,తడవు సేయకు తల్లి  పురుషకారమా పురుషోత్తముని నిదురలే...

MARGALI MALAI-18

Image
  మార్గళి మాలై-18   *****************      పదునెనిమిదవ పాశురం      *********************   ఉందు మదగళిత్తన్ ఓడాద తోళ్ వలియన్   నందగోపాలన్ మరుమగళే! నప్పిన్నాయ్   కందం కమళుం కుళలీ! కడై తిరవాయ్;   వందెంగుం కోళి అళైత్తనగాన్; మాదవి   ప్పందల్మేల్ పల్కాల్కుయిల్ ఇనంగళ్ కూవినగాణ్   పందార్ విరలి! ఉన్ మైత్తునన్ పేర్పాడ   శెందామరై క్కైయాల్ శీరార్ వళై యొళిప్ప   వందు తిరవాయ్; మగిళిందు ఏలోరెంబావాయ్.    తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో.  శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము  శ్రీనీలాకృష్ణుల అనుగ్రహము అనవరతము  ఉన్మత్త మదగజముల మదమణచిన భుజబలుని  నందనాయకుని మేనకోడల! నప్పిన్నాయ్ మేలుకో  కోళ్ళు లేచి గింజలకై కాళ్ళను కదుపుచున్నవి  మాధవీలతపై కోయిలలు కూ కూ అంటున్నవి  కీడును తలబెట్టినారు అసురులు ఏడు ఆంబోతులుగ  చూడగానే అత్తకొడుకు వానిని మట్టుబెట్టెగ  వలచి-వలపించుకొనిన వాత్సల్య ప్రదాయిని  కరకంకణముల సవ్వడులతో కదలి తలుపుతెరువు  పాశురములు పాడుచు,పాశ...