Wednesday, October 6, 2021

001

1. సుందరి సౌందరి నిరందరి దురంధరి జ్యోతియాయ్ నిండ్ర ఉమయే శుక్రవారత్తినిల్ కండ దరిశిత్తు వగళ్ తుంబత్తె నీకిడిడువాయ్ చింతనిల్ ఉన్ పాదం తన్నయే తులుపవర్కళ్తుయిరత్తె మాత..... జగమెల్లాం ఉన్ మాయ పుగళ ఎన్నాలామొశిరియనాళ్ ముడిదిడిత్తూ సొంద ఉన్ మైందనాం ఎందనై రక్షిక్క సిరియ కాదన్నదమ్మా శివశివ మహేశ్వరి పరమ మణి ఈశ్వరి శిరోన్మణి మనోన్మణియు నీయే అంతరి దురంధరి నిరంతరి పరంపరి అనాధరక్షకియు నీయే
అళగానకాంచియిల్ పుగళాన వాళ్దిడుం అమ్మ కామాక్షి ఉమయే. ************ సుందరి సుమంగళి నిరంతరి దురంధరి జ్యోతిస్వరూపమే నీవు శుక్రవారమునాటి నీదివ్యదర్శనము కిల్బిషము కడతేర్చునమ్మా నీ పాద చింతనమే భవతాపహరణము భావనామాత్ర సంతుష్టవు జగమంత నీ మాయలో మునిగిన తరుణాన నేనేమని కీర్తించగలను నీ సొంత సంతతిని వేగమే రక్షించు బిరుదు నీకున్నదమ్మా శివ శివ మహేశ్వరి పరమనిలయేశ్వరిశిరోన్మణి మనోన్మణియు నీవే శాంకరి శుభంకరి యశోధరి పరాత్పరి అనాధరక్షకియు నీవే అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే. *************** మొదటిభాగములో అమ్మయొక్క బాహ్య-అంతః సౌందర్య ప్రస్తావనతో ప్రారంభమైనది.శుక్రవార కామాక్షి దర్శన భాగ్యము ప్రశంసించబడినది. తల్లి ఆవిర్భావము వెనుక దాగియున్న రహస్యములు చెప్పబడినవి . కాంచీ క్షేత్రము *********** జగత్కళ్యాణమునకై ఆదిపరాశక్తి,తనను తాను శివ-శక్తి అను రెండు రూపములుగా ప్రకటించుకొని,శివ రూపమునకు స్థిరత్వమును-శక్తి రూపమునకు విస్తరణను నిర్దేశించుకొని,సూత్రధారుడైన స్వామి సంకల్పముతో తాను ఎన్నెన్నో నామరూపగుణ వైభములతో క్షేత్రములుగా భాసిల్లుతు,పరమేశుని క్షేత్రజ్ఞునిగా ప్రకటింప చేయుచున్నది. ప్రళయ జిత్/జయించినక్షేత్రముగా,సప్త మోక్ష పురములలో ఒకటిగా,ధర్మమునకు రెండు కళ్ళైన కాశి-కాంచి క్షేత్రముగా అలరారుచున్న కాంచిక్షేత్రముగా- కామాక్షి తాయి,తన చల్లని చూపుతో కాపాడుతున్నది.కాంచీ క్షత్రమునకు-కామాక్షి అమ్మకు భేదము లేదు.తపఃశక్తి దైవ సక్తితో మిళితమై స్థలమును క్షేత్రముగా సుసంపన్నము చేయుచున్నది లోకములకు వెలుగును ప్రసాదించుటకు వారు చీకటిని నాంది చేసుకొని లీలను ప్రారంభించారు.అమ్మ అయ్యవారి కనులు మూయుట,తత్ఫలితముగా ప్రళయావిర్భావము-పునః సృష్టిలోని చీకటిని తరిమివేసే వెలుగును ప్రసరింప చేయుటకు,సకల చరాచరజీవరాశులను ఉధ్ధరించుటకు,తల్లి తనను తాను ఒక ఉదాహరణగా నిరూపించుటకు,ధర్మ-అర్థ-కామ-మోక్ష సాధనామార్గమునకు తార్కాణమైన తపోకామాక్షిగా కాంచి నగరములో కొలువైనది కామదాయిని . జ్యోతి నిండ్రాయ్ ఉమయే *********** ************ భండాసురుని బారి నుండి భువన భాండములను సంరక్షించుటకు, " చిదగ్ని కుండ సంభూతా దేవకార్య సముద్యతా" సత్తు-చిత్తు శాశ్వతప్రకాశ లక్షణిగా ఆవిర్భవించినది.ఇది కథ.కాని ఇది భండ అజ్ఞానమును పారద్రోలు ప్రకాశమునకు సంకేతము. శుక్రవార విశిష్టత ************************* నవగ్రహాలలో రాహు కేతువులను మినహాయిస్తే,వారములోని ఏడురోజులు ఏడుగ్రహ ప్రభావ సంకేతములుగా పరిగణిస్తే, భోగ కారకుడైన శుక్రగ్రహ//శుక్లగ్రహ ప్రభావదినముగా కామాక్షి అమ్మను శృంగార /శుభలక్షిణిగా // విశేషాలంకారము చేసి ,దర్శించి అలంకారసేవలో ధన్యులవుతారు. కేన- అంచిత బ్రహ్మచే సేవింపబడిన కాంచి క్షేత్రములో వెలసిన కామాక్షి తాయి దివ్య తిరువడిగళే శరణం. నరియ నరియ వణక్కంగళ్. అమ్మ చేయి పట్టుకుని వెళుతు రేపు రెండవ విరుత్తమును తెలిసికొనుటకు ప్రయత్నిద్దాము. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఎ

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...