ASYA ASTI ITIKASI @ KASIPAMCHAKAMNIJABODHA 05

 


 కాశీక్షేత్రం  శరీరం  త్రిభువన జనని వ్యాపినీ జ్ఞానగంగా

 భక్తిశ్రధ్ధః గయేయం నిజగురుచరణ ధ్యానయోగః ప్రయాగః

 విశ్వేశోయం తురీయం సకల జనమనః సాక్షి భూతోంతరాత్మా

 దేహే సర్వం మదీయే  యదివసతి పునః తీర్థమన్యత్కిమస్తి.


  పదవిభజన


    మదీయే  దేహే సర్వం

    మదీయే  దేవే కాశీక్షత్రం

    మదీయే దేహే జ్ఞానగంగా

    మదీయేదేహే  గయ

    మదీయే  దేహే  ప్రయాగ

    మదీయే  దేహే విశ్వేశః

    మదీయే  దేహే సాక్షిభూత

       

     యది-ఏది/వసతి-ఉన్నదో అదే తురీయమైనది.శాశ్వతానందమునుఇచ్చునది.

   ఆవిషయము నేనూర్థముచేసుకున్నప్పుడు నేను దర్శించుకోవలసిన  తీర్థము

 అన్యత్-వేరుగా 

 కిం-ఏది/అస్తి-ఉన్నది

  అంతర్భావనలో నేను కాశీక్షత్రమునే దేహముగా భావిస్తూ గంగాతీర్థము అను జ్ఞానములో ప్రవహిస్తూ,భక్తిశ్రద్ధలను గయాక్షత్రమున నివసిస్తూ,గురుచరణ ధ్యానమను గురుపాదములందు  అంతర్లీనముగా  నాబుద్ధిని మేళవిస్తూ విశ్వేశ్వరుని సాక్షిగా సేవిస్తున్న సమయమున నేను దర్శించవలసిన/సేవించవలసిన తీర్థములు ఏవైనా  ఉంటాయా?

  సాఫల్యమును పొందిన నాఉపాధి ప్రారంభసాధన స్థితికి తిరిగి  అథోగమనము చేయుట  గాక.

    సర్వంశివమయం జగత్

 ఏక బిల్వం శివార్పణం.


Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)