TIRUVEMBAVAY-17
తిరువెంబావాయ్-17
***********
కృపాసముద్రం సుముఖం త్రినేత్రం
జటాధరం పార్వతీ వామభాగం
సదాశివం రుద్రం అనంతరూపం
చిదంబరేశం హృదిభావయామి."
సందర్భము
ధీయతే రక్షతే.ధీయతే పశ్యతే దీక్ష అంటుంది సనాతనము.ధీ అంటే బుద్ధి.దానిని చైతన్యపరచి ఉపాధిలోని స్వస్వరూపమును అందించగలిగే ఏకైక మార్గము.శివనోమును సంకల్పించి,ప్రాతఃకాలమునక ఒకరినొకరు మేల్కొలుపుచుకొనుచు,స్నానఘట్టమునకు చేరిన మన భాగ్యశాలురు నిన్న కృపావర్షమున మునిగి పునీతులైనారు.
ప్రస్తుత పాశురములో స్వామి పాదపద్మముల విశిష్టతను ,కారుణ్యమును సంకీర్తిస్తున్నారు.
పాశురము
*********
శన్ కన్ అవన్ పాల్ తిశై ముగన్ పాల్ దేవర్గణ్ పాల్
ఎంగుం ఇలాదరోర్ ఇంబం నం బాలదా
కొంగుం కరుణ్ కుళలి నందమ్మాయ్ కోదాట్టి
ఇంగనం ఇల్లంగళ్ తోరుం ఎళుందరుళె
శంగమల పొర్పాదం తందరుళం సేవగనై
అంగణ్ అరసై అడియోగళ్ కారముదై
నంగళ్ పెరుమానె పాడి నలందిగళ్
పంగయుం పూం పునల్ పాయిందాడేలోరెంబావాయ్
.
కొంగుం-కురల్-అరుళీ-నల్లని అందమైన-పరిమళభరితమైన కేశపాశము కల చెలీ
(మంత్రమయమయిన శరీరముతో నున్నదానా)
ఇంకా నిద్దుర పోవుట నీకు తగదమ్మా.
స్వామి తన పొణ్(బంగరు) పాద సేవనము అనుగ్రహించి తనకు తానే మనదగ్గరకు వస్తున్నాడు.
ఆ శెన్(ఎర్రని పాదము) ఎంత దుర్లభమైనదందంటే,
సెన్-కన్-ఎర్రని పద్మముల వంటి కన్నులున్న విష్ణుమూర్తికి సునాయాసముగా లభించలేదు అంటూ శివపురాణములోని పుండరీకాక్ష వ్రతమును,ఏ విధముగా వ్రతసమర్పణములో ఒక్క పుండరీకము తగ్గినదని విష్ణూవు తన కన్నును దానికి బదులుగా సమర్పించబోయి,స్వామిదయతో సుదర్శన చక్రమును పొందగలిగాడో చెప్పకనే చెబుతున్నారు.
అదే విధముగా బ్రహ్మసైతము బహుకష్టముతో సంవత్సరమునకు ఒక్కసారి ఉత్సవములను జరిపే అదృష్టమును పొందగలిగాడు.
వారిద్దరు మాత్రమే కాక ఇంకెందరో భూపతులు సైతము జపతపములను ఆచరించి,నియమనిష్టలను అనుసరించిన తరువాతనే స్వామి పాదార్చనమును చేసుకొనగలుగుచున్నారు.
ఓ చెలి! మనమెంత భాగ్యశాలురమమ్మా.ఇవేవి లేకుండానే స్వామి మనదగ్గరకే వచ్చి,మన సేవలను స్వీకరించుటకు సిద్ధమయినవేళ నీవు లేచి,నోమునకు సిద్ధము కావమా అంటున్నారు.
అంబే శివే దివ్య తిరువడిగళే పోట్రి.
ఏక బిల్వం శివార్పణం.

Comments
Post a Comment