ADITYAHRDAYAMU-13
ఆదిత్యహృదయము-13 *************** "జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం కిరణసమిత పాపం క్లేశ దుఃఖస్య నాశం అరుణకిరణగమ్యం ఆదిం ఆదిత్యరూపం సకలభువన వంద్యం భాస్కరం తం నమామి." పూర్వరంగము ********* పరమాత్మ హిరణ్యగర్భునిగా,తన తేజస్సుతో అగ్నిగర్భుడై,రవి యై తపమును కలిగిస్తూ,శిశిరమును తొలగిస్తున్నాడు.అంటే ఘర్మసర్జన కిరణములతో శబ్దస్వరూపునిగా ప్రకాశిస్తున్నాడన్న అగస్త్యుడు, ప్రస్తుత శ్లోకములో ఆ శబ్ద వైశిష్ట్యమును-జలతత్త్వమును-దక్షిణాపథ గమనమును ,విజ్ఞానప్రదాత్వమును స్పష్టముగా తెలియచేస్తున్నాడు. శ్లోకము ***** " వ్యోమనాథః తమోభేది ఋగ్యజుసామ పారగః ఘనవృష్టిః అపాం మిత్రో వింధ్యవీధి ప్లవంగమః" స్వామి వ్యోమ వాసియై తన రశ్ములచే చీకట్లను తొలగించువాడు.ఇది వాచికము. స్వామి ఆత్మస్వరూపియై తన జ్ఞానముచే అజ్ఞానమును పారద్రోలువాడు. స్వామి త్రయీమూర్తిం వేదం అన్న ఆర్యోక్తిని నిజముచేస్తూ ,సుప్రభాత సమయమున ఋగ్వేదముగాను-మద్యాహ్న సమయమున యజుర్వేదముగాను -అస్తమాన సమయముబ సామవేదముగాను,మూడువేదములచే సంస్తుతింపబడ...