తిరువెంబావాయ్-30
************
"కృపాసముద్రం సుముఖం త్రినేత్రం
జటాధరం పార్వతీ వామభాగం
సదాశివం రుద్రం అనంతరూపం
చిదంబరేశం హృది భావయామి."
సందర్భము
********
ఆరుద్ర నక్షత్ర దర్శనము అనే ఘట్టము తరువాత మనము ఎళుచ్చిని ప్రారంభించుకున్నాము.
ఆరుద్ర నక్షత్రము శివ జన్మ నక్షత్రమని కొందరు-రుద్రాధిపతి ని పొందిన నక్షత్రమని మరికొందరు భావిస్తారు.అది నిజమే.అయితే ఏమా నక్షత్ర దర్శన భాగ్యము?దాని విశేషము అను సందేహము కలుగ వచ్చును.
శ్రీ లలితా రహస్య సహస్రనామములలో "మజ్జత్" బ్రహ్మాండ మండలా అను శ్లోకము వస్తుంది.ఆ జగదంబ తన అరుణకరుణతో బ్రహ్మాండములను ముంచి వేస్తుంది.
అదే శక్తి లక్ష్మీ స్వరూపముగా ప్రకటనమయినాప్పుడు
"ఆర్ద్రాం-జ్వలంతీం+అర్ద్రాం-పుష్కరిణీ" అంటూ మనలను అవ్యాజకరుణ లో మునకలు వేయిస్తుంది.
అంతెందుకు నమక-చమకముల ముందు "ఆ పాతాళ-నభ-స్థలాంత" అంతూ సర్వ్వ్యాపి అయిన సదాశివుని స్తుతిస్తుంది.
బాహ్య-అభ్యంతర శుచిత్వమును పొందుటయే ఆర్ద్రా/ఆరుద్ర నక్షత్ర దర్శనము.
మనమదరము ఆ పరమేశ్వరుని కరుణతో ఆద్రత అను అవ్యాజానురాగములో మునిగి ఆ చిత్స్వరూపమును సేవిద్దాము.
బువనయిర్ పోయ్ ప్పెర వామైయిన్ నాళాం
పోక్కుకిన్రోం అవమే ఇంద బూమి బూమి
శివన్ ఉయ్యర్ కొల్కిన్ర వారెన్రు నోక్కిత్
తిరుపెరుం తురైయురై వాయ్ తిరుమాలాం
అవన్ విరుప్ పెయిదవుం మలర్వన ఆశై
పడవుం ఇన్ అలర్దామయె కరుణయు నీయుం
అవనియర్ పుగుందెమ్మై ఆట్కోళ్ళ వల్లాయ్
ఆరముదే పళ్ళి ఎరుందరుళాయ్
పరంజ్యోతియే పోట్రి
*********************
"శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రాః
అయే ధామాని దివ్యాని తస్థుః"
వేదాహమేతం పురుషం మహాంతం
ఆదిత్య వర్ణః తమసః పరస్తాత్."
శివనోమును నిష్కళంకమనముతో నోచుకొనిన చెలులు మనతో
ఓ జీవులారా!
పరమేశుని అనుగ్రహముతో మేము ఇప్పుడు,
తమస్సునకు అవతలనున్న ప్రకాశ స్వరూపమును కనుకొనగలుచున్నాము.తద్వారా,
మేము చావు పుట్టుకలను చక్రము బారిన పడకుండా భవబంధ విముక్తులము కాబోతున్నాము.ఎందుకంటే,
దేహాభిమానమును వీడిన వెంటనే స్వస్వరూపమును తెలుసుకోగలముకదా.
సురలకు సైతము సాధ్యము కాని స్వామి సాంగత్యము -సంసేవనము -మనకు లభించబోతున్నదికదా.
ఆ పరమాత్మ పాద సంసేవనమునకై బ్రహ్మ-విష్ణు మిగిలిన దేవతలు సైతము మర్త్యలోకమునకు మరలుతున్నారు.
జంతూనాం నరజన్మ దుర్లభం
సులభోపాయముతో జీవాత్మను-పరమాత్మతో సంగమింపచేసే సోపానము.
అసలు ఇన్నిమాటలేల?
ఒక్క మాటలో చెప్పాలంటే,
మృణ్మయమూర్తి చిన్మయమూర్తిగా మారబోతోంది ఆ ఆత్మనాథుని అనుగ్రహముతో.
తరలిరండి-తరించండి.అంటూ
"తిరుపళ్ళి ఎళుచ్చి" మనలను తట్టిలేపుతున్నది.
గంగను జటలో బంధించిన గంగాధరుడు తన భక్తుని గొప్పదనమును ప్రపంచమునకు దాట దలచినాడో లేక
ప్రభువులో పరివర్తనమును కలుగచేయదలచినాడో కాని వైగైనది పరవళ్లతో పరుగులు తీస్తూ ఊళ్ళను ముంచేస్తోంది.
నీరైనా/నిప్పైన తన్ను కమ్ముకున్న వేళ మరింత నిశ్చింతతో నిటలాక్షుని నమ్ముకుని యున్నాడు భక్తుడు.
అహముతో /అజ్ఞానముతో తన బలమును/బలగమును నమ్ముకుని మానవప్రయత్నమును మాత్రమే చేస్తున్నాడు మహారాజు.
కాదనలేని కరుణగల పరమేశుడు నిర్దోషులను శిక్షించనీయదు
కదా.కనుక రాజాజ్ఞ ప్రకారము ప్రతి ఇంటి నుండి ఒకరు వచ్చి జలప్రవాహమునకు అడ్డువేయుచున్న వేళ,తానొక సేవకునిగా ఒక ముసలి అవ్వ ఇంటినుండి వచ్చి,పనిచేయక పవళించగానే,కుపితులైన రాజభటులు తమ కొరడాను అతని వీపుపై ఝళిపించారు..
జటాధారికి కావలిసినది అదేకదా.విశ్వాత్మకునికి తగిలిన దెబ్బ గుర్తు-బాధ విశ్వమం
తా భరించవలసివచ్చింది.
తన తప్పును తెలిసికొనిన పాండ్యరాజు పశ్చాత్తాపముతో పరమేశుని భక్తుని శిక్షించినందులకు బాధపడుతూ,స్వామిని బంధవిముక్తుని చేయమని వేడుకున్నాడు.
ప్రధానమంత్రి పదవిని
తృణ ప్రాయముగా వదిలివేసి,ప్రచార సాధనమై,చిదంబర నటరాజ దర్శనముతో "త్వమేవాహమై" ముందు తరముల వారికి మార్గదర్శకమైనాడు
"తిరు మాణిక్యవాచగరు.
ప్రియ మిత్రులారా! మీరందించినప్రోత్సాహమే "తిరువెంబాయ్" అను దివ్య స్తోత్రరాజమును స్మరించుకొనునట్లు చేసినది.
తిరుమాణిక్యవాచగరును కొందరు తిరువెంబావాయ్ అంటే ఏమిటి? అని కొంటెగా ప్రశ్నించారట.
దానికి వారు ప్రశాంతముగా కొండమీదనున్న స్వామిని చూపిస్తు అది అని, సవినయముగా బదులిచ్చారట.
నిజమునకు నామమునకు-నామికి భేదమేలేదుకద.
భావ దోషములు-భాషాదోషములు-భక్తి లోపములు కల ఈ నా ప్రయత్నమును స్వామితో పాటు మీరును పెద్దమనసుతో ప్రోత్సహించి,ఆశీర్వదించారు.
నేను ప్రారంభములో మీతో విన్నవించుకొనినట్లు నా "తాయ్ మొళి" మాతృభాష తమిళ
ము కాదు.పెద్దగా పరిచయము కాని/పాండిత్యము కాని లేదు.అయినప్పటికిని మహదేవ సంకల్పము మనలను ఈ మహాశివ నోములో భాగస్వాములను చేసినది.ఇప్పటికిని మించినదిలేదు.దీనిలోని దోషములను సవరించుకొనుటకు నేను సర్వదా సంసిధ్ధురాలను.
.స్వామి కృపతో మనమందరము పాదార్చకులమై,పునీతులమగుదాము.
శుభం భూయాత్-మీ సోదరి,
నిమ్మగడ్డ సుబ్బలక్ష్మి, నమస్కారములతో.
నండ్రి.వణక్కం.
Comments
No comments yet
Be the first to comment.
Comments
Post a Comment