Posts

CHIDAANAMDAROOPAA-MADIVALA MAACHAYYA

Image
 చిదానందరూపా-మడివల మాచయ్య  *****************************  కలయనుకొందునా  నిటలాక్షుడు  కలడనుకొందునా  కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా  పర్వతప్ప-సుజ్ఞానుల సుకృతపు సుపుత్రుడు  శరణు సాహిత్యపు సంరక్షకుడు  మడివల మాచయ్య  శిల శిష్యుడుయైన వేళ  శిల్పి గురువుయే కద  తన గురువు బసవేశ్వరునికి తాను పాద సేవకుడు  ఇష్టలింగము  గురించి మలయ చంద్రయ్యకు బోధించెను  ఇష్టముగా బట్టలనుతికి ఈశ్వర భక్తులకు అందించెను  మడిమూటను తాకినవానిని హతమార్చెను  వీర గణాచారిగ  మరల బ్రతికించుతకు మహేశ్వరుని మహిమలె కారణమాయెగ  చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక  చిత్తముచేయు  శివోహం  జపంబు చింతలు తీర్చును గాక.

CHIDAANAMDAROOPAA-IDANGAL NAAYANAARU

Image
 చిదానందరూపా-ఇదంగళి నాయనారు  *******************************  కలయనుకొందునా  నిటలాక్షుడు  కలడనుకొందునా  కలవరమనుకొందునా  కటాక్షించిన వరమనుకొమునా  అగస్త్యకుల వంశజుడు ఇదంగళ్ ఈశ్వరభక్తుడు  శైవాగమ విధులను సంతసముగ సలిపెడివాడు  ఆ లయకారుని  ఆలయ విధులలో సహాయకారి  ఆకలిగొన్నవారిని  సంతృప్తులచేసెటి ఆత్మయోగి  అన్నదానమునుచేయగ ధాన్యపు కొరతను తీర్చుకొనగ  రాజ ధాన్యాగారపు దొంగ సంగతి తను తెలిసికొని  చాటింపే వేయించెను తన సంపదనంతయు పంచగ  పరమేశుని తను చేరగ పంచిన సంపద కారణమాయెగ  చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక  చిత్తముచేయు  శివోహం జపంబు చింతలు తీర్చును గాక.

CHIDAANAMDAROOPAA-GOEDAGOOCHI

Image
 చిదానందరూపా-గోడగూచి  *********************  కలయనుకొందునా  నిటలాక్షుడు  కలడనుకొందునా  కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా  తలితండ్రుల ఆనతిగాన  తరియింపగ తాను  కమ్మని ఆవుపాలు నైవేద్యము సేయగ తరలెను  కొండను వెలిసిన శివునికి బొజ్జనింపగ ఇంపుగ  మెండగు భక్తి తోడ  గోడగూచి నిష్కళంకముగ  అతివాస్తవికతతో స్వామికి ఆవుపాలను త్రాగించెనుగ  ఆ విషయము నమ్మనివారి ఆగ్రహమునకు దండన తోడాయెగ  పరమాత్మలో పదిలముకాగా  పరమాద్భుతమె జరిగెగ  ప్రమథ గణములలో చేరగ పట్టిన పాలే కారణమాయెగ  చిత్రముగాక ఏమిటిదిచిదానందుని లీలలు గాక  చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక. 

CHIDAANAMDAROOPAA-NAESA NAAYANAARU

Image
 చిదానందరూపా-నేశ నాయనారు  **************************  కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా  కలవరమనుకొందునా  కటాక్షించిన వరమనుకొందునా  భక్తియను పగ్గమువీడని కాంపిలి మగ్గపు నేతగాడు నేశ  పంచల చాపునునేయుచున్నను పంచాక్షరియే అతని శ్వాస  భక్తి-కర్మ-జ్ఞాన-రాజ యోగముల నిలయము ఆతని దేహము  భగవంతునిచేరగ దారిని చూపెను ఆతని జపము  భక్తుల గౌరవించు, వస్త్ర సమర్పణము భాగ్యముగా భావించు  సుకృతమేమో గాని సుందరారు కీర్తనలలో భాసించు  ప్రతిఫలమును కోరని పవిత్ర జీవనము పరిణితి పొందగా  పరమేశుని చేరగ,పంచిన పంచెలె కారణమాయెగా  చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక  చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చు గాక.

CHIDAANAMDAROOPAA- NARASINGA MUNAI NAAYANAARU.

Image
 చిదానందరూపా-నరసింగ మునై నాయనారు  ************************************  కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా  కలవరమనుకొందునా  కటాక్షించిన వరమనుకొందునా  నరసింగ మానై నాయనారు తిరుమానైపాడి ముఖ్యాధికారి  పరమ పవిత్రులైన శివభక్తుల ఉపకారి  ఎదురయిన భక్తులకు సాదర మర్యాదలతో పాటుగ  వంద బంగారు నాణెములను ఆనందముగా దక్షిణనిచ్చు  సాక్షాత్తు శివుడు దక్షిణ తాంబూలములను స్వీకరింప  ప్రత్యక్షమయినాడు నాయనారు ముందు శివ భక్తునిగ  సహనము-సంస్కారము సర్వేశ్వరుని తెలియచేసినదిగ  దక్షిణామూర్తి కరుణను పొందగ దక్షిణలే కారణమాయెగ  చిత్రముగాక  ఏమిటిది చిదానందుని లీలలు గాక  చిత్తము చేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక.

CHIDAANAMDAROOPAA-KANNAPPA NAAYANAARU

Image
  చిదానంద రూపా-కన్నప్ప నాయనారు   *******************************  కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా  కలవరమనుకొందునా  కటాక్షించిన వరమనుకొందునా  ఎనలేని  భక్తిని చాతగ అర్జునుడు ఎరుకలవానిగ పుట్టెగ  ఎలమిని తిన్నడుగ శ్రీ కాళహస్తీశ్వరుని పాదము పట్టగ  బోయ దంపతులు నాగడు-దత్త యోగఫలముగ  నాయము తప్పని వేటగాడు ఆ తిన్నడుగ  నందివాహనుని కరుణను డెందము భక్తిమరందమాయెగ  పొందగ  దండిగ  చిందిన రక్తపు కన్నుల కరుణను  తన కన్నులను మందుగ  సామికి అందించెనుగ  తిన్నడు  కన్నప్పగ మారగ కళ్ళను ఇచ్చుట కారణమాయెగ  చిత్రముగాక  ఏమిటిది  చిదానందుని లీలలు గాక  చిత్తముచేయు  శివోహం  జపంబు చింతలు తీర్చును గాక.

CHIDAANAMDAROOPAA- KULACHIRAAYA NAAYANAARU

Image
  చిదానందరూపా-కులచిరాయ నాయనారు   *********************************  కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా  కలవరమనుకొందునా  కటాక్షించిన  వరమనుకొందునా  "మనమేర్కుడి" గ్రామపెద్ద శివభక్తుడు కులచిరాయ   అనవరతము వినపడును అతనినోట " నమః శివాయ"   కులమత భేదమును మరచి శివకులమొకటే అని అను   చిన్న-పెద్ద తేడాలు  చిన్నబుచ్చుట అతడు ఎరుగడు   మంత్రి పదవి వరించెను శివభక్తిని  వ్యాపించగ   జ్ఞాన సంబంధరును తెప్పించెను  రాజుకన్ను తెరిపించగ   స్వచ్చత నిండిన మనము స్వచ్ఛంద శివమయమాయెగ   సద్గతినొందగ ఇతరులకు సన్మార్గము చూపుట కారణమాయెగ   చిత్రముగాక  ఏమిటిది  చిదానందుని లీలలు గాక   చిత్తముచేయు  శివోహం జపంబు చింతలు తీర్చును గాక.