Posts

CHIDAANAMDAROOPAA-KINNARI BRAHMAYYA.

Image
 చిదానందరూపా- కిన్నరి  బ్రహ్మయ్య  *****************************  కలయనుకొందునా  నిటలాక్షుడు  కలడనుకొందునా  కలవరమనుకొందునా  కటాక్షించిన వరమనుకొందునా  కిన్నరి మీటుతు పరవశించు త్రిపురాంతక భక్తుడు బ్రహ్మయ  శివ చర్చలసార మరందమందుకొన అట చేరును బసవయ  త్రిపురాంతక సేవలో నున్నవేళ ఆతనిని శరణన్నది ఒక చిన్నిగొర్రె  ప్రత్యర్థికి గొర్రెకు బదులుగ వేయి మాడల పరిహారము నీయగ  కాదని గొర్రెకై బ్రహ్మయను వధింపగ పూనుకొనియె  శరణాగత రక్షణ చేయగ  శత్రువు శిరమును  తీసివేసె  న్యాయము చేయగ  విచారణ జరుపు సమయమున  సాయపు  సాక్ష్యము  శివుడు చెప్పుట కారణమాయెగ  చిత్రముగాక  ఏమిటిది చిదానందుని  లీలలు గాక  చిత్తముచేయు  శివోహం జపంబు  చింతలు  తీర్చును గాక.

CHIDAANAMDAROOPAA-HARALAYYA-KALYAANAMMA

Image
 చిదానందరూపా-హరలయ్య-కళ్యాణమ్మ  ********************************  కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా  కలవరమనుకొందునా  కటాక్షించిన  వరమనుకొందునా  కళ్యాణ నగరములోని లింగాయతనులు హరలయ్య-కళ్యాణమ్మ  చెప్పులు కుట్టుచు భుక్తికి  చెదరనిభక్తితో నుండువారు  బసవడు వారికడ బసచేయుట గుసగుసలాయెగ  గురువుకు శరణము చెప్పిన శరణార్థికి శరణని పలికెగ  తమవంతుగ తొడచర్మములతో శివునకు  చెప్పులు కుట్టిరి  కను ఇంపగు చెప్పులు మంత్రిని శివభక్తునిగా మార్చినవి  హరలయ్య-కళ్యాణమ్మ హర్షముతో హరునే చేరగ  శరణపు ఘోష వారి భవతరణమునకు కారణమాయెగ  చిత్రముగాక  ఏమిటిది  చిదానందుని  లీలలు గాక  చిత్తముచేయు  శివోహం జపంబు  చింతలు తీర్చును గాక. కళ్యాణ నగరములో హరలప్ప-కళ్యణమ్మ పుణ్యదంపతులు.చెప్పులు కుట్టి జీవము సాగించుచు,శివ ధ్యానముతో గడిపెడివారు.వారి పవిత్రతను గుర్తించి,ఒక్సారి బసవడు వారి గృహమున దేవతార్చన చేసి,ప్రసాదమును స్వీకరించెను.చాందసులు దీనిని ఖండించిరి.గురుభక్తి సూచకముగా తమ చర్మమును ఒలిచి చెప్ప...

CHIDAANAMDAROOPAA-BAANABHADRUDU.

Image
 చిదానందరూపా-బాణ భద్రుడు  ********************************  కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా  కలవరమనుకొందునా  కటాక్షించిన వరమనుకొందునా  మీనాక్షి-సుందరేశ్వర  మధుర నివాసి బాణ భద్రుడు  సుందరత్వముతో కూడిన మథుర కీర్తనా శివభక్తుడు  సంగీతముతో పరమాద్భుతములే చేసెను హేమనాథ భాగవతారు  అంగరంగ వైభవకీర్తికి ఆశగ అరుదెంచెను పాండ్యదేశము  రాజసభావము నిండిన మదితో రాజ్యములె పందెము వేసెను  యోగముగా బాణభడ్రుడు పోటిచేయగ నియమితుడాయెగ  గట్టెంకించగ భక్తుని కట్టెలమ్ము వానిగ స్వామి కదిలెగ  పట్టిన పాద సన్నిధి చేరగ సంకీర్తనలే కారణమాయెగ  చిత్రముగాక  ఏమిటిది చిదానందుని లీలలు గాక  చిత్తముచేయు  శివోహం జపంబు చింతలు తీర్చును గాక.  మీనాక్షి-సుందరేశ్వర విరాజితమైన మధుర క్షేత్రములో పాండ్యరాజుల కాలమున సంగీత సాహిత్య నృత్యములకు ఆలవాలమై అప్రతిహతముగా అలరారుచుండెడిది.ఆ నగరములో అననవరతము ఆ సుందరేశుని తన అంతరంగముననిలుపుకొని కీర్తనలను స్వయముగా వ్రాయుచు,భక్తి పరవశముతో కీర్తించుచుండెడి వాడు బాణభద్రుడు.అతనిసమకాల...

CHIDAANAMDAROOPAA-MADIVALA MAACHAYYA

Image
 చిదానందరూపా-మడివల మాచయ్య  *****************************  కలయనుకొందునా  నిటలాక్షుడు  కలడనుకొందునా  కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా  పర్వతప్ప-సుజ్ఞానుల సుకృతపు సుపుత్రుడు  శరణు సాహిత్యపు సంరక్షకుడు  మడివల మాచయ్య  శిల శిష్యుడుయైన వేళ  శిల్పి గురువుయే కద  తన గురువు బసవేశ్వరునికి తాను పాద సేవకుడు  ఇష్టలింగము  గురించి మలయ చంద్రయ్యకు బోధించెను  ఇష్టముగా బట్టలనుతికి ఈశ్వర భక్తులకు అందించెను  మడిమూటను తాకినవానిని హతమార్చెను  వీర గణాచారిగ  మరల బ్రతికించుతకు మహేశ్వరుని మహిమలె కారణమాయెగ  చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక  చిత్తముచేయు  శివోహం  జపంబు చింతలు తీర్చును గాక.

CHIDAANAMDAROOPAA-IDANGAL NAAYANAARU

Image
 చిదానందరూపా-ఇదంగళి నాయనారు  *******************************  కలయనుకొందునా  నిటలాక్షుడు  కలడనుకొందునా  కలవరమనుకొందునా  కటాక్షించిన వరమనుకొమునా  అగస్త్యకుల వంశజుడు ఇదంగళ్ ఈశ్వరభక్తుడు  శైవాగమ విధులను సంతసముగ సలిపెడివాడు  ఆ లయకారుని  ఆలయ విధులలో సహాయకారి  ఆకలిగొన్నవారిని  సంతృప్తులచేసెటి ఆత్మయోగి  అన్నదానమునుచేయగ ధాన్యపు కొరతను తీర్చుకొనగ  రాజ ధాన్యాగారపు దొంగ సంగతి తను తెలిసికొని  చాటింపే వేయించెను తన సంపదనంతయు పంచగ  పరమేశుని తను చేరగ పంచిన సంపద కారణమాయెగ  చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక  చిత్తముచేయు  శివోహం జపంబు చింతలు తీర్చును గాక.

CHIDAANAMDAROOPAA-GOEDAGOOCHI

Image
 చిదానందరూపా-గోడగూచి  *********************  కలయనుకొందునా  నిటలాక్షుడు  కలడనుకొందునా  కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా  తలితండ్రుల ఆనతిగాన  తరియింపగ తాను  కమ్మని ఆవుపాలు నైవేద్యము సేయగ తరలెను  కొండను వెలిసిన శివునికి బొజ్జనింపగ ఇంపుగ  మెండగు భక్తి తోడ  గోడగూచి నిష్కళంకముగ  అతివాస్తవికతతో స్వామికి ఆవుపాలను త్రాగించెనుగ  ఆ విషయము నమ్మనివారి ఆగ్రహమునకు దండన తోడాయెగ  పరమాత్మలో పదిలముకాగా  పరమాద్భుతమె జరిగెగ  ప్రమథ గణములలో చేరగ పట్టిన పాలే కారణమాయెగ  చిత్రముగాక ఏమిటిదిచిదానందుని లీలలు గాక  చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక. 

CHIDAANAMDAROOPAA-NAESA NAAYANAARU

Image
 చిదానందరూపా-నేశ నాయనారు  **************************  కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా  కలవరమనుకొందునా  కటాక్షించిన వరమనుకొందునా  భక్తియను పగ్గమువీడని కాంపిలి మగ్గపు నేతగాడు నేశ  పంచల చాపునునేయుచున్నను పంచాక్షరియే అతని శ్వాస  భక్తి-కర్మ-జ్ఞాన-రాజ యోగముల నిలయము ఆతని దేహము  భగవంతునిచేరగ దారిని చూపెను ఆతని జపము  భక్తుల గౌరవించు, వస్త్ర సమర్పణము భాగ్యముగా భావించు  సుకృతమేమో గాని సుందరారు కీర్తనలలో భాసించు  ప్రతిఫలమును కోరని పవిత్ర జీవనము పరిణితి పొందగా  పరమేశుని చేరగ,పంచిన పంచెలె కారణమాయెగా  చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక  చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చు గాక.