Posts

TIRUPPAAVAI-05

Image
మాయనై మన్ను వడ మదురై మైందనై తూయ పెరునీర్ యమునైత్ తుఱైవనై ఆయర్ కులత్తినిల్ తోండ్రుం అణివిళక్కై తాయైక్కుడల్ విళక్కం శెయద దామోదరనై తూయోమాయ్ వందు నాం తూ మలర్ తూవిత్తొళుదు వాయినాల్ పాడి మనత్తినాల్ శిందిక్క పోయ పిళయుం పూగుదురువాన్ నిన్ఱనవుం తీయనిల్ తూశాగుం శెప్పేలో రెంబావాయ్ ఓం నమో నారాయణాయ-5 ************************ విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది విష్ణుచిత్తీయమై శ్రీహరి నామ సంకీర్తనమే కోరుతోంది పాలుతాగినంతనే పూతన పాపాలు పరిహారమైన మురిపాల బాలగోపాలుని మేలుకొలుపులలో యశోదమ్మ పున్నెమేమో తనకుతాను కట్టుబడిన వాడైన మన్నుతిన్న వాడన్న దామోదర రూపములో వ్యత్యస్త పాదారవిందములతో కాళియమర్దనమైన ప్రస్తుతించి పులకించిన పశుపక్షి గణములలో మధుర నిర్వాహకుడు మన వ్రతనాయకుడైన ఆగామి సంచిత హరుని ఆగమ స్తుతులలో తెల్లవార వచ్చెనమ్మ చెలులారా! రారె తెల్లబరచగ భక్తిపూల మాలలతో నేడె భావము పాలుతాగి,పూతన పాపాలను తొలగించిన నల్లనయ్య మేలుకొలుపులలో,అమ్మకు పదునాలుగు లోకములు చూపించి,తనకు తానుగా దొరికి యశోదచే రోటికి కట్టబడిన దామోదరునిలో,( పొట్ట మీద తాటిగుర్తు కలవాడు),కాళియ మర్దనముతో ప...

TIRUPPAAVAI-06

పుళ్ళుం శిలంబినకాణ్ పుళ్ళరైయన్ కోయిలల్ వెళ్ళై విళి శంగన్ పేరరవం కేట్టిలైయో పిళ్ళాయ్ఎళుందిరాయ్  పేయ్ములై నంజుండు కళ్ళాచ్చగడం కలక్కళియక్కాలోచ్చి వెళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై ఉళ్ళత్తుకొండు మునివర్గళుం యోగిగళుం మెళ్ళ ఎజుంద్ అరి ఎన్న పేరరవం ఉళ్ళం పుగుందు కుళిరుంద్ ఏలో రెంబావాయ్. ఓం నమో నారాయణాయ-6 ************************* విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది విష్ణుచిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది నాయందే కలడనుకొనుచు బృందావన వాసుడైన గోవిందుని అనుగమించు గొల్లెతల పెడకొప్పులలో వేదవేదాంత వేద్యుని వేణుగాన పరవశులైన యమునా రాస విహార రమణుల కుడిపైటలలో మధురానగర విహారి మధుర గంభీర ధ్వనియైన శంఖధ్వనితో కూడిన మోగిన జేగంటలలో ఆ మాయావి ఏమిచేసెనో శతక్రతు సమానమైన వ్రత వైభవమును మరచి నిదురించుచున్న గోపికలో తెల్లవార వచ్చెనమ్మ చెలులారా రారె తెల్లబరచగ భక్తిపూల మాలలతో నేడె భావము పదిమందికి స్వామి అనుగ్రహమును పంచదలచి,గొల్లెతగా కుడిపైట-పెడకొప్పు ధరించి,శంఖధ్వనిని వినమని,వ్రతము మరచి నిదురించుచున్న గోపికను జేగంట వినపడుచున్నది కనుక నిద్రలెమ్మ...

TIRUPPAAVAI-07

కీశు కీశెన్రెగుం మానై  చత్తాన్ కలందు పేశిన పేచ్చరవం కేట్టిరయ్యో పేయ్పెణ్ణే కాశుం పెఱప్పుం కలకల్ప్పైకె పేర్తు వాశ నఱుం కుజలాయిచ్చయర్ మత్తినాల్ ఓశై పడుత్త తయిర రవం కేట్టిలైయో నాయగ పెణ్ పిళ్ళాయ్ నారాయణ మూర్తి కేశవునై పాడవుం నీ కేట్టే కిడత్తియో తేశ ముడైయాడ్ తిఱన్వేలో  రెంబావాయ్ ఓం నమో నారాయణాయ-7 విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది విష్ణుచిత్తీయమై శ్రీహరి నామ సంకీర్తనమే కోరుతోంది భరధ్వాజ పక్షులకు భగత్చింతన యైన ఖగరాజ వాహనుని సుప్రభాత సేవలలో ముద్దరాలు ఈమె అని నిద్దురలేపుచున్నదైన ప్రేమ పూరితమగు "పిచ్చి పిల్లా " అను పిలుపులో నవ మన్మథుని మించిన నగధర రూపమైన అగణిత గుణగణుని కొలుచు అగరు ధూప పరిమళములో రేపల్లెలో గొల్లెతలు చల్ల చిలుకు వేళయైన నల్లనయ్యను పిలుచు కవ్వపు సవ్వడులలో తెల్లవర వచ్చెనమ్మ చెలులారా రారె తెల్ల బరచగ భక్తిపూల మాలలతో నేడె. భావము పుణ్యాల పంటైన భరధ్వాజ పక్షుల కిచకిచలలోను,ఆండాళ్ తల్లి గోపికను ప్రేమతో పిలిచిన "పిచ్చిపిల్ల" అను పిలుపులోను,స్వామి కైంకర్యములో ధన్యమగు చున్న అగరుధూపముల లోను,గొల్లెతల కవ్వపు శబ్దములలోను ని...

TIRUPPAAVAI-08

Image
కీళ్ వానం వెళ్ళెన్రు ఎరుమై శిఱువీడు మేయ్వాన్ పరందన కాణ్ మిక్కుళ్ళ పిళ్ళైగళుం పోవాన్ పోగిన్రారై ప్పోగామల్ కాత్తు ఉన్నై క్కూవువాన్ వందు నిన్న్రోం కోదుకుల ముడైయ పావాయ్ ఎళుందిరాయ్ పాడిప్పఱైకొండు మావాయ్ పిళందానై మల్లరై మాట్టియ దేవాది దేవనై చెన్రురాం శేవిత్తాల్ ఆవా వెన్రా రాయుందరుళ్ ఏలో రెంబావాయ్ ఓం నమో నారాయణాయ-8 విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది విష్ణుచిత్తీయమై శ్రీహరి నామసంకీర్తనమే కోరుతోంది వేణుగానలోలునినయన భానూదయ ప్రసాదమైన లేగ దూడలు మేయుచున్న లేలేత చిగురు పచ్చికలో రేపల్లెలలో రేయి-పవలు గోవింద రూపములైన గోపాలుర-గొల్లెతల పావై-పామర భాషలలో చందన చర్చిత ధారి చదరంగపు పావులమైన ఇదిగో! అని ఇస్తున్న "పఱి" అను పురుషార్థములో పదిమందికి పంచగలుగు పారమార్థికమైన భువనమోహనుని కొలుచు బుద్ధి పాశురములలో తెల్లవార వచ్చెనమ్మ చెలులారా రారె తెల్లబరచగ భక్తిపూల మాలలతో నేడె. భావము ఉదయముననే లేత పచ్చిక తినుచున్న లేగ దూడలలో,రేపల్లె వాసుల పండిత-పామర భాషలలో,స్వామి అనుగ్రహించబోతున్న పఱి అను వాయిద్యములో,పదిమందితో కలిసి జరుపుకునే పరమ పావనమైన పెరుమాళ్ సేవతెలుపు బుద్ధి...

TIRUPPAAVAI-09

తూమణి మాడత్తుచ్చుత్తం విళక్కెరియ తూపం కమళత్తుయిలణైమేల్ కణ్వళరుం మామాన్ మగళే! మణిక్కదవం తాళ్తిరవాయ్ మామీర్! అవళై ఎజుప్పీరో ఉన్మగళ్ తాన్ ఊమైయో అన్రి చెవిదో అనందలో ఏమపెర్రుందుయిల్ మందిరప్పట్టాళో మామాయన్ మాధవన్ వైగుండన్ ఎన్రెన్రు నామం పలవుం నవిన్ర ఏలో రెంబావాయ్ . ఓం నమో నారాయణాయ-9 విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది విష్ణుచిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది వేద సం రక్షణార్థము " వేదాంతవేద్యుడైన" జలచరమై జయమొసగిన "మత్స్యావతారములో" "ధర్మ సంస్థాపనకు" క్షీరసాగర మథనమైన ఉభయచరమై ఉద్ధరించిన " శ్రీకూర్మావతారములో" " పరమపునీత భూమాత" అసురహస్తగతమైన అమ్మను రక్షించిన " ఆదివరాహరూపములో" "దశేంద్రియములు మేల్కొలుపు" దశావతారములైన వివిధరూపములు ధరించిన " విరాట్రూపములో" తెల్లవార వచ్చెనమ్మ చెలులారా రారె తెల్లబరచగ భక్తిపూల మాలలతో నేడె. భావము పరిశుద్ధమైన మణిసదనములో ఆదమరచి నిదురించుచున్న గోపిక స్వామిసేవకు సిద్ధముకాలేదని,పిలుచుచున్నను మేల్కొనుటలేదని,అమె పక్కనున్న తల్లిని మే...

TIRUPPAAVAI-10

నోత్తుచువర్గం పుగుగిన్ర అమ్మనాయ్ మాత్తముం తారారో వాశల్ తిఱవాదార్ నాత్తత్తుళాయ్ ముడి నారాయణన్ నమ్మాళ్ పోత్తపఱై తరుం పుణ్ణియనాల్ పండొరునాళ్ కూత్తత్తిన్ వాయ్ వీళంద కుంబకరణనుం తోత్తుం ఉనక్కే పెరుందుయిల్ తాన్ తందానో ఆత్త అనందలుడయాయ్ అరుంకలమే తేత్తమాయ్ వందుతిఱ ఏలో రెంబావాయ్ ఓం నమో నారాయణాయ-10 విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది విష్ణుచిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది ప్రభువుల,పడతుల,ద్విజుల కర్తవ్యపాలనమైన నెలకు, ఆరక కురియుచున్న మూడు వానలలో బురద అంటనీయని వైరాగ్యపు భాష్యమైన "మణి కైరవ" దిగుడుబావి విరబూసిన తామరలలో పూర్వ పుణ్యఫలముగా యోగ తాదాత్మ్యమైన అంభోరుహనేత్రి పోవుచున్న కుంభకర్ణుని నిద్రలో 'ఉడైయార్ ఆరుఙ్ లమే"అని అగస్త్యుని తలపించినదైన అమ్మ కీర్తించుచున్న ఆ ఆభరణపు పాశురములో తెల్లవార వచ్చెనమ్మ చెలులారా రారె తెల్లబరచగ భక్తిపూల మాలలతో నేడె. భావము. మాయ తెరను తొలగించుకొని,మాధవ సరస భావనలో నున్న గోపికను,తలుపును (మాయతెర) దాటలేని గోపికలు,స్వామిని సేవించుటకు నిదురను చాలించి తమతో రమ్మనుచున్నారు.కుంభకర్ణుని గెలిచి,అతన...

TIRUPPAAVAI-11

కత్తు కఱవై కణంగళ్ పలకఱందు శెత్తాల్ తిఱల్ అరయ చెన్రు శెరుచ్చెయుం కుత్తం ఒన్రిల్లాద కోవలర్ దం పొఱ్కొడియె పుత్తరవల్ గుల్ పునమయిలే పోదరాయ్ శుత్తత్తుత్తోరిమార్ ఎల్లారుం వందు నిన్ ముత్తం పుగుందు ముగిల్ వణ్ణన్ పేర్పాడ శిత్తాదే పేశాదే శెల్వ పెణ్డాట్టి నీ ఎత్తుక్కుఱగుం పొరుళ్ ఏలో రెంబావాయ్. ఓం నమో నారాయణాయ-11 విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది విష్ణుచిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది " మాధవ కణంగల్" అనబడు సాధురూపములైన అరిషడ్వర్గములంటని సురభుల గోష్ఠములో అస్ఖలిత బ్రహ్మమునకు అనిశము శిరోధార్యమైన అస్ఖలిత బ్రహ్మచారి ఆ బర్హి పింఛములో "సెండ్రుం-సెరుం-సెయ్యం" అంటు అతిపరాక్రమములైన అరి సం హారముచేయు బుద్ధికుశలతలో పుట్టలోపల చుట్టినదేహముతో పడగ విప్పినదైన పుట్టినింటి గౌరవమును పెంచు ఆ " బంగరు మొలకలో" తెల్లవార వచ్చెనమ్మ చెలులారా రారె తెల్ల బరచగ భక్తిపూల మాలలతో నేడె. భావము లెక్కపెట్టలేనన్ని సద్గుణముల ప్రోవులైన గోగణములున్న గోశాలలలోను,ప్రశాంత ప్రసన్న సౌందర్యమైన నెమలి లోను,దుష్టత్వమను శత్రువును గుర్తించి,తనకు తానుగా ...