Posts

SAUNDARYA LAHARI-77

Image
సౌందర్య లహరి పరమ పావనమైన నీ పాదరజ కణము పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము మంచి పనులు చేయుచున్న ఇంద్రియములు ఐదు వానికి సంకేతములు ఇచ్చుచున్న ఇంద్రియములు ఐదు సప్త ధాతువులు మనసు ఎనిమిది కలిసి అష్టాదశ పీఠముల నా హృదయ మందిరము నిశ్చల భక్తిని నిన్ను గొలువ నిష్ఠను చేరినదమ్మా మనో వాక్కాయ కర్మలు అను ముగ్గురు మిత్రులతో ఏమని వర్ణించను ఏ నోము ఫలితమో ఇది నా శరీరము పావన శక్తి పీఠముగా మారుచున్న వేళ నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా మానస విహారి ఓ సౌందర్య లహరి. భావము నా మనసనే తోటలో విహరించుచున్న తల్లీ.చెవి,కన్ను,ముక్కు,నాలుక, చర్మము అను జ్ఞానేంద్రియములు,పాణి,పాద,పాయు ,ఉపస్థ,వాక్కు అను ఐదు కర్మేంద్రియములు,రస,రక్త,మాంస, మేధ,అస్థి,నుజ్జు,శుక్ర అను ఏడు ధాతువులు,మనసు కలిసి ఎనిమిది ఉన్న నా హృదయము ,మనస్సు,మాట,పని అను ముగ్గురు మిత్రులతో నిన్ను సేవించ నిష్ఠను చేరుటకు బయలు దేరినది.నా శరీరము పావన శక్తి పీఠముగా మారుటకు ప్రయత్నించుట ఎంతటి అదృష్టము.ఈ శుభ సమయములో నీ చెంతనే నున్న నా వేలిని విడిచి పెట్టకమ్మా.అనేక వందనములు.

SAUNDARYA LAHARI-76

సౌందర్య లహరి- తెప్పోత్సవము-70 పరమ పావనమైన నీ పాదరజ కణము పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము భయ నివారణమైన అభయహస్తపు ముద్ర వర ప్రదాయకమైన వరద హస్తపు ముద్ర నీ మూర్తిలో కానరాకున్న యేమి? కామితార్థములన్ని నీ కాలి ధూళి ఈయగ నీ చేతిలో ముద్రలు చేరుట సాహసమేగ నేను అగాథ జలధి మునిగిన నీ అవ్యాజ కరుణ  భక్తి కర్మనధిగమించి భవతారకమగురీతిగ ఉప్పొంగుచు సాగుచున్న తెప్పోత్సవమైన వేళ నీ మ్రోలనేనున్న నా కేలు విడనాడకమ్మా,నా మానస విహారి ఓ సౌందర్య లహరి భావము నా మనసనే తోటలో విహరించుచున్న తల్లీ.నీ పావన పాదధూళికణము అభయములు,వరములు ఇచ్చుచున్న సమయములో నీ చేతులలో అభయ ముద్రను,వరద ముద్రను ధరించవలసిన పని ఏమి?   అసుర సంహారము చేసి ఆదిశక్తి అలిసిపోయిన వేళ,ఆహ్లాదమును కలిగించుటకు ఆనందముతో భక్తులు ఆమ్మను పిలిచి,అమ్మతో కలిసి సర్వాలంకృతమైన తెప్పలో పుష్కరిణిలో చేసే ఉత్సవమే తెప్పోత్సవము.ఆ తెప్ప హంస వలెనున్నది.ఉండుటకాదు అది నిజముగా జ్ఞాన ప్రతీకయైన హంస.ఆ తెప్పకు సరంగు జగన్మాత.కనుక అలల అలజడి దానికి లేదు.భక్తి మునకలు తెడ్డులై నడుపుచున్నవి.భవబంధములు ఆ తెప్పను పట్టుకొనలేవు.జీవులను జన్మలను రేవుల నుండి జన్మరాహిత్యమునకు ...

SAUNDARYA LAHARI-SRNKHALAADEVI-75

 సౌందర్యలహరి-శృంఖలాదేవి-75  పరమపావనమైన నీపాద రజకణము  పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము  దూర్వాసుడు  పరీక్షించె  రుక్మిణీ-వాసుదేవులను  పర్యవసానమే వారికి ద్వారక బహిష్కరణము  తల్లి ప్రద్యుమ్నుని ప్రసవించె-నడికట్టుతో కనిపించె  సంకెల నడుముకు ఉన్న శృంఖలదేవిగ తోచె  వంగదేశమపుడు పొందె  ప్రద్యుమ్నుని  నామము  ఋష్యశృంగముని అచట అయినాడొక పర్వతము  మాయాసతి  ఉదరమే  మహిమాన్వితమూర్తిగ  శృంఖలాదేవి మా సంకెలను తెంచువేళ  నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా  మానస విహారి ! ఓ సౌందర్య లహరి.   " ప్రద్యుమ్నే వంగరాజ్యాయాం శృంఖల నామ భూషితే     విశ్వ విమోహితే దేవి శృంఖల బంధనాశిని"    వంగదేశములోని  ప్రద్యుమ్న నగరములో పడిన మాయా సతి పొట్ట భాగము "శృంఖలాదేవి" గా ఆరాధింపబడుతున్నడి.ఈ తల్లిని" శృంగలాదేవి","సింహళాదేవి" అని కూడా ఆరాధిస్తారు.   సింహళ అనే శబ్దమునకు సంకెల -బాలెంత నడుము కట్టు అని కూడా వ్యవహారములో ఉంది.స్థలపురాణము ప్రకారము ఈ ప్రదేశములో ఋష్యశృంగ మహాముని అమ్మ...

SAUNDARYA LAHARI-KAAMAAKSHI-74

  సౌందర్య లహరి-కామాక్షి-73   పరమపావనమైన నీ పాదరజకణము   పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము   చూత వృక్షముక్రింద  సైకతలింగమును ఉంచి   చంద్రచూడుని ప్రార్థించె,తనను పెండ్లాడమనె   అనవరతము  ప్రణవమే  ఆ భుజము మీది చిలుక   అమాసలేని పున్నములే  ఆ అనందిలభట్టుకిక  " క" కారమే సృష్టిగా-"మ" కారము స్థితి తత్త్వముగా    మాయాసతి వీపు ఎంతో మహిమాన్విత మూర్తిగా    పంచభూతాత్మికమైన  ఆ కాంచీ పట్టణములోన    ఏకామ్రేశ్వరునితో-కామాక్షి,మమ్మేలుచున్న వేళ    నీ మ్రోలనే  నున్న నా కేలు విడనాడకమ్మా,నా    మానస విహారి  ఓ సౌందర్య లహరి.  "అయోధ్యా మధురా మాయా కాశి కాంచి అవంతికా" అను భారత దేశములోగల సప్త మోక్ష పురములలో ఒకటి   అమ్మవారు సైకత లింగ పరమేశ్వరుని మామిడిచెట్టుక్రింద నిలిపి, తపమాచరించి పతిగా పొందినది.పంచభూతాత్మిక క్షేత్రముగా ప్రసిద్ధిచెందినది కంచీపురము." క" కారము సృష్టికి" మ" కారము పోషణకు ప్రతీకలుగా గుర్తిస్తారు.కామాక్షి విలాసము అను గ్రంధము ప్రకారము అమ్మ శక్తిని మన్మథుని యం...

SAUNDARYA-SAANKARI-73

     సౌందర్య లహరి-శాంకరీదేవి-72  పరమపావనమైన నీ పాదరజకణము  పతిత పాలకమైన  పరమాత్మ  స్వరూపము  ఆది దంపతుల లీలయనగ అద్భుత సుందరభవనము  విస్తుబోవచేసె రావణుని విశ్వకర్మ నిర్మితము  బ్రహ్మగా మారి కోరె,దక్షిణగ దక్షిణ కైలాసము  అంబాసమేతముగా,షరతుతో అనుగ్రహించిరి కరుణను  ధర్మమునకు గ్లానియైన ధ్వంసము తప్పదని  పుడమి పుణ్యక్షేత్రమైన లంకా ద్వీపములో  మాయాసతి మొలభాగము మహిమాన్వితమూర్తిగ  శాంకరియై త్రికోణేశునితో కింకరులను బ్రోచువేళ  నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా  మానస విహారి! ఓ సౌందర్య లహరి.  సంస్కృతములో లంక అంటే భవ్యమైనది,లంక అంటే తేజస్సుగల భూమి/ద్వీపము.శ్రీలంక జలావృత భూభాగము.దైవ మహిమచే భూమి పవిత్రతను సంతరించుకొని క్షేత్రముగా భాసిల్లుతుంది.దైవానుగ్రహముతో పుణ్యక్షేత్రమవుతుంది.ఈశ్వర సంకల్పముగా భవాని ఒక అందమైన భవనమును దక్షిణ భూభాగములో నిర్మింపహేయమని నాథుని కోరగా,సదాశివుడు విశ్వ కర్మచే లంకలో నిర్మింపచేసెను.దేవతలు విశ్వకర్మ,రాక్షసులకు మయుడు నిర్మించేవారు.గృహప్రవేశపూజను నిర్వహించిన రావణబ...

SAUNDARYA LAHARI-72

 సౌందర్య లహరి-రాజేరాజేశ్వరి   పరమపావనమైన నీపాద రజకణము   పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము   ఇచ్చా-క్రియా-జ్ఞాన  శక్తుల అనుగ్రహదాయిని   అష్టసిద్ధులను అనుగ్రహించు సిద్ధిదాత్రివి నీవు   అంబా తత్త్వము వెల్లివిరియ ఆనందదాయిని   రాజాధిరాజులను రక్షించే ఈశ్వరివి నీవు   రజో-తమో-సత్వ భక్తిని మించినదైన పరాభక్తితో   రాగాతీత ఉపాసనను ఉత్కృష్టము చేయుచు   తేజోమయమైన  నీ రాజరాజేశ్వరి  రూపము   అపరాజితగా నాలో విరాజమానమగుచున్నవేళ   నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా   మానస విహారి! ఓ సౌందర్య లహరి  "పాహిమాం శ్రీ రాజరాజేశ్వరి-కృపాకరి శంకరి,పాహిమాం"  కోరి వచ్చిన వారికెల్లను కోర్కెలొసగె బిరుదు గల తల్లి రాజరాజేశ్వరి. " ఐశ్వర్య ప్రదాయినికనుక తల్లిని ఈశ్వరి అని కీర్తిస్తారు.సర్వ సమృద్ధియే ఐశ్వర్యము.ఐశ్వర్యము ఎనిమిది రూపములలో చెప్పబడినది.(అష్ట-ఐశ్వర్యములు.) అవి,   1.రాజ్యము-2.ధనము-3.ఇల్లాలు-4.పిల్లలు-5.ధైర్యము-6.స్థైర్యము-7.విద్య-8.వినయము.(మణి మాణిక్యముల...

SAUNDARYA LAHARI-71

Image
 సౌందర్య లహరి-మహిషాసుర మర్దిని  పరమపావనమైన నీ పాదరజ కణము  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము  మధుకైటభులను సంహరించితివి మాధవ సోదరి  భండాసురుని వధించి భువన భాండము రక్షించితివి  రక్తబీజుని అంతమొందించిన శక్తిస్వరూపిణివి  విషంగ విశుక్రులం విషమును అరికట్టితివి  మహిషాసురుని మర్దించిన మహిమాన్వితవి  అవనీ పాలనకై ఎన్నో అవతారములెత్తితివి  అంతః-బహిర్ముఖములలో  చింతలను కలిగించు  అసుర సంహారమే నీకు అమితానందమైన వేళ  నీ మ్రోలనేనున్న నా కేలు విడనాడకమ్మా,నా  మానస విహారి ఓ సౌందర్య లహరి.  " జయజయహే మహిషాసుర మర్దిని"  పై వాక్యములో ధర్మమునకు ప్రతిరూపమైన అమ్మవారు-అధర్మమే ఊపిరి యైన రంబ పుత్రుడు మహిషుడు ,ధర్మమునకు లభించిన జయము దాగియున్నవి.   సకలదేవతా శక్తుల సమాహారమునకు-సకల దేవతలు అనుగ్రహించిన ఆయుధములు తోడై'రిపవోపి శస్త్రపూతా" (తల్లి ఆయుధముల స్పర్శ వలన శత్రువులు పునీతులగుదురు)  అన్నట్లు మహిషాసుర సంహారమునందు ఆయుధము-వాహనము అరివీర భయంకరములైనవి.  1.ఆయుధము.    మహిషునిలోని అజ్ఞానము అను చీక...