Posts

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

Image
వందనం =========== అంబ వందనం  జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి    వందనం. పారిజాత అర్చనల  పాదములకు వందనం పాపనాశిని పావని  పార్వతి   వందనం. గులాబీలు గుబాళించు  గుల్భములకు వందనం గణపూజిత గుణాతిశయ  గౌరి   వందనం. ముద్దు గణపయ్య  కూర్చున్న  ఊరువులకు వందనం ఎద్దునెక్కు శివునిరాణి  గిరిజ   వందనం. అఘరహిత తల్లి శుభ జఘనమునకు వందనం గిరితనయ విరిపూజిత దుర్గ   వందనం. విదుషీమణి అలంకృత  మణిమేఖలకు వందనం అఖిలాండపోషిణి  ఆదిశక్తి అన్నపూర్ణ   వందనం. భక్తానుగ్రహ హృదయారవిందమునకు వందనం శక్తిపీఠనిలయ శ్రీశైల భ్రమరాంబిక   వందనం.   సకలశాస్త్ర ధర శుభకర కంకణములకు వందనం పరిపాలిని శుభకారిణి గాయత్రి   వందనం.  త్రయంబక  రాణి భవాని కంబుకంఠమునకు వందనం సృష్టి స్థితి లయ రూపిణి త్రిపుర సుందరి    వందనం బుధ స్తుతుల విరాజిల్లు చుబుకమునకు వందనం లక్షణ రూపిణి సన్నుత కొళాపురి మహాలక్ష్మి   వందనం బీజాక్షర పూరిత ఓ...

HAPPY INDEPENDENCE DAY

Image
72వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ******************************************** శ్రీ పింగళి వెంకయ్యచే మంగళ సంకేతముగా చెక్కబడిన శిల్పమురా మన చక్కనైన పతాక  . అల్లూరి వీరత్వము, ఆనందుని వివేకము మడమతిప్పుటెరుగని మన నాయకుల వ్యూహము భారత భాగ్య విధానపు సౌభాగ్యము గాగ "తాకాలనుకుంటే పీకలు కోసేస్తాం" అను కశ్మీర సిందురమే" కాషాయపు రంగు."  ******** బాపూజీ ఆశయాలు, అమ్మ థెరెస్సా ఆచరణలు తేటతెల్ల పరచుచున్న వెలిసిపోని వెల్లరా "వందేం అహింసా పరమో ధర్మ:" అను శాంతి కపోత సంకేతం "తెలుపు రంగు".  ********* పంచభూతములు శుచిగ, పంచభక్ష్య రుచులుగ కర్షకునికి కూతురుగా,క్షుత్తునకు మాతగా "సుజలాం,సుఫలాం,సస్య శ్యామలాం" అను పచ్చతోరణపు కుచ్చు, మెచ్చుకోలు "ఆకుపచ్చ రంగు." ************ నిరంతర ప్రయత్నమనే నీలివృత్త నృత్యముతో వ్యాకులత నిర్మూలనమనే ఆకుల సమానతతో ధర్మపు నడిబొడ్డుయైన అశోక ధర్మ చక్రముతో జనగణమన గళముతో, జనగణముల మంగళముతో "జై కిసాన్" పొలముగ,"జై జవాన్" బలముతో కన్నులపండుగగా కశ్మీర ప్రాంగణములో కోటలలో పేటలలో కోటి కోటి కాంత...

DEVI DASAMAHAVIDYALU.

Image
     దేవిదశమహావిద్యలు-శ్రీ మాత్రేనమః.      ****************************** అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పె   ద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లో      నమ్మిన      వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మా  యమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్ ఒకొక్క దేవత ఆవిర్భావం ఒకొక్క లీలలా వుంటుంది. . ఒకొక్క తత్త్వం ఒకొక్క అవతారం లో వస్తుంది. అందరికీ అందని సూక్ష్మ తత్త్వం నుండి అందరూ పూజించుకునేలా ఒక ఉపాధి ద్వారా మన పూజలు అందుకునే  స్థాయికి దిగి వస్తారు దేవతలు. ఆ తత్త్వ ఔదార్యాన్ని మనం స్తోత్రాలతో అర్ధం చేసుకుని బాగుపడాలి అని మహర్షుల మనోభీష్టం. ఎవరికీ అందని అద్భుతమైన సూక్ష్మతత్త్వం నుండి స్థూలంగా ప్రకటితమయిన   దశమహా శక్తులు.కరుణసంద్రములు.శతకోటి వందనములు.  అమ్మను వర్ణించడము అసాధ్యము.వేయినాలుకల ఆదిశేషుడే ఒప్పుకున్నాడు.అతి సామాన్యమైన నేనెంత? "దివ్" క్రీడాయాం అను ధాతువు ప్రకారము అండ-పిండ-బ్రహ్మా0డములతో ఆడుకునే అమ్మ నిర్హేతుక కృపాకటాక్షము నా చేతిని పట్టుకొని...

DASAMAHAVIDYA-KAMALATMIKA

Image
    శ్రీమాత్రే నమః     **************  " కాళీ తారా మహావిద్యా షోడశీ భువనేశ్వరీ    భైరవీ ఛిన్నమస్తా చ విద్యా ధూమవతీ తథా    బగళా సిధ్ధవిద్యా చ మాతంగీ,కమలాత్మికా    ఏతా ఏవ మహావిద్యాః సిధ్ధవిద్యా ప్రకీర్తితాః."  నమామి కమలాత్మికాదేవి మహాశక్తిం నిరంతరం. శార్దూలము... కమల  వర్ణన చాతుర్ధార సుధా గజేంద్ర విలసత్ చాంపేయ చాముండినీమ్ హేతుర్భాగ్య విశారదా శుభద మాహేశ్వర్య దాక్షాయణీమ్ పాతివ్రత్య పరాయణీమ్ భగవతీమ్ పద్మాసనా సంస్థితామ్ జ్యోతిర్లోక పురాధి దేవి కమలజ్యోతీమ్  పరంజ్యోతినీమ్! భావము: నాలుగు ఏనుగులు అమృత ధారలు పోయుచుండగా విలాసముగా ఉన్నది బంగారు (చాంపేయ) వన్నె చాముండి. భాగ్యానికి హేతువుగా నేర్పరి శుభాకారములను ఇచ్చు మాహేశ్వరి, దాక్షాయణి. పాతివ్రతత్త్వముకు ఆశ్రయము భగవతి పద్మాసనంలో స్థిరాసనము ఆమెది. కాలచక్రాన్ని నడిపే జ్యోతిర్లోక పురాధిపతి కమల ఆమె జ్యోతి పరంజ్యోతియే!    శ్రీ మాత్రే నమః   *************   " కాంత్యాంకాంచన సన్నిభాం హిమగిరి ప్రఖ్యైశ్చతుర్భిగజైః     హస్తోత్ క్ష...

DASAMAHAVIDYA-MATANGI

Image
శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ వాణీం చతుర్బాహునీమ్ గీతం వాచక నాద నృత్య నిధి సంఘీభావ సంపూజనీమ్ మాతంగీమ్ హరితాం సుశోభి సుమతీమ్ మంత్రిత్వ సంచాలకీమ్! భావము: ఆశ్రయము (ఊతం) ఇచ్చి భద్రంగా చూసే విష్ణురూప (సుభద్ర) రుద్రకామినీ ఉచ్చిష్ట చండాలిని గా పేరుపొందావు. ఎరుపు వస్త్రములతో ఆభరణములతో కాంతివంతముగా కప్పుకున్న (సంపుటి) నాలుగు బాహువులు గల సరస్వతీ. నృత్య నాట్య సంగీత వాచకములకు నిధివి, ఐకమత్య బోధకురాలివి కడుపూజనీయురాలివి. ఓ మాతంగీ! ఆకుపచ్చ రంగులో శోభిల్లు బుద్ధిమంతురాలివి, ఆ లలితా మాతకు ప్రధాన మంత్రి గా సంచాలకము చేస్తున్నావు. నమస్కారములు!   శ్రీ మాత్రే నమః  ********************  " మాణిక్యవీణాం ఉపలాలయంతీం    మదాలసాం  మంజుల వాగ్విలాసాం    మాహేంద్ర నీలద్యుతి కోమలాంగీం     మాతంగ కన్యాం మనసా స్మరామి.   చతుర్భుజే  చంద్రకళా వతంసే   కుచోన్నతే కుంకుమరాగ శోణే   పుండ్రేక్షు పాశాంకుశ పుష్ప బాణ హస...

DASAMAHAVIDYA-BAGALAAMUKHI

Image
    శ్రీమాత్రే నమః     **************  " కాళీ తారా మహావిద్యా షోడశీ భువనేశ్వరీ    భైరవీ ఛిన్నమస్తా చ విద్యా ధూమవతీ తథా    బగళా సిధ్ధవిద్యా చ మాతంగీ,కమలాత్మికా    ఏతా ఏవ మహావిద్యాః సిధ్ధవిద్యా ప్రకీర్తితాః."  నమామి బగళాముఖిదేవి మహాశక్తిం నిరంతరం. .. బగలాముఖి వర్ణన. గంభీరాసన కర్కరాటుక మహా కర్బూర పీతాంబరీమ్ కుంభీపాక విదారకాగ్నివిరళీమ్  క్రూరాకృతిమ్ భంజనీమ్ స్తంభీకార విజృంభ లంఘన కరీమ్ సంరంభ విస్త్రాణినీమ్ అంభోజశ్రిత పాదపద్మ యుగళీమ్  ఆధ్యాత్మికాసాగరీమ్! భావము: కర్కరాటుక (కొంగ) వాహని, కర్బూర (బంగారు) వన్నెతో పసుపు బట్టలు ధరించునది. కుంభీపాక నరకములో లాగా చీల్చే అగ్నిని విశాలముగా విసిరి క్రూరాకృతి (దానవులను) చంపుతుంది. వేగంగా విజృంభించి లంఘించి విస్త్రాణము (పెరలైజ్) చేస్తుంది. ఆ తల్లి కమలములు వంటి పాదయుగళము ఆధ్యాత్మికా సాగరము.     శ్రీ మాత్రే నమః.   ****************   " మధ్యే సుధాబ్ధి మణిమండప రత్నవేదీ     సింహాసనోపరిగతా...

DASAMAHAVIDYA-DHOOMAVATI

Image
    శ్రీమాత్రే నమః     **************  " కాళీ తారా మహావిద్యా షోడశీ భువనేశ్వరీ    భైరవీ ఛిన్నమస్తా చ విద్యా ధూమవతీ తథా    బగళా సిధ్ధవిద్యా చ మాతంగీ,కమలాత్మికా    ఏతా ఏవ మహావిద్యాః సిధ్ధవిద్యా ప్రకీర్తితాః."     నమామి  మహాశక్తిం నిరంతరం. శార్దూలము.. ధూమవతి వర్ణన.. వైధవ్యంబు నిరాశ నిస్పృహ సహా వార్ధక్య ధూమం రుచిమ్ వ్యాధిగ్రస్త కురూపి కాకి రధమున్ వాసం శ్మశానంబునున్ బాధా రూపము తానె దాల్చు బహుధా బ్రహ్మాండ మంతంబునన్ బోధంజేసెడి బుద్ధి సిద్ధి శుభదం భోక్తవ్య భూరిన్నిలన్! భావము: ముదుసలి విధవరాలి రూపము, పొగ రంగు, నిరాశా నిస్పృహలతో వ్యాధులతో కురూపిగా కాకి రథముగా శ్మశానంలో నివసిస్తుంది. లయకాలములో సర్వ బాధలు తాననుభవించి బ్రహ్మాండాన్ని లయజేసుకొని తనలో దాచుకుంటుంది. బుద్ధి సిద్ధిని ఇలలో అనుభవప్రద అర్హత ఉన్నవారికి ఎంతో ప్రసాదిస్తుంది ఆ తల్లి!!   ఆవిర్భావ కారణము ********************      పార్వతీదేవికి కలిగిన విపరీతమైన ఆకలి.దానిని తట్టుకొనలేక ఆహారమునిమ్మని శివుని మూడుసా...