Posts

Image
 ప్రియ మిత్రులారా,దేవీశరన్నవరాత్రుల శుభకామనలు.  ***************************************   తెలుగు మొదటి నక్షత్రమైన అశ్విని ని అనుసరించి, ఆశ్వయుజ-కార్తిక మాసముల శరద్రుతువును గౌరవిస్తూ ఆదిశక్తి రూపాలైన దశవిద్యా తత్త్వమును గురించి తెలుసుకొనేటందుకు చేసే ప్రయత్న్మే ఇది.మొదటి అడుగు.అమ్మ చేయి పట్టుకుని అర్థము చెప్పమని చేసే అభ్యర్థన ఇది.కనుక విజ్ఞులైన మీరు ఇందలి దోషములను సవరించుట అమ్మ సేవగా భావించి,నన్ను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ,  నిమ్మగడ్డ సుబ్బలక్ష్మి.   అమ్మ సేవలో అందమైన పరిమళ పద్యపుష్పములను సమర్పించుచున్న ప్రసాద్ నిమ్మగడ్డ ( నా తమ్ముడి ని) అభినందిస్తూ,ఆశీర్వదిస్తూ,అమ్మ కృప అనవరతము వర్షించాలని కోరుతూ,చిరంజీవి సాయి ప్రసన్న అమ్మరూపములో వచ్చి అత్యంత అమూల్యమైన సహాయ సహకారమును అందించినందులకు ఆశీర్వదిస్తూ మీముందుంచటానికి ప్రయత్నిస్తాను. శార్దూలము పాళీమ్ హార కపాలధారి రుధిరామ్ ప్రాముఖ్య మాలాన్వితాం కేళీమ్ జిహ్వ మహారుణారుచి భయక్రీడావచూడాస్ధి కం- గాళీ రాక్షస భంజనేన రణరంగాలింగనోత్సాహికామ్ కాళీమ్ కాలకలాప దంత ధవళా  కార్యానువర్తీమ్ శివమ్! భావము: కపాలముల సమ...

PADISAKTULA PARAMAARTHAMU.-KAALI.

 పదిశక్తుల పరమార్థము - కాళి ప్రథమశక్తి.  ************************  ప్రియ మిత్రులారా! మీకు తెలియని విశేషములు కావు.కాని నా తపన అమ్మ తత్త్వములోని మీ అందరితో పంచుకోవాలనే .ఈ ప్రక్రియ ప్రణాలికకు తన అమూల్యమైన సమయమును-విజ్ఞానమును అందించిన భక్తునిపై ఆ తల్లి దయ అనవరతము వర్షించనీ.ద్వంద్వమయమైనఈ జగతిలో రాత్రింబవళ్ళు-సుఖదుఃఖములు-జ్ఞాన-అజ్ఞానములు-కలిమి-లేములు-ఉఛ్చ్వాస-నిశ్వాసములు-స్త్ర్ర్పురుషులు ఉన్నట్లే శ్రీవిద్యోపానలో దక్షిణాచార-వామాహారములు ప్రాంతములను బట్టి,పరిసరములను బట్టి పరంపరను బట్టి ద్వివిధములుగా నున్నందున కాళి శక్తిని పూజావిధానమును తాంత్రికముగా అనుకుంటు అనుగ్రహమునకు దూరమవుచున్నాము.   అర్థనారీశ్వరమైన మహాశక్తి కాళి తన సామర్థ్యముతో సామరస్యము కల్పిస్తూ,లయబధ్ధముగా ఊగిసలాడుస్తూ( కాలస్వరూపముగా)జగతిని ఒక స్థితి నుండి మరొక స్థితికి నడిపిస్తున్న కాళీతత్త్వము ఎంతగొప్పదో మనము అర్థముచేసుకుంటే మాట కరుకు-మనసు చెరుకు అన్నట్ల్కుగా కాళి తత్త్వము లోని సమభావము ( అగ్నితత్త్వముగా అన్ని వస్తువుల యందు సమభావము,కాలాతీత స్వభావము గతము తలచుకోదు-తెలియని భవిష్యత్తు ఆలోచించదు)సృష్టి-స్థితి-లయములకు ...

YAA DEVI SARVABHOOTESHU-02

   యాదేవి సర్వ భూతేషు-02    ********************   రెండవ దశమహావిద్య-తారాదేవి.   కాలికాదేవిని ఆదిమతమస్సుగా భావిస్తారని మనము చెప్పుకున్నాము.ఆ తమస్సునుండి తేజోపుంజముగా మేరుశిఖర మధ్యనుండి కాలిక సృష్టించిన జగమును సంస్కరించుటకు తేజోరేఖగా వెలువడిన తల్లి తారాదేవి.తన భక్తుడైన గణపతి ముని ఉమాసహస్ర పద్యములకు తన అంగీకారము-ఆనందమును తల్లి ఆకాశములో మెరుపు రూపముగా తెలియచేసినదని ఆర్యోక్తి.  " యాదేవి సర్వభూతేషు తేజోరూపేణ సంస్థితా." అమ్మా అనేక నమస్కారములు.   దేవతలు ధర్మసంస్థాపనకై కాళిమాతను ప్రార్థించగా తన రౌద్రరూపమును కొంతమేరకు తగ్గించుకొని(ఉపసంహరించుకొని) తారాదేవి రంగములోనికి దిగినదని భావిస్తారు.ఉదాహరణకు కత్తిని కత్తెరచేసినది.సంహరణను సవరణ గా మార్చినది. " యాదేవి సర్వభూతేషు సహన రూపేణ సంస్థితా."   కాళిక పునర్నిర్మించిన విశ్వమునకు తారాదేవి వాక్కును ప్రసాదించి సంస్కరించినది.వాక్కు పరా-పశ్యంతీ-మధ్యమా-వైఖరీ అని నాలుగు విధములుగా వర్గీకరించబడినది.మేఘగర్జన-గాలికి చెట్ల ఆకులు ఊగుతూ చేయు ధ్వనులు-పక్షుల-పశువుల అరుపులు మొదటి మూడు వర్గములకు చెందినవి.గుత్పప్రణవము శబ్...

YAA DEVI SARVABHOOTESHU-01 ( MAHAAKAALI)

Image
 యాదేవీ సర్వభూతేషు-01  ********************   దశమహావిద్యలలో కాళివిద్య మొదటిది.మహాకాళుని శక్తిగా లయకారిణిగా సంహారస్వరూపిణి అయిన కాళీవిద్య వేదములలో మంత్రరూపముగా తేజరిల్లుచున్నది.కాళి శక్తిది మంత్రశరీరము.మనవి మాంసశరీరములు.కనుక తల్లి ఘోరరూపమును,లావణ్యమును గురించి తర్కింపజాలము.అగ్ని స్వరూపిణి అయిన కాళిశక్తి నల్లని శరీరఛాయతో ప్రకటింపబడుట తల్లి లీలావిశేషము.ప్రళయానంతర ఆదిమ తమస్సుగా (కన్యారాశితో) జ్యోతిష్కులు పోలుస్తారు.  అధర్వణ వేద ప్రకారము దక్షిణాచార-వామాచార (తాంత్రిక) పూజావిధానములు శాంప్రదాయములు ప్రాంతీయ పరంపరా భేదములే కాని,పరమేశ్వరికి ప్రీతిపాత్రములు కాదనలేము.అంతర్యాగ-బహిర్యాగ విధానము కూడా అంతే.ఇది సరి అని ఇదమిథ్థముగా చెప్పలేము.నియమ నిష్ఠలతో,అకుంఠిత విశ్వాసముతో చేయు ఏ పూజావిధానమైనను.ఆచరణీయమే.అనుగ్రహ పాత్రమే.  అస్సాంలోని కామాఖ్యలో వెలిసిన కాళినుండి వరంగల్లు భద్రకాళి వరకు అన్నె అమ్మరూపాలే.   కఠినరూపము-కారుణ్య స్వభాముల మేళవింపు కాళి తల్లి.  అంధకారములో సమస్తమైన ఆకారాలు సమానముగ అయిపోయి గుప్తస్థితిని పొందుతాయి. ఈ గుప్త తత్త్వమే కాళిదసమహావిద్య." యాదేవి...

BHAJARE NAMDABALAM.

Image
భజరె నంద బాలం" **************** శ్రీ కృష్ణా, పిల్లన గ్రోవిని ఊదుతు పులకించుటయా ఘనత? పిల్లిమొగ్గలేయు నా మనసును మళ్ళించుటయే రమణీయత. ఇంద్రుని యాగమును అడ్దగించుటయా ఘనత? నా ఇంద్రియ రాగములను అడ్డుకొనుటయే ధీరత. తులసిదళములతో సమముగ తూగుటయా ఘనత? అతులిత మంగళములు అందచేయుటయే ఉదారత. మన్నుతిన్న నోటను యశోదకు మాయచూపుటయా ఘనత? కన్ను మిన్ను కానరాని నన్ను సవరించుటయే చతురత. కురుక్షేత్రమున నరునికి గీతను అందించుటయా ఘనత? మనసుకు సుశిక్షిత నడవడికను అందించుటయే ఆధ్యాత్మికత. "మహా నందాంగనా డింభకుడు" అని మెప్పులను పొందుటయా ఘనత? మదాంధకారయుత డింభకునికి కనువిప్పును కలిగించుటయే ఆర్ద్రత. "శ్రీ కృష్ణం వందే జగద్గురుం"అంటూ పూజలందుకొనుటయా ఘనత? నికృష్టపు మందబుద్ధిని పూజ్యము చేయుటయే పూజ్యత. పరిహాస హాస వాసనలు నీ పాదము చేరుటయా ఘనత? నే యమునాతీరమున రాసక్రీడల తేలుటయే భావుకత. "అష్టాక్షరీ" ఆనందాబ్ధి ఓలలాడుటయా ఘనత? దుష్టుడైన నన్ను నీ మ్రోల నిలబెట్టుటయే పరమార్థత. నవవిధ భక్తుల జగములు నిన్ను కొలుచుట ఘనత, **నే** అనవతర భక్తిని "భజరె నంద బాలం" అనుటయె ధన్యత. ...

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

Image
వందనం =========== అంబ వందనం  జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి    వందనం. పారిజాత అర్చనల  పాదములకు వందనం పాపనాశిని పావని  పార్వతి   వందనం. గులాబీలు గుబాళించు  గుల్భములకు వందనం గణపూజిత గుణాతిశయ  గౌరి   వందనం. ముద్దు గణపయ్య  కూర్చున్న  ఊరువులకు వందనం ఎద్దునెక్కు శివునిరాణి  గిరిజ   వందనం. అఘరహిత తల్లి శుభ జఘనమునకు వందనం గిరితనయ విరిపూజిత దుర్గ   వందనం. విదుషీమణి అలంకృత  మణిమేఖలకు వందనం అఖిలాండపోషిణి  ఆదిశక్తి అన్నపూర్ణ   వందనం. భక్తానుగ్రహ హృదయారవిందమునకు వందనం శక్తిపీఠనిలయ శ్రీశైల భ్రమరాంబిక   వందనం.   సకలశాస్త్ర ధర శుభకర కంకణములకు వందనం పరిపాలిని శుభకారిణి గాయత్రి   వందనం.  త్రయంబక  రాణి భవాని కంబుకంఠమునకు వందనం సృష్టి స్థితి లయ రూపిణి త్రిపుర సుందరి    వందనం బుధ స్తుతుల విరాజిల్లు చుబుకమునకు వందనం లక్షణ రూపిణి సన్నుత కొళాపురి మహాలక్ష్మి   వందనం బీజాక్షర పూరిత ఓ...

HAPPY INDEPENDENCE DAY

Image
72వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ******************************************** శ్రీ పింగళి వెంకయ్యచే మంగళ సంకేతముగా చెక్కబడిన శిల్పమురా మన చక్కనైన పతాక  . అల్లూరి వీరత్వము, ఆనందుని వివేకము మడమతిప్పుటెరుగని మన నాయకుల వ్యూహము భారత భాగ్య విధానపు సౌభాగ్యము గాగ "తాకాలనుకుంటే పీకలు కోసేస్తాం" అను కశ్మీర సిందురమే" కాషాయపు రంగు."  ******** బాపూజీ ఆశయాలు, అమ్మ థెరెస్సా ఆచరణలు తేటతెల్ల పరచుచున్న వెలిసిపోని వెల్లరా "వందేం అహింసా పరమో ధర్మ:" అను శాంతి కపోత సంకేతం "తెలుపు రంగు".  ********* పంచభూతములు శుచిగ, పంచభక్ష్య రుచులుగ కర్షకునికి కూతురుగా,క్షుత్తునకు మాతగా "సుజలాం,సుఫలాం,సస్య శ్యామలాం" అను పచ్చతోరణపు కుచ్చు, మెచ్చుకోలు "ఆకుపచ్చ రంగు." ************ నిరంతర ప్రయత్నమనే నీలివృత్త నృత్యముతో వ్యాకులత నిర్మూలనమనే ఆకుల సమానతతో ధర్మపు నడిబొడ్డుయైన అశోక ధర్మ చక్రముతో జనగణమన గళముతో, జనగణముల మంగళముతో "జై కిసాన్" పొలముగ,"జై జవాన్" బలముతో కన్నులపండుగగా కశ్మీర ప్రాంగణములో కోటలలో పేటలలో కోటి కోటి కాంత...