Posts

CHAMAKAMU-ANUVAAKAMU-10

Image
 శివుని కరుణ అర్థము కానిది.శివుని కరుణ అద్భుతమైనది.   అంతర్-బహిర్యాగములను నిర్వహిస్తీ యజ్ఞ సిధ్ధిని పొందిన సాధకుడు ఈ అనువాకములో పాడి-పంటలను సమృధ్ధము గావించుటకు ప్రార్థిస్తూ,తన అభ్యర్థనములను లోపరహితము గావించి పరిపూర్ణముచేయుచున్నాడు. గోవిశిష్టత పాడికి సంకేతముగా భావిస్తే-వృషభ విశిష్టతను పంటలకు సంకేతముగా భావించవచ్చును.సత్యమును గోమాతగా పూజిస్తే-ధర్మమును వృషభముగా కీర్తింపవచ్చును.     సాధకుడు తల్లిగర్భమున నున్న శిశువు నుండి వృధ్ధాప్యము వరకు వాటిని సమర్థవంతములుగా అందించమని అర్థిస్తున్నాడు.    గోమాత విషయమునకు వస్తే ఒకటిన్నర సంవత్సరపు వయసు గల త్ర్యవీని,రెండు సంవత్సరముల వయసు గల దిత్యౌహీని,రెండున్నర సంవత్సరముల వయసు గల పంచావీని,మూడు సంవత్సరముల వయసుగల త్రివత్సాని,మూడున్నర సంవత్సరముల వయసు గల తుర్యౌహీని,నాలుగు సంవత్సరముల వయసుగల షషటాహీని,    కొత్తగా ఈనిన ధేనువును,గొడ్డుటావు అయిన వశాను,దూడను కోల్పోయినదైన వేహత్ను,అమృతత్తమునకు ప్రతిరూపమైన కామధేనువును సమర్థవంతమైనవి ప్రసాదించమని వేడుకొనుచున్నాడు.    ఇవన్నీ మన ఆలోచనలకు,పాప పుణ్యములకు,వాటి ప్రయాణమ...

CHAMAKAM-ANUVAKAMU-09

Image
శివుని కరుణ అర్థము కానిది.శివుని కరుణ అద్భుతమైనది. యజ్ఞసిధ్ధిని వివరించు ఈ అనువాకము యజ్ఞ ప్రారంభ దశ యైన దీక్షా స్వీకారము నుండి బృహత్ స్నానము అను యజ్ఞము ముగిసిన తరువాత చేయు సంస్కారము వరకు వివరించుచున్నది.    ఆధ్యాత్మిక స్థానమును ప్రకాశింపచేయు అగ్నికార్యము,"ఘర్మచమే" అను ప్రపర్థ్యము,అర్క యాగము,సూర్య యాగము,ప్రాణ హోమములతో పాటు అత్యుత్తమ యాగ ప్రక్రియయైన "అశ్వమేథమును" ప్రస్తావించుచున్నది.   అశ్వమేథము అంటే గుర్రము తలను నరుకుట యేనా యజ్ఞ సమయములో అను సందేహము మనకు వస్తుంది.ఒక   విధముగా మనము కాదనలేని అంశమిది.ఇప్పటివరకు సాధకుడు దేహాభిమానమును  కలిగియున్నప్పటికిని ఆధ్యాత్మికత యందు ఆసక్తిని కలిగియున్నాడు..అతనిలో దేహాభిమానము పూర్తిగా తొలగలేదు.కాని పరతత్త్వమును గురించిన కుతూహలము ,దానిని విచారించు విజ్ఞత కలగలుపుగా కలిసి ఉన్నవి.అంతర్యాగ-బహిర్యాగ ఫలితముగా సాధకుని మనస్సులో ఆధ్యాత్మికత బలవత్తరమై ఐహికమును మరుగుపరచుచున్నవి.నిరంతర సాధన సత్కామముల సహకారముతో అతని ఆలోచనా విభావరి అశ్వమువలె శీఘ్రగమనముతో పరమార్థ తత్త్వము వైపు పరుగులు తీసింది.అశ్వము తలను-శరీరమునుండి వేరుచేసినట్లు విషయ...

CHAMAKAMU-ANUVAAKAMU-08

Image
 శివుని కరుణ అర్థము కానిది.శివుని కరుణ అద్భుతమైనది.  ఈ అనువాకము యజ్ఞకర్త-యజ్ఞభర్త-యజ్ఞభోక్త అయిన పరమాత్ముని యజ్ఞ నిర్వహణకు కావలిసిన పరికరములను-పరివారమును అనుగ్రహించి,సాధకుని యజ్ఞము సమర్థవంతగునట్లు చేయబడు ప్రార్థన.  సాధకుడు అంతర్యాగానందమును అనుభవించుచు ఈ అనువాకములో బహిర్యాగ విశేషములను ప్రస్తుతిస్తున్నాడు.   యజ్ఞము అను ప్రక్రియ సనాతన వైదిక సంప్రదాయ అగ్నికార్యము.ఈనాటి ఆధునికము కొన్నిసంవత్సరముల తరువాత పురాతనముగాను,కొన్నేళ్ళ కిందటి ఆధునికము నేటి పురాతనముగాను మారుచుండుట మనము చూస్తూనే ఉన్నాము.ఇటువంటి మార్పులు లేని శాశ్వత సంప్రదాయమే సనాతనము.అపౌరుషేయమైన వేదోక్త విధినిర్వహణము.అపరిమిత సౌభాగ్యఫల ప్రదము.  పరమాత్మస్వరూపమైన ప్రకృతి లోని సంపదలను మనము ఏవిధముగా కోరుకోవాలో-ఎందుకు కోరుకోవాలో-ఎప్పుడు కోరుకోవాలో కోరుకున్న వాటిని ఏ విధముగా ఉపయోగించుకొని ఆధ్యాత్మికామృతమును అందుకోవాలో తెలియచేస్తున్నాడు చమకరూపములో.విజ్ఞతకు ఇది ఒక ఉదాహరణ.   నిజము చెప్పాలంటే చిన్నపిల్లల చేతిగోరు ముద్దలు తింటూ అమ్మ ఎలా పరవశించిపోతుందో,చిన్న పిల్ల తినిపించిన అనుభూతితో ఎలా ఆనందపడుతుందో అద...

CHAMAKAMU-ANUVAAKAMU-07

Image
  శివుని కరుణ అర్థముకానిది.శివునికరుణ అద్భుతమైనది.  సోమ గ్రహ ప్రభావ విశిష్టమైన    (శివశక్తులు) ఈ  అనువాకములో మానసిక యాగమునకు కావలిసిన పరికరములను సాధకుడు పరమాత్మను అర్థిస్తూ,అవి ప్రాప్తించుట  వలన తన యజ్ఞము సమర్థవంతమై శుభపరిణామములను కలిగించు  ఆత్మౌన్నత్యమును పరిపూర్ణముగా పొందగలనని తెలియచేయుచున్నాడు.   జ్ఞానము మనసునకు బుధ్ధికి సంబంధించినది.చీకటితో నిండియున్న మనసును తేజోవంతము చేయాలంటే వెలుగు కావాలి.అది కూడా నిరంతరము నిండిఉండాలి.ఇట్లా వచ్చి కాసేపుండి వెళ్ళిపోకూడదు.కనుక పరమాత్మను  అగున్శుశ్చనే-రశ్మిశ్చమే" అంటూ కిరణములు వాటిద్వారా వచ్చే కాంతిని కోరుకుంటున్నాడు.వాటిని ప్రసాదించే వానికి అలసత్వము కూడదని నిరంతరము ప్రసరించే వాడై ఉండాలని కోరుకుంటున్నాడు.అంతే కాదు వాడు అధిపతియై తనను పాలించాలని వేడుకొనుచున్నాడు.   అంతే కాదు  ఉపాంశు  మార్గమున మంత్రములను చదువు( తనకు మాత్రమే వినబడునట్లు ఉచ్చరించుచు జపము చేయు విధానము)ఉపకరమును ప్రసాదించమంటు, అజ్ఞానమును తొలగించి,అంతర్యామిత్వమునందించగల ఐంద్ర వాయువును,శరీరమునకు కావలిసిన పది వాయువులను అడుగుతు...

CHAMAKAM-ANUVAAKAMU-08

Image
 శివుని కరుణ అర్థము కానిది.శివుని కరుణ అద్భుతమైనది.  ఈ అనువాకము యజ్ఞకర్త-యజ్ఞభర్త-యజ్ఞభోక్త అయిన పరమాత్ముని యజ్ఞ నిర్వహణకు కావలిసిన పరికరములను-పరివారమును అనుగ్రహించి,సాధకుని యజ్ఞము సమర్థవంతగునట్లు చేయబడు ప్రార్థన.  సాధకుడు అంతర్యాగానందమును అనుభవించుచు ఈ అనువాకములో బహిర్యాగ విశేషములను ప్రస్తుతిస్తున్నాడు.   యజ్ఞము అను ప్రక్రియ సనాతన వైదిక సంప్రదాయ అగ్నికార్యము.ఈనాటి ఆధునికము కొన్నిసంవత్సరముల తరువాత పురాతనముగాను,కొన్నేళ్ళ కిందటి ఆధునికము నేటి పురాతనముగాను మారుచుండుట మనము చూస్తూనే ఉన్నాము.ఇటువంటి మార్పులు లేని శాశ్వత సంప్రదాయమే సనాతనము.అపౌరుషేయమైన వేదోక్త విధినిర్వహణము.అపరిమిత సౌభాగ్యఫల ప్రదము.  పరమాత్మస్వరూపమైన ప్రకృతి లోని సంపదలను మనము ఏవిధముగా కోరుకోవాలో-ఎందుకు కోరుకోవాలో-ఎప్పుడు కోరుకోవాలో కోరుకున్న వాటిని ఏ విధముగా ఉపయోగించుకొని ఆధ్యాత్మికామృతమును అందుకోవాలో తెలియచేస్తున్నాడు చమకరూపములో.విజ్ఞతకు ఇది ఒక ఉదాహరణ.   నిజము చెప్పాలంటే చిన్నపిల్లల చేతిగోరు ముద్దలు తింటూ అమ్మ ఎలా పరవశించిపోతుందో,చిన్న పిల్ల తినిపించిన అనుభూతితో ఎలా ఆనందపడుతుందో అద...

CHAMAKAMU-ANUVAAKAMU-06

  శివుని కరుణ అర్థముకానిది.శివుని కరుణ అద్భుతమైనది. " రుద్రం సురనియంతారం శూల ఖట్వాంగధారిణం   జ్వాల మాలా వృతం ధ్యాయేత్ భక్తానాం అభయప్రదం."    దేవతలను కూడ నియమించు రుద్రుడు సాధకులకు శుభములొసగును గాక. మేఘములందు మెరుపు-ఉరుము-పిడుగు రూపముగా విరాజిల్లుతూ రుద్రుడుసృష్టి/వృష్టి రూపముగా ప్రసన్నుడై భూమిని ఫలవంతము చేయుచు,ఇంద్రరూపముగా కీర్తింపబడుతున్నాడు.    రుద్రుడు ఇంద్రియములకును-మనసునకును అధిపతి.వానిని అనుభవించునపుడు ఇంద్రునిగను-నియమించునపుడు రుద్రునిగను చెప్పబడును.   అర్థ ఇంద్ర అనువాకముగా ప్రశస్తి చెందిన అనువాకము ముఖ్యముగా కార్య-కారణ సంబంధమును సోదారహరణముగా తెలియచేస్తున్నది.అంతే కాకుండ మొదటి అనువాకము అగ్నా- విష్ణో అంటూ, ఇద్దరిని కలిపి అనుగ్రహహించమని ప్రార్థించుటతో సత్వర సమిష్టి ఫలితములను పొందవచ్చునన్న వేద సంప్రదాయమును మరొకసారి ప్రతిపాదించుచున్నది.ఈ ఇద్దరిలో రెండవ వారిగా సంబోధింపబడుచున్న ఇంద్ర శబ్దము మూలము.దాని ఆదేశముననుసరించి మొదటి శబ్దమైన అగ్ని,వరుణ మిత్ర మున్నకు దేవతా శక్తులు మన ప్రార్థనలను స్వీకరించి,ప్రస...

CHAMAKAMU-ANUVAAKAMU-05

Image
  శివుని కరుణ అర్థము కానిది.శివుని కరుణ అద్భుతమైనది.    ఈ అనువాకము భూమి యొక్క గొప్పదనమును -భూగర్భ సంపదలను ప్రస్తావిస్తూ,జీవుడు పరిపూర్ణతను సంపాదించుకొనుటకు పరమాత్మ కోరినకోరికలను తీర్చే కొంగుబంగారము సాధకుని యజ్ఞమును సమర్థవంతము చేయాలనుకుంటున్నాడు.    మనము ఒక మహావృక్షమును సామాన్యదృష్టితో చూసినపుడు మనకు భూమిపైన ఉన్న కాండము-కొమ్మలు-ఆకులు-పూలు-పళ్ళు మాత్రమే కనిపిస్తాయి కాని,వాటన్నిటికి మూలకారణమైన మహిమాన్వితమైన వేరు కనపడదు.అంతమాత్రమున వేరులేదనగలమా? అదే విధముగా మన చర్మనేత్రములు భూభాగ ఉపరితలమును మాత్రమే వీక్షించగలవు కాని భూగర్భ సంపదను ఆలోచించలేవు.అర్థముచేసుకొనలేవు.ఇక స్వామిని అర్థించ గలవా? సాధ్యము కానే కాదు. అందుకే స్వామి ఘోర-అఘోర రూపములకు సంకేతముగా "అశ్మాచమే-మృత్తికాచమే" అంటూ కఠినమైన రాయి కావాలి-మెత్తనైన మట్టి కావాలి" అని అర్థింపచేస్తూ,అభీష్టసిధ్ధిని కలిగించాలనుకుంటున్నాడు.  భూమిని దున్నిన భూమి-దున్నని భూమి " "కృష్ణ పశ్యంచమే-అకృష్ణ పశ్చమ్యచే" అంతూ వర్గీకరించి కొన్ని భూములను ఆహారదాతలుగాను,మరికొన్నింటిని ఆవాస (ఇల్లు) దాతలుగాను ,ఆ భూములు అందించే సంపదలను కోరుక...