Posts

CHAMAKAMUTO MAMAEKAMU-03

Image
చమకములొ శబ్దము  పరమాత్మ తాను స్పూర్తియై మనచేత వాగ్రూపముగా అభ్యర్థలను జరిపించి,అనుగ్రహించుట ఎందుకు? తానే నేరుగా అనుగ్రహించ వచ్చును కదా! అను సందేహము కలుగ వచ్చును. కాని ప్రకృతి నియమానుసారముగా మనకు ఆకలి వేసిన మనమే ఆహారము దగ్గరికి వెళ్ళవలెను.నది నిరంతరము మన దప్పిక తీర్చుటకు తనదైన తీరులో ప్రవహిస్తూనే ఉంటుంది కాని మన దగ్గరకు రాదు.దప్పిక తీర్చుకొనుటకు మనమే జలము దగ్గరకు వెళ్ళలి.అదే విధముగా భగవత్ ప్రాభవమును మనకు పరమాత్మ తెలియపరుస్తూనే ఉంటాడు.మనము గుర్తించగలగాలి.అడగాలి.ఆసరా చేసుకోవాలి.అవరోధములను అధిగమించి,ఆయన పద సన్నిధిని చేవ్రుకోగలగాలి. మనలోని శక్తిని బహిర్గతము చేయాలంటే శబ్దము చాలా అవసరము.అందుకే కాంతిని-శబ్దమును (ప్రణవమును) పరమాత్మ మనకు అందించాడు.ఆ ప్రణవము జీవులను చైతన్య పరచి,వాగ్రూపముగా బహిర్గతమై వాంఛాఫలితములకు సహాయపడుతుంది.   ఆకాశము శబ్ద వాచకము.ప్రథమ భూతము.మహర్షులు దివ్య శబ్దములను అనంతాకాశములో తమ తపశ్శక్తితో వినగలుగుచున్నారు.శబ్దము కలుగచేయు జ్ఞానము మన తమస్సును పోగొట్టును.జగతి మానవులు సృజించలేని దృశ్య వైభవమైతే వేదములు-ప్రణవము మానవులు సృజించలేని శబ్ద వైభవములు.   కనుక ప్రథమ...

CHAMAKAMUTOE MAMAEKAMU-02

Image
వాజశ్చమే  అన్నము ఇది పరబ్రహ్మ స్వరూపము.అన్నము అనగా బియ్యమును ఉడికించగా ఏర్పడిన పదార్థము మాత్రమే కాదు.     ప్రతి మనిషికి అన్నమయకోశము-ప్రాణమయ కోశము-మనోమయ కోశము-విజ్ఞాన మయ కోశము-ఆనంద మయ కోశములుంటాయి. తైత్తరీయోపనిషత్తు అన్నము వలనే భూతజనములు జనించుచున్నవై,జీవించుచున్నవని, లయింపబడుచున్నవని చెప్పుచున్నది.     అన్నమే/ఆహారమే అన్నమయకోశములోనికి ప్రవేశించి ప్రాణముగా మారుచున్నది.మరల మరల ప్రవేశించుచు ప్రాణిని జీవింపచేస్తున్నదిచివరకు జీవికి ఈశ్వరత్వమును అందిస్తున్నది.   పరమాత్మ సృష్టించిన రుద్రులు మనకు అందించే ఆహారముద్వారా మనకు ఆరోగ్యము-అనారోగ్యమును మన కర్మ ఫలితములను అనుసరించి అందిస్తుంటారు.  ప్రాణములు ఇంద్రియములు సర్వము రుద్రుడే. రుద్రుడు మేఘుని రూపములో వర్షములను కురిపిస్తూ,సూర్యుని రూపములో ఆహారమును అందిస్తూ విశ్వమును పోషిస్తున్నాడు"అంధసస్పతి."     సూర్యరశ్మి-జలములు-వాయువులు ఆహారముగా జీవులను పోషించును కవున అన్నింటికి రుద్రుడే అధిపతి.ఇవన్నె కలిపి ఉపయోగించుకొనుటయే యజ్ఞము.వీటికి రుద్రుడు యజమాని.తిని జీవించు పక్షులు-పశువులు-మనుష్యులు మొదలగు వాటి...

CHAMAKAMUTO MAMAEKAMU-01

Image
మన శరీరమే శ్రీచక్రము.శ్రీచక్రము బ్రహ్మాండమునకు ప్రతీక.ఈ అనువాకము రుద్రుని అనేకానేకత్వమును ప్రస్తావిస్తున్నది.మూలము తన యొక్క వివిధ శక్తులను జగత్రక్షణార్థము వివిధ నామ రూపములతో తన నుండి ఆవిర్భవింపచేసి జగత్రక్షణమును గావించుచుండును.ఇక్క డి దేవతలందరు పరమాత్మ అవయవములే.సమయ సందర్భానుసారముగా సూక్షము నుండి అనగా పిపీలకము నుండి బ్రహ్మాండము వరకు విస్తరిస్తూ,తిరిగి సంకోచిస్తూ భగవత్ వరప్రదాన-అనుగ్రహ కారకులగుచున్నారు.ఈ రుద్రులు అసంఖ్యాకకులు.ఆద్యంత రహితులు.అవ్యాజకరుణా మూర్తులు.దేవసృష్టులైన వారు సమస్త చరాచరములను సృష్టించుట-పోషించుట-లయము చేయుటలో పరమాత్మాదేశానుసారమును పాటిస్తుంటారు.జీవుల కర్మఫలములు ప్రధాన పాత్రను వహిస్తాయి.వీరు వాయువులు-రశ్ములు-మనుషులు మొదలగు నానా రూపములందును విహరించెదరు.అట్లు విభక్తులైన రుద్రులు సంసారము అనాది యగుట వలన లెక్కకు మిక్కిలివారై లోకానుగ్రహార్థము ప్రవర్తించుచుందురు. చమకములొ శబ్దము  పరమాత్మ తాను స్పూర్తియై మనచేత వాగ్రూపముగా అభ్యర్థలను జరిపించి,అనుగ్రహించుట ఎందుకు? తానే నేరుగా అనుగ్రహించ వచ్చును కదా! అను సందేహము కలుగ వచ్చును. కాని ప్రకృతి నియమానుసారముగా మనకు ఆకలి వేసిన మ...

CHAMAKAMU-ANUVAAKAMU-11

Image
  శివునికరుణ అర్థము కానిది.శివుని కరుణ అద్భుతమైనది.మానవత్వముతో ప్రారంభమైన రుద్రచమక పారాయణ యజ్ఞము దైవత్వము పొందుటతో సఫలీకృతమగుచున్నది.సరి సంఖ్యలు-బేసి సంఖ్యలు సంకేతములై పరమాత్మ తత్త్వమునకు దర్పణములై దర్శనీయతను ప్రసాదించుచున్నవి.  శివశక్త్యాత్మక భగవతత్త్వమును దర్శింపచేయుటయే మానవత్వముతో ప్రారంభించిన దీక్ష ను అవబృథస్నానముతో ముగించిన సాధకుని లక్ష్యము.ద్వ0ద్వములు నిర్ద్వంద్వమైన అపురూప స్థితి.    ఈ అనువాకము "ఏకాచమే అంటూ త్రయస్త్రిగంశస్చమే ' 1 నుండి 33 వరకు గల బేసి అంకెలను-సంఖ్యలనుపురుష స్వభావముగల దేవతా ఛందముగా విజ్ఞులు పేర్కొనినారు.వీటినే అయుగ్మములు-విషమములు అని కూడా అంటారు.   " చతస్రశ్చమే మొదలు అష్టాచత్వారిగంశశ్చమే" అనగా 4 నుండి 48 వరకు గల సంఖ్యలు అయుగ్మములు.సమములు.వీనిని సరిసంఖ్యలు అని కూడా అంటారు.ఇవి స్త్రీ స్వభావము కలవి.   ఆదిశంకరులవారు స్తుతించినట్లు "శివశక్త్యా యుక్తా " సరి సంఖ్య బేసి సంఖ్య కలయిక మిథునత్వము.ఆదిదంపతుల అద్భుత దాంపత్యము.ఉత్తరోత్తర వంశాభివృధ్ధ్కి సూచితము.ఈ రెండు విధములైన మంత్రములతో చేయు జపతపములు-హోమములు అంతకంతకు అధికమైన అభివృధ్ధిని కల...

CHAMAKAMU-ANUVAAKAMU-10

Image
 శివుని కరుణ అర్థము కానిది.శివుని కరుణ అద్భుతమైనది.   అంతర్-బహిర్యాగములను నిర్వహిస్తీ యజ్ఞ సిధ్ధిని పొందిన సాధకుడు ఈ అనువాకములో పాడి-పంటలను సమృధ్ధము గావించుటకు ప్రార్థిస్తూ,తన అభ్యర్థనములను లోపరహితము గావించి పరిపూర్ణముచేయుచున్నాడు. గోవిశిష్టత పాడికి సంకేతముగా భావిస్తే-వృషభ విశిష్టతను పంటలకు సంకేతముగా భావించవచ్చును.సత్యమును గోమాతగా పూజిస్తే-ధర్మమును వృషభముగా కీర్తింపవచ్చును.     సాధకుడు తల్లిగర్భమున నున్న శిశువు నుండి వృధ్ధాప్యము వరకు వాటిని సమర్థవంతములుగా అందించమని అర్థిస్తున్నాడు.    గోమాత విషయమునకు వస్తే ఒకటిన్నర సంవత్సరపు వయసు గల త్ర్యవీని,రెండు సంవత్సరముల వయసు గల దిత్యౌహీని,రెండున్నర సంవత్సరముల వయసు గల పంచావీని,మూడు సంవత్సరముల వయసుగల త్రివత్సాని,మూడున్నర సంవత్సరముల వయసు గల తుర్యౌహీని,నాలుగు సంవత్సరముల వయసుగల షషటాహీని,    కొత్తగా ఈనిన ధేనువును,గొడ్డుటావు అయిన వశాను,దూడను కోల్పోయినదైన వేహత్ను,అమృతత్తమునకు ప్రతిరూపమైన కామధేనువును సమర్థవంతమైనవి ప్రసాదించమని వేడుకొనుచున్నాడు.    ఇవన్నీ మన ఆలోచనలకు,పాప పుణ్యములకు,వాటి ప్రయాణమ...

CHAMAKAM-ANUVAKAMU-09

Image
శివుని కరుణ అర్థము కానిది.శివుని కరుణ అద్భుతమైనది. యజ్ఞసిధ్ధిని వివరించు ఈ అనువాకము యజ్ఞ ప్రారంభ దశ యైన దీక్షా స్వీకారము నుండి బృహత్ స్నానము అను యజ్ఞము ముగిసిన తరువాత చేయు సంస్కారము వరకు వివరించుచున్నది.    ఆధ్యాత్మిక స్థానమును ప్రకాశింపచేయు అగ్నికార్యము,"ఘర్మచమే" అను ప్రపర్థ్యము,అర్క యాగము,సూర్య యాగము,ప్రాణ హోమములతో పాటు అత్యుత్తమ యాగ ప్రక్రియయైన "అశ్వమేథమును" ప్రస్తావించుచున్నది.   అశ్వమేథము అంటే గుర్రము తలను నరుకుట యేనా యజ్ఞ సమయములో అను సందేహము మనకు వస్తుంది.ఒక   విధముగా మనము కాదనలేని అంశమిది.ఇప్పటివరకు సాధకుడు దేహాభిమానమును  కలిగియున్నప్పటికిని ఆధ్యాత్మికత యందు ఆసక్తిని కలిగియున్నాడు..అతనిలో దేహాభిమానము పూర్తిగా తొలగలేదు.కాని పరతత్త్వమును గురించిన కుతూహలము ,దానిని విచారించు విజ్ఞత కలగలుపుగా కలిసి ఉన్నవి.అంతర్యాగ-బహిర్యాగ ఫలితముగా సాధకుని మనస్సులో ఆధ్యాత్మికత బలవత్తరమై ఐహికమును మరుగుపరచుచున్నవి.నిరంతర సాధన సత్కామముల సహకారముతో అతని ఆలోచనా విభావరి అశ్వమువలె శీఘ్రగమనముతో పరమార్థ తత్త్వము వైపు పరుగులు తీసింది.అశ్వము తలను-శరీరమునుండి వేరుచేసినట్లు విషయ...

CHAMAKAMU-ANUVAAKAMU-08

Image
 శివుని కరుణ అర్థము కానిది.శివుని కరుణ అద్భుతమైనది.  ఈ అనువాకము యజ్ఞకర్త-యజ్ఞభర్త-యజ్ఞభోక్త అయిన పరమాత్ముని యజ్ఞ నిర్వహణకు కావలిసిన పరికరములను-పరివారమును అనుగ్రహించి,సాధకుని యజ్ఞము సమర్థవంతగునట్లు చేయబడు ప్రార్థన.  సాధకుడు అంతర్యాగానందమును అనుభవించుచు ఈ అనువాకములో బహిర్యాగ విశేషములను ప్రస్తుతిస్తున్నాడు.   యజ్ఞము అను ప్రక్రియ సనాతన వైదిక సంప్రదాయ అగ్నికార్యము.ఈనాటి ఆధునికము కొన్నిసంవత్సరముల తరువాత పురాతనముగాను,కొన్నేళ్ళ కిందటి ఆధునికము నేటి పురాతనముగాను మారుచుండుట మనము చూస్తూనే ఉన్నాము.ఇటువంటి మార్పులు లేని శాశ్వత సంప్రదాయమే సనాతనము.అపౌరుషేయమైన వేదోక్త విధినిర్వహణము.అపరిమిత సౌభాగ్యఫల ప్రదము.  పరమాత్మస్వరూపమైన ప్రకృతి లోని సంపదలను మనము ఏవిధముగా కోరుకోవాలో-ఎందుకు కోరుకోవాలో-ఎప్పుడు కోరుకోవాలో కోరుకున్న వాటిని ఏ విధముగా ఉపయోగించుకొని ఆధ్యాత్మికామృతమును అందుకోవాలో తెలియచేస్తున్నాడు చమకరూపములో.విజ్ఞతకు ఇది ఒక ఉదాహరణ.   నిజము చెప్పాలంటే చిన్నపిల్లల చేతిగోరు ముద్దలు తింటూ అమ్మ ఎలా పరవశించిపోతుందో,చిన్న పిల్ల తినిపించిన అనుభూతితో ఎలా ఆనందపడుతుందో అద...