Posts

OM NAMAH SIVAAYA ---04

Image
ఓం నమ: శివాయ -04  **************** నెత్తిమీది గంగతప్ప నెత్తుటి బంధము ఏది పొత్తు నీకు హరికితప్ప పొత్తిళ్ళలో సుఖము ఏది లలాటమున కన్ను తప్ప బాలానందములు ఏవి హెచ్చైన ఎద్దు తప్ప అచ్చట ముచ్చటలు ఏది పిలవని పేరంటము తప్ప పెళ్ళికి సందడి ఏది దక్షుని నిర్లక్ష్యము తప్ప లక్షణ మర్యాద ఏది మింగుడుపడని విషము తప్ప మెరుగు అగు సంగతులేవి పుక్కిటి పురాణములు తప్ప పురుషార్థములు ఏవి అపాత్ర వరములు తప్ప ఈషణ్మాత్రపు ఈవి ఏది పరుగుతీయు భయము తప్ప పరమపదము నీకు ఏది లయముచేయు లయ తప్ప నాకు వలయునది లేదని,నే నొక్కి చెప్పాలిరా ఓ తిక్క శంకరా.    శివునికి రక్త సంబంధీకులు లేరు .అమ్మ పొత్తిళ్లలో పరుండలేదు.చిన్నపిల్లల ఆటపాటలు లేవు.పెరుగుచున్నప్పుడు జరుగు ముద్దుముచ్చటలు జరుగలేదు.పెళ్ళికి దక్షుని ఆహ్వానము లేదు.కనుక మగపెళ్ళివారి సందడి లేదు.అత్తింటి మర్యాదలు లేవు.మింగక దాచిన విషము తప్ప చెప్పుకోదగ్గ విశేషములు లేవు.కాలక్షేప పురాణములే కాని కైవల్యమును ఈయలేవు.శివుడు అర్హత లేని వారికి వరములు ఇచ్చుటచే కొంచమైనను కీర్తిలేదు.తన వర ప్రభావమునకు తానే భయపడి పరుగులు తీయు శివుడు పరమపదమును ఎలా అందీయ    గలడు?లయ ప...

SIVASANKALPAMU-03

Image
ఓం నమః శివాయ-03    ***************   చక్కదనపు నలుగునిడి స్నానము చేయిద్దామనుకుంటే   పుక్కిలింత నీళ్ళతో సొక్కిపోయి ఉంటావు   పట్టుపుట్టాలు నీకు కట్టాలనుకుంటేను   గట్టిగా విడువనంటు చుట్టుకుంది పులితోలు   కనకభూషణములను కంఠమున వేయాలనుకుంటేను   కాలకూటవిషపు పాము కౌగలించుకుందాయె   ప్రేమతో పరమాన్నమును తినిపిద్దామనుకుంటేను   పచ్చిమాంసపుముక్క పచ్చి అనక ఉందాయె   పక్కింటి వాళ్ళతో ఆడుకోమంటేను   నాకు పక్కిల్లే లేదని వెక్కివెక్కి ఏడుస్తావు   ఎవరు నీకులేరనువారికి ఎరుకచేయి నిజమును   అక్కను నేనున్నానని ! ఓ తిక్క శంకరా!.  శివుడు (కన్నప్ప) నీళ్ళను పుక్కిలించి ఇదే అభిషేకముగా స్వీకరించమంటే సరేనన్నాడు.పచ్చిమాంసమును సమర్పిస్తే నైవేద్యముగా స్వీకరించాడు.బూదిపూతలతో పులితోలును వస్త్రముగా కట్టుకుని ఉంటాడు.ఇల్లు-వాకిలి లేనివానికి పక్క ఇల్లు ఎక్కడినుండి వస్తుంది? మొత్తము మీద శివుడు పధ్ధతి లేనివాడు-  నింద.     కర్ణాటక లోని ఉడుతడి గ్రామములో సుమతి-నిర్మలశెట్టి దంపతులకు పార్వతీదేవి అంశతో జన్మించినది మహాదేవి.పరిశుధ్ధయోగిని.మహేశ్వర తత...

SIVASANKALPAMU-02

Image
ఓం నమ: శివాయ-02 ధర్మాధర్మములా సకలదేవతలారా! ఇవి నిర్మితము శివునిచే నిమిత్తమాత్రము నేను మదముతోటి మాటలని నన్ను మన్మథునిగ చూస్తాడో వదరుబోతు పదములు అని ఆదరమే చూపుతాడో పుట్టుట-గిట్టుట నడుమ శివుని తిట్టుట అనుకుంటాడో కట్టుబాటు నేర్పించగ మెట్టుదిగి వస్తాడో ప్రమథ గణములకు నన్ను పరిచయమే చేస్తాడో ప్రమదములో ముంచుతాడో-ప్రమాదమే అంటాడో కాలకూట విషముకన్న కఠినము తానంటాడో కన్నతండ్రిని అని క్షమించి వదిలేస్తాడో మితిమీరిన ప్రేమతో తిక్క శంకరుడని అన్నానంటూ నా పక్కనే ఉంటాడో ఆ తిక్క శంకరుడు. ద్వంద్వ భావములు నాలో చేరి,నేనే వ్రాసాను అని కాసేభ్రమపడుతు,మరి కాసేపు శివుడే వ్రాసాడు అనికనిపెడుతు,కాసేపు స్తుతియిస్తు, మరికాసేపు నిందిస్తు మాయామోహితుడనైన నన్ను క్షమించి రక్షించుతాడో-కోపించి శిక్షించుతాడో-అంతా ఈశ్వరేచ్చ. ( ఏక బిల్వం శివార్పణం.) నచ్చింది వ్యాఖ్య భాగస్వామ్యం చేయి

CHAMAKAMUTOE MAMAEKAMU-06

Image
     యంతాచమే-ధర్తాచమే      **********************   " గురుమధ్యేస్థితౌ విశ్వం     విశ్వమధ్యే స్థితౌ గురు."    విశ్వమే గురువు.గురువే  గురువే విశ్వము.రెండును అవిభాజ్యములు-అభేదములు.    సాధకుడు తనకు కావలిసిన (దేహమునకు) నిద్రాహారములునివాసయోగ్యమైన ఇల్లు,మంచి నిద్ర-ఆరోగ్యము కోరుకున్నాడు "సీరంచమే-వసతిశ్చమే-శయనంచమే " అంటు.రుద్రుని మందహాసము సాధకుని మనసులో ఒక వింత ప్రశ్నకు కారణమైనది.నేను కోరుకున్నవేనా మానవజీవిత లక్ష్యాలు-లక్షణములు.కాదు.కానేకాదు.ఇంకా ఎన్నో అద్భుతాలు-అమృతాలు ఉన్నాయి.కాని అవి ఏమిట్పో వానిని స్వామిని ఎట్లా అడగాలో అర్థము కావటములేదు.దరహాసము దయాభాసమై,"యంతాచమే" అంటూ,తన మేథను వాటివైపుకు మళ్ళించగలిగిన ఆచార్యుని అర్థించేటట్లు చేసినది.రుద్రా నాకు ఆచార్యుడు కావాలి.అతడు సమస్త గోళములను గ్రహములను శక్తులను జీవులను వారివారి నిర్ణీత స్థానములందుంచి,గతి తప్పక-మితి తప్పక నియంత్రించబడిన కార్యములను చేయించగలిగిన నియామకుడై యుండాలి.ఆచార్యుని అనుగ్రహిస్తే ఏమి చేస్తావు అన్నాడు స్వామి;     రుద్రా నీవు అనుగ్రహించిన ఆచార్యు...

CHAMAKAMUTO MAMAEKAMU-05

Image
క్లప్తంచమే-క్లప్తిశ్చమే ************    క్లప్తంచమే- ఇక్కడ సాధకుడు రుద్రుని తన యజ్ఞనిర్వహణకు గాను కావలిసిన ద్రవ్యములను కోరుకొనుచున్నాడు.   యజ్ఞము సమర్థవంతము కావాలంటే వనరులు-వాటిని సద్వినియోగము చేసుకొనే సామర్థ్యము రెండు కావాలి. ఆ సామర్థ్యమును "క్లప్తిశ్చమే" అని అనుగ్రహించమని వేడుకుంటూన్నాడు.   ఉదాహరణకు వాహనముకావాలి-దానిలోనికి నడిపించగలిగే ఇంధనము-చోదకుడు కావాలి.వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా నిరుపయోగమే.అదే విధముగా రుద్రానుగ్రహము అనే చోదకశక్తి,యజ్ఞమునకు కావలిసిన ద్రవ్యములను-వానిని సద్వినియోగపరచుకోగల సామర్థ్యమును కలిగియుంటే సత్ఫలితములను పొండగలడు.    సాధకుడు రుద్రమహిమను తెలిసిన వాడు కనుక వాహనము వంటి శరీరమును,"వర్మాచమే" అని కోరుచున్నాడు.అది ఉండుటకు," ప్రథిమాచమే" ఇల్లు-వాకిలి కావాలంటూన్నాడు.అందులో ఉంటాను సరే,తినటానికి-చదువుకోటానికి"వృధ్ధంచమ-వృధ్ధిశ్చమే" అంటూ వాటిని అడుగుతున్నాడు.రుద్రుడు ఇచ్చిన శరీరముతో ఇంటిలో ఉంటూ ఆహారమును తింటూ,చదువుకుంటూ తాను ఏవిధముగా గుర్తింపును పొందాలో తెలియచేస్తున్నాడు "జైష్ఠంచమ-ఆధిపత్యంచమే" అంటూ స్వామి నువ్వు జ్య...

CHAMAKAMUTOE MAMAEKAMU-04

Image
  చమకము-అనువాకము-02   *********************   త్విషిశ్చమే-త్విషకాంతే.    ప్రవృత్తి-నివృత్తుల వివేకమును ప్రకాశింపచేసెడి భావము.    క్షత్రంచమే అని సాధకుడు రుద్రుని సౌష్టవమైన శరీరమును కోరుతున్నాడు.చాలా తెలివైన వాడు కనుక త్విషిశ్చమే అని యుక్తాయుక్త విచక్షణ వలన కలుగు ప్రకాశమును కోరుకుంటున్నాడు.    ఆధ్యాత్మిక సాధన అను ప్రక్రియలో కొన్ని శక్తులు మన దగ్గరకు వచ్చి,శాశ్వతముగా మన దగ్గరనే ఉండి మన సామర్థ్యమును పెంచేవిగా ఉండాలి.మరి కొన్ని శక్తులు మననుండి శాశ్వతముగా దూరముగా తొలగిపోవాలి.అప్పుడు కాని మనలను కమ్ముకున్న అజ్ఞానమను చీకటి తొలగి పోయి,చిత్ప్రకాశమును దర్శించలేము.  పంటచేను పచ్చదనముతో పరవశించాలంటే,కలుపు మొక్కలను పీకివేయాలి.ఎదుగుతున్న పైరును చీడ-పీడ దరిచేరకుండా చూసుకోవాలి.అదేవిధముగా ఆధ్యాత్మిక సేద్యమును కొనసాగించాలంటే,అరిషడ్వర్గములనే కలుపు మొక్కలను పీకివేయగలగాలి.చంచలమైన మనసుకు ఏకాగ్ర్తను అలవాటు చేయాలి.    ఈ అనువాకములో మన్యుశ్చమే-భామశ్చమే అని కోపమును మానసిక కోపముగాను-బాహ్య కోపముగాను ప్రస్తావించారు.సాధకుని కోపము మానసికమైనద...

CHAMAKAMUTO MAMAEKAMU-03

Image
చమకములొ శబ్దము  పరమాత్మ తాను స్పూర్తియై మనచేత వాగ్రూపముగా అభ్యర్థలను జరిపించి,అనుగ్రహించుట ఎందుకు? తానే నేరుగా అనుగ్రహించ వచ్చును కదా! అను సందేహము కలుగ వచ్చును. కాని ప్రకృతి నియమానుసారముగా మనకు ఆకలి వేసిన మనమే ఆహారము దగ్గరికి వెళ్ళవలెను.నది నిరంతరము మన దప్పిక తీర్చుటకు తనదైన తీరులో ప్రవహిస్తూనే ఉంటుంది కాని మన దగ్గరకు రాదు.దప్పిక తీర్చుకొనుటకు మనమే జలము దగ్గరకు వెళ్ళలి.అదే విధముగా భగవత్ ప్రాభవమును మనకు పరమాత్మ తెలియపరుస్తూనే ఉంటాడు.మనము గుర్తించగలగాలి.అడగాలి.ఆసరా చేసుకోవాలి.అవరోధములను అధిగమించి,ఆయన పద సన్నిధిని చేవ్రుకోగలగాలి. మనలోని శక్తిని బహిర్గతము చేయాలంటే శబ్దము చాలా అవసరము.అందుకే కాంతిని-శబ్దమును (ప్రణవమును) పరమాత్మ మనకు అందించాడు.ఆ ప్రణవము జీవులను చైతన్య పరచి,వాగ్రూపముగా బహిర్గతమై వాంఛాఫలితములకు సహాయపడుతుంది.   ఆకాశము శబ్ద వాచకము.ప్రథమ భూతము.మహర్షులు దివ్య శబ్దములను అనంతాకాశములో తమ తపశ్శక్తితో వినగలుగుచున్నారు.శబ్దము కలుగచేయు జ్ఞానము మన తమస్సును పోగొట్టును.జగతి మానవులు సృజించలేని దృశ్య వైభవమైతే వేదములు-ప్రణవము మానవులు సృజించలేని శబ్ద వైభవములు.   కనుక ప్రథమ...