Posts

SIVA SANKALPAMU-108

Image
ఓం నమః శివాయ-108 ****************** కరుణరస పట్టిది కచ్చితము కనికట్టనలేనిది నేనేమరియున్నవేళ తానే నన్నుచేరినది మనోకలశము చూచినది మక్కువ తిక్కశంకరుని తక్కువచేసినగాని దయతలుచు దిక్కగువానిని సన్నుతిచేయుచు సంతోషపు జలమును నింపుచున్నది అనురక్తితో భక్తిదారమును చుట్లుగ చుట్టుచున్నది పదపదమని చేరినవి పరమేశుని పదములు మామిడాకులై అపరాధము తలంచుచు పలాయనమైనది నింద కుందుచు నా పశ్చాత్తాపము పరివర్తన చెందెను నారికేళమై నిను నిందించిన ఇంద్రియములు నిష్కృతి కోరెను పుణ్యహవచనము జరుగుచున్నది పునీతమవ్వగా వసియింపుము శివా నామది వాత్సల్యము వాసికెక్కగా. పరబ్రహ్మము ఒక్కటే.పైపై తొడుగులు వేరువేరుగా గోచరిస్తుంటాయి.పరమాత్మను అనుభవించాలంటే సూక్ష్మాతి సూక్ష్మమైన దర్శనశక్తిని కలిగియుండాలి.ఈ శక్తి అచేతనములను చైతన్యవంతము చేయు చిత్-శక్తి.దీనిని ఆత్మ యొక్క (పరమాత్మలోని చిన్ని మచ్చుతునక)అఖండశక్తిగా కూడ భావించవచ్చును.నేను-నాది అను అపరిమితమైన అహము అఖండశక్తిచే ప్రభావితమై మంచుకరిగినట్లు కరిగి,అంతఃకరణ శుధ్ధితో అసలు నిజము తెలుసుకోగలుగుతుంది.తాను నీడను మాత్రమేనని తెలుసుకొని నిజమైన పరమాత్మకు దూరముగా నుండి నడవలేక కదులు...

SIVA SANKALPAMU-107

Image
ఓం నమః శివాయ-107 ******************** భక్తుల కంఠస్థమైన శితికంఠుని స్తోత్రములకు-దండాలు శివా పృథ్వీలింగమైన ఏకామ్రేశ్వరునికి -దండాలు శివా అగ్నిలింగమైన అరుణాచలేశునికి-దండాలు శివా జల లింగమైన జంబుకేశ్వరునికి-దండాలు శివా వాయు లింగమైన శ్రీ కాళహస్తీశ్వరునికి- దండాలు శివా ఆకాశలింగమైన చిదంబరేశ్వరునికి- దండాలు శివా సూర్యబింబ లింగమైన కోణార్క దేవునికి-దండాలు శివా చంద్ర బింబలింగమైన చంద్రకోన దేవునికి-దండాలు శివా భక్తి ఆలింగనమైన మహాలింగమునకు -దండాలు శివా (ఓం) న-మ:-శి-వా-య అను పంచాక్షరికి-దండాలు శివా దం-డా-లు-శి-వా అను ఐదు అక్షరములకు-దండాలు శివా సుస్పష్టపు ఇష్టమైన అష్టమూర్తికి-దండాలు శివా. పంచభూతములు-సూర్యుడు-చంద్రుడు-జీవుని కలయికయే అష్టమూర్తితత్త్వము. జగత్ ఈశ ధీయుక్త సేవనం-భగవాన్ రమణమహర్షి. చరాచరాత్మకములన్నియు ఈ ఎనిమిది శక్తుల సంగమమే.సూక్ష్మముగా మనలో పంచభూతములుగా,సూర్యునిగా కంటిని-బుధ్ధిని పాలిస్తూ,చంద్రునిగా మనసును మళ్ళిస్తూ,జీవుని లోని శక్తిగా అష్టమూర్తి సంగమము నెలకొన్నది. సదా శివుడు అష్టమూర్తి తత్త్వముతో ఎనిమిది పేర్లతో ,భూతత్త్వమును వివరించు శర్వునిగా,జలతత్త్వమును వివరించు భవునిగా,అగ్నితత...

SIVA SANKALPAMU-106

ఓం నమః శివాయ-106 ******************** ఆనంద భాష్పాలతో అభిషేకము చేయనా భక్తి మకరందమును చందనముగ పూయనా ఆది-అనాది లేదంటు బూదిని నే పూయనా శాంతి సహనపుష్పాలతో పూజలనే చేయనా పాప రహితము అనే దీపము వెలిగించనా పొగడ్తపూల వాసనలనే పొగలుగ నే వేయనా లబ్బు-డబ్బు శబ్దాలతో స్తొత్రములే చేయనా ఉచ్చ్వాశ-నిశ్వాస వింజామరలను వీచనా అరిషడ్వర్గములు లేని ఆతిధ్యమునీయనా హర హర మహాదేవ అంటు హారతులే ఇయ్యనా దాసోహం-దాసోహం అంటు నే ధన్యతనే పొందనా నా పక్కనే ఉన్నావురా చూడ చక్కనైన శంకరా! అప్రాకృత శరీరం తం అతి మన్మథ రూపిణం శివా. సచ్చిదానంద రూపాయ సదాశివాయతే నమః. నా కోసం రూపమును ప్రకటించుకొని,నాచే పరిహాసము చేయించుకొని,పరమ దయతో నాకు పరతత్త్వమును పరిచయమును చేసిన పరమాత్మా! ఇప్పుడు ఎవరైనా నన్ను నీ రూపము గురించి అడిగారనుకో,ఆనందముతో నీ సూక్ష్మ తత్త్వముతో పాటు,నీ స్థూల రూపమును కూడా అగ్ని నీ ముఖమని-పరాపరాత్మకము ఆత్మ యని,కాలము గతి యని,భూమి నీ పాదపీఠమని,ఊరుపు గాలి యని,నాలుక జలోత్పత్తి స్థానమని,దిశలు(దిక్కులు) కర్ణంబులని,దివము నాభియని,సూర్యుడు కన్నులని,శుక్లము సలిలమని,జఠరము జలధులని,వేదములు (ఛందములు) ధాతువు...

SIVA SANKALPAMU-105

శివ సంకల్పము-105 ************************ నువ్వు తిక్కలోడివని అంది నా మూఢత్వం నిన్ను చక్కదిద్దాలనుకుంది నా మూర్ఖత్వం నీకేమి తెలియదంది నా అహంకారం నీకు తెలియచేయాలనుకుంది నా అంధకారం నిన్ను గౌరవించలేనంది నా తాత్సారం నీతో గారడి చేయాలనుకుంది నా మాత్సర్యం నీకు నాగరికత లేదంది నాలోని ఆటవికం నిన్ను నాగరికుడిని చేయాలంది నాలోని ఆధునికం నీకు పాఠము చెబుదామనుకుంది నాలోని ఆర్భాటం నీకు పరీక్ష పెట్టాలనుకుంది నాలోని ఆరాటం సముద్రాన్ని పరీక్షించు ఉప్పుబొమ్మ నేనైతే నా తప్పు చెప్పినావురా ఓ గొప్ప శంకరా. ఆరూఢ భక్తిగుణ కుంచిత భావచాప యుక్తైః శ్శివస్మరణ బాణ గణైరమోఘైః నిర్జిత్య కిల్బిష రిపుం విజయీ సుధీంద్రః సానంద మావహతిసుస్థిర రాజ్యలక్ష్మీ. శివమే జగము-జగమే శివము శివోహం శివోహం. శివా! నీ అనుగ్రహ వృష్టిలో మునిగి పునీతుడనైన నేనేకాదు,మరెందరో బుధ్ధిమంతులు ధనుర్విద్యా సంపన్నతతో ధన్యులగుచున్నారు.వారి హృదయమనే ధనుస్సుకు నిష్కళంక భక్తి అనే నారి బంధించబడినది.నెరజాణలైన శివ నామములు అనే బాణములు అమ్ములపొదిని అలంకరించుచున్నవి.వారి ధన్యత నేమనగలను? అర్జునుని తో పాటు సమానముగా అందించిన నీ ధనుర్విద్యా చాతుర్యము...

SIVA SANKALPAMU-104

ఓం నమః శివాయ-103 ******************** చిలుకగ నే జన్మిస్తే చిదంబరుడ అంటాను కోడిగ నే జన్మిస్తే కోటిలింగేశ్వర అంటాను కాకిగ నే జన్మిస్తే కాళహస్తేశ్వర ఆవుగ నే జన్మిస్తే అంబాపతి అంటాను మేకగ నే జన్మిస్తే నే మేలమాడుతుంటాను పాముగ నే జన్మిస్తే భృస్మేశ్వర అంటాను ఏనుగుగ నే జన్మిస్తే ఏకాంబరేశ్వర అంటాను కీటకముగ నే జన్మిస్తే నే కీర్తిస్తూనే ఉంటాను జన్మకాదు ముఖ్యమనే కర్మసిద్ధాంతపు సాక్షిగా ఏ జన్మలో నేనున్నా ఏలినవారి దయతో "త్వమేవాహం" అని తలుస్తు నన్ను తరియింప చేయగా బిరమున నన్ను బ్రోవరా పరమైన శంకరా. " ఏషత్యేషజనిం మనోన్య కఠినం తస్మిన్నటానీతిమ ద్రక్షాయై గిరిసీమ్ని కోమల పదన్యాసః పురాభ్యాసితః నోచేదివ్య గృహాంతరేషు సుమనస్తల్పేషు వేద్యాదిషు ప్రాయః స్సత్సు శిలా తలేషు నటనం శంభో కిమర్థం తవః." ఓ తండ్రీ! నేను దుర్భాషలాడతానని నీకు ముందే తెలుసుకదా.అయినా నీ పితృవాత్సల్యము నన్ని విడిచిపెట్టలేదుకదా.అందుకే అవును అందుకే వీడు పుడతాడు.వీడి మనసు కఠినమైనది అయినప్పటికి నేను అక్కడ సంచరించాలని నా మీది ప్రేమతో ఎన్నో దివ్య భవనము (మెత్తని తివాచీలు కప్పినవి),పూలపానుపులు (సుతిమెత్తనివి)...

SIVA SANKALPAMU-103

ఓం నమః శివాయ-103 ******************** చిలుకగ నే జన్మిస్తే చిదంబరుడ అంటాను కోడిగ నే జన్మిస్తే కోటిలింగేశ్వర అంటాను కాకిగ నే జన్మిస్తే కాళహస్తేశ్వర ఆవుగ నే జన్మిస్తే అంబాపతి అంటాను మేకగ నే జన్మిస్తే నే మేలమాడుతుంటాను పాముగ నే జన్మిస్తే భృస్మేశ్వర అంటాను ఏనుగుగ నే జన్మిస్తే ఏకాంబరేశ్వర అంటాను కీటకముగ నే జన్మిస్తే నే కీర్తిస్తూనే ఉంటాను జన్మకాదు ముఖ్యమనే కర్మసిద్ధాంతపు సాక్షిగా ఏ జన్మలో నేనున్నా ఏలినవారి దయతో "త్వమేవాహం" అని తలుస్తు నన్ను తరియింప చేయగా బిరమున నన్ను బ్రోవరా పరమైన శంకరా. " ఏషత్యేషజనిం మనోన్య కఠినం తస్మిన్నటానీతిమ ద్రక్షాయై గిరిసీమ్ని కోమల పదన్యాసః పురాభ్యాసితః నోచేదివ్య గృహాంతరేషు సుమనస్తల్పేషు వేద్యాదిషు ప్రాయః స్సత్సు శిలా తలేషు నటనం శంభో కిమర్థం తవః." ఓ తండ్రీ! నేను దుర్భాషలాడతానని నీకు ముందే తెలుసుకదా.అయినా నీ పితృవాత్సల్యము నన్ని విడిచిపెట్టలేదుకదా.అందుకే అవును అందుకే వీడు పుడతాడు.వీడి మనసు కఠినమైనది అయినప్పటికి నేను అక్కడ సంచరించాలని నా మీది ప్రేమతో ఎన్నో దివ్య భవనము (మెత్తని తివాచీలు కప్పినవి),పూలపానుపులు (సుతిమెత్తనివి)...

SIVA SANKALPAMU-102

ఓం నమః శివాయ-102 ********************* తామరలున్న కొలనులో తిరుగాడు కప్పను నేననుకో తామసమడచి ఆ కప్పను తుమ్మెదగా మార్చరాదో మధురసమున్న పాత్రలో తిరుగాడు తెడ్డుననుకో మేధను అనుగ్రహించి తెడ్డును జిహ్వగ మార్చరాదో కొమ్మకు చుట్టుకుని తిరిగాడు గాలిపటము నేననుకో ఇమ్ముగ జాలిచూపి దానిని చుక్కల పక్కకు చేర్చరాదో వాన నీరు వృధాచేయు సంద్రమునునేననుకో పన్నీరై క్షుథతీర్చు పంటబీడు చేయరాదో శివుడెంత అని అన్న గర్వపు గంగను నేననుకో శివపాదమే తనకు సర్వమన్న గంగగా చేయరాదో ఇన్ని మార్పు చేర్పులకు కూర్పువైన నిన్ను ఎన్న తరము కదురా నా కన్నతండ్రి శంకరా. " రోధస్తోయహృతః శ్రమేణ పథికశ్చాయాం తరోర్వృష్టితో భీతః స్వస్థగృహం గృహస్థమతిధిః దీనః ప్రభుం ధార్మికం దీపం సంతమసాకులశ్చ శిఖినం శీతావృతస్త్వం తథా చేతః సర్వ భయాపహం వ్రజసుఖం శంభో పదాంభోరుహం శివానందలహరి. ఓ మనసా! ఏ విధముగా నీటిలో కొట్టుకొనిపోవువాడు ఒడ్డును,అలిసిన బాటసారి చెట్టు నీడను,వర్షభయము కలవాడు ధృఢమైన ఇంటిని,అతిథి గృహస్థుని,దీనుడు ధార్మికుడైన ప్రభువును,చీకటిలో భయపడువాడు దీపమును,చలిలో వణుకువాడు మంటనుచేరునట్లుగా,సమస్త భయములను పోగొట్టి సుఖమునిచ్చు శివుని పాద...