Posts

PRASEEDA MAMA SARVADA05

Image
ప్రసీద మమ సర్వదా-06 స్కందమాత నమోనమః సింహాసన గతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా శుభమస్తు సదాదేవి స్కందమాతా యశస్వినీ అరవ నవదుర్గ స్కదమాతాదేవి.కూష్మాందా మాత అండరూపములో సమస్తమును తన గర్భములో నిక్షిప్తము చేసునినది కదా.దానిని ధర్మ రక్షనకు ప్రకటించవలసిన సమయమాసన్నమైనందున స్కందమాత గా అమ్మదనముతో మనలనందరిని తారకాసురుని బారి నుండి నెమ్మదింపచేయుటకై తన జాన-క్రియాశక్తులను శివశక్తితో కలిపేసి స్కందుని దేవసేనాధ్యక్షునిగా చేసినది తల్లి. స్కందము చేయబడిన శక్తి నుండి ఆవిర్భవించిన శక్తి స్కందనామముతో సంకీర్తించబడుతున్నది.ధర్మరక్షణార్థము బ్రహ్మ వరమును గౌరవించుటకు,మన్మథ దహన సమయమున వెలువడిన శివతేజము ఆరు భాగములుగా విభజింపబడినదట.ఆ తేజస్సును వాయువు-అగ్ని దాచిన గంగ దేవి ఒడిని చేరినదట.ఆ తల్లి ఆ దివ్యతేజమున రెల్లునందు దాచినదట. రెల్లునుండి తారకుని దుందగములను చెల్లు చేయుటకు అద్భుత బాలురు ఆవిర్భవించిరట.కృత్తిక నక్షత్ర శక్తులు ఆరు ఆ బాలునికి తమ శక్తులను స్తన్యమునిచ్చి యుధ్ధ సన్నధ్ధునిచేసినవి.తారకుని అంతమొందించగల ఆరుగురు బాలురను అమ్మ తన అక్కున చేర్చుకొని అత్యంత సుందర షణ్ముఖునిగ తీర్చిదిద్దినది.షన్ముఖుని ...

PRASEEDA MAMA SARVADA04

Image
ప్రసీద మమ సర్వదా-04 మాతా కూష్మాండా నమోనమః "సురాసుర సంపూర్నకలశం రుధిరా పుత్రమేవచ దధనా హస్త పద్మాభ్యాం కుష్మాండా శుభదాస్తుం " శైలపుత్రీ మాత మనకుబ్రహ్మచారిణి మాతను పరిచయము చేస్తే,బ్రహ్మచారిణి మాత మనకు చంద్రఘంట తల్లి పరిణయమను ప్రసాదగుణమును అందించింది.ఇల్లాలైన చంద్రఘంట తల్లి సూక్ష్మ-స్థూల రూపములతో అండరూపముగా ధరించు కూష్మాండ మాత కరుణరసామృత వర్షిలో మునిగితేలే మురెపమును అందించింది. కు అనగా చిన్న/సూక్ష్మ అను భావమును మనము గ్రహించగలిగితే,ఊష్మాండా అనగా సుందరతత్త్వము.అనగా తల్లి మనలో సూక్ష్మరూపములో నిండి స్థూలతత్త్వమును దర్శింపచేస్తుంది తల్లి.అందుకే ఆమ్మ అష్టసిధ్ధిస్వరూపిణి అయిన అష్టభుజి. పదునాలుగు భువనంబులు కుదురుగ తన కుక్షిలో నింపుకొని,దేవకీదేవి గర్భములో ఒదిగిన శ్రీకృష్ణుని వలె సూక్ష్మాతిసూక్ష్మము కాగలదు.అదే విధముగా ఇందుగలదందులేదని...ఎందెందు వెతికి చూసిన అందందేగలడు చక్రి అని ప్రహ్లాదుడు అన్న చందంబున విశ్వరూపియై విచ్చేయగలది కూష్మాందమాత. ప్రళయానంతరము సర్వము అంధకారబంధురమైన సమయమున "మందస్మిత ప్రభాపూర" తన చిరునప్పు కాంతులతో చీకట్లను చిదిమివేసినది.సూర్యమండలమధ్...

PRASEEDA MAMA SARVADAA-03

Image
ప్రసీద మమ సర్వదా-03 చంద్రఘంట మాతా నమోనమః " పిండజ ప్రవరారూఢ చండకోపాస్త్రకైర్యుతా ప్రసాదం తమతేహ్యం చంద్రఘంటేతి విశ్రుతా". శైలపుత్రీ మాత మనలను బ్రహ్మచరిణి మాతకు అప్పగిస్తే తల్లి పరమేశుని అర్థాంగిగా పరిణయమాడు సమయమున తాను సౌమ్యరూపియై-తన నాథుని సౌమ్యరూపునిగా ప్రకటించుకొనమని అర్థించి,శివశక్త్యైకరూపిణియై,సౌభాగ్యచిహ్నముగా తానును నుదుటను ఘంటాకృతిలో నున్న చంద్రఘంటను ధరించి,వినూత్న శోభలతో విశ్వేశ్వరుని అర్థాంగి గా మారినది. తల్లి ధైర్యమునకు గంభీరతకు ప్రతీకయైన పెద్దపులినిగాని/సింహమును గాని వాహనము చేసుకొని శివునిశక్తియై శుభములనొసగుచున్నది. తల్లి నామములో చంద్ర-ఘంట అను రెండు పదములున్నవి.ఇవి రెండు విభిన్న స్వభావముల సంకేతములు.అమ్మ ఘోర/అఘోర రూపములను దుష్టశిక్షణకు-శిష్ట రక్షణకు ధరించు విధానమును పరిచయము చేస్తున్నవి. చంద్ర పదము చంచలత్వమును-ఘంట పదమును నిశ్చలత్వమును తెలియచేస్తున్నవి.ఇక్కడ చంద్రుని రూపమును గాక స్వభావములకు సంకేతములుగా పరిగణిస్తే రెండు పరస్పర విరుధ్ధభావములైన చంచలత్వమునకు-నిశ్చలత్వమునకు ప్రాతినిధ్యము వహించుచున్నవి. "చంద్రమా మనసో జాతః" చంద్రుడు మన మనో...

PRASEEDA MAMA SARVADAA-02

Image
ప్రసీద మమ సర్వదా-02 బ్రహ్మచారిణి మాతా నమోనమః "దధనాకర పద్మాభ్యాం అక్షమాలా కమందలా దేవీ ప్రేదతుమయీ బ్రహ్మే చారిణ్యనుత్తమం." ఒకచేత జపమాల-మరొకచేత జలపాత్రతో "అజాయమాన బహుదా విజాయతే" అను సూక్తిని శుభకరము చేస్తూ,తల్లి తన రెండవ దుర్గారూపమైన బ్రహ్మచారిణిగా ప్రకటితమగుచున్నై.ఎంతటి భాగ్యశాలురమో మనము.ఈ తల్లికి ఏటువంటి వాహనముమనకు గోచరమగుటలేదు.దానికి కారణము తల్లి చారిణి.నిరంతరము సంచరించు స్వభావము కల చలనశక్తి. బ్రహ్మచారిణి అను నామము రెండుపదముల ద్వారా రెండు విషయములను తెలియచేయుచున్నవి.అందులో మొదటిది బ్రహ్మము.రెండవది అందులో తల్లి సంచారము. " పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదుచ్యతే" పురుషసూక్త ప్రకారము అపరిమితమైన బ్రహ్మములోని ఒక భాగమును సమస్తచరాచర విశ్వముగా మనము చూడగలుగుతున్నాము.అమృతమయమైన మిగిలిన మూడు భాగములు మనకు అగోచరములు-అనూహ్యములు. నాశనమయ్యే మన దేహములోని నాశరహిత చైతన్యమే బ్రహ్మము.విజ్ఞులు బ్రహ్మమును భగవతత్త్వము అని కూడా భావిస్తారు.వారి సిధ్ధాంతము ప్రకారము "భ" శబ్దము తేజోవంతమైతే"గ" శబ్దము గమనశీలత్వము.తేజోవంత గమన చైతన్యమే బ్రహ...

PRASEEDA MAMA SARVADAA-01

Image
ప్రసీద మమ సర్వదా-01 మాతా శైలపుత్రీం నమోనమః " వందేవాంఛిత లాభాయ చంద్రార్థకృత శేఖరం వృషారూఢం శూలధరం శైలపుత్రీం యశస్వినీం' వృషభవాహినియై(ధర్మమును అధిష్టించి) కుడిచేతిలో త్రిశూలమును-ఎడమచేతిలో పద్మమును ధరించి భక్త రక్షణచేయుతల్లికి నమస్కారములు. సృష్టి-స్థితి-సంహార-తిరోధాన-అనుగ్రహమను పంచకృత్యములను చేయుతల్లి,తిరోధానము ముగిసిన తరువాత,అనుగ్రహమను ఐదయకృత్య విశేషమే నవదుర్గావిష్కారము.ఇందులో శైలపుత్రీ గా తల్లి ప్రథమ రూపమును ప్రకటించుకొనినది. అమ్మ అవ్యాజ కరుణను నేనేమని వర్ణించగలను? తల్లి తన నిర్హేతుక కృపాకటాక్షమునకు నిదర్శనముగా మనతో తన నవదుర్గా అవతార విశేషములను తెలియచేస్తూ,ఎంతో ఓర్పుతో-నేర్పుతో మనందరి చేయి పట్టుకుని,నవనవోన్మేష మార్గమున మనలను నడిపించదలచినది. మొట్తమొదట మనము ఆశ్వయుజ శుక్ల పాడ్యమి రోజున ఆదిపూజలందు తల్లి శైలపుత్రీ లీలా విశేషములను తెలుసుకొనే ప్రయత్నము చేద్దాము. మూలపదార్థము కొత్తరూపమును ధరించు ప్రక్రియను మనము సృష్టికార్యముగా భావిస్తే,దక్షవాటికలో తన అవతారమును స్వఛ్చందముగా ముగించుకొనిన సతీదేవి,సతీదేవి గ్లానియైన ధర్మమును తిరిగి స్థాపించుటకు ,తన శక్తి...

PRAPASYAMTEE MAATAA-10

Image
ప్రపశ్యంతీ మాత-10 **************** " కమలాంబ నా చింత తీర్చవమ్మా "అంటు ఆర్తితో ఆలపించాడు ముత్తుస్వామిదీక్షితారు ముక్తిని పొందగలిగారు.ఆ కీర్తనను నవావర ణ కీర్తన అంటారు.కాళి సక్తితో ప్రారంభమైన మన శక్తి దర్సన ప్రయానము తార-షోడసి-భువనేశ్వరి-భైరవి-ఛిన్నమస్తక-ధూమవతి-బగళముఖి-మాతంగి అను తొమ్మిది విధములైన శక్తుల స్థూల తత్త్వము-సూక్ష్మ తత్త్వమును పరిచయము చేసుకొని,బహిర్దర్శనముతో బాహ్య ప్రవృత్తులను సాధనములు చేసుకొని వాటికి మూలమైన అంతర్డర్శనమునకు తల్లి కమలాంబిక అనుగ్రహముతో ఉద్యుక్తులమగుచున్నాము.చీకతి తొలగి కాంతి-శబ్దము మనకు పరిచయమైనవి.సుందరము-సుభిక్షము అను బాహ్య-అంతర విషయములు బయటపడినవి.వాటిని వరుచేసుకొనుట-పనికి రాని వాటిని పరిత్యజించుట అవసరమని తెలుసుకున్నాము.క్రమక్రమముగా నలుపు-తెలుపు రంగులలో నున్న శక్తి తత్త్వము తన నలుపును చీకటిని తొలగించుకొని,శుధ్ధ సత్వ ప్రకాశముగా శుభపరిణామముగా ద్యోతకమగుచున్నది.అంటే సూర్యోదయమగుచున్నది స్థూలములో.శక్తి తత్త్వము అవగతమగుచున్నది సూక్ష్మములో.ఆ విధముగా లోపల -బయట వెలుగులు విరజిమ్ముతు సూర్యోదయమున ప్రకాశించుచున్న జ్ఞానమే కమలాంబిక.తొలగి పోయిన తమస్సు,ఉషస్సు అనే ...

PRAPASYANTEE MAATAA-09

Image
" మాణిక్యవీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళా వతంసే కుచోన్నతే కుంకుమరాగ శోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్ప బాణ హస్తే నమస్తే ! జగదేక మాతః." అని మహాకవి కాళిదాసుచే ప్రస్తుతింపబడిన తల్లిని,అశుభములలో-అశుభ్రతతో మిళితమైన కాలుష్యశక్తిగా భావించి,చండాలిక నామముతో గుర్తించుట అలుముకున్న మన అజ్ఞానమునకు ప్రతీకయే కాని మరొకటి కాదు.చీకటి-వెలుగులు తల్లి కనుసన్నల కదలికలు కనుకనే ఒక్కొక్కసారి నీలశ్యామలగా-మరొక్కసారి సరస్వతిగా ప్రకటింపబడుతూ,అంతర్-బహిర్ తత్త్వములకు అద్దముపట్టుతుంది అమ్మ. స్థూలజగతిలో మతంగ ముని కన్యగా ప్రస్తుతింపబడు తల్లి సంగీత-సాహిత్య సమలంకృత.సంపూర్ణ శబ్దస్వరూపము అయిన మాతంగి మనలను ఏ విధముగా శబ్దస్వరూపమై శాసిస్తుందో-మనలో శ్వాసిస్తుందో తెలుసుకునే ప్రయత్నము చేద్దాము. స్పందన గుణము కలది శబ్దము.స్పందనశక్తి శబ్దమును వివిధస్థితులలోనికి పయనింపచేస్తుంది.ప్రయాణములో వచ్చిన మజిలీలలో,శబ్దము తన సహజగుణమును కొంత విడిచిపెట్టి,కొత్తదనమును మరికొంత పుణికిపుచ్చుకొని,సరికొత్తరూపుతో సాగుతుంటుంది...