Posts

MEEDUSHTAMA SIVATAMA-02

      మీడుషటమ శివ-02    ***********************    న రుద్రో రుద్ర మర్చయేత్-రుద్రుడు కానివాడు రుద్రునితో సంభాషించలేడు-అర్చించలేడు.   సాధకుని మాటకు మయశ్చమే అంతే అని అమాయకముగా అడిగాడు ఆదిదేవుడు అమాయకముగా.ఎంత చతురుడవయ్యా చంద్రశేఖరా! శాపగ్రస్థౌడైన చంద్రుని నీ చాతుర్యముతో శిరోభూషనముగా చేసికొనినావు.ఆ అవ్యాజప్రేమ అటుగా వెళుచున్న నాపై కొంచము ప్రసరించినదేమో.నా నోటినుండి వినాలనుకున్న నీ కోరికను నా అదృషముగా స్వీకరిస్తాను.    నాకు ఇల్లుకావాలి అన్నానుకదా.నీవు సరే అన్నావు.నా ఈ ఉపాధియే ఇల్లు  వస్యశ్చమే అని అడిగాను.  .గూటిలో కూర్చుని ఉన్న నాకు నీ అనుగ్రహముతో ఈ ఉపాధి ఉపయోగమేమిటి? అనే ప్రశ్న ఉదయించింది.ఇదియే నాకు నా ఆధ్యాత్మిక అంచులను చూపించే సాధనము అని అనిపించింది.ఇట్టి విశిష్టగల పరికరమును నేను సమర్థవంతము చేసుకోవాలి కద.అందుకే ఆధ్యాత్మికముగా తృప్తిని కలిగించే భావములను అహారముగా ఇమ్మనమని "ప్రియంచమే" అని అర్థించాను.సంకల్ప వికల్పములు నా మనసును కుదిపివేస్తూ ప్రశాంతతకు అడ్డుపడుతున్నాయి.వాటిని తొలగించి,నా మనో క్షత్రమును చదును చేయుటకు నాగలిని "సీరంచమే" అ...

MEEDUSHTAMA SIVATAMA-01

      మీడుస్టమ శివ-వరములను వర్షించు-01     ***********************************   శం చ మే-    మే నాకు చ కుడా కావాలి ఏది కావాలి?  శం అనగా ఐహిక సుఖము.    ఐహిక సుఖమును పొందవలెనన్న శరీరమునకు ఆహారము-మనసునకు ఆహ్లాదము కావాలి.   తలదాచుకొనటానికి ఇల్లుకావాలి.కనుక -వస్యశ్చమే.      గూటిలోనికి చేరిన తరువాత కూటిపై తాపత్రయము సహజమే కదా-కనక సీరంచమే-వ్యవసాయము చేసుకొనుటకు కావలిసిన నాగలి-ఎద్దులు-ఇతర పరికరములు కావాలి.కనుక సీరంచమే.    ఆహారముతో పాటు నీరు కూడ కావాలి-అంబశ్చమే.  మనకు కావలిసిన అన్ని వస్తువులను పండించుకోలేము కదా! కనూ మిగిలినవి కొనుగోలు చేయవలసినదే.కనుక ద్రవిణశ్చమే.    కూడు-గూడు ఇచ్చావు.మేము వాటిని ఆస్వాదిస్తూ,అనుభవించాలికదా.కూరిమితో వాటిని అనుభవిస్తున్న సమయములో చిన్న చిన్న జలుబు-దగ్గు-జ్వరము వంటి శరీర రుగ్మతలు రావచ్చును.వాటిని దూరముగా నెట్టివేయి-అనామయశ్చమే.    నువ్వు చిన్నచిన్న వాటిని నెట్టివేస్తున్న సమయములో క్షయ మొదలగు పెద్దపెద్ద వ్యాధులు మమ్ములను సమీపించుటకు సాహసము చేయవచ్చును.వాటిని కూడ మా...

009

    అమ్మకు సభక్తిపూర్వక నమస్కారములతో    ప్రసీద మమ సర్వదా-09      *******************   మాతా సిధ్ధిధాత్రి నమోనమః.  " సిధ్ధగంధర్వ యక్షాద్యైః అసురైరమరైరపి    సేవ్యమాన సదాభూయాత్ సిధ్ధిదా సిధ్ధిదాయిని"   సిధ్ధులనైన,గంధర్వులైన,యక్షులనైన,అసురులనైన,అమరులనైన,ఎవరినైనా కొలిచినవారికి సిధ్ధిప్రదాయిని జగదంబ.ఈ శ్లోకము చెప్పకనే చెప్పుతున్నది"ఏకైవ అహం" అన్నింటిలో నుండే దానిని నేనేనని.వేరొకటి లేదని.అనుగ్రహ ప్రతిరూపము దైవత్వము అయితే అహంకార ప్రతిరూపత్వము అసురత్వము.ఇప్పటి వరకు జరిగిన పోరు అహంకారమునకు -అనుగ్రహమునకు . కనుకనే కొమ్ములను అహంకారమునకు గుర్తుగా-నలుపు తనమును తామస గుణమునకు గుర్తుగా-కరుకు చర్మము మూర్ఖత్వమునకు గుర్తుగా-తల్లి అనునయమును పెడచెవిని పెట్టి పోరునకు సిధ్ధపడుట పశ్చాత్తాప రాహిత్యమునకు గుర్తుగా అన్నీ కలబోసిన మహిషునికి-రాశీభూతమైన కరుణకు మధ్యన జరిగిన కదనములో అహంకారము సమసిపోయి అనుగ్రహమును చేరినది.తల్లి కర స్పర్శ కర్మఫల విముక్తుని చేసినది.ఈ విషయమును అమ్మ మనకు మహిషునిచే పలికించిం-నది.నా ఒక్కనితో పోరాడుత చేతకాక ఎన్నో శక్తులను ఎందరో స్త్రీలను ...

0008

  అమ్మకు   సభక్తిపూర్వక నమస్కారములతో   ప్రసీద మమ సర్వదా-08   **************  మహాగౌరి నమోస్తుతే  "శ్వేతవృషే సమారూఢా శ్వేతాంబర ధరా శుచిః   మహాగౌరి శుభం దద్యాత్ మహాదేవ ప్రమోదదా"  అష్టవర్షా భవేద్గౌరీ -తల్లి ఎప్పుడు ఎనిమిది సంవత్సరముల వయసుగల మూర్తిగా దర్శనమిస్తుందట.   ' కర్పూరగౌరం కరుణావతారం     సంసారసారం భుజగేంద్రహారం     సదావసంతం హృదయారవిందే     భవం భవానీ సహితం నమామి."    అయ్య కర్పూరకాంటివంటి తెల్లని కాంతిగలవాడని,అమ్మ బ్రహ్మచారిణిగా ఘోరతపమాచరించుటచే,నల్లని శరీరకాంతితో నున్నదని.కాళి అని స్వామి మేలమాడినందుకు తల్లి తన శరీరఛాయను ఆకాశగంగా జలముతో పునీతము చేసుకొని గౌరవర్నమును పొంది గౌరి నామధారియైనదని ఒక కథనము.స్వామి అమ్మ కన్నులు సరదగా మూసినందులకు చీకటి తల్లి శరీరకాంతిని పొందినదని మరొక కథనము.ఏది ఏమైనప్పటికిని ఆదిశక్తి తన చర్మ కాంటిని నల్లగా ప్రకటించుకొనుట-తదుపరి తెల్లగా ప్రకాశించుట లోని పరమార్థము ప్రశస్తనీయము.   మనము ముందర చర్చించుకొనినట్లు అసురులు తమ జీవితమును-మరనమును అత్యంత ప్రత్యేకముగా తీర్చిదిద్దుకుం...

0007

అమ్మకు సభక్తిపూర్వక నమస్కారములతో ప్రసీద మమ సర్వదా మాతా కాళరాత్రి నమోనమః " ఏకవేణి జపకర్ణి పూరానగ్నా ఖరస్థితా లంబోష్ఠి కర్నికాకర్ణీ తైలాచ్యక్త శరీరిణీ వామపాదోల్లిసల్లోహలితా కంతకా భూషణా వరమూర్థ్వ ధవజా కృష్ణాకాళరాత్రిర్భయంకరీ." జుట్టును చెల్లాచెదురుగా విరబోసుకొని,పెద్దగా వాచిన పై పెదవితో,శరీరమంతా తైల లేపనముతో,ముళ్ళ ఆభరనములను ధరించి,గాడిదపై ఎడమకాలు ముందుకు చాచి,కూర్చున్న కాళరాత్రి మాత మనలను రక్షించు గాక. కాళరాత్రిః మహారాత్రిః మోహరాత్రి చ దారుణా" రాత్రిసూక్తము. అంటూ రాత్రి తత్త్వము నాలుగు విధములుగా ప్రస్తుతించబడినది.దీపావళి ముందురోజువచ్చే చతుర్దశిరాత్రి కాళరాత్రి.దీపావళినాటి రాత్రి మహారాత్రి.శ్రీకృష్ణజన్మాష్టమి మోహరాత్రి.అక్షయతృతీయ దారుణరాత్రి అని పెద్దలు చెబుతారు. అసలు మనము రోజు నిద్దరపోయే సమయమే రాత్రియా లేక రాత్రి శబ్దము ఇంకేమైన అంతరార్థమును కలిగియున్నదా అని మనలను మనము ప్రశ్నించుకుంటే ప్రతిజీవి అంతర్ముఖమే రాత్రి.బహిర్ముఖమే పగలు.కర్షణాత్ కృష్ణః.సమస్తమును తనలోనికి ఆకర్షించుకొనుశక్తి కృష్ణతత్త్వము.అదియే కాళరాత్రి తత్త్వము....

0006

    అమ్మకు సభక్తిపూర్వక నమస్కారములతో    ప్రసీద మమ సర్వదా-06    **************************     కాత్యాయనీమాతా నమోనమః.  " చంద్రహాసోజ్వలకరా శార్దూలవరవాహనా    కాత్యాయినీ శుభం దద్యాదేవి దానవఘాతినీ."   అమరకోశం పార్వతీదేవిని కాత్యాయనీ నామంతో కీర్తించింది.అనేక నామ-రూపాలు అమ్మ క్రీడలు.సింహవాహిని యైన తల్లి ఘోరాఘోర రూపిణి.   అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ కత్యమహర్షిచే అమ్మాయి అని పిలిపించుకుంటూ ఆనందించింది,తండ్రిగా మునిని అనుగ్రహించింది.కత్యగోత్ర సంభవురాలు కనుక కాత్యాయినీ నామముతో కళ్యాణములను అనుగ్రహించింది.ఇది వాచ్యార్థము.    సాధకుడు తత్ ను దర్శించవలెనన్న ,  కతిః యానం? ఏది మార్గము? కతిః అయనం? ఎటువైపు పయనము? అని దారితెన్ను తోచని స్థితిలో నుండగా తల్లి తానే మార్గమై వారిని ఉధ్ధరించునది కనుక కాత్యాయని.ఇది పరమార్థము.   కాత్యాయనీ మాత బుధ్ధిబలముతో కూడిన భుజబల ప్రకాశము.ఆజ్ఞా చక్ర అధిష్ఠాన దేవతగా సాధకునకు ఏకాగ్రతను అనుగ్రహిస్తుంది.మహిషాసుర ఆగడములవలన ధర్మము క్షీణిస్తూ,గ్లనిని పొందే సమయమున క్రోధరూపిణియై ఆదిశక్తి మహిషాసుర మర...

0005

. అమ్మకు సభక్తిపూర్వక నమస్కారములతో ప్రసీద మమ సర్వదా-05 ****************** స్కందమాత నమోనమః ******************* "సింహాసన గతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా శుభమస్తు సదాదేవి స్కందమాతా యశస్వినీ" ఇంతవరకు జగన్మాత నిర్ద్వంద్వ రూపిణిగా నిరుపమాన ప్రతిభతతో జగములను సృష్టించింది."ఏకైవాహం బ్రహ్మం" అన్న నానుడి మరొక శుభపరిణామమునకు శ్రీకారముగా మహాశక్తి తన ఒడిలో మరొక అద్భుత శక్తితో మనకు దర్శనభాగ్యమును అందిస్తున్నది. ఎంత తియ్యటిమామిడి పండో అంటూ నేడు మనము ఆస్వాదించగలుగుతున్నామంటే ,ఎంతో కాలానికి ముందు.ఎవ్వరో మహానుభావుడు మామిడిటెంకను భూమిలో నాటడము జరిగిదింది.భూమి దానికి తనశక్తిని అందించి,అగ్ని చైతన్యమును అందించి మొలకగా మార్చినది.వరుణుడు అందించిన జలములతో మొలక మొక్కగా మారినది.మొక్క సూర్యకిరణములనుండి పత్రహరితమునుచంద్రుని వెన్నెలలోని ఔషధశక్తులను తనలో నింపుకుంటూ కొమ్మలతో వాయువందిస్తున్న శక్తిని తనలో నింపుకుంటూ పంచభూతాత్మక పోషణలో మహా వృక్షముగా రూపుదిద్దుకుని మధురఫలములను మనకు అందిస్తున్నది.ఇది లౌకిక ఉదాహరణము. పంచభూతాత్మికం పరమశివం అన్నది కాదనలేని సత్యము....