Posts

ALO REMBAVAAY-13

Image
  పదమూడవ పాశురం **************** పుళ్ళిన్వాయ్ కీండానై ప్పొల్లా అరక్కనై క్కిళ్ళి క్కళైందానై క్కీర్తిమై పాడిప్పోయ్ పిళ్ళైగళ్ ఎల్లారుం పావై క్కళం పుక్కార్ వెళ్ళి ఎళుందు వ్యాళంఉరంగిట్రు పుళ్ళుం శిలంబినకాణ్! పోదరికణ్ణినాయ్! కుళ్లక్కుళిర క్కుడైందే నీరాడాదే పళ్ళికిడత్తియో? పావాయ్! నీ నన్నాళాల్ కళ్ళం తవిరందు కలందేలో రెంబావాయ్.  ఓం నమో భగవయే వాసుదేవాయ నమః.  ****************************   ఈ పాశురములో గోదమ్మ మనకు నాలుగు విషయములను ప్రస్తావిస్తూ,వాటి ప్రాముఖ్యతను వివరిస్తున్నది.   మొదటిది-ఇంద్రియ దుర్వినియోగము-దాని ఫలితములు  రెండవది-ఉషోదయ ప్రాముఖ్యత. మూడవది-భూమానందము.  నాల్గవది-శబరి గొప్పతనము.   తల్లి బకాసురవధను కీర్తిస్తున్నట్లుగా పాశురమును ప్రారంభిస్తోంది.  పిళ్లైగళై-గోపికలందరు,  (సంతోషముగా)  పొల్లా-మాయావి యైన,  అరక్కన్-అసురుని,అందున పక్షిరూపముగా తన కామరూప శక్తితో వచ్చిన వానిని,  పుళ్ళన్-కొంగరూపముతో,అదియును అందమైన తెల్లని కొంగరూపముతో ఖదిరి వనమున ప్రవేశించిన వానిని, కీండానై-వాడి నోటిని/ముక్కును విభజించి/చీల్చి,  కళందునె-సంహరించిన...

ALO REMBAVAY-12

Image
     పన్నెండవ పాశురము.  *******************  కనైత్తిళం కాట్రెరుమై కన్రు క్కిరంగి  నినైత్తు ములై వళియే నిన్రుపాల్ శోర  ననైతిల్లం శేరాక్కుం నర్చెల్వన్ తంగాయ్  పనిత్తళై వీళనిన్ వాశల్ కడైపట్రి  శినత్తినాల్ తెన్నిలంగై క్కోమానై శెట్ర  మనత్తుకు ఇనియానై ప్పాడవుం నీవాయ్ తిరవాయ్  ఇనిత్తాల్  ఎళుందిరాయ్! ఈ తెన్న పేరురక్కం  అనితిల్ల తారారుం అరుందేలో రెంబావాయ్.     ఓం నమో భగవతే వాసుదేవాయనమః  *********************************   ఇనిత్తాల్-ఇప్పటికైనా?ఇప్పుడైన,     ఎళుందిరాయ్-మేలుకొను,మేల్కొనివచ్చి మమ్ములను/మా పరిస్థితిని చూడు,  మేమెలా ఉన్నామంటే,  పని-మంచు,  తళై-తలలపై కురుస్తున్నది.అసలే హేమంత కాలమేమో,విపరీతముగా కురుస్తున్నది .దానిని తాళలేక నీ ఇంటిముందున్న తలుపు చూరు పట్టుకుని ఉన్నాము. నిన్-నీ, వాశల-బయటి తలుపు, కడై-చూరు, పట్రి-పట్టుకొని యున్నాము . ఇనిత్తినాల్-ఇప్పుడైన, ఎళుందిరాయ్-మేలుకొనవమ్మా.   మేమెందుకలా చూరుపట్టుకొని ఉండాలి?         ,కొంచంపుసేపు కూర్చోవచ్చుకదా అని అనుకు...

ALO REMBAAVAAY-11

Image
  పదకొండవ పాశురము.  ***********************    కట్రుక్కరవై కణంగళ్ పలకరందు    శెట్రార్తిరళలియం శెన్రు శెరుచ్చెయ్యుం        కుట్రం ఒన్రిల్లాద కోవలరం పొర్కిడియె    పుట్రు రవల్గున్ పునమయిలే పోదారాయ్    శుట్రుత్తు తోళీమార్ ఎల్లారుం వందు నిన్    మూట్రం పుగుందు ముగిల్ వణ్ణన్ పేర్పాడ   శిట్రాదే-పేశాదే సెల్వ పెండాట్టి, నీ   ఎట్రుక్కు ఉరంగుం పొరుళేలో రెంబావాయ్.    నమో భగవతే శిఖి పింఛాయ నమః.    *************************    కోవలరం పొర్కడియె-గోకులపు బంగరుతీగె/ ఓ గోపిక,   మీ గోకులములోని గోపాలురు అతిబలపరాక్రమవంతులు.తమకు తాము శత్రుస్థావరములను/బలమును గుర్తించి,వారిపై దండెత్తి మట్టుపెట్టువారు.అంతః శత్రువులకు సైతము అదేగతి.  వారి పరాక్రమ ప్రదర్శన కేవలము శత్రువులమీదనే.  శెట్రాల్-శత్రువుల  తిరళ్-బలపరాక్రమములను తెలిసికొని  శెరుచ్చెయ్యం-తామే వారిపై దండెత్తి,  అరళియం-మట్టుపెట్టి వచ్చువారు.   మిగతా సమయములలో వారు గోపోషణమను స్వధర్మవృత్తిని/సత్వగుణను కలిగియున్నవా...

ALO REMBAAVAAY-10

Image
 పదవ  పాశురము.  *************** నోట్రుం చువర్కం పుగుగిన్ర అమ్మణాయ్ మాట్రావుం  తారారో వాసల్  తిరవాదార్ నాట్రా తుళాయ్ ముడి నారాయణన్ నమ్మాళాల్ పోట్రా పరైతర్రుం పుణ్ణెయనాళ్ ఒండొరునాళ్ కూట్రత్తిన్ వాయ్ వీళ్దం కుంబకరణనుం తోట్రుం  ఉనక్కే పెరున్ తుయిల్ తాన్ తందానో అట్ర అనందన్ ఉడయాయ్  అరుంగలమే తేట్రమాయ్ వందు తిరవేలో  రెంబోవాయ్.  పాదములలదుకున్నవి వేదగంధమును  పెదవులందించునుగద నాదగంధమును  నలువనందించిన నడుమున కమలగంధంబు  మెడమీడ నడయాడు తులసిగంధంబు  నిస్తులమైన నుదుటను కస్తురిగంధంబు  ఎన్నిగంధంబులు తన్ను బంధించుచున్నను  గోద పూమాలల గంధంబు మోదమందించుట  నిర్వివాదము ఆహా!.సర్వసుగంధునకు.  "తిరుపళ్ళి ఎళుచ్చి " పాశురములలో ఐదవ గోపికను గోదమ్మ అమ్మణాయ్ అంటు మేల్కొలుపుతోంది.బాహ్యమునకు ఈమె నివాసము శ్రీకృష్ణుని ఇంటి పక్క ఇల్లు.ఎప్పుడు స్వామి తనను చూడాలన్నా,తాను స్వామిని చూడాలన్న అడ్డుగోడను దూకి వెళ్ళి ఆనందించేవారట.స్వామితో అత్యంత సాన్నిహిత్యము కలది కనుక స్వామిని ( అమ్మణ్ణాయ్.)అని సంబోధిస్తున్నది.గోదమ్మ.  ఏవా ఇరుగిల్లు-పొరుగి...

ALO REMBAVAY-09

Image
 తొమ్మిదవ పాశురం *************** తూమణి మాడత్తు  సుట్రుం విళక్కెళియ తూపం,కమళ త్తుయిల్ అణై మేల్ కణ్ వళరుం మామాన్! మగళే! మణికదవం తాళ్ తిరవాయ్ మామీర్! అవళై ఎళుప్పీరో! ఉన్ మగళ్ తాన్ ఊమైయో? అన్రి  స్సెవిడో? అనందలో? ఏమన్ పెరున్ తుయిల్ మందిరపట్టాళో? మామా ఎన్ మాదవన్-వైకుందన్" ఎన్రెన్రు నామం పలవుం నవిన్రు ఏలోరెంబావాయ్.   ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.   ******************************  మా  మాయన్-మహా మహిమాన్వితుడ  మాధవన్-మాధవా  వైకుందన్-వైకుంఠ వాసా  మా మాయన్-మహా మహిమాన్వితుడ  మాధవన్-మాధవా  వైకుందన్-వైకుంఠవాసా,అంటు    ఎన్రెన్రు-మరీ మరీ వినిపిస్తునది    హరినామ సంకీర్తనము.ఎక్కడ?   తూమణి-దోషరహితమైన మణులు పొదిగిన,  మాడత్తు-మేడ దగ్గర.  ఎవరు చేస్తున్నారు?బయట నున్న గోపికలు.   మణిమయకదవం తాళ్-మణిమయ తలుపు గడియపెట్టి ఉన్నది.దానిదగ్గర.  ఎందుకు చేస్తున్నారు-పెట్టి ఉన్న గడియను      గోపికను వచ్చి తెరువమని అభ్యర్థిస్తున్నారు.  తలుపు గడియ తీయమనవచ్చును కదా నేరుగా,  బయట నున్న గోపికలు స్వ గత ఆశ...

ALO REMBAVAY-08

Image
ఎనిమిదవ పాశురము. *****************   కీళ్వానం వెళ్ళెండ్రు ఎరుమై సిరువీడు   మేయాన్ పరందన కాణ్ మిక్కుళ్ళ పిళ్ళైకళుం   పోవాన్ పోగిన్రారై పోగామల్ కాత్తు   కూవువాన్ వందునిన్రోం కోగులం ఉడయ   పావాయ ఎళుందిరాయ్ పాడి పరై కొండు   మావాయ్ పిళందనై మల్లనె మాట్రినాయ్  దేవాదిదేవనై శెన్రునాం సేవిత్తాల్  ఆవా వెన్రాయాండు అరుడేలో రెంబావాయ్.    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.  దేవదిదేవనె-శ్రీకృష్ణ పరమాత్మను  ఆవావెన్రు-త్రికరణ శుధ్ధితో  శెన్రుదాం-చెన్నుమీర  సేవిత్తాల్-సేవించుటకు  పావాయ్-ఓ గోపికా  ఎళుందిరాయ్-మేలుకో.  ఈ గోపిక బహిర్ముఖమగుటకు సుముఖముగా లేదు.చతుర భాషిణి.కనుక తగిన సమాధానములతో తాత్సారముచేస్తూ,వారిని పంపించేయాలనుకుంది.   అందుకే గోదమ్మ,  కీళ్వానం వెళ్ళెన్రు-   వానం-ఆకాశము   కీళ్వానం-తూరుపుదిక్కు,    ఆకాశములోని తూరుపు దిక్కు తన నల్ల రంగును వీడి( తమోగుణమును)   వెళ్ళెన్రు-తెల్లబడినది/తెల్లవారినది.  కణ్-చూడు అనగానే,  లోపలనున్న గోపిక,   ఆ ప్రకాశము తూరుపు దిక్కుది కాదన...

ALO REMBAVAY-07

Image
  ఏడవ  పాశురము   ****************  కీశు కీశెన్రెంగుం  ఆనైచ్చాత్తు కలందు  పేశిన పేచ్చరవం కేట్టిలైయో? పేయ్ పెణ్ణే     కాశుం పిరప్పుం కలగల ప్పక్కై ప్పేర్తు  వాశ నరుం కుళల్ ఆయిచ్చియర్ మత్తినాల్  ఓశై పడుత్త  తైరరవం కేట్టిలైయో?  నాయగ పెణ్ పిళ్ళాయ్ నారాయణన్ మూర్తి  కేశవనై పాడవుం నీకేట్టే కిడత్తియో  దేశం ఉడయేయాయ్ తిరనేలో రెంబావోయ్.  " నారాయణతే నమో నమో   నారద సన్నుత నమోనమో."   తమోనిద్రను వీడి తాదాత్మ్యములో నున్నవారు కొందరు,తన మదిలోని స్వామిని సేవించువారు మరికొందరు,తన్మయములో నున్న కొందరు,తలపు మార్చుకొనుటకు ఇష్టపడనివారు కొందరు,తలుపుతీయుటకు ఇష్టపడని వారు ఇంకొందరు,తనవాడేనని తనతోనే ఉండాలనే వారు కొందరు,తనివితీరని తాదాత్మ్యముతో పరిసరములను పట్టించుకోని వారు ఇలా వివిధ భావములతో,భంగిమలతో,అనుభవములతో ..... నున్న గోపికల రూపములలో నున్న ఆచార్యులను/ఆళ్వారులను తల్లి దయతో మనము దర్శించ బోతున్నాము. వీరిలో ఎవరు ఎక్కవభక్తికలవారో-ఎంతటి భాగ్యశాలురో చెప్పుట సాధ్యము కానిది.  నిద్రిస్తున్న వారిది పారవశ్యము.  మేల్కొలుపు వారిద...