Posts

DHYAAYAET IPSITA SIDHDHAYAET-10

Image
    ధ్యాయేత్  ఈప్సిత సిధ్ధయేత్-10   ********************************   సర్వము తానెయైన వానిని దర్శిస్తూ,  బ్రహ్మమొక్కటే-పరబ్రహ్మమొక్కటే" అనిసంకీర్తిస్తీ,బ్రహ్మానందములో మునిగిపోయాడు ఆ అన్నమయ్య పాత్రధారి.     బహిర్ముఖమగుటకు ఇష్టపడుటలేదు.  మూలకారణంబిది  అని సన్నగా సన్నగా గొణుగుతున్నాడు.ఆది అనాది మధ్యయు కూద ఇదియే అంటున్నాడు.  మీరు అంటున్న ఇది-ఏది స్వామి అని ప్రశ్నిస్తూ అతనిని బహిర్ముఖుని చేసారు ఎదుటనున్న వారు.    బ్రహ్మము-దానిని కనుగొనినప్పుడు కలిగే బ్రహ్మానందము అని చెమర్చిన కన్నులతో బదులిచ్చాడు వారికి.   బహుళానందులను మించినదా ఆ బ్రహ్మానందము? సందేహము సందడి చేసినది అక్కడ.   అసలు బహుళానందములు అంటే అడగటం అతని వంతయింది.    అంటేఎన్నో విధములుగా-ఎన్నో పర్యాయములు ఎన్నో ప్రదేశములలో,ఎన్నో నామరూపగుణములతో విసుగు చెందక మనలను ఆనందపరిచేది అత్యుత్సాహముతో వచ్చింది సమాధానము.   సమాధానముగా చిరునవ్వు తొ అన్నమయ్యపాత్ర నుండి తన ఆహార్యమును తొలగించుకొని భాగవతారుగా అసలైన నామరూపములతో వారితో  తన సంభాషణమును ప్రారంభించారు. ...

DHYAAYAET iPSITA SIDHDHAYAET-09

Image
   ధ్యాయేత్  ఈప్సిత సిధ్ధయేత్-09  *****************************   నేను అంతే కేవలము ఉపాధిగా భావింపబదే ఈ శరీరమా? లేల అంతకు మించి ఏమైన ఉన్నదా? అన్న సంసయము నన్ను తొలిచివేస్తున్నది.   ఉపాధిని కారనముగా కనుక మనము అనుకుంటే దానికి కారణమైనది ఏది? ఒకవేళ ఇది స్వయం నిర్మితమనుకుంటే దీనికి మనము ఇన్ని వైల్యములు-దురవస్థలు వృధ్ధాప్యము-మరణము మున్నగు వానికి లోనుకానీయము కదా.   కనుక నిస్సందేహముగా ఇది పరాధీనము.ఏదో మహాశక్తి కనుసన్నలలో తన ప్రతి కదలిక ఆధారపడియున్నది.   అయితే ఈ విషయమును మనము విస్మరిస్తున్నామా? అనుకోకుడా ఎదురింటివైపుకు మళ్ళింది నా దృష్టి...     గుమ్మమునకు కట్టిన పరదా తెర అప్పుడు సరదాగ కదులుతు గాలికి,లోపలి వస్తువులను లీలగా చూపిస్తున్నది.అంతలో కప్పివేస్తున్నది.నేను తెలిసికొనవలసిన సత్యమును చెప్పకనే చెప్పుతున్నదా అనిపించింది.    అంటే మన లోపల ఏముందో మనము గుర్తించలేక పోవుటకు కారనము "ఆవరణము" అని అంతటా ఆవరించి యున్న మాయతెర అన్నమాట.అది లోపలనిన్ను వస్తువులను(విక్షపమును) దాచివేసి దానిని మాత్రమే మనలను దర్శింపచేస్తున్నదన్నమాట.   ఏ విధముగా తె...

DHYAAYAET IPSITA SIDHDHAYAET-08

Image
   ధ్యాయేత్  ఈప్సిత సిధ్ధయేత్-08  ****************************** ఉపన్యాసలహరి లో రేపటి అంశము,     నేను-నాది     ***********  అని కార్యక్రమమును ముగించారు.     నేను-నాది అంటే రెండా/ఒకటా అనే సందేహము నాలో సందడి చేస్తున్నది.    ఎప్పుడో విన్న ప్రసంగములు ప్రసన్నములైనవో అన్నట్లు కొంచము కొంచము   నన్ను ఆలోచింపచేస్తున్నవి.   జీవుడు కారణము-జగము కార్యము.ఈ కార్య-కారణ సంబంధపు దాగుడుమూతలే రెండుగామన నుండి వేరుగా కనిపించే ద్వైతములు.    ఎవా ద్వైతములు? అభాస-వాస్తవికత గా దోబూచులాడు వింతలు.    ప్రకటిత స్వరూపము-వాస్తవిక స్వరూపము అను రెండు మనలను భ్రమింపచేయు ఏకైక చేతనము.   తనకు ఇష్టమైనప్పుడు వాస్తవిక స్వరూపము తనతో పాటుగా నామరూపములను-గుణత్రయములను కలుపుకొని,తాను మాత్రము గోప్యముగా నుండి తనతో పాటుగా తెచ్చుకొనిన,తాను సృష్టించిన జగతి అనే పరికరము ద్వారా ప్రకాశిస్తుంటుంది.  ఆ అంతటా  ప్రకాశించేది ఆభాస.   అంతే ,  అంటే మన ఉపాధి దానిలో దాగిన చిత్శక్తి ద్వారా చేతనవంతమగుచున్న ఒక పరికరమా?  అయినే నేన...

DHYAAET IPSITA SIDHDHAYAET-07

Image
    ధ్యాయేత్ ఈప్సిత సిధ్ధయేత్-07    ***********************  వర్షాకాలం ప్రారంభమైనది.పొలమును దున్నుతున్నారు.అంతే బీడునేల పంటభూమిగా మారబోతున్నది.చుట్టు ఉన్న కలుపు మొక్కలను తీసిపారేస్తున్నారు రైతులు.అవి మొక్కలుగా కనిపిస్తున్న పంట విద్రోహక శక్తులు.నేలసారమును స్వీకరించి పంటకు సారమునందనీయని అడ్డంకులు.  ఒక విధముగా ఆలోచిస్తే మన విశేషములు అంతే.సామాన్యమును కననీయని అడ్డంకులు.ఏ విధముగా రైతు వానిని తీసివేస్తున్నాడో అదే విధముగా  మనము సామాన్య విశేషముల నుండి విసేషములను తొలగించుకొనుటకు ప్రయనించాలి.ఒక్కసారి మాత్రమే కాదు.ఏవిధముగా రైతు ధాన్యమును నూర్చి తప్పగింజలను తూర్పారపదతాడో అదే విధముగా.తప్పగింజలు తప్పుకొనేలా చేసుకోవాలి.   మన చుట్టు-మన మనసు చుట్టు ఎన్నో గజబిజి ఆలోచనలు ఆవరించి,పరిస్థితులుగా పరిణామము చెందుతు మనలను ప్రశ్నిస్తూనే ఉంటాయి.వాటిలో సమాధానమీయవలసిన యోగ్యత అన్నింటికి ఉండదు.వాటిలో కొన్ని మన సాధనకు అనుకూలములు-కొన్ని ప్రతికూలములు.  మనము అత్యంతశక్తిహీనులమని సరనాగతి మార్గమునకు చేర్చునవి అనుకూలములు.   సత్యమును అసత్యముగా-అసత్యమును సత్యముగా మనలచే భ్రమింపచేయ...

DHYAAYAET IPSITA SIDHDHAYAET-06

Image
   ధ్యాయేత్  ఈప్సిత సిధ్ధయేత్-06  **************************  సత్యమును అసత్యమని-అసత్యమును సత్యమని ప్రత్యర్థిని ఓడించి దానిని సమర్థించుకునేందుకు కాలం తన గమనములో నిర్దేశించిన అవకాశము రానే వచ్చింది.  సమాధానమును సమర్థించవలసిన వారు ప్రశాంతముగానే ఉన్నారు.ఎదురుచూస్తున్న సభ్యులలోని అభ్యంతరాలు ఆందోలనను నింపుకుని చిందవందరగా ఉన్నాయి.   సభావందనమును చేసిన తరువాత మర్యాదపూర్వకముగా తమ సమర్థనను ప్రారంభించారు.  అయ్యా వందనములు.మొదట మీరు మాముందుంచినది పుష్పగుచ్ఛము.అందులో ఒక సామాన్యము మరొక విశేషము కలిసి యున్నవి.నిజమేనా? ఇప్పుడు ప్రశ్నించుట వీరి వంతుగా మారినది.    అంటే అంటే  తడబడ్డారు వారు అవుననలేక/కాదనలేక.  ఒక్క నిమిసము నిశ్సబ్దము తరువాత ,  మీరన్నదే నిజమైతే ఇందులో సామాన్యము ఏది? విసేషము ఏది?దేనికి ఏది ఆధారము?దేనికి ఏది ఆభాస? వీటి పర్యవసానము ఏమిటి?   గంభీరమైన గళము గులాబీలు-వాటి వివిధ రంగులు-రూపములు-స్వభావములు విశేషములు.వానిలో దాగియున్న శక్తి శాశ్వతము.    మరింత వివరణ అవసరము అంటూ ....    సరే చెబుతాను వినండి.నిన్నటి ముందు ...

DHYAAYAET IPSITA SIDHDHAYAET-05

Image
    ధ్యాయేత్ ఈప్సిత సిధ్ధయేత్-05   ***********************        మనసంతా ఒకటే గందరగోళం.మనము చూసేదిది నిజమైనది -శాశ్వతమైనది కాదా? శాశ్వతమైనది సులభముగా మనము దర్శించలేమా?   లోపల బయట తానే యున్నదంటున్నారు కొందరు "జగమెవ్వని లోపలనుండు "అంటు.   అంటే ఈ దృశ్యప్రపంచము ఎచరో మనకు తెలియని వాని లోప ఉందా?    లోపకనుక ఉంటే మనలను బయటనే ఉన్నట్లు ఎలా భ్రమింపచేస్తున్నది.   ఇది భ్రమ తత్త్వమా? బ్రహ్మాండ తత్త్వమా?   ఒక సందేహమునకు తోడుగా మరొక సందేహమును జతకలుపుకొనుటకా అన్నట్లు,  పనులన్నీ చేసుకొని కాసేపు కాలక్షేపం కోసము చర్చావేదికను చూచుటకు టి.వి ముందు కూర్చున్నాను.  కార్యక్రమము ప్రారంభమైనది.చర్చకు ఇరువర్గముల వారు అభిముఖముగా అసీనులైనారు.ఆసనముపై న్యాయనిర్ణేత వారిని గమనిస్తున్నారు.         గులాబీలతో,   సహకారపరికరములుగా కొన్ని వస్తువులను ప్రవేశపెడుతూ చర్చా కార్యక్రమమును ప్రారంభింపచేసారు.  వారిద్దరి మధ్యన రంగురంగు గులాబీలతో, అలంకరింపబడిన పుష్పగుచ్చమును ఉంచారు.గులాబీలలో కొన్ని ఎర్రవి.కొన్ని పసుపుపచ్చవి.కొన్ని త...

DHYAAYAT IPSITA SIDHDHAYAET-04

Image
  ధ్యాయేత్ ఈప్సిత సిధ్ధయేత్-04 ******************************  ఆలోచనలలో మునిగియున్న నన్ను మరొక సందేహము ముందర నిలిచి,సతమతము చేస్తున్నది నా దినచర్యను ఒక సిధ్ధాంతముగా మారుస్తు.  వాటి సంగతి సరే.మరి నా సంగతి ఏమిటి? నిన్న రాళ్ళ ఉప్పు పట్టుకుని వస్తున్నప్పుడు నా ఇంద్రియములైన కళ్ళు-స్పర్శ దానిని ఉప్పుగా గుర్తించి నాకు చెప్పినవి.తెచ్చి గిన్నెలో వేసి అవతలికి వెళ్ళానో లేదో తిరిగివచ్చేటప్పటికి నా కళ్ళు ఉప్పును చూడలేమంటున్నవి.నా స్పర్శ కూడా ఆ నీళ్ళలో ఉప్పు ఉన్నదో/లేదో తాను చెప్పలేనంటున్నది.అంతలో నా జిహ్వ నేను చెప్పగలను అంటు రుచి చూసి ఉప్పు నీళ్ళలో కలిసినదని చెప్పినది.దృష్టి-స్పర్శ తమ శక్తిని ప్రదర్శించినపుడు జిహ్వ తన ప్రభావమును దాచివేసినది. అవి నిస్సహాయములైనపుడు తన శక్తిని ప్రకటించి చేతనునకు తోడైనది.  నిన్న మామిడిపండు కూడా తన రంగుతో నా దృష్ని,సువాసనతో నా నాసికను చైతన్యవంతము చేసి,నేను దానిని తినుటకు తాము సహాయపడలేమన్నవి. అప్పుడు నాలుక తన చాకచక్యముతో అద్భుతరుచులను అనుభవములోనికి తెచ్చినది.  నాకు సహాయపడుటలోనే కాదు.ఇతరుల ప్రతిభను గుర్తించుటలో కూడ సమర్థవంతములు కావు.  కనుకనే వే...