Posts

DANDI ADIGAL NAYANAR

దండి అడిగళ్ నాయనారు ********************* బ్రహ్మ మురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ప్రణమామి సదాశివ లింగం. ఏ సంకేత రూపముగా నున్న పరమాత్మ లింగమును బ్రహ్మ విష్ణువు మొగిలిన దేవతలు అర్చింతురో,నిర్మలమైన ఏ లింగము సకల చరాచర జన్మలకు ముడిపడియున్న కర్మపాశములను విడదీసి,దుఃఖములను నశింపచేయునో అట్టి సదాశివునికి నా నమస్కారములు. ******** చోళదేశములో తిరునావూరులోని పరమ శివభక్తుడు దండి అడిగళ్ నాయనారు. అడిగల్ పాదపద్మములు-పరమేశ్వర పాదపద్మములను దండిగా అపరిమితముగా నమ్మిన వాడగుటచే దండి అడిగళ్ గా కీర్తింపబడుచున్నాడు.వారు సార్థకనామధేయులే సదాశివునికి ప్రియమైన వారే. దండి అడిగల్ బాహ్యమునకు అంధుడు.అంతర్దర్శనశక్తిమంతుడు. కన్ను తక్క నాలుగు ఇంద్రియములను స్వామిసేవకు మిక్కిలి ప్రేమతో సమర్పించే సమర్థుడు. స్వామి లీలలు వినుచు తన శ్రవణేంద్రియమునకు సౌఖ్యమును కలిగించేవాడు. స్వామిని తాకుతు స్పర్శను పరవశమొందించేవాడు. సామి కరుణ యను సుగంధములను ఆఘ్రాణించుచు ఆనందపడేవాడు .పరమేశుని గుడి చుట్టు ప్రదక్షిణములను లక్షణముగా చేస్తూ మురిసిపోయేవాడు. నిర్మల...

MAIPORUL NAYANARU

మెయిపొరుల్ నాయనరు **************** అంతా పరమాత్మ స్వరూపమే అని నమ్మేవాడు పొరుళ్ ఈ విశ్వము విశ్వశ్వరుని స్వరూపము అన్న సత్యమును నమ్మేవాడు కనుక మెయి పొరుళ్,మై పొరుల్ నాయనారుగా కీర్తించబడుతున్నాడు.తిరుక్కోయిలూరులో వీరత్తరేశ్వరుని కొలుచు పరమ శివ భక్తుడు.సేది దెశమును ఏలినవానిగా కొందరు సేది నాయనారు అని కూడా కీర్తిస్తారు రాజుగా ఉత్తమ నాయకుడిగా ప్రజాపాలనను కొనసాగించినవాడు కనుక ఆ హోదాను గౌరవిస్తూ, మిలాద్ ఉడయార్-మిలాద్ నాయకుడు అని కూడా సంబోధిస్తారు. ఈ నాయనారు బద్దెన కవి సుమతీశతకములో చెప్పినట్లు, 'అపకారికి నుపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతీ" అన్న సుభాషితమునకు నిలువెత్తు నిదర్శనము. తమ ఊరిలోని శివాలయములలోనే కాక రాజ్యములో పలుప్రాంతములలో పరమేశ్వారాధనమును కొనసాగించేవాడు.స్త్రీ-పురుషులు.పిన్నలు-పెద్దలు,ధనిక-పేద,మొదలగు బాహ్య వ్యత్యాసములను అధిగమించి ప్రతి ఒక్కరిలో పరమేశ్వరుని చూడగలిగి,భావించగలిగి,భాషించగలిగి,ఆరాధించగలిగిన ప్రావీణ్యమును పొందిన పుణ్యశాలి. రాజ్యము-రాజు-ప్రజలు సుభిక్షముగా నున్న సమయమున ఆది భిక్షువు తన ఆతను ప్రారంభందలచాడు.ఆపగలవారెవరు? పొరుగు రా...

RUDRA PASUPATI NAYANARU

URUTTIRU PASUPATI NAYANAR తిరుతొండర్దొగై సనాతన వైదిక బ్రాహ్మణ కుటుంబమున తిరుతలయూరు నందు జన్మించారు.త్రికాలములందు తలలోతు -తిరుతలయూరు నందలి పార్వతీ శ్రీ బాలేశ్వర స్వామి పుష్కరిణీ తీర్థమునందు తలలోతు మునిగి రుద్రపారాయణను అదే నమ్మినవాని అర్చనగా నమకచమక పారాయణమును చేసేవాడు.భవ పాశములను తొలగించే పతి ని కొలిచేవాడు శివుడుగా -- నిద్రాహారములు దరిచేరుటకు ధైర్యము చేయలేకపోయేవి.అన్యమునకు స్థానము నాస్తి నాస్తి.శ్వాస మాత్రమే రుద్రనాయనారు అనుష్టానమునకు ఆలంబనగా ఉండేది. ఇక్కడ మనము కొంచము పరిశీలితే అనేకానేక జన్మల చక్రములలో నిరంతరముగా తిరుగుచున్న జీవునికి దాని నుండి విముక్తి లభిచాలంటే దానికంటే బలమైన శక్తి అవసరము.ఆ సక్తి సత్యమైనది-శుభప్రదమైనది-శాశ్వతమైనది అయితేనే తాత్కాలితను తొలగించగల సామర్థ్యతను కలిగియుంటుంది. మనకు పాశము-పశుపతి-పశువు అను మూటిని కనుక పరిగణిస్తే , పాశమును వేయగల/తీయగల సామర్థ్యము కలవాడు శాశ్వతుడు.పాశము శాశ్వతుని చేతిలో నున్నది కనుక అదియును శాశ్వతమే.కాకపోతే పశుపాశ బంధితుడు తన పూర్వజన్మల పుణ్య-పాప కర్మల అవశేషములను ముగించుకొనుటకై ,పునరపి జననం-పునరపి మ...

MURKHA NAYANAR

మూర్ఖ నాయనారు ***************** ఈ నాయనారు అసలు పేరు మరుగున పడినప్పటికిని,జూద నిపుణుడు కనుక నర్సూదన్ నాయనారు అని అన్నదానమునకు సప్తవ్యసనములలో మొదటిదైన జూదమును ఆధారముగా చేసికొనిన వాడు కనుక మూర్ఖ నాయనారుగా ప్రసిధ్ధిపొందెను. తొండైనాడు లోని తిరువెర్కుడం లో జన్మించిన నాయనారు, " అన్నద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః" అన్న సిధ్ధాంత ప్రకారము, యజ్ఞము చేత వర్షము వర్షము వలన అన్నము అన్నము వలన సమస్త ప్రాణకోటి ఏర్పడును. అన్నం అంటె అన్నమయకోశ శరీరముగా మనము భావించుకోవాలి. అంటే అణు-పరమాణు సముదాయమైన శరీరము. నాయనారు తన చిన్నతనము నుండి శివభక్తులను శివస్వరూప భావంతో సేవిస్తూ,వారికి మధురపదార్థములను అన్నముతో పాటు వడ్డిస్తూ,వారు తృప్తిగా తినిన తరువాతనే తాను భుజించేవాడు. అనవరతము ఆతంకములేకుండా దేనిని సాగనీయడు కదా ఆ సాంబశివుడు. హరుని ఆన దాటనంటూ నాయనారు సంపదలను హరించివేయసాగినది కాలము.ఉన్న వస్తువులన్నీ అమ్ముడుపోయి కిమ్మనకున్నాయి.అయినా ఏమాత్రము బాధపడకుండా, అన్నము పరబ్రహ్మ స్వరూపము. అన్ని...

SAKTI NAYARAR

శక్తి నాయనారు ************* కృపాకటాక్ష అక్షర స్వరూపునకు దండాలు శివా ప్రకటిత ప్రకాశ యజ్ఞదీక్షితునకు దండాలు శివా నందివాహనుడు చిదానందమునకు దండాలు శివా సద్గతి ప్రసాదక భక్త మందారకునకు దండాలు శివా ***** శక్తి నాయనారు పరింజియార్ గ్రామమునకు సంబంధించిన భూస్వామి.పరమ శివభక్తుడు.శివడమరుక అనుగ్రమైన అక్షరములను సలక్షణముగా గౌరవించే వాడు.నిక్షేపములైన అక్షరములను ఆక్షేపిస్తూ ,దుర్భాషలాడిన వారిని శిక్షించక వదిలేవాడు కాడు. అసలే వ్యవసాయ పాండిత్యమున్నవాడేమో,లక్షణ అక్షర సేద్యమునకు కంకణ బధ్ధుడైనాడు. దానికి కారణము నాయనారుకు శబ్ద ప్రాశస్త్యము పై గల అవగాహనయే.సాక్షాత్ తాను నమ్మిన శివుని శబ్ద స్వరూపమే వాక్కుగా భావించేవాడు.దాని ప్రయాణమును ను ప్రమాణముగా స్వీకరించేవాడు. సకల చరాచర జగత్తులో వాక్కు సలక్షణముగా నున్నప్పటికిని ,సమస్తమునందు సంపూర్ణముగా నుండదను విజ్ఞుల అభిప్రాయా నుసారము , రాళ్ల యందు వాక్కు పరా రూపంలో ఉంటుంది, వృక్షాదులయందు పశ్యంతీ రూపంలో, పశువులయందు మాధ్యమా రూపంలో, మానవుని యందు వైఖరీ రూపంలో వ్యక్తమౌతోంది అని విశదీకరించబడింది. అయితే, కేవలము మానవుడి యందే ఈ నా...

AMARANEETI NAYANARU

అమరనీతి నాయనారు ***************** [03:20, 11/11/2021] విమల: ఇష్టవస్తు ముఖ్యదాన హేతవే నమః శివాయ దుష్ట దైత్య వంశ ధూమకేతవే నమః శివాయ సృష్టి రక్షణాయ ధర్మ సేతవే నమః శివాయ అష్టమూర్తయే వృషేంద్ర కేతవే నమః శివాయ ఋషివందిత ఋషభవాహనునకు దండాలు శివా ధర్మపు వంతెన సృష్టిరక్షకునకు దండాలు శివా దుష్టుల శిక్షించు ధూమకేతనునకు దండాలు శివా ఇష్టవస్తు ప్రదాత అష్టమూర్తికి దండాలు శివా. అశాశ్వత ఉపాధిని నడిపించుచున్న శాశ్వత /అమర శక్తివి నీవే అని పరమాత్మ తత్త్వమును తెలిసిన సార్థక నామధేయుడు అమరనీతి నాయనారు. వృత్తి-ప్రవృత్తులు విరుధ్ధములైనప్పటికిని ,వాటిని తన సంస్కారముతో సమర్థవంతములుగా మలచుకొనిన వాడు.పళైయర్ లో వైశ్యకులములో జన్మించిన అమరనీతి ఇహమునకు సంబంధించిన భోగలాలసను పెంపొందించు పట్టు వస్త్రములను.సువర్ణ-నవరత్నములను కులవృత్తిగా విక్రయించుచున్నప్పటికిని,బురద తాకని తామరవలె,వైరాగ్య సంపన్నుడై అత్యంత భక్తి శ్రధ్ధలతో నటరాజ భక్తులైన శివయోగులకు ,వైరాగ్య సంకేతమైన కౌపీనములను దానము చేయు దీక్షాపరుడిగా శివార్చనలను చేయుచుండెడి వాడు. తన సంపాదనతో శివభక్తుల వసతికై ఎన్నో మఠములను ...

murty nayanar

మూర్తి నాయనారు ************ శిశుశశిరేఖా ప్రకాశములవానికి దండాలు శివా సుందరంబగు దరహాసంబులవానికి దండాలు శివా వెండికొండ చరియలందుండు వానికి దండాలు శివా మెండుగ కరుణించు పశుపతినాధునకు దండాలు శివా ******** [08:46, 10/11/2021] విమల: మూర్తి నాయనారు. ******* నిరాకార భగవత్స్వరూపముగా తాను సాకారముగా ప్రకటింపబడుటయే మూర్తిమంతము.ప్రకటింపబడిన స్వరూపముయే మూర్తి. మనము ఈ రోజు సాకారరూపియైన భగవంతుని మూర్తినాయనరుగా కీర్తించుకుందాము. " గంధము పూయరుగా-కస్తూరి గంధము పూయర్య్గా" అని యదునందనుని గంధపుసేవు గానముతో చేస్తూ పరవశిస్తూ ధన్యుడైనాడు త్యాగరాజస్వామి. అదే విధముగా షోడశోపచారములలో ఒకటైన గంధపుసేవా ప్రాశస్త్యమునకు నిలువెత్తు నిదర్శనమైనాడు మన మూర్తి నాయనారు. మంగళకరమైన మధుర పట్టనమున వ్యాపారకుటుంబములో జన్మించిన మూర్తి నయనరు గంధపుచెక్కల వ్యాపారమును చేసేవాడట. మధురలోని చొక్కనాథస్వామికి చందనసేవార్చనాసక్తుడు. ప్రతి ఉదయము స్వామికి తానే స్వయముగా చందనమును అరగదీసి స్వామికి అలంకరించి ఆనందించేవాడు.ఇది బాహ్యార్థము. కాసేపు మనము రాయిని పాంచభౌతిక ప్రపంచమన...