Posts

KALIYA NAYANARU

Image
కలియ నాయనారు. ***************** ఆడిన మాటను నిలబెట్టుకొనుటకై ఆలిని అమ్మకమునకు పెట్టి,అమ్మివేసిన ఘనత హరిశ్చంద్రునిదైతే, ఆదిదేవునికి దీప ప్రజ్జ్వలములచే సేవించుటకై తన ఆలిని అమ్మకమునకు పెట్టిన ఘనత కలియనాయనారుది. అన్నింటికన్న అర్చనయే అతిముఖ్యమన్న సిధ్ధాంతముతో నున్న కలియ నాయనారు తిరవట్రూరు లో వైశ్య కుటుంబమునందు జన్మించెను.నూనె వ్యాపారము వృత్తి. దీపప్రజ్వలనముతో శివారాధనము చేయుట ప్రవృత్తి. " సాజ్యంచ వర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా దీపం గృహాణ దేవేశ త్రైలోక్యం తిమిరాపహం. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నిరయాద్ ఘోరాత్ దీపంజ్యోతి నమోస్తుతే." ఓ త్రిలోక తిమిర సంహారకా! సత్వ-రజో-తమో గుణములనే త్రిగుణములను వత్తులుగా చేసి,భక్తి యనే చమురుతో,హృదయమనే ప్రమిదలో చైతన్యమనే అగ్నితో వెలిగించిన దీపము నీ ప్రతిబింబమై నా పాపములనే చీకట్లను పారద్రోలును గాక. తేజము కలియ చుట్తుప్రక్కల విస్తరించి సమస్త చీకట్లను తరిమివేయునుగాక అను సిధ్ధాంతమును నమ్మువాడు కనుక ,కలయ(చుట్ట్ ఉప్రక్కల) చీకట్లను తాను వెలిగించిన దీపములతో పారద్రోలువాడు కనుక కలియ నాయనా...

KANAPULLA NAAYANAARU

Image
కణుంపుల్ల నాయనారు ********************** నమో శుష్కాయచ హరిత్యాయచ పచ్చి గడ్డి/పచ్చి కట్టెల రూపములో, ఎండుగడ్డి/ఎండు కట్టెల రూపములో నున్న శివునికి నమస్కారములు. గడ్డిని కోసి,మోపులు కట్టి అమ్మి వచ్చిన డబ్బులతో శివభక్తునిగా ఖ్యాతిని గాంచిన,పుల్లరెక్కు వల్లూరులో జన్మించిన కణంపుల్ల (గడ్డిమోపు) నాయనారునకు నమస్కారములు. నాయనారు పచ్చిగడ్దిని కోసి,మోపులులను తలపైకెత్తుకుని,అమ్మి,వచ్చిన పైకముతో జీవించెడివాడు. దర్భలను వత్తులుగా మలచుకొని అగ్నికార్యములను ఆచరించుచు,ఆనందముగా శివనామ సంకీర్తనమును చేయుచు నుండెడివాడు. నాయనారు వైదిక పూజావిధానమునకు ఆటంకమును కలిగించాలనుకున్నాడు వైదీశ్వరుడు. పరీక్షను నిర్వహించడానికి కరువుకు గడ్డి మిగలకుండా చేశేలా ఉత్తరువులను జారీచేసాడు. మారుమాటాడకుండా గడ్డి పరకలను మాయము చేసేసింది. గడ్డు సమస్యకు శ్రీకారమును చుట్టింది. నమో నమో ఉలప్యాయచ అనేకరకములైన గడ్డిజాతులలో నిండియున్న నిటలాక్ష నమస్కారములు. సమిధలకు,వత్తులకు అగ్నికార్యములకు అతిముఖ్యమైన గడ్డి,దుర్వారములు కనుచూపుమేరలో కానరాకుండా రాబోవు/కాబోవు స్వామి సేవగా, " ...

SERUTANAAY NAAYANAARU

" పుష్ప మూలే వసేత్ బ్రహ్మ మధ్యేచ కేశవ పుష్పాగ్రేచ మహాదేవ సర్వదేవ స్థితో దళే" చిదానందరూపా-శేరుతనాయ్ నాయనారు. కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా స్థిరమగు భక్తియను తిరువిరులను మాలగ తాను అల్లు సమర్పణమును చేసి ,సాష్టాంగము మోకరిల్లు కామేశుని ఆన కాన కాదనలేని విధంబున కదిలిరి రాజుయు-రాణియు కథ నడిపించు పథంబున లీలగ,పూమాలల సుగంధము బంధము వేయగ హేలగ చేతబూని వాసనచూసెను రాణి నాసిక అపరాధము చేసెననుచు నాసిక కోసెను సెరుత్తనాయి ముక్తిని పొందగ రాణి ముక్కును కోయుట కారణమాయెగ చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక చిత్తము చేయు శివోహం జపంబు నా చింతలు తీర్చును గాక. భగవంతుడు పుష్పములలో నిండి,కరుణతో వాటిని వికసింపచేయుచు,చూసి సంతసించుటను ఆధారము చేసుకొని పుష్పముల ద్వారా మనకు అర్థము-సౌఖ్యము-సాక్షాత్కారము అను మూడు దివ్య మహిమలకు శివుని చేతినున్న త్రిశూలములోని మూడు విభాగములను ప్రతీకగా కొలుస్తారు.భక్తులు.అతి స్వల్పకాలములో మనకు జగతి సృష్టి-స్థితి-లయములను వాటిని జరిపించే పరమేశ్వర తత్త్వమును చాటిచెబుతాయి పుష్పములు.అంతే కాదు.శబ్ద-చెవి,స్పర్శ -చర్మము,గంధ-నాసిక,రూప-న...

TIRU KORIPPU TONDA NAAYANAARU.

వార్ధక్యే చేంద్రియాణాం వికలగతిమతశ్చాధిదైవాదితాపైః ప్రాప్తై రోగైర్వియోగైర్వ్యసనకృశతనోర్‍జ్ఞప్తిహీనం చ దీనమ్ మిథ్యామోహాభిలాషైర్భ్రమతి మమ మనో ధూర్జటేర్ధ్యానశూన్యం క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భోః శ్రీ మహాదేవ శంభో " చిదానందరూపా-తిరు తొండ నాయనారు. *************************************** కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా తిరు కురిప్ప తొండ నాయనారు నియమము రజకవృత్తి యందే యతిరాజ భక్తి సంయమనము మాసిన బట్టల మసిపూతలరేడు ఆ చాకిరేవులో వ్రత భంగము చేసినాడు కురిపించిన జోరువానలో అపరాధము జరిగినదని ఆ బండరాయికే, తన తలను బాదుకొనుటయే సరియనినాడు వెంటనే తగదని-నిలుమని కనపడి, కపర్ది కరుణించగ తరియించగ నాయనారు తలబాదుకొనుటయే కారణమాయెగ చిత్రము గాక ఏమిటిది చిదానందుని లీలలు గాక చిత్తముచేయు శివోహం జపంబు చింతలుతీర్చుగాక. తిరుకొరిప్పు తొండనాయనారు. తిరు అరాధ్యుడు కొరిప్పు క్రమశిక్షణ ఏ సమయమునకు ఏ విధముగా శివునికి వేనితో అభిషేక-అర్చనాదులనులను జరుపుటలో క్రమమును పాటిచెడివాడు కనుక తిరు కొరిప్పు తొండ నాయనారుగా ప్రసిధ్ధిగాంచెను. కాంచీ పురమునందు వల్లారు కుట...

KULACHCHIRAAYI NAAYANAARU

కులచ్చిరాయ్ నాయనారు ********************** పాండ్యరాజ్యములో రాజవంసమున మన్మేల్కుడి యందు జన్మించిన కులచ్చిరాయి నాయనారు జైనము రాజును-రాజ్యమును ప్రభావితముచేయుహున్న సమయమునందున్న గొప్ప శివభక్తుడు.ప్రధానమంత్రి.మహారాణి తిరుమంగై కరసి నాయనారు తక్క మిగిలిన వారందరు జైనమతమునకు దాసోహమయిన వారే.అప్పటి మత ఉద్రిక్తత మహారాణిని విభూతిధారనను చేయలేని ఆక్షలను విధించినది. మహారాణి-ప్రధానమంత్రి మతవిద్వేషములను అణచివేయుటకు ప్రయత్నించినప్పటికిని, ముదిరిని వ్యాధిని కుదిరించే మందును ఇచ్చేవారు కనరాక యున్న సమయమున , మహారాణి మనో వేదనకు ఉపసమనమా అన్నట్లుగా, వేదారణ్యేశ్వర స్వామి వారి ఆలయ త్ద్వారములు వేదనాభరితములై బిగిసిపోయినవా అన్నట్లు తెరుచుకొనుట మానివేసినవి. మానవనేత్రములకు మాములు మనుషులకు తెలియచేసేందుకేమో మహనీయుల రాకకై వేయికన్నులతో వేచి చూచుచున్నవి. వేకువ రేఖలుగా అప్పార్-జ్ఞాన సంబంధర్ తమ పాదమును మోపి ,తమ నామ సంకీర్తనముతో ,విషపూరిత విచక్షణారాహిత్యముపై తమ అమృతాభివర్షమును కురిపించి అజ్ఞానమును తొలగించివేశారు.మహాద్భుతము మూసిన తలుపులు.మూఢుల తలపులను తెరిపిస్తూ,తమంతట తామె తెరుచుకున్నవి. మహారాణి చెవికి సోక...

ILANGUdI MARAN NAYANAR

ఇలయాంగుడి మారన్ నాయనారు ***************************** హరిలీలా విలాసమో/సిరి కేళీ వినోదమో రంతిదేవుడు అను విష్ణుభక్తుడు ,తన కుటుంబముతో సహా 48 రోజులు ఆకలిదప్పులతో బాధించబడినాడు.అది ఊరటయో/ఊరట అనుపేర తనను పరీక్షించు గారడియో వారికి పాలు-అన్నము-రొట్టెలు -నీరు లభించినది. స్నానాదికములు పూర్తిచేసుకొని,హరిని మనసారా స్మరించుకొని,అహారమును తినుటకు సిధ్ధమవగానే, "భవతి భిక్షాందేహి" అంటూ బ్రాహ్మణుడు రానే వచ్చాడు. హరికి అర్పిస్తున్నానన్న భావనతో ,తమ దగ్గర నున్న ఆహారములో కొంత భాగమును సవినయముగా సమర్పించి,వెనుదిరుగగనే ,వెనుకనే నిలచి మరొక అభ్యాగతి అకలికేకలు వినపడగానే మరికొంత పదార్థములనిచ్చి తృప్తిపరచినాడు రంతిదేవుడు.ఇంతలో నాలుగు కుక్కలతో నలిగిన దుస్తులతో నకనకలాడుచున్న కడుపుతో నాలుగు మెతుకులకై ఎదురుగా మరొక దీనుడు రంతిదేవుని ముందు నిలిచాదు. కటకట! ఆకలిని జయించుట కానిపనికద అనుకొని తన దగ్గరనున్న మొత్తము ఆహారమును ఇచ్చివేసి నిశ్చింతుడైనాడు రంతిదేవుడు . హరినామ స్మరణముతో తమ ప్రానములను నిలుపుకొనుటకు జలాహారమును స్వీకరించ సిధ్ధమగుచున్నవేళ రానేవచ్చాడు జలజాక్షుడు...

KALIKKAR AMMAYAAR NAAYANAAR

కరైక్కల్ అమ్మయార్ నాయనారు *************************** మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు పోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికల తూగు రాయంచ చనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణందుచంద్రికా చకిత చకోరకంబు అరుగునే సాంద్ర నీహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేషమత్త చిత్తమేరీతి నితరంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయిన్ ఏల. బమ్మెర పోతన సహజకవి సాహిత్యమునకు నిలువెత్తు తార్కానము కలికంబ అమ్మయార్ నాయనారు. కరైక్కల్ గ్రామమునకు సంబంధించిన పరమ శివ భక్తురాలు. వైశ్య కులసంజాతుడైన ధనదత్తుని కుమార్తె .మహాలక్ష్మి అవతారముగా వారు తమ కుమార్తెను భావించి" ఔనీతవతి" అని నామకరనమును చేసినారు .చిన్నతనమునుండి శివభక్తితో ,శివపాదార్చులను వినయముతో సేవిస్తూ ,తల్లితండ్రులను సంరోషపరుస్తు ,సార్థక నామముతో జన్మపరమార్థమునకు త నను మలచుకుంటూ అందరికి ఆదర్శముగా అల్లారుముద్దుగా పెరుగుచున్న సమయమున " నమః శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్థరాభ్యాం" ...