Posts

PASURAM-01

Image
పాశురం-01 ********** ఆదియుం అందముం ఇల్లారుం పెరుం శోదియై యాం పాడ కేట్టేయుం వాల్కడంగళ్ మాదే వళరుదియో వన్సెవియో నిన్సెవిదాన్ మదేవన్ వార్కళంగళ్ వాళ్తియ వాళ్తోళిపోయ్ వీధివాయ్ కేట్టిలియో విమ్మి విమ్మి మెయ్ మరందు పోదార్ అమలి ఇమ్మేల్ పురండిగన్ ఏదేను మాగాళ్ ఎడుందాన్ ఎన్నే ఎన్నే ఈదే ఎంతోళి పరిసేలో రెంబావాయ్. పరంజ్యోతియే పోట్రి. *************** తిరు మాణిక్యవాచగరు మొదటి పాశురములో సంకీర్తనా భక్తిని సన్నుతిస్తూ,వ్రతమునకు సిధ్ధమవుతున్న కన్నెలు తమ చెలిని నిద్దురలేపుటకు వచ్చినారు. వారికి మరికొందరు స్వామియొక్క స్వరూప-స్వభావ సంకీర్తనము వీనుల విందుగా వినిపిస్తున్నది. ఆ సంకీర్తనము ఎంతటి సౌశీల్యమును కలిగినదంటే అది , వాల్ ఒళిపో-ప్రతిధ్వనించుచున్నది. వీధివాయ్-వీధి అంతా తన నోరు తెరుచుకుని కీర్తిస్తున్నదా అన్నట్లుగా శివనామము, స్వామి స్వరూపమును , అరుం-అద్భుతమైన, పెరుం-బహు పెద్దదైన,విస్తీర్ణమును కొలుచుటకు సాధ్యము కాని , స్వభావమందువా ఆదియుం-అంతముయుం, మొదలు చివర కనలేని/కనరాని అనగా, ఆద్యంతరహితుని,దివ్య చరణారవిందములను, వార్కళల్-పాదపద్మములను ప్ర...

TIRU VEMBAVAY INTRODUCTION

Image
[08:24, 15/12/2021] Vimala: భగవత్ బంధువులారా! మన శరీరము పంచేంద్రియములకు ప్రతీక."ధనుస్సు" అనే పదమునకు శరీరము అనే అర్థమును కూడ పెద్దలు నిర్వచించారు కదా.మన మనస్సు శరముతో పోల్చబడినది."పరమాత్మ అనుగ్రహము" అను గురి చూస్తు,మన శరీరమును ధనువులా సారించి,మనసు అనే బాణముతో,సర్వస్య శరణాగతి అను విలు విద్యను ఉపయోగించి,పరమాత్మ అనుగ్రహమునకు పాత్రులమగుటయే "ధనుర్మాసము" అని ఆర్యోక్తి. ధన్యతనందించే ధనుర్మాస వైభవమును మనసా,వచసా,కర్మణా స్తుతించి,ఆచరించి,దర్శించి కృతకృత్యులైన మహాను భావులు ఎందరో . " అందరికి వందనములు." మంద బుద్ధినైన నాపై అమ్మ కృపాకటాక్షము ప్రసరించినదేమో తెలియదు కాని,పదిమందితో పంచుకోవాలనే పరమార్థ తత్వమును, "నా" అనబడే ఈ జీవిలో ప్రవేశింప చేసి, " నీ పాదము పట్టి నిల్చెదను పక్కనె నీవు ప్రస్తుతి వ్రాయుమా" అనిప్రార్థించగానే తానే పలికినది. తిరు ఎం పావై ***** తిరు-శ్రీకరము-శుభకరము-పవిత్రము-ప్రపన్న ప్రసన్నము-పరమార్థ ప్రదాయకము ఇలా ఎన్నెన్నో అర్థములను పెద్దలు సమన్వయపరిచినారు. పావై -పాహిమాం-వ్రతము-అనుసరణీయము-అవ్యాజ అనుగ్రహము-అసమాన అదృష్టము...

PERU MIlALAI KURUMBAR NAAYANAAR

Image

KARI NAYANAR

Image

GANANATHA NAYANAR

Image

SIRAPPULI NAYANAR

Image
సిరప్పులి నాయనారు ******************** సంతోషముగా శివభక్తులను సేవించుచు,శివార్చనము చేయు నాయనారు అసలుపేరు మరుగునపడి సిరప్పునాయనారుగా ప్రసిధ్ధిచెనది.నాయనారు బ్రాహ్మణవంశమునందు తిరు ఆకూఎఉలో జన్మించెను. నిరంతరము, బ్రహ్మ మురారి సురార్చిత లింగం అంటు పంచేంద్రియములను పంచాక్షరి జపమునకు సమన్వయించుకొనుచు,పరమశివభక్తుల పాద సేవనమె పరమార్థముగా భావించెడివాడు . ప్రతిదినము వెయ్యికి మించి శివభక్తులకు అన్ననైవేద్య నియమమును నిండిన భక్తితో కొనసాగించుచు,నిశ్చల మనముతో నిటలాక్ష సేవనమును చేసెడివాడు.

KALIYA NAYANARU

Image
కలియ నాయనారు. ***************** ఆడిన మాటను నిలబెట్టుకొనుటకై ఆలిని అమ్మకమునకు పెట్టి,అమ్మివేసిన ఘనత హరిశ్చంద్రునిదైతే, ఆదిదేవునికి దీప ప్రజ్జ్వలములచే సేవించుటకై తన ఆలిని అమ్మకమునకు పెట్టిన ఘనత కలియనాయనారుది. అన్నింటికన్న అర్చనయే అతిముఖ్యమన్న సిధ్ధాంతముతో నున్న కలియ నాయనారు తిరవట్రూరు లో వైశ్య కుటుంబమునందు జన్మించెను.నూనె వ్యాపారము వృత్తి. దీపప్రజ్వలనముతో శివారాధనము చేయుట ప్రవృత్తి. " సాజ్యంచ వర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా దీపం గృహాణ దేవేశ త్రైలోక్యం తిమిరాపహం. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నిరయాద్ ఘోరాత్ దీపంజ్యోతి నమోస్తుతే." ఓ త్రిలోక తిమిర సంహారకా! సత్వ-రజో-తమో గుణములనే త్రిగుణములను వత్తులుగా చేసి,భక్తి యనే చమురుతో,హృదయమనే ప్రమిదలో చైతన్యమనే అగ్నితో వెలిగించిన దీపము నీ ప్రతిబింబమై నా పాపములనే చీకట్లను పారద్రోలును గాక. తేజము కలియ చుట్తుప్రక్కల విస్తరించి సమస్త చీకట్లను తరిమివేయునుగాక అను సిధ్ధాంతమును నమ్మువాడు కనుక ,కలయ(చుట్ట్ ఉప్రక్కల) చీకట్లను తాను వెలిగించిన దీపములతో పారద్రోలువాడు కనుక కలియ నాయనా...