Posts

TIRUPALLI ELUCHCHI-07

Image
తిరుపళ్ళి ఎళుచ్చి-07 ****************** అదుపళచువ ఎన అముదెన అరిదర్కు అళిదెన ఎళిదెన అమరరుం అరియార్ ఇదు అవన్ తిరువురు ఇవన్ అవన్ ఎనవే ఎంగళై ఆ ండుకొండు ఇంగెళుందు అరుళం మధువళిర్ పొళి తిరు ఉత్తరకోశ మంగై ఉళ్ళాయ్ తిరుపెరుంతురై మన్నా ఎదు ఎమ్మై పనికొళ్ళుం ఆరందు కేట్పోం ఎం పెరుమాన్ పళ్ళి ఎళుందరుళాయె ....... ఉత్తర కోశ మంగళనాథర్ పోట్రి ************************** అరుణగిరినాథర్ తో పాఉగా మాణిక్యవాచగరు చే ప్రస్తుతింపబడిన, మంగళాంబ సహిత మంగళనాథుని కోవెల తమిళనాడులోని పరమక్కడి సమీపములో పాండ్యరాజులచే నిర్మింపబడినది.ఈ దివ్య క్షత్రము ఉత్తరకోశ గా ప్రసిధ్ధిచెందుటక ఒక ఇతిహాసమును చెబుతారు. ఉత్తిరం అనగా ఉపదేశము.ఇక్కడ పరమేశుడు పార్వతీదేవికి ఉపదేశమును చేసినాడట. దేనిని ఉపదేశించెను అనగా కోశై-రహస్యమును/వేద రహస్యములను ఉత్తర కోశై మంగళనాథుడు/నటరాజు,తిరుపెరుంతూరు లోని ఆత్మనాథుడు ఒకరే అన్న రూపమును దాటిన తత్త్వమును మనకు పరిచయము చేయుచున్నారు. కనుకనే ఇదు అవన్-ఇది నీవే, ఇవన్-అవన్ ఎనవే-ఇది-అది-నీవే అదియేకాదు, అళుదెన-ఎళుదెన -కుడి-ఎడమ రెండును నీవే/అయ్య/అమ్మ అన్ని నీవే అనుచు స్వామి నీ...

TIRUPALLI ELUCHCHI-06

Image
తిరుపళ్ళి ఎళుచ్చి-06 ******************* పప్పర విట్టిరుందునరుం నిన్ అడియార్ పందనై వందరుదా అవరుం పలరుం మైపురు కణ్ణియ మానుడత్త ఇయల్బీ వణంగు కిరార్ అనంగిన్ మణవాలా శెప్పొరు కమలంగళ్ మలరుందన్ వయల్సోల్ తిరుపెరుంతురైయురై శివపెరుమానే ఇప్పిరప్ప అరుందెమ్మై ఆండరుపురియం ఎం పెరుమాన్ పళ్ళి ఎళుందరుళాయె. భవబంధ విమోచనాయ పోట్రి ************************ ప్రస్తుత పాశురములో తిరుమాణిక్యవాచగర్ స్వామీ నీవు మానుడత్తి ఇయల్బీ-తగిన వరుడవు ఎవరికి నీవు సరియైన వరుడవు అంటే, మైపురు కన్నియ-లేడి కనుల మా అమ్మకు/ఉమాదేవికి ఇది వాచ్యార్థము. సహజకవి బమ్మెర పోతమాత్యులు వివరించినట్లు, "తగు నీచక్రి విదర్భరాజ సుతకున్ తథ్యంబు వైదర్భితుం తగునీ చక్రికి" అన్నట్లుగా ఉమాదేవి నీకు తగిన కన్య-స్వామి నీవు మా ఉమాదేవికి తగిన వరుడవు ఇంత మంచిదవునే దాంపత్యమీ ఇద్దరిని తగులన్ కట్టిన బ్రహ్మ నేర్పరి కదా. శివ పార్వతుల దాంపత్యము లౌకికముగా అన్వయించుకోలేనిది. స్థితి-గతుల సమాగమమే సృష్టి సంకల్పము శివ-శక్తుల సంగమమే సమస్త భువన భాండములు. ఇది కాదనలేని ఒక సిధ్ధాంతమైతే, మరొక విశ్లేషణ ప్రకారము పరమాత్మ యొ...

TIRUPALLI ELUCHCHI-05

Image
తిరుపళ్ళి ఎళుచ్చి-05 ***************** పూదంగ తోరున్ నిన్రాన్ ఎనిన్ ఆళ్ళాళ్ పొక్కిలన్ వరవిలన్ ఎననినై పులవోర్ గీదంగళ్ పాడుదళ్ ఆడుదల్ ఆళ్ళాళ్ కేట్టరియోం ఉనై కణ్దరి వారై శీదంకోళ్ వయల్తిరు పెరుంతురై మన్నన్ శిందనైక్కుం అరియా ఎంగన్మున్వందు ఏదంగళ్ అరుదెమ్మై ఆండరుళుం పురియుం ఎం పెరుమాన్ పళ్ళి ఎళుందరుళాయె తిరువడి తొళుకో పోట్ర్ స్వామిపాదకాంతులకు మంగళం *********** ప్రస్తుత పాశురములో తిరుమాణిక్యవాచగరు సుక్షేత్రములుగా మారిన అంతరంగము కలిగిన చెలుల సంభాషణమును వర్ణిస్తున్నారు. తిరుపెరుంతురు మన్నన్, తిరుపెరుతురునకు ప్రభువైన మా స్వామి, శీదంగళ్ వయల్-మా మనోక్షేత్రములు భక్తి అను విత్తును నాటిన పుష్కలముగా పంటను అందించు సుక్షేత్రములుగా మారినవని మాకు నీ పంచభూత తత్త్వమును ఆళ్ళాళ్-విజ్ఞులు మాకు తెలియచేస్తున్నారు. వారేమో ఆడుతున్నారు-పాడుతున్నారు. గీదంగళ్ పాడుదల్-ఆడుదల్ అల్లాల్ వారి సంతోషమునకు కారణమును తెలిసికోవాలని మేము వారిని ప్రశ్నిస్తే పూదంగల్ తోరున్ నిండ్రాయ్ అని పంచభూత నిండి యున్న నీ విభవమును గురించి కీర్తిస్తున్నారు. ఆనందాశ్రువులు నిండిన నయనములతో నర్తిస్తున్నారు-కీ...

TIRU PALLI ELUCHCHI-04

Image
తిరుపళ్ళి ఎళుచ్చి-04 ******************* ఇన్నిశయై వీణయర్ యాళినుర్ ఒరుపాల్ ఇరుక్కొండుం తోత్తిరం ఇయంబినార్ ఒరుపాల్ తున్నియ పిణై మలర్ కయ్యనర్ ఒరుపాల్ తొళుకయ్యర్ అళుకయ్యర్ తునళ్కయ్యర్ ఒరుపాల్ సెన్నియల్ అంజలి కుప్పినార్ ఒరుపాల్ తిరుప్పెరుంతురై శివపెరుమానే ఎన్నయుం ఆండ్రుకొండుం ఇన్నరుళ్ పురియం ఎం పెరుమాన్ పళ్ళి ఎళుందరుళాయె ...... "స్తుతిస్తు నామ-రూపాలు కర్మణా బాంధవేనచ." అన్నది ఆర్యోక్తి. భగవదనుగ్రహము ఆధారమైతే దానిని ఆలంబనము చేసుకొని ఆరాధించుచున్న చేతనుల భక్తి ఆధేయము.అనగా భాగవతుల ద్వారా భగవత్తత్త్వము ప్రచోదమగుచున్నది. ప్రస్తుత పాశురములో తిరుమాణిక్యవాచగరు మనకు రెండు పరమాద్భుతములను చెలుల సంభాషణము ద్వారా ఆవిష్కరింపచేస్తున్నారు.మొదటిది, " తిరుపెరుంతురైయురై శివపెరుమానే" అంటూ స్వామి నామ-రూపములను,గుణవైభవమును,నివాసమును కీర్తిస్తున్నారు అంటే పరబ్రహ్మము తననుండి నామ-రూప-గుణములను/అనంత కళ్యాణగుణములను వేరుచేసుకొని, అర్చామూర్తిగా తనను తాను మలచుకొనుట. ఈ ప్రక్రియ కేవలము జీవులను ఉధ్ధరించుటకు లీలగా స్వామి ప్రకటనము కాని మరే ఇతర ప్రయోజనమును లేదు. ...

TIRUPALLI ELUCHCHI-03

Image
తిరుపళ్ళి ఎళుచ్చి-03 ******************* కూవిన పుంకుయిల్ కూవిన కోళి కురుగుకళ్ ఇయంబిన ఇయంబిన శంగం ఓవినై తారకై ఒళి ఒళి ఉదయత్తు ఒరుప్పుడు కిన్రాడు విరొప్పుడు నమక్కు తేవన చెరికళల్ కాడినై కాట్టాయ్ తిరుంపెరుంతురై యురై శివపెరుమానే యాం వరుం అరివరియాయ్ యమక్కు అడియాయ్ ఎం పెరుమాన్ పళ్ళి ఎళుందరుళాయె. ........ ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినాం కామదం మోక్షదం తస్మాత్ ఓంకారాయ నమోనమః" *********** ప్రస్తుత పాశురములో తిరుమాణిక్య వాచగరు బ్రాహ్మీముహూర్తము ఏ విధముగా పరమాత్మకు నాదార్చననో చేయుచున్నదో వివరిస్తున్నారు. పోట్రి-అరుణన్ పాశురములలో ఏ విధముగా పరమాత్మ ముఖకాంతిని పద్మములు-సూర్యుడు తమ వెంట తెచ్చుకొని ప్రకాశిస్తున్నారో ప్రస్తుతించి,ఈ పాశురములో నాదోద్భవమును-నాదార్చనను వివరిస్తూ,చెలులు ఏ విధముగా స్వామి విరుప్పొడు నమక్కు నీ దివ్య మంగళ విగ్రహమును దర్శించి సేవించాలి అని కోరుతూ, అంతలోనే కాదు కాదు, తేవన చెరికలల్ కాట్టాయ్-నీ యొక్క శోభాయమానముగా ప్రకాశించు పాదములు పటుకొనగలిగిన చాలును ఓ పరమాత్మా! మా యందలి అనుగ్రహముతో నీ యోగ నిద్రను (లాంఛన నిద్రను) చాలించి మే...

TIRUPALLI ELUCHCHI-02

Image
తిరుపళ్ళి ఎళుచ్చి-02 ****************** అరుణన్ ఇందిరన్ దిశై అణుగినన్ ఇరుళ్పోల్ అగండ్రదు ఉదయం మలత్తిరు ముగత్తిన్ కరుణన్ శూరియన్ యలయళ నయన కడిమలర్ మలరమర్క అణ్ణవన్ కణ్ణా తిరన్ నిరై అరుపదం మురల్వన్ ఇవైయోం తిరుపెరుంతురై శివపెరుమానే అరుళిరి తరవరం ఆనందమలయే అలకడలే పళ్ళి ఎళుందరుళాయె ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివః స్స్కందః ప్రజాపతిః మహేంద్రో ధనదః కాలో యమః సోమోహ్యపాంపతిః ********** పోట్రి పదముతో ప్రారంభమయిన తిరుపళ్ళి ఎళుచ్చి లో స్వామి ముఖమలముల -పాదపద్మముల కాంతిని కెందామరలు తంతో వెంట తెచ్చుకొని,సూర్య కిరణముల స్పర్శానుగ్రహముచే వికసనమును పొంది ప్రకాశిస్తున్నట్లుగా వివరించారు తిరుమాణిక్యవాచగరు. పళ్ళి ఎళుచ్చి పదిభాగములు భగవంతునికి-భాగవతులకు గల అవినాభావ సంబంధమును అందించుచున్నవే. మన చెలులు స్వామి సుప్రభాత సేవకు వెళుతో కొలనులో వికసించుచున్న కెందామరలను తమ హృదయకమలముతో అనుసంధానము చేసుకొని అనుగ్రహపాత్రులైనారు. కొంచము ముందుకు తమ అడుగులను కదిపారో లేదో వారి ఆలోచన కెందామరలను అనుగ్రహించిన భానుకిరణములవైపునకు మళ్ళించినాడు పరమాత్మ. చెలి తామరలు స్వామి ముఖకాంతిని తెచ్చుకున్నాయనుకున్నా...

TIRUPALLI ELUCHCHI-01

Image
తిరుపళ్ళి ఎళుచ్చి-01 ********************* పోట్రియన్ వాళ్ముదల్ ఆగియ పొరుళె పులందదు పూంకళత్తు ఇనైతునై మలర్కొండు ఏట్రు ఇన్ తిరుముగత్తు ఎమక్ అరుళ్ మలరుం ఎడిల్నడై కొండు ఇన్ తిరువడి తొళుకోం శేట్రిదళ్ కమలంగళ్ మలరుంగన్ వయల్సోల్ తిరుపెరుత్తురైయురై శివపెరుమానే ఏట్రియార్కొడి ఉడయాయ్ ఎన్నై ఉడయాయ్ ఎం పెరుమాన్ పళ్ళి ఎళుందు అరుళాయె. ...... జన్మదుఃఖం జరా దుఃఖం జాయాత్ దుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత జాగ్రత. ********* పోట్రి అను మంగళాశాసనముతో ప్రారంభింపబడిన మొదటి పద్యము మనలో సూక్ష్మముగా దాగిన పరంజ్యోతిని మేల్కొలిపి మన ఇంద్రియములను సన్మార్గమున నడిపించమని విన్నవించుటతో ప్రారంభమవుతున్నది. ఆది శంకరుల హెచ్చరిక. దీనిని అర్థము చేసుకోవాలంటే మనకు శివానుగ్రహముతో "తిరువాదిరై-ఆరుద్ర నక్షత్ర" దర్శనభాగ్యము కలుగవలసినదే. మార్గళి పౌర్ణమి నాటి చిదాకాశములో జ్యోతి రూపములో కదులుచు మనలను చైతన్యవంతులను చేయు చిదంబర నటరాజ దర్శనము. సాకార-నిరాకారములను మేళవించిన స్వామి సాక్షాత్కారము.అంబరమున అగుపడు అద్భుతలీల-అనుగ్రహ హేల. జ్యోతి కదలికలు సామాన్యనేత్రము గ్రహించలేదు.స్వామి తన క...