Posts

LAMCHAM DANDAKAM.

థిస్ ఇస్ జుస్త్ ఫొర్ ఫున్.(నొత్ తొ బ్లమె అన్య్ ఒనె.)ప్ల్ ఎక్ష్చుసె స్పెల్లింగ్ మిస్తకెస్ "లంచం"దండకం దాసోహమమ్మా,ఇహలోక సంచారిణి,బహురూప వరదాయినీ,చిద్రూప చింతామణి. ఓ విదుషీమణీ మస్కాలకు,నమస్కారాలకు ఆస్కారమే లేదంటు శూన్యమై, ధన,కనక,వస్తు,వాహనాదులకు ఆస్వాదనే వేదమంటు సూక్ష్మమై, మనోవాక్కాయ కర్మాభిలాషలను భేషుగ్గా అందించు ప్రత్యక్షమై, ఓ శుభలక్షణా తూర్పు తిరిగిన దండంబునకు ఓదార్పుగా పడమర చేరి కనుమరుగవని ఓ నేర్పుగా ఉత్తరువులందించు ఉత్తరపు ఓ మార్పుగా ప్రదక్షిణలు చేయించు ఓ కూర్పుగా ఓ పరాత్పరీ వీలుకానిదేదీ లేని పలు వీలునామాల నందించు వకీలుగా నైవేద్యో నారాయణో హరి కీర్తింపబడుచున్న ఆచారిగా మిథ్య విద్యాలయాలఓ గుణపాఠాలు నేర్పించే ఒకే ఒజ్జగా బీడుల-చివిటినేలల వరముల జడివానలు కురిపించు ఓ వరుణిడిగా అలివేణి కరుణామయి నీవు తాత్సారపు వాత్సల్యమా కార్యాలయాలకేరింతలాడు ఉత్సాహమా తారుమారులకు వీరతాడగు ప్రోత్సాహమా జతకూడననలేని ఓ ఈప్సిత ప్రదాయినీ,మూఢులు కాంచనంబొల్లకే ఇనుము కోరు చందంబునున్నారని , గ్రహింపచేసి,వారిని మార్చేసి, మరికొందరు నిన్ను ఈతరులకు ఉంచమని...

YAMA AS DIKPALAKA

Image
ధర్మ పరిరక్షకుడిగా ధర్మరాజు అని నియమపాలకునిగా (కఠిన )దక్షిణదిశాధిపతిగా ప్రపంచవ్యవస్థను పరిరక్షించేవాడు.సూర్యపుత్రునిగా వేదములప్రకారము కీర్తింపబడుచున్నాడు.

AGNI AS DIKPALAKA

Image
దక్షిణము-తూర్పు మధ్యభాగమైన ఆగ్నేయమూలాధిపతి మూడు చోట్ల మూడు రకములుగా వ్యాపించియుంటాడని ఇతిహాసము నమ్ముతుంది. 1భూమి మీద అగ్నిరూపముగాను 2పర్యావరనములో కాంతిరూపముగాను 3.ఆకాశములో సూర్య రూపముగాను విధులను నిర్వహిస్తుంటాడు అని వేదోక్తము. అంతేకాకుండా ఒకచోట నున్న శక్తిని వేరొకచోటికి అనుకూలముగా మారుస్తూ అందచేసే నిపుణుడు అగ్ని.ఉపనిషద్ విజ్ఞాన రహస్యమును కూడా అగ్నిగానే గౌరవిస్తారు. ఆద్యంతరహితుడైన జాతవేదుడు ఎన్నో తరములను దర్శించియున్నాడు.వారికి కావలిసిన శక్తిని తాను ముందు వహ్నిగా గాలితో పాటు సంచరిస్తూ,యజ్ఞయాగాదులందు దేవతలకు తనద్వారా హవిస్సులను అందచేస్తూ,తత్ఫలితములకు సహాయపడుతు ,వ్యర్థములను హుతముచేస్తూ జగత్ సంరక్షణమును చేస్తుంటాడు.

VAYU AS DIKPALA

Image
పశ్చిమ-ఉత్తరదిక్కుల మధ్యన గల వాయవ్యమూలకు అధిపతిగా గంధవతి నుండి అడ్దంకులను తొలగించుచు,పంచభూత సమన్యమును కలిగించుచున్న వాయువు మరోపేరు అయిన "వాత" నామమునకు గుర్తుగా వాతావరణము అను పదము ప్రసిధ్ధికెక్కినదని పెద్దల అభిప్రాయము. వేదోక్త ప్రకారముగా యజ్ఞ-యాగాదులలోని సోమరస ప్రథమ గ్రహీతగా వాయుదేవుడు కీర్తింపబడుతున్నాడు.

INDRA AS DIKPALAKA

Image
ఇదం ద్ర ఇంద్ర అన్నారు పెద్దలు.ద్ర గమనిస్తుందో-ఏది మన కదలికలను గమనిస్తుందో అది ఇంద్రుడు.దానికి కల సాధనములు ఇంద్రియములు.ఉత్తర దిక్పాలకునిగా కీర్తింపబడుతున్న ఇంద్రుడు గోచరముకాని మనలకు గోచరించుచున్న కదలికలకు కారణమైన బ్రహ్మపదార్థము.నింగి నేలకు సామరస్యమును కూర్చు సాధనము. పురంధరునిగా ప్రస్తుతింపబడుచున్న నదీజలముల నడకకు కావలిసిన పరిస్థితులకు పర్వతములను నియంత్రిస్తూ,సూరెయకాంతిని అవరోధిస్తున్న ప్రతికూల పరిస్థితులను తొలగిస్తూ,స్థితికార్యమునకు సహాయపడుతున్న అద్భుత శక్తి కనుకనే 'వృత్రఘ్న" గా అడ్డంకులను అడ్డగించే ప్రజాపతి. పురాణకథనము ప్రకారము ఐరావత వాహనుడుగా సచీసమేతుడై వజ్రాయుధమును ధరించి లోకసంరక్షకునిగా కీర్తింపబడుతున్నాడు.

KUBERA AS DIKPALAKA

Image
కుబేరుడు ********** ఇతిహాసములననుసరించి కుబేరుబి పులస్త్య ముని మనుమనిగాను,విశ్రవకుమారునిగాను భావిస్తారు. వైశ్రావణ నామమును కీర్తిస్తారు. కు బేర బేరము అను పదమునకు శరీరము అను అర్థమును కనుక అన్వయించుకుంటే వికృత శరీరునిగా,మరుగుజ్జు రూపముతో,ధనరాశుల మూటను పట్తుకుని,పెద్దబొజ్జతో,పింగళాక్షునిగా సాకారతను వివరిస్తరు. కు అను అక్షరమునకు భూమండలము అను అర్థమును స్వీకరిస్తే బేరుడు నాయకుడు గా మనము భూమండలమునకు సంపదలనొసగు నాయకునిగాను మనము అన్వయించుకోవచ్చును. అలకాపురిని నివాసముచేసుకొని ఉత్తరదిక్భాగమునకు పాలకునిగా నున్న కుబేరుడు మహాభారత కథనము ప్రకారముగా బ్రహ్మచే ధనాధిపతిగాను,శివమిత్రునిగా కామేశునిగాను,దుష్ట పరిహారకునిగాను వరప్రసాదితుడైనాడట. నాగులను జయించిన సంకేతముగా ముంగిసపై కూర్చున్న విగ్రహములుకూడా మనకు దర్శనమిస్తుంటాయి. విద్యాధరులు-కింపురుషులు-రాక్షసులు కుబేరుని సభకు విచ్చేసి,పరిపాలనలో అనుచరులుగా వ్యవహరిస్తారను నమ్మకము కూడా కలదు.ఎన్నో గుప్తశక్తులను నియంత్రిస్తుండుట వలన గుహ్యకాధిపుడుగా కుబేరుడు విష్ణుధర్మోత్తర పురాణ కథనము ప్రకారము అర్థమునకు మాత్రమే అధిపతిగా కాక అర్థశాస్త్రమునకు కూడ ...

NIRUTI AS DIKPALAKA

Image
నిరుతి దిక్పాలకురాలు/దిక్పాలకుడు ద్వంద్వమయములైన ప్రకృతిలోని దక్షిణ-పడమర మధ్య ప్రాంతములోని కృష్ణజ్ఞాన నగరమూ దీర్ఘాదేవి సహితుడు ఒక్కొక్కసారి అశ్వవాహనుడుగా/మరొక్కసారి నరవాహనునిగా దర్శనమిస్తుంటాదని పెద్దల అభిప్రాయము. సంస్కృత భాష "నిరుతి" అను పదమును క్రమశిక్షణారాహిత్యము,అజ్ఞానాంధకారముగాను,అధర్మముగాను నిర్వచిస్తుంటుంది. జ్యోతిష్య శాస్త్రము మూలానక్షత్రాధిపతిగా విశ్వసిస్తుంది. పతనమునకు వాడు పదముగాను నిరుతిని విశ్వసిస్తారు. మంచి-చెడుల మిశ్రమమున చెడును గుర్తించి,నిర్మూలనమునకు సహాయపడేవానిగాను సన్నుతిస్తారు.