NA RUDRO RUDRAMARCHAYAET-12
న రుద్రో రుద్రమర్చయేత్-04 ******************** " బాలేందు మకుటం దేవం తరుణాదిత్య విగ్రహం ధ్యాయేత్ నందీశ్వరాకారం గణేశ్వర సమావృతం" ఈ రోజు బిల్వార్చనలో మనము "జలతత్త్వమును" గురించి తెలుసుకునే ప్రయత్నమును చేద్దాము. ఓం నమః శివాయ న రుద్రో రుద్రమర్చయేత్-04 ******************** " బాలేందు మకుటం దేవం తరుణాదిత్య విగ్రహం ధ్యాయేత్ నందీశ్వరాకారం గణేశ్వర సమావృతం" ఈ రోజు బిల్వార్చనలో మనము "జలతత్త్వమును" గురించి తెలుసుకునే ప్రయత్నమును చేద్దాము. చమకము 2వ అనువాకములో అమశ్చమ-అంబశ్చమే అని నీటి ప్రస్తావన "అంబశ్చమే" అను పదముద్వారా చెప్పబడినది. 'అమయతి అంబః" గ్రహించేశక్తిని నీరు,జలము అని పెద్దలు సంకేతిస్తారు.దానిని నిర్ధారిస్తు అమశ్చమే-విచక్షణ ప్రసాదించమని,సత్యాసత్యములను గ్రహించే శక్తిని అంబశ్చమే అంటు ప్రస్తావించారు. నమకములో సైతము జలము ద్రవరూపముగా,మంచురూపముగా,మేఘములో దాగియున్నదానిగా,బురదరూపముగా,గాలితో కలిసి వచ్చుదానిగా,శబ్దముచేయుచు కదులు తరంగములుగా,మౌనముగా ప్రవహించి కొలనులా,సరస్సులా,బావిలో దాగిన నీటిలా,సహజ జలముగా,వర్షపు జలముగా,అనేక...