Posts

SIVATANDAVASTOTRAMU( ADBHUTA VINODAM BHIBHARTU)04

Image
 4.జటాభుజంగపింగళస్ఫురత్ఫణామణిప్రభా కదంబకుంకుమద్రవప్రలిప్తదిగ్వధూముఖే | మదాంధసింధురస్ఫురత్త్వగుత్తరీయమేదురే మనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరి || 4 ||  మొదటి శ్లోకములో స్వామి తాండవ స్థలిని-స్వామి తాండవవము ద్వారా సమస్త మంగళములను విస్తరింపచేయుటను ప్రస్తావించిన సాధకుడు,  రెండవ శ్లోకములో స్వామి ఆహార్యమును అట్టి మంగళ తాండవమును తన చిత్తములో నిలుపుకొనవలెనను ఆకాంక్షను తెలియచేసినాడు.  మూడవ శ్లోకములో తాండవ వినోదమునందించు వస్తువుల యొక్క అగ్ని-సోమాత్మకతను అన్వయిస్తూఏ వానిలో దాగిన అర్థనారీశ్వర పరమార్థమును ప్రస్తుతిస్తూ ఆ నందము యొక్క శాశ్వతవమును ఆకాంక్షిస్తున్నాడు.   ప్రస్తుత శ్లోకములో సాధకుడు రెండేరెండు ఉపమానములను 1) సర్పములు 2)గజచర్మము తీసుకుని అనుపమాన స్వామి తేజమును తెలియచేస్తున్నాడు.  ఇప్పటి వరకు మనము స్వామి జటలు అడవి వలె నున్నవని,కటాహము వలె నున్నవని చెప్పుకొనినాము.     ఇప్పుడు ఆ జటలు పాములచే చుట్టబడినవట.అంటే మొదటి శ్లోకములో గళమున అలంకారముగా హారము వలె మెరిసిన సర్పము/సర్పములు చరచర పాకి జటలను చుట్టుకొనినవట.కాదు కాదు  స్వామి తన జటలను ఎర్రని వర్ణములుగల...

SIVATANDAVASTOTRAMU-(ETU VASTUNI-MANOVINODAM)-03

Image
 3.ధరాధరేంద్రనందినీవిలాసబంధుబంధుర స్ఫురద్దిగంతసంతతిప్రమోదమానమానసే | కృపాకటాక్షధోరణీనిరుద్ధదుర్ధరాపది క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని || 3 ||   శివములను సర్వత్ర విస్తరింపచేయు శివతాండవమును సదా నా మనసులో చూడాలనే ఆకాంక్షను వ్యక్తము చేసిన సాధకుని పురాకృతపుణ్యమా అనునట్లుగా అగ్నిసోమాత్మకమిన శివస్వరూపము అర్థనారీశ్వరముగాను సాక్షాత్కరించుచున్నది.తనకోరికను తీర్చుటకు ఆలంబనములైన సంఘటనలను సైతము వ్యక్తము చేయుచున్నది.అవి స్వామి అమ్మతో కలిసి జతగా చేయు తాండవము ద్వారా కరుణావీక్షనములను ప్రసరింపచేయుచు దుర్భరమైన ఆపదలను దూరముచేయుచున్నాడట.అంతే కాదు తనకున్న వైరాగ్యమునకు-వ్యాపకత్వమునకు గుర్తుగా దిగంబరుడిగా ప్రకాశించుచున్నాడు.అన్నీ తానే-అంతా తానైన చైతన్యము సమస్త జగములను జాగృతపరచుచున్నవేళ సమస్త సంతతి ప్రమోదముతో నిండియుండునుకదా.దానికి కారణమైన శివశక్త్యాత్మకమైన చైతన్యము నన్ను వీదకుండుగాక.  స్వామి స్వరూపమునకు సంకేతము దిగంబరములను అనగా దిక్కులనే వస్త్రములుగా ధరించినవానిని-అఖండుని దర్శిస్తూ,దుర్లభమైన ఆపదలను సైతము దగ్గరికి చేరనీయని దయావీక్షణము నన్ను ఆశీర్వదించుగాక.    ఏక బిల్వం శివార్పణం....

SIVATANDAVASTOTRAM-02 ( RATI PRATI KSHANAM MAMA)

Image
 2.జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ- -విలోలవీచివల్లరీవిరాజమానమూర్ధని | ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాటపట్టపావకే కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ || 2.     మమ పతి క్షణం రతిః-ప్రస్తుత శ్లోకములో  మనకు సాధకుడు తెలియచేస్తున్న ఆకాంక్ష.  రతిః-స్థిరమైన ఆనందమును శివతాండవము ద్వారా పొందవలెనన్నది కోరిక. కాని మొడటి శ్లోకములు మంగళాశాసనముగా స్వామి శుభంకరుడై తన తాండవము ద్వారా శుభములకు సమస్తమునకు విస్తరింపచేస్తాడని కీర్తిస్తున్నది.  కాని భాషాపరముగా అన్వయించుకుంటే అది  చ కార చండ తాండవం-జరిగిపోయిన తాండవము.అందులో కేవలము రంగస్థలము ఏ విధముగా సంప్రోక్షణము గావింపబడినదో,స్వామిని సర్పము ఏ విధముగా చుట్టుకొని సత్కరించినదో,డమరునాదము స్వామి కదలికలకు మంగళ వాయిద్యముగా మ్రోగినదో కీర్తించబడినది.  కాని సాధకుని చిత్తములో అది నిత్య-సత్య చైతన్య తాండవము.దానిని ప్రతిక్షణము అనుభవిస్తూ ఆనందపడటమే ఆకాంక్ష.కనుక రెండవ శ్లోకములో,  శాశ్వతానందమును పొందుతకు సహకరించుచున్న నాలుగు ఉపమానములను సాధకుడు ప్రస్తావించుచున్నాడు. 1.మొడటిది-స్వామి   మూర్థని-శిరము పైభాగము.అది ఇప్పుడు అడవిగా నున్న జటలతో...

SIVATANDAVASTOTRAMU-01( " TANOTU NA SIVAH SIVAM)

Image
 SLOKAM. 1.జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికామ్ | డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండతాండవం తనోతు నః శివః శివమ్ || 1 ||    ప్రస్తుత శ్లోకము పరమాత్మ సాకారమును అగ్నిసోమాత్మకముగా,అనగా ప్రజ్వలనము-ప్రకాశము మేళవించుకొనినట్లున్నదట.దానికి ఉదాహరనముగా స్వామి జటాజూటము-అందులో బంధింపబడియున్న గంగమ్మ అటు-ఇటు కదలలేక సుడులు తిరుగుచున్నదట.జటా స్వరూపము ఘోరత్వమునకు-గంగ జలము చల్లదనమునకు సంకేతములుగా నున్నవి.అంతేకాదు స్వామి ఫాలనేత్రము-అగ్ని తత్త్వమునకు-వేడికి-సిగలోని చంద్రరేఖ చల్లదనమునకు సాఖ్యముగా నున్నవట.స్వామి తాండవమునకు కైలాసము వేదికయైనది.ఆ వేదిక స్వామి తలపై నుండి జారిపడుచున్న గంగమ్మ దైవ ప్రవాహ జలముతో సంప్రోక్షితమైనది.నర్తకుడు కూడా తన గలములో సర్పమును మాలగా ధరించి సభామర్యాదతో గౌరవింపబడుతున్నాడు.మంగళవాయిద్య సూచకముగా స్వామి చేతనున్న డమరుకము ధ్వనులను చేయుచున్నదట. ప్రథమ పాదము వేదిక ప్రాభవమును ప్రస్తావించుచున్నది.  స్వామి చేయబోతున్నది చండ తాండవము-అనగా దానికదేసాటి.అసమానమైనది.ఆ తాండవము శివః-శుభస్వరూపునిచే,సివం-శుభములను-తనోతు-విస్తరింపచేయునది.  సకలచరాచరములలో...

SIVATANDAVASTOTRAMU-INTRODUCTION

Image
  "ప్రదోషం రజనీముఖే" ఆర్యోక్తి.ఆ సమయ ప్రాశస్త్యమును తెలియ్స్చేయునది శివ తాందవ స్తోత్రము.    శివము అంటే నిత్యము-సత్యము అయిన మూలము.అది నిరాకారముగా నున్న భావనలో.ఆ మూలము తాను నిశ్చలముగా నుండి సకల చరాచరములను స్పందింపచేయుటయే తాండవము.ఇతిహాసము అనగా ఈ విధముగా జరిగినది అని చెప్పబడు సాహితీవిధానము.నిశ్చలమైన తత్త్వమును తెలిసికొనవలెనన్న దాని చుట్టు చలించుచున్న మరొక ఉదాహరనమును చూపితేగాని అర్థము చేసికొనుట కష్టము.కనుక సనాతనము నామరూపములను ప్రకటించేసినట్లు,ఆ ప్రకటిత స్వరూపము ఒక సభాస్థలిని-సమయమును-సందర్భమును,స్వభావమును వివరిస్తూ,సాక్షాత్కారమును కలిగిస్తూ,సత్కృపను వర్షిస్తుంది.దానిని అందుకొనుటకు హృదయమనే పాత్రను శుభ్రపరుస్తుంది.సిద్ధము చేస్తుంది.ముద్దు తీరుస్తుంది.దానికి ఉదాహరణమే మనము చర్చించుకునే "శివతాండవ స్తోత్రము".వేదిక కైలాసము.సమయము ప్రదోషము.సందర్భము రావణ దర్శనము-అనుభవము." సాహిత్యము పంచ చామర వృత్తము.పూజావసాన సమయమున స్తోత్ర పఠనము సర్వార్థసాధకమని చెప్పబడినది ఫలసృతిగా.ఈ స్తోత్రము 15 భాగములుగా/శ్లోకములుగా వానిలో రెండు ఫలశృతిగా,మిగిలిన 13 భక్తుని ఆకాంక్షగా స్వామి తాండవ సంరంభము,సాక్ష...

SIVATANDAVASTOTRAMU-PRATIPADAARTHAMU-BHAAVAMU.

Image
    శివతాండవ స్తోత్రము-రావణకృతము   ************************** 1.జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికామ్ | డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండతాండవం తనోతు నః శివః శివమ్ || 1 ||  శివతాండవము జరుగు పవిత్రస్థలమును గురించి చెప్పబడినది మొదటి భాగము.  జటాటవి- అడవి వలె జటలున్న ప్రదేశమునుండి,  గలజ్జల- పవిత్రమైన జలము,  ప్రవహించి_ ప్రవాహ  పావిత-పవిత్రమొనరించిన,స్థలే-స్థలము అది.శివజటాజూటమునుండి గంగాజలము సంప్రోక్షించబడి పునీతమైన ప్రదేశములో తాండవము  ప్రారంభమగునట.అదియె వికార రహితమైన మన హృదయసీమ. గలేవ లంబ్య లంబితాం భుజంగ తుంగ మాలికాం.   స్థలమును గంగ పవిత్రమొనరించినది.వెంటనే, భుజంగములు గళమున మాలుకలుగా తమను తాము అలంకరించుకొని తరించినవి.  .డమడ్దమ నినాదవడ్దమర్వయం,  గంగమ్మను,వాసుకిని అనుసరిస్తు,డమరుకం డమడమ నినాదముతో స్వామి చేతిని అలంకరించి,అర్వయం -ప్రకాశించుచున్నది. చకార చండతాండవం తనోతు నః శివః శివమ్-అనుగ్రహమును అర్థించు చమకమునకు ఫలముగా స్వామి తన తాండవముతో మనలను అనుగ్రహించుగాక.ఓం నమః శివాయ. 2.జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్...

PARUGULELA PATTUKONAGA-OM NAMASIVAYA

Image
      పరుగులేల పట్టుకొనగ-ఓం నమః శివాయ   ******************************  స్పూర్తినిచ్చిన సిద్ధార్ శివవాక్కియర్ కు నమస్కారములతో (ఓడి-ఓడి-ఓడి-ఓడి-పరుగులు తీసి తీసి పట్టుకోగలవా) ఈ చిన్ని ప్రయత్నము.పెద్దలు తప్పులు సవరించగలరు.  1.వ్రాసి వ్రాసి వ్రాసి వ్రాసి నీటిమీది వ్రాతలే    మాసి మాసి మాసి మాసి ముసురుకున్న మాయలో    చూసి చూసి చూసి చూసి మోసపోయి శంకరా    రోసి రోసి రోసి రోసి సమసిపోయిరెందరో.      ఓ పరమేశా!మాయముసుగులో నిన్ను కనలేక స్థిరముగా నిలువని నీటి ప్రవాహముపై నీ నామమును వ్రాసి,నిన్ను దర్శించాలని పరుగులు తీసి తీసి కనుగొనలేక కనుమరుగు అయినవారెందరో.అట్టి అజ్ఞానమును మన్నింపుము.  2.నీది ఏది? నాది ఏది? నీదినాది కానిదేది?    జననమంటు-మరణమంటు ఆటలాడుచున్నదేది?    రాజు అంటు-గురువు అంటు మాటలాడుతున్నదేది?    వేరుచేసి చూపుచున్న" నేను"  అన్న భ్రాంతియే.      ఓ మహేశా! నేను అన్న దేహభ్రాంతి నిన్ను నా నుండి వేరుగా భ్రమింపచేస్తూ,చావు పుట్టుకలగురించి,నీవు-నేను అన్న ద్వంద్వముల గురించి వి...