Posts

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM-INTRO

Image
         ఆదిత్యహృదయము         *************  "ఏకం సత్ విప్రా బహుధా వదాతి"    వాల్మీకి విరచితమైన "శ్రీమద్రామాయణము" లోని యుద్ధకాండమునందు "ఆదిత్యహృదయస్తోత్రము"  అగస్త్యమహాముని చే అనుగ్రహింపబడినదని ఆర్యోక్తి.  కథాకథన ప్రకారముగా,  దక్షప్రజాపతి కుమార్తె అదితి.కశ్యప ప్రజాపతి ధర్మపత్ని.వీవివి సంకేత నామములు.వానినే గౌణ/గుణమును తెలియచేయు నామములని చెబుతారు.అదితి అనగా అఖండము.కష్య అనగా ప్రకాడము.అకహండ ప్రకాశమే వారి దాంపత్యము.   మాతృస్వరూపిణి అయిన అదితీదేవి ధర్మసంరక్షణమునకై "అదిత్యోపాసనమును" ఉపాయముగా భావించి,తన భర్త అనుమతిని స్వీకరించి,పరమాత్మను ప్రార్థించుటకు పూనుకొనెను.   పరమాత్మ(సూర్యభగవానుడు) తల్లికి ప్రత్యకముగా కనబడి,సుష్మ్న అనే కిరణము ద్వారా ఆమె గర్భవాసము చేసే వరమును ప్రసాదించెను.  తరువాత జరిగిన కథను మనము ముందు సంచికలలో తెలుసుకునే ప్రయత్నమును చేద్దాము.    అదితి అనగా అఖండముగా మనము భావించుకుంటే అఖండమునకు లభించిన అనుగ్రహమే "ఆదిత్య హృదయము".  పరంజ్యోతిని అదితిగా భావించుకుంటే పరమాత్మ ప్రకాశమే ఆ...

SIVATANDAVA STOTRAMU(ANUGRAHAMU)-15

Image
  పూజావసానసమయే దశవక్త్రగీతం యః శంభుపూజనపరం పఠతి ప్రదోషే | తస్య స్థిరాం రథగజేంద్రతురంగయుక్తాం లక్ష్మీం సదైవ సుముఖిం ప్రదదాతి శంభుః || 15.  ప్రస్తుత శ్లోకము కథాపరముగా అన్వయించుకుంటే పూజను ముగించే సమయమున,సాయం సంధ్యా సమయమున చదివినటయితే అశ్వములు-ఏనుగులు-రథములు లభించుటయే కాక అవి మరలిపోక స్థిరముగా ఉంటాయని చెప్పబడినది.పది నాలుకలు కల రావణుడు దీనిని పఠించినట్లు-పరమేశ్వరునిచే అనుగ్రహింపబడిన కథనము కలదు.ఒక విధముగా ఇది సంప్రదాయ మంగళాశాసనము.సంపదలను అనుగ్రహించేవాడు శంకరుడు.అనగా సంకరుడు అను నామము-శిరముపై జటలు-గంగ-చంద్రవంకను ధరించి,మెడలో పాములను హారములుగా ధరించి,డమరు నాదమును మ్రోగించుచు ,అమ్మ పార్వతీదేవిని కూడి తాండవమాడు స్వామిని స్మరించుకుంటే అసమాన సంపదలను పొందుతారని ఆర్యోక్తి.  కాని కొంచము నిశితముగా పరిశీలితే ఎన్నో విశిష్ట పదముల వివరణను గ్రహించగలిగితే మనము తప్పక మన మనసును పరమేశ్వరార్పనము చేయకుండా ఉందలేము.   స్వామి తాందవమును వర్ణించిన సాధకుడు ఆ పవిత్ర తాండవము తనలో కూడా నిరంతరము జరుగుచున్నదని,ఆ నర్తనమును గమనించుకొనుటయే లక్ష్మీ సుముఖత్వముగా గ్రహించగలగాలి.  తన స్వస్వరూపమును అర్థముచ...

SIVATANDAVASTOTRAMU(VISUDDHIM ETI SAMTATAM)-14

Image
  ఇమం హి నిత్యమేవముక్తముత్తమోత్తమం స్తవం పఠన్స్మరన్బ్రువన్నరో విశుద్ధిమేతిసంతతమ్ | హరే గురౌ సుభక్తిమాశు యాతి నాన్యథా గతిం విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనమ్ || 14 ||  క్రిందటి శ్లోకములో సాధకుడు తాను పొందవలసిన సమాధిస్థితిని తెలియచేస్తూ,కనుబొమలమధ్యలో తన ఏకాగ్రతను నిలిపి ఆ పరమాద్భుతమును దర్శితూ,ధ్యానిస్తూ , స్తవములలోఎల్లా అత్యుత్తమమన శివతాండవస్తొత్రమును  1.పఠన్-స్మరన్-బ్రువన్  చదివినను-స్మరించినను-జపించినను  ఇదమ్హి నిత్య ఏవ ముక్తం  శాశ్వతమైన ముక్తిని ప్రసాదిస్తుంది.  2.అంతే కాదు న అన్యధాగతి-అంతకంతే తక్కువ స్థితికి తీసుకుని వెళ్లదు.అంటే అదే స్థితిలోనే సాధకుని చిత్తమును నిలుపుతుంది. 3.అట్టి స్థితికి అనుకూలమగు  నరో విశుద్ధ ఏతి సంతతం  ఇక్కడ నరులకు అను శబ్దము ప్రయోగించబడినది. ఆకారములు వికారములకు ప్రేరకములు.నరులకు చూపు ఆకారములపై నున్నంతకాలము వికారములు వారిని వేధించక మానవు.  ఆకారములో దాగి చైతన్యవంతము చేస్తున్న అసలును గ్రహించిన వేళ ఆకారములేదు-అది కల్పించు వికారములుండవు.  అప్పుడు ఆ హృదయకుహరములో సుభక్తి ప్రవేశించి ఆ పరమాత్మను గురువుగా తనను అను...

SIVATANDAVA STOTRAMU(SIVETI MAMTRAMUCHCHAREN KADA-WHEN)-13

Image
  కదా నిలింపనిర్ఝరీనికుంజకోటరే వసన్ విముక్తదుర్మతిః సదా శిరఃస్థమంజలిం వహన్ | విముక్తలోలలోచనో లలాటఫాలలగ్నకః శివేతి మంత్రముచ్చరన్ సదా సుఖీ భవామ్యహమ్ || 13 ||   క్రిందటి శ్లోకములో సాధకునకు కావలిసిన మనోస్థితిని సమస్థితిగా వివరిస్తూ,అట్తి స్థితిని పొందుటకు బాహ్యవస్తువులలోని వైవిధ్యమును గమనిస్తూ ద్వంద్వములో దాగియున్న మూలమును గ్రహింకలిగే సంస్కారమును పొందాలి అని చెప్పబడినది.    ప్రస్తుత శ్లోకములో ఆసనమును గురించి ఎటువంటి ప్రదేశము అనువైనది నాలుగు విధములుగా ఐదవది ఫలితముగా చెప్పబడినది.అవియే 1.వసనము 2.స్మరనము 3.లగ్నము 4.వందనము 5.సుఖము                           1.వసనము.    *******  బాహ్యమునకు   నిలింపనిర్ఝరీ ప్రవాహ తటమున కల కుటీరము అనువైనదట.భ్రూమధ్యక్షే త్రమైన కాశీక్షే త్రమున ప్రవహించుచున్న గంగానదీ తీరమున నున్న పవిత్ర ఆశ్రమములో అధిష్ఠించి ఉపాసనను ప్రారంభించవేల్ననెను.   మనసులో కదిలే ఆలోచనలన్నీ నిలింపనిర్ఝరీ తరంగములు కావలెని.వాటి తీరమున నున్న హృదయ కుహరము కుటీరముగా కావించుకొనవలెను. ...

SIVATANDAVA STOTRAMU( KADA SADASIVAM BHAJE--ELIGIBILITY TO WORSHIP)-1212

Image
  దృషద్విచిత్రతల్పయోర్భుజంగమౌక్తికస్రజోర్- -గరిష్ఠరత్నలోష్ఠయోః సుహృద్విపక్షపక్షయోః | తృష్ణారవిందచక్షుషోః ప్రజామహీమహేంద్రయోః సమం ప్రవర్తయన్మనః కదా సదాశివం భజే || 12 ||   మొదటి శ్లోకములో జటాజూటమునుండి జారిన నిలింప-దేవతలయొక్క-నిర్ఝరీ-జల ప్రవాహము శివతాండవ వేదికను పునీతము చేసినది.ప్రస్తుత శ్లోకములో సాధకుని హృదయపీఠిక స్వామి తాండవమునకు ఏ విధముగా సిద్ధము చేసుకొనవలెనో తెలియచేయబడుతున్నది.  ఇంతవరకు చెప్పబడిన శ్లోకములలో సర్పములు ఒకసారి ఆభరణముగాను-మరొకసారి ఆయుధముగాను-ఇంకొకసారి అగ్నిని ప్రజ్వలించేసిన జ్వాల గాను స్వామి తాండవములో భావింపచేసినది.  అదే విధముగా స్వామి కంఠము సైతము ఒకసారి అమావాస్య కటికచీకటిగాను మరొకసారి చంద్రోదయమునకు వికసించుచున్న కలువకాంతిగాను ప్రస్తావింపబడినది.   గజము ఒక సారి గర్వచిహ్నముగాను మరొకసారి ఉత్తరీయముగాను భావింపబడినది.   చంద్రవంక ఒకసారి స్వామి జటలో ఆభరణముగాను మరొకసారి చకోరమునకు వెన్నెలనందించు అమృతమూర్తిగాను వర్ణింపబడినది.  అమ్మవారు సరేసరి .అగ్నిసోమాత్మక సంకేతముగాను,అర్థనారీశ్వర పరమార్థముగాను,మరొకసారి జగన్మాతగా స్థితికార్యమును నిర్వహించుటకు సూర్యచ...

SIVATANDAVASTOTRAMU( TAAMDAVA SIVAM KAROTI)--11

Image
  జయత్వదభ్రవిభ్రమభ్రమద్భుజంగమశ్వస- -ద్వినిర్గమత్క్రమస్ఫురత్కరాలఫాలహవ్యవాట్ | ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్మృదంగతుంగమంగళ ధ్వనిక్రమప్రవర్తిత ప్రచండతాండవః శివః || 11 ||     ప్రస్తుత శ్లోకములో సర్వ చరాచరముల పరిణామములను సంకేతించుచు,విష్ణువు మృదంగధ్వని క్రమముగా స్వామి నర్తనము జరుగుచున్నదని వివరిస్తున్నారు.అదే విధముగా సర్పముల శ్వాసప్రక్రియ యొక్క రాక-పోకల లయము/లీనత్వమును వివరిస్తూ,లలాట నేత్రము ఏ విధముగా కీలలతో జ్వలితమగుచున్నదో వర్ణించబడినది. విత్తు స్థితి నుండి మొలక స్థితికి జరిగే పరిణాములో/మార్పులో పూర్వస్థితి-తదుపరి స్థిలో కలిసిపోతుంది.ఆ మొలక మొక్కగా మారువేళ రెండు స్థితులు అవే బీజస్థి-మొలకస్థితి-మొక్క స్థితిని పొంది,తదుపరి వృక్షస్థితికి చేరునపుడు నాలుగు స్థితులను ఒక స్థితిలో ముందటి స్థితిని లీనము చేసుకుంటూ ముందుకు సాగుతుంది.అదే విధముగా స్వామి తాండవము సైతము ఒక స్థితి నుండి మరొకస్థితి తన పూర్వస్థితిని తనలో లీనము చేసుకొని తదుపరి స్థితిని పొందుటకు ముందుకు సాగుతుంటుంది.  మొదటి శ్లోకములో డమడమ డమ అంటూ డమరుక శబ్దముతో ప్రారంభించిన తాండవమును ధిమి ధిమి ధిమి అను మ్ర్దంగ ధ్వనికి అనుగుణముగా నర...

SIVATANDAVASTOTRAM( MADHUVRATAM AHAM BHAJE)-10

Image
అఖర్వ   సర్వమంగళాకళాకదంబమంజరీ రసప్రవాహమాధురీ విజృంభణామధువ్రతమ్ | స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే || 10 ||    "పరిత్రాణాయ సాధూనాం -వినాశాయచ దుష్కృతాం"    అన్న పరమాత్మ నియమమే మధువ్రతము.ఒక చక్కని నియమము.ఆ విషయమునే సాధకుడు ప్రస్తుత శ్లోకములో సుస్పష్టము చేయుచున్నాశ్డు.  అంతేకాదు సాధకుడు స్వీకరనము-సంహరనము అను రెండు విరుద్ధ చ్విషయములను తెలియచేస్తున్నారు.  ఒక పదార్థము కాని-ఒక విషయము కాని స్వీకరణమునకు యోగ్యతను పొందాలంటే దానిలోని దోషములు తొలగ్ఫింపబడాలి.ఆ విషయమునే అమ్మ పరముగా-అఖర్వ సర్వమంగళా గా కీర్తింపబడుతున్నది క్రియారూపముగా. అఖర్వ-దోషరహితమైన సర్వమంగళ కర్తగా స్వామి ప్రస్తుతింపబడుతున్నాడు.  స్వామిని సాకారముగా కీర్తించాలనుకుంటే స్వామి మన్మథుని-త్రిపురాసురుని-దక్షుని-గజాసురుని-అంధకాసురుని-యముని అంతమొనరించి -దోషరహితమైన అమృతత్త్వాని-కదంబ పుష్ప మధువును గ్రహించు వ్రతమును పూనియున్నాడు.  అంతరార్థమును గమనిస్తే స్వామి జనన-మరణ చక్రమునుండి విముక్తులను కావించుచున్నాడు.  కనుకనే, " పునరపి జననం-పునరపు మరణం   పునరపి జననీ-జఠరే...