Posts

TIRUPPAAVAI-01

Image
  పాశురం-01 *********  ఆండాళ్  తల్లికి, ఆచార్యులకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటు,అమ్మ అనుగ్రహించినంత మేర, మొదటి పాశురమును అనుసంధానము చేసుకుందాము .అమ్మ చెప్పినట్లు నారాయణనే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు "నమక్కే మనకే" తప్పక పరతరువాయ్-"పరను" అనుగ్రహిస్తాడు అన్న  అమ్మ మాటకు భక్తి యే అర్హతగా స్వామిని అడిగే అధికారముగా భావిస్తూ,  మార్గళి తింగళ్ మదినిరైంద నన్నాళాల్  నీరాడప్పోదువీర్ పోదుమినో నేరిళైఈర్  శీర్మల్గుం అయిప్పాడి చ్చెల్వ చ్చిరుమీర్గాళ్  కూర్వేల్ కొడున్ తొళిలన్ నందగోపకుమరన్  ఏరారందకణ్ణి యశోదై ఇళంసింగం  కార్మేని చెంకణ్ కదిర్మదియుంపోల్ ముగత్తాన్  నారాయణనే నమక్కే పరై దరువాన్  పారోర్ పుగళ్ పడిందు ఏలో రెంబావాయ్.    ఓం నమో భగవతే వాసుదేవాయ.      **********************     మొదటి పాశురములో యశోదనందుల పుత్రునిగా స్వామి బాలకృష్ణుని అర్చారూపముతో పాటు ,నారాయణుని పర స్వరూపమును తెలియచేస్తూ, శుభసమయమునందు సామూహికముగా గోపికలందరు నోమును నోచుకొనుటకు సంకల్పము-సంసిద్ధము-సానుకూలతను తెలుపుతున్నది.గోదమ్మ.వ్రతఫల...

IDAEYAM TVAAM PASYAAMI/KADAA TVAAMPASYEYAM-30.

Image
     కదా త్వాంపశ్యేయం/ఇదేయం  త్వాం పశ్యామి      ధన్యోస్మి  దయామయా.-30   ************************  " జిహ్వ చిత్త శిరోంఘ్రి నయన శ్రోతైః అహంప్రార్థితం    నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం."   " సకలము నీవే సదాశివా-సంకల్పము నీవే సర్వేశ్వరా     మూలము నీవే హరోంహరా-మూలాధారము నీవే పరాత్పరా      నీలి గగనము నీవే-వాయుపవనమును నీవే     నీటికి మూలము  నీవే -చీకటికి దీపము నీవే      పుడమియు నీవే-గుడియును నీవే     రవి శశి గ్రహముల గమనము నీవే     సమయము నీవే-సంరక్షణయును నీవే         ఏకము నీవే-అనేకము నీవే      వెలుపల నీవే-లోపల నీవే     గమనము నీవే-గమ్యము నీవే      నమకము నీవే-చమకము నీవే    కరుణయు నీవే-శరణాగతియును  నీవే   పాహిమాం-పాహిమాం అనిపరమేశ్వరుని   ప్రార్థిస్తూ, ఈనాటి బిల్వార్చనమును ప్రారంభించుకుందాము.    ఎంతటి పరమాద్భుత తాండవము.సకలమును సముచిత స్థానములలో నిలుపుటయే కదా ...

IDEYAM TVAAM PASYAAMI/KADAA TVAAM PASYAEYAM-29

Image
    ఇదేయం త్వా  పశ్యామి-03   కదా  త్వాం  పశ్యేయం-29  **********************  "జిహ్వ చిత్తశిరోంఘ్రి నయన శ్రోతైః అహం ప్రార్థితం   నమామి భగవత్పాదం  శంకరంలోక శంకరం."   " హరం త్రిపురభంజనం అనంతకృత కంకణం అఖండదయం అంతరహితం   విరించి సుర సంహతి పురందర విచించిత పదం తరుణచంద్ర మకుటం    పరం పద విఖండిత యమం భసిత మండిత తనుం మదన వంచన పరం    చిరంతనమముం ప్రణవ సంచితనిధిం పర చిదంబర నటం  హృది భజ."   అని పతంజలి చే స్తుతింపబడిన త్రిపురహరుని మనములో త్రికరణ శుద్ధితో నిలుపుకుని, ఈనాటి బిల్వార్చనమును ప్రారంభించుకుందాము.   పిల్లలు శంకరయ్య చుట్టుముట్టి,కనకసభకు చేరుకునేలోగా మ0చికథను చెప్పమని అడిగారు.  ఎవరికథ ఎందుకు? నా కథ చెబుతాను అన్నాడు వారితో.మీకథ చెబుతారా-బాగుంటుందా అని అడిగారు పిల్లలు.  విన్న తరువాత మీరే చెప్పాలి ఎలావుందో?      ఒకానకొప్పడు శంకరయ్య శివునిమీద చాలా కోపముతో ఉండేవాడు.మోసగాడు అనుకునేవాడు.మనసు-వాక్కు-పని శివునికినమస్కరించమంటే మొరాయించేది.   ఎందుకు?అమాయకముగా అడిగారు పిల్లలు.  ఎ...

POST-28

Image
  ఇదేయం  త్వాం  పశ్యామి-02   కదా  త్వాంపశ్యేయం-28  ****************************  " జిహ్వ చిత్త శిరోంఘ్రి నయన శ్రోతైః అహం ప్రార్థితం    నమామి భగవత్ పాదం శంకరం లోకశంకరం"  " నమస్తే నమస్తే విభో విశ్వమూర్తే    నమస్తే నమస్తే చిదానంద మూర్తే    నమస్తే నమస్తే తపోయోగ గమ్య    నమస్తే నమస్తే శ్రుతి జ్ఞానగమ్య"     అంటు సదాశివునకు నమస్కరించుకుంటూ,శంకరయ్యతో పాటుగా మనము ఈనాటి బిల్వార్చనమును ప్రారంభించుకుందాము.   " మన ఏవ మనుష్యాణాం-కారణం బంధ-మోక్షయోః"  ఎంతటి అమృత వాక్యమిది.  మనుషులకు జగత్తులో బంధానికైనా/ముక్తికైనా మనసే కారణం కదా.  అతిచంచలమైన మనసు-అజ్ఞానముతో జతకలిపి "సత్-చిత్పదార్థముబు" అన్యపదార్థముగా భావింపచేస్తూ భంగపడుతుంటుంది.  ఆ మోసగానిని పట్టుకోవాలని బయలుదేరిన నేను ఆ ఆటవికుని దర్శనముచే ,కొత్త అనుభూతికి లోనగుచున్నాను.  కదలమంటున్న శివుడు-కదలలేనంటున్న జీవుని,  తస్యైవాహం/ తస్య ఏవ అహం, అను విషయమును తెలియచేసి,దానినుండి,   మమ ఏవ అసౌ అను దారికి మళ్ళించి,క్రమముగా  స ఏవ అహం అను...

IDEYAM TVAAMPASYAAMI-02(KADAA TVAAM PASYAEYAM-28)

   " జిహ్వ చిత్త శిరోంఘ్రి నయన శ్రోతైః అహం ప్రార్థితం    నమామి భగవత్ పాదం శంకరం లోకశంకరం"  " నమస్తే నమస్తే విభో విశ్వమూర్తే    నమస్తే నమస్తే చిదానంద మూర్తే    నమస్తే నమస్తే తపోయోగ గమ్య    నమస్తే నమస్తే శ్రుతి జ్ఞానగమ్య"     అంటు సదాశివునకు నమస్కరించుకుంటూ,శంకరయ్యతో పాటుగా మనము ఈనాటి బిల్వార్చనమును ప్రారంభించుకుందాము.  పిల్లలు చేతులు పట్టుకుని శంకరయ్యతో పాటుగా నడుస్తున్నారు.   గిరిజ చనువుగా శంకరయ్యగారు శివుడు ఎప్పుడు/ఎక్కడ తాందవము చేస్తాడు?అసలు ఎందుకు చేస్తాడు?ఎవరు దానిని చూస్తారు అంటూ ప్రశ్నలలహరులతో పాటుగా పరుగులు తీస్తుంటే,  అమ్మా గిరిజా!  విశ్వ తాండవమే -విశ్వేశ్వర తాండవము   అది ప్రదోషవేళలలో అనగా సంధ్యాసమయములో జరుగుతుంది.  ఆ నటరాజు సముద్రములను-కొండలను-వనములను-మనములను సముచిత స్థానములలో/అటు-ఇటు చెదిరిపోకుండా చేయుటయే " ఆ శివతాండవము."  దానిని ఆ జగన్మాత వీక్షించుటకు వచ్చినంతనే పరమశివుడు ఆ అమ్మను చూస్తూ,మరింత పరవశముతో చేస్తాడు అనిచెబుతుండగా ఆ పురివిప్పి నాట్యముచేస్తున్న నెమలిరాకు కన్నులముందు స...

IDEAM TVAAM PASYAEYAM-02/ KADAA TVAAM PASYAEYAM-28

   " జిహ్వ చిత్త శిరోంఘ్రి నయన శ్రోతైః అహం ప్రార్థితం    నమామి భగవత్ పాదం శంకరం లోకశంకరం"  " నమస్తే నమస్తే విభో విశ్వమూర్తే    నమస్తే నమస్తే చిదానంద మూర్తే    నమస్తే నమస్తే తపోయోగ గమ్య    నమస్తే నమస్తే శ్రుతి జ్ఞానగమ్య"     అంటు సదాశివునకు నమస్కరించుకుంటూ,శంకరయ్యతో పాటుగా మనము ఈనాటి బిల్వార్చనమును ప్రారంభించుకుందాము.  పిల్లలు చేతులు పట్టుకుని శంకరయ్యతో పాటుగా నడుస్తున్నారు.   గిరిజ చనువుగా శంకరయ్యగారు శివుడు ఎప్పుడు/ఎక్కడ తాందవము చేస్తాడు?అసలు ఎందుకు చేస్తాడు?ఎవరు దానిని చూస్తారు అంటూ ప్రశ్నలలహరులతో పాటుగా పరుగులు తీస్తుంటే,  అమ్మా గిరిజా!  విశ్వ తాండవమే -విశ్వేశ్వర తాండవము   అది ప్రదోషవేళలలో అనగా సంధ్యాసమయములో జరుగుతుంది.  ఆ నటరాజు సముద్రములను-కొండలను-వనములను-మనములను సముచిత స్థానములలో/అటు-ఇటు చెదిరిపోకుండా చేయుటయే " ఆ శివతాండవము."  దానిని ఆ జగన్మాత వీక్షించుటకు వచ్చినంతనే పరమశివుడు ఆ అమ్మను చూస్తూ,మరింత పరవశముతో చేస్తాడు అనిచెబుతుండగా ఆ పురివిప్పి నాట్యముచేస్తున్న నెమలిరాకు కన్నులముందు స...

IDEYAM TVAAM PASYAAMI-01 /KADAA TVAAM PASYAEYAM-27

Image
   " ఇదేయం    త్వాం పశ్యామి-01"  (కదా  త్వాం  పశ్యేయం-27)  ***************************  " జిహ్వ చిత్త శిరోంఘ్రి నయన శ్రోతైః అహం ప్రార్థితం    నమామి భగవత్పాదం  శంకరం లోకశంకరం."   మహేశుని అనుగ్రహ ఆవిష్కరణము శంకరయ్యకు ఈ విధముగా తన స్వరూప-స్వభావములను దర్శింపచేస్తున్నది.కనుక "ఇదేయం  త్వాం పశ్యామి" ఇన్ని విధములుగా/ఈవిధముగానిన్ను నేను దర్శించగలుగుతున్నాను.    సర్వం  శివ సంకల్పమస్తు.  "   " స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితా గాన ఫణితౌ    పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేష్వ చతురః    కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయికోహం? పశుపతీ    పశుం మాం  సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభు."  "ప్రీతిర్భవతి మయికోహం?   రాజాశ్రయమును పొందుటకు తగిన అర్హతలు లేని,కనీసము నన్ను నేను తెలిసికోలేని  పశువును పశుపతివైన నీవు తప్ప ఎవరు రక్షించగలరు?అని శరణు వేడుతూ  ఈనాటి బిల్వార్చనమును  ప్రారంభించుకుందాము.   అనుగ్రహిస్తున్న ఆదిదేవుని వైపు ఆకర్షితుదగుచున్నాడో,ఆనందానుభూతిని ...