Posts

TIRUPPAAVAI-07 PAASURAM

Image
     తిరుప్పావై-పాశురము07    ******************  "మాతః సముత్థైతవతీ మదివిష్ణుచిత్తం   విశ్వోపజీవమమృతం వచస దుహానాం   తాపఛ్చదం హిమరుచేరివ మూర్తిమన్యాం   సంతః పయోధి దుహితః సహజాం విదుస్త్వాం"   పూర్వపాశుర ప్రస్తావనము   *********************   మనము శుద్ధి వ్రతమును పూర్తి చేసుకుని,ఆందాళమ్మచేతిని పట్టుకుని రెండవ భాగమైన 'మేల్కొలుపు వ్రత భాగములో మొదటి గోపికను మనతో కలుపుకుని,రెండవ గోపిక ఇంటికి వెళ్ళుచున్నాము"  ప్రస్తుత పాశురములో శబ్దమును మరింత స్పష్టము చేస్తూ,భారధ్వాజ పక్షుల "కృష్ణ నామ సంకీర్తనమును" గొల్ల భామల చల్ల చిలుకు శబ్దములను,కేశి అను రక్కసుని సంహరించిన కేశవ నామ సంకీర్తనమును శబ్దమును-అందులో దాగిన పరమార్థమును తెలిసికొనుటకు శ్రవనమును సాధనములుగా నోము సాధనకు వివరించుచున్నది గోదమ్మ.  ఆండాళ్ తల్లికి-ఆళ్వారులకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ,మనము పాశురములోనికి ప్రవేశిద్దాము. ఏడవ పాశురము **************** కీశు కీశెన్రెంగుం ఆనైచ్చాత్తు కలందు పేశిన పేచ్చరవం కేట్టిలైయో? పేయ్ పెణ్ణే కాశుం పిరప్పుం కలగల ప్పక్కై ప్పేర్తు వాశ నరుం కుళ...

TIRUPPAAVAI---PASURAM06

Image
     తిరుప్పావై-పాశురం06    *****************   " మాతః సముత్థితవతీ మదివిష్ణుచిత్తం    విశ్వోప జీవ్యమమృతం వచసా దుహావాం    తాపఛ్చదం హిమరుచేరివ మూర్తిమన్యాం    సంతః పయోధి దుహితః సహజాంవిదుస్త్వాం."   పూర్వ పాశుర ప్రస్తావనము.   ********************  మొదటి ఐదు పాశురములలో గోదమ్మ శుద్ధివ్రతమును తెలియచేసినది.స్వామి పర-వ్యూహ-విభవ-అంతర్యామి-అర్చా మూర్తి తత్త్వమును వివరించినది.చ్గేతనులకు సులభసాధ్యతనూందించుటకై స్వామి శ్రీకృష్ణావతారమును అర్చావైభవమును వివరించి,దానిని ప్రత్యక్షముగా పొందుట               కేవలము ద్వాపర యుగమునందలివారికే పరిమితమైనందున శ్రీవిల్లిపుత్తూరును రేపల్లెగను,తననొక గోపికను భావించుకుని,తన తోటిగోపికలను వ్రతమునకు మేల్కొలిపే 10 పాశురములను ప్రారంభించుచున్నది.ఇది రెందవ భాగముగా వైష్ణవ సంప్రదాయము పరిగణిస్తుంది.    ప్రస్తుత పాశురములో అమ్మ శృఅణ భక్తికి సంకేతముగా "శబ్దము-శ్రవనము" అను రెండు అంశములను ప్రస్తావిస్తోంది.   "పది గోపికలు" తపోనిద్రలో నున్న వారు కాని తమో...

TIRUPPAAVAI-05

Image
   తిరుప్పావై-పాశురము05  ***************** " మాతః సముత్థితవతీ మదివిష్ణుచిత్తం  విశ్వోపజీవ్యమమృతంవచసా దుహానాం  తాపఛ్చదం హిమరుచేరివ మూర్తిమన్యాం  సంతః పయోధి దుహితః సహజాం విదుస్త్వాం."   పూర్వ పాశుర ప్రస్తావనము   *************************  పర అవతారమైన నారాయణుని చేరుట అత్యంత దుర్లభము కనుక స్వామి పాలకడలిపై తన వ్యూహరూపమును ప్రకటించినాడు.పాలకడలిచేరుటయును పరమదుర్లభము కనుక స్వామి లీలావతారముగా"వామనమూర్తిని" ప్రస్తుతించినప్పటికిని అవతార సమయము చాలా స్వల్పము.చేసిన కార్యము ఘనమే అయినను ఒక్కటియే.అట్టి లీలావతారమునుప్రత్యక్షముగా కొలుచుట  చేతనులకు అసంభవము..నాల్గవ పాశురములో పరమాత్మ వరుణదేవుని రూపమున అంతర్యామియై ఆశీర్వదించినాడు.అంతర్యామిని పట్టుకొనుట అత్యంత దుర్లభము సామాన్యులకు.కనుక స్వామి తన అర్చారూపమును ప్రకటించుచు అందరికి సులభసాధ్యుడగుచున్నాడు.  అర్చా రూప విశేషము కదా తాను తల్లితన ఉదరమునకు కట్టినదామమునకు కట్టుబడి యుండుట.   బందీగా ఉన్న పరమాత్మ నలకూబరుల బంధవిమోచనమును కావించుట మరింత విశేషము.ఒక పక్క అవతార ధర్మపాలన చేస్తూనే-ఆశ్రిత రక్షణా పాలనమునుచేస్త...

TIRUPPAAVAI-04

Image
    తిరుప్పావై-నాల్గవ పాశురము   *********************  "మాతః సముత్థితవతీ మదివిష్ణుచిత్తం   విశ్వోప జీవ్యమమృతం వచసా దుహానాం   తాపఛ్చదం హిమరుచేరివ మూర్తిమన్యాం   సంతః పయోధి దుహితః సహజాం విదుస్త్వాం."  పూర్వ పాశుర ప్రస్తావనము.  *******************    మొదటి పాశురములో మార్గళి గ్రించి,రెందవ పాశురములో నోము నియమముల గురించి,మూడవ పాశురములో వర్ష ప్రాశస్త్యమును వివరిస్తూ,ఆచార్య వైభవమును పెరుం పశుక్కళ్ అంటూ జ్ఞానమను గోక్షీరమును పుష్కలముగా అనుగ్రహించుచున్నారని తెలిపినది.అమ్మకు సంతృప్తి కలుగలేదు ఆ పరమాత్మ-ఆచార్య వైభవమును మరికొన్ని సంకేతములతో స్పష్టము చేస్తున్నది.    స్వామిని-గురువును నల్లని కరుణామృత మేఘముతో పోలుస్తూ,ఏ విధముగా సముద్రపు ఉప్పునీటిని సూర్యకిరణములవేడితో పైకి గ్రహించి,వానిలోని దోషములను హరించి,మంచినీటిని వర్షించునట్లు,గురువు సైతము అజ్ఞానమనే శిష్యుల ఉప్పునీటిని తన విద్వత్తు అనే సూర్యకిరణముల వేడితో పైకి తీసుకుని,శుభ్రపరచి జ్ఞానమనే మంచినీటిని వర్షిస్తాడు.అంతేకాదు  మేఘము అన్నిచోట్ల సమముగానే వర్షిస్తుంది.గురువు సైతము తన శిష్యుల...

TIRUPAAVAI-03

Image
 తిరుప్పావై-మూడవ  పాశురము  *********************  "మాతః సముత్థితవతీ మది విష్ణుచిత్తం   విశ్వోపజీవ్యమమృతం వచసా దుహానాం   తాపఛ్చదం హిమరుచేరివ మూర్తిమన్యాం   సంతఃపయోధి దుహితః సహజాం విదుస్త్వాం."    పూర్వ పాశుర ప్రస్తావనము     ********************         రెండవ పాశురములో కృత్యాకృత్య  వివేకమును   బోధించిన గోదమ్మ ప్రస్తుత పాశురములో పరమాత్మ            "లీలావతారమైన "    వామన మూర్తి (మత్స్య-కూర్మ-వరాహ-నారసింహ-వామన-    ధర్మసంరక్షనము ఒక్కపర్యాయము అవతరించి-సమస్యను    పరిష్కరించి అవతార సమాప్తిని గావించుట) అనుగ్రహమును    సోదాహరణముగా చెబుతూ ,కృత్య విభూతిని స్మరిస్తూ ,ఏ    విధముగా వామనమూర్తి మూడు అడుగులతో ధర్మమును    రక్షించినాడో-అదేవిధముగా మన బాలకృష్ణుడు సైతము మనలను       ఉద్ధరించగలడు కనుక సందేహమును వీడి నోమునకు       ఉద్యుక్తులమగుదామని ,సత్ఫలితములు కలుగుతాయని      ...

TIRUPAVAI-02

Image
.    తిరుప్పావై-రెండవ పాశురము  *********************  "మాతః సముత్థితవతీ మది విష్ణుచిత్తం   విశ్వోపజీవ్యమమృతం వచసా దుహానాం   తాపఛ్చదం హిమరుచేరివ మూర్తిమన్యాం   సంతఃపయోధి దుహితః సహజాం విదుస్త్వాం." పూర్వ పాశుర ప్రస్తావనము ********************  " తిరు-పావై " అనగా  శ్రీ  వ్రతము. పవిత్రమైననోము.ఇది నిజమునకు విల్లిపుత్తూరులో జరిగినదని పెద్దలు భావిస్తారు.తానొక గోపికయై,విల్లిపుత్తూరును రేపల్లెగా భావిస్తూ,తన చెలులందరినికలుపుకుంటు,యశోద-నందులను-బలరాములను -కృష్ణుని తమ నోముస్థలికి రమ్మని ఆహ్వానించుట,శ్రీకృష్ణునకు పోట్రి(మంగళములు)  పాడుట,రాసలీలలు చేయుట చివరకు గోదాకళ్యాణముతో ఈ ద్రవిడప్రబంధము సకలజనులను ఆశీర్వదిస్తుంది .   రెండవ పాశురములో గోపికలు గోదమ్మతో పాటుగా "కాత్యాయినీ వ్రతమును " చేయ సంకల్పించుకుని,వ్రత నియమములను తెలుసుకుంటుంటారు. .   అసలు ఈ వ్రతమును చేయుటకు ముందు రేపల్లెలో వర్షములు లేక క్షామము సంభవించినదట.దానికి ఎందరు ఎన్నివిధములుగా ప్రయత్నించినను పరిష్కారము లభించలేదు.శ్రీమన్నారాయణుని అనుగ్రహముతో రేపల్లె లోని కన్నెపిల్లలు "కాత్యాయినీ ...

TIRUPPAAVAI-01

Image
  పాశురం-01 *********  ఆండాళ్  తల్లికి, ఆచార్యులకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటు,అమ్మ అనుగ్రహించినంత మేర, మొదటి పాశురమును అనుసంధానము చేసుకుందాము .అమ్మ చెప్పినట్లు నారాయణనే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు "నమక్కే మనకే" తప్పక పరతరువాయ్-"పరను" అనుగ్రహిస్తాడు అన్న  అమ్మ మాటకు భక్తి యే అర్హతగా స్వామిని అడిగే అధికారముగా భావిస్తూ,  మార్గళి తింగళ్ మదినిరైంద నన్నాళాల్  నీరాడప్పోదువీర్ పోదుమినో నేరిళైఈర్  శీర్మల్గుం అయిప్పాడి చ్చెల్వ చ్చిరుమీర్గాళ్  కూర్వేల్ కొడున్ తొళిలన్ నందగోపకుమరన్  ఏరారందకణ్ణి యశోదై ఇళంసింగం  కార్మేని చెంకణ్ కదిర్మదియుంపోల్ ముగత్తాన్  నారాయణనే నమక్కే పరై దరువాన్  పారోర్ పుగళ్ పడిందు ఏలో రెంబావాయ్.    ఓం నమో భగవతే వాసుదేవాయ.      **********************     మొదటి పాశురములో యశోదనందుల పుత్రునిగా స్వామి బాలకృష్ణుని అర్చారూపముతో పాటు ,నారాయణుని పర స్వరూపమును తెలియచేస్తూ, శుభసమయమునందు సామూహికముగా గోపికలందరు నోమును నోచుకొనుటకు సంకల్పము-సంసిద్ధము-సానుకూలతను తెలుపుతున్నది.గోదమ్మ.వ్రతఫల...