Posts

DEVIKHADGAMAALA-INTRODUCTION

Image
     శ్రీ మాత్రే నమః      గం గణపతియే నమః     ****************  అమ్మలగన్నయమ్మ ముగురమ్మలమూలపుటమ్మ దయతో,  'దేవు ఖడ్గమాల స్తోత్రము" శుద్ధసక్తి మహామాల" అంటే ఏమిటి?తెలుసుకోవాలనే జిజ్ఞాసను నాలో అంకురింపచేసిన ఆ అమ్మయే"అమ్మ దయ ఉంటేఅన్నె ఉన్నట్లే" అన్న నానుడిని మరొకసారినిరూపిస్తూ,నాచేతిని పట్టుకుని,నన్నొకకలముగా మలచుకొని తన దివ్యమహిమానుభవములను తానే తెలియచేస్తుందన్న ప్రగాఢ విశ్వాసముతో అమ్మను ప్రార్థిస్తూ,అడుగులను కదుపుదాము. "Yఆదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా  నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమో నమః"   ఖడ్గమాల అంటే ఏమిటి?  ఖండించగలిగే శక్తికల ఆయుధము ఖడ్గము.అజ్ఞానమును-అధర్మమును-అయోమయమును ఖండించకలిగేది.అదే అమ్మానుగ్రహము.అమ్మ అనుగ్రహమును వివరముగా తెలియచేయు స్తోత్రము " దేవిఖడ్గమాలస్తోత్రము.  మూలశక్తితో పాటుగా నున్న పరివారశక్తులను తెలిసికుని,వారిప్రాముఖ్యమును సైతము గుర్తించి,ఆరాధించు అర్చనావిధానమును తెలియచేయు స్తోత్రము"దేవిఖడ్గమాల స్తోత్రము."   మనము చర్మచక్షువులతో నేరుగా చూసి తెలిసికోలేని అపరిమిత అనుగ్రహ శక్తులను తెలిసికొను...
Image
    జై శ్రీరాం  **********  ఎంతటి చమత్కారి అగస్త్యభగవానుడు.రామచంద్రునకు 'తతో యుధ్ధమునా చింతా శోకములను తొలగించుటకై రాముని సమీపించి,స్తోత్రమును ఉపదేశించి నిజస్థానమునకు తరలినాడట.ఇంకాచమత్కారము రామచంద్రుడు భక్తి-శ్రధ్ధలతో ప్రార్థించగానే సూర్యనారయణుడు సంతుష్టుడై రామునిసమీపించి,రావణునికి మరనము ఆసన్నమైనదని కాల స్వరూపునిగా/యమునిగానిర్దేశించి,రాముని దీవించి,సంతసముతోనిజస్థానమునకు చేరినాడట.  అంటే అతి పవిత్రమైన ఆదిత్యహృదయస్తోత్రము కేవలము రామునికిసంబంధించినదా/లేక సకల చేతనులనూద్దేశించి,వెలుగు మార్గమును చూపించుటకు పరోక్షముగా ప్రసాదించినదా అన్న ఒక్కఆలోచన    మనకు నామికి-నామమునకు భేదము లేదని,సకలములో అంతర్యామిగా దాగిన పరమాత్మ తానొక మానవ ధర్మమును అనుసరిస్తూ,ధర్మసంస్థాపనమును ఏ విధముగా నిలిపినాడో విశదపరుస్తుంది.   నారాయణుడే రామచంద్రుడు/సూర్యనారాయణుడు/అగస్త్యభవ్గవానుడు,ఆంజనేయుడు/విభీషణుడు/యుధ్ధభూమి,సీతమ్మ,సర్వము/సకలము పరమాత్మే.  అయినప్పటికిని, " గోచరంబగు జగములోపలగోప్యమైనది రామనామము."  తాను గోప్యముగా ఉండి మనందరిచే,రాముడు యుధ్ధభూమిలో ఉన్నాడు/రాముడు చింతా-శోక...

ADITYAHRDAYAMU-SLOKAMU-31

    ఆదిత్యహృదయము-శ్లోకము-31   ***********************  ప్రార్థన  *******  "జయతుజయతు సూర్యం సప్తలోకైక దీపం   హిరణసమిత పాప ద్వేషదుఃఖస్యనాశం   అరుణకిరణ గమ్యం ఆదిమాదిత్యమూర్తిం   సకలభువనవంద్యం భాస్కరం తం నమామి."  పూర్వరంగము  ***********  పరమాత్మ పన్నెండు నెలలు ఋతుచక్రమునకు అనుకూలముగా తనపరివారమును-తానుసైతము మలచుకుని,ద్వాదశాదిత్యులుగా దర్శనమిస్తున్నాడో,ఏ విధముగా సకలజగములను సకలగ్రహములను సంరక్షించుచున్నాడో,ఏ విధముగా సర్వపాపములను నశింపచేయుచున్నాడో వివరించిన అగస్త్యభగవానుడు,చివరి శ్లోకములో ,  మహేంద్రః ధనదః కాల యమ గా అలరారుతున్న పరమాత్మ సూర్యభగవానునిగా ప్రకటితమగుచు,రావణాసురునికి అంత్యకాలము సమీపించినదని తెలిపి,రాముని రణోన్ముఖుని చేస్తూ,ఆశీర్వదించి తరలినాడట.  శ్లోకము  ******  "అథ రవిరవదన్నిరీక్ష రామం   ముదిత మనాః పరమం ప్రహృష్యమాణః  నిశిచరపతి సంక్షయం విదిత్వా  సురగణ మధ్య గతో వచస్వరేతః"    ఇతి శ్రీమద్రామాయణే యుద్ధ్ధకాండే    ఆదిత్యహృదయ స్తోత్రం సంపూర్ణం."   ఎంతటి చమత్కారి ఈ అగస్త్యభగవ...

ADITYAHRDAYAM-SLOKAM-30

   ఆదిత్యహృదయము-శ్లోకము-30  ***********************  ప్రార్థన  ******* " జయతు జయతు సూర్యం సప్తలోకైక దీపం   హిరణసమిత పాపద్వేష దుఃఖస్యనాశం   అరుణ కిరణగమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం   సకల భువన వంద్యం  భాస్కరం తం నమామి."    పూర్వ రంగము.    ***********     మనముఇప్పటివరకు సూర్యభగవానుని కరుణామృతవర్షమును గురించి తెలుసుకునే ప్రయత్నములో ఒక్కసారి 'పదకవితా పితామహుడైన తాళ్ళపాక అన్నమాచార్య కీర్తనను ప్రస్తావించుకుందాము.  " నీవొక్కడివే సర్వాధారము    నిన్నే ఎరిగిన అన్నియునెరుగుట   .....  నీ యందె బ్రహ్మయు రుద్రుడు ఇంద్రుడు   నీ యందె ఋషులు  నీయందె గరుడ గంధర్వులు  నీ వలననె కిన్నెర కింపురుషులు  నీ వలననె అచ్చరులు ఉరగులు    ఎంతటి అద్భుతము " నీ యందె ద్వాదశాదిత్యులు"    ఓ పరమాత్మ! ఓ పరంధామ  నీలోనె అన్నియును  నిన్నర్చించిన -నిఖిల తృప్తికరము అని ప్రత్యక్ష పరమాత్మ తత్త్వమును ప్రస్తుతించినాడు.  మరొకమహానుభావుడు,  నారాయణా! నారాయణా  నను కావుమో సూర్యనారాయణా ...
   ఏక ఏవహిలోకానాం సూర్య ఆత్మాదికృత్ హరిః-భాగవతపురాణము.  ప్రంచ స్థితికి పూర్వస్థితిచీకటియే కదా.తమోగుణప్రధానులైన హర్తి-ప్రహేతిమొదలగు రాక్షసులు సూర్యభగవానుని రథమును ముందుకుజరుపుతుంటారు.  సూర్యభగవానునిప్రతికిరనము నాదమయమే.ధర్మసంకేతము.  నాదాత్మకమైన సూర్యకిరన శక్తియే గాయత్రీమంత్రము.  గాతారం ధారయతీతి గంధర్వః.గానధరులు గంధర్వులు.  చాందగ్యోపనిషత్తు సూర్యపరమాత్మ నుండిజనించు నాదమును ప్రణవముగా కీర్తిస్తుంది.  వాలిఖ్యాది మునులు సూర్యకిరనములనాశ్రయించుకుని తపోసంపన్నులుగా అలరారు తున్నారు. వారుసూర్యరథమునకు అనవరతముమంగళాశాసనములనుసమర్పిస్తుంటారు.వాలిఖ్యము నగాఖండము. ప్రతిసూర్యమాసమునందు ఒక్కొక్క ఋషి రథముకదలబోవు సమయమున దానికి ముందునిలబడి,స్వామి రథగమనమును సంకేతిస్తారట.  పాతాళలోక సాంరక్షణమునకు స్వామిని సర్పములు స్వామి రథ పగ్గములను సవరించి,పయనమునకు సిద్ధము చేస్తాయట.  ఋషులు-గంధర్వులు-యక్షులు,నాగులు,రాక్షసులు-అప్సరసలు దేవతలు అను సప్పగనములతో సేవింపబడుతూ స్వామిసర్వమంగళములనూనుగ్రహిస్తాడు.  యక్షులు వీరూపదేవతలు.వీరు స్వామి రథమునకూశ్వములనూనుసంధానముచేస్తుంటారు.భూగర్భ స...
   శ్లోకము  *******  " సర్వ మంగళమాంగల్యం సర్వపాప ప్రణాసకం    చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం."   ఆదిత్యహృదయ స్తోత్రము సర్వమంగళములకు మూలాధారము.సర్వపాపములను నశింపచేయునది.చింతాశోకనిర్మూలమునకు కారణభూతమైనది.    మనము ఆదిత్యహృదయ స్తోత్ర సారమును పదకవితాపితామహుడు తాళ్ళపాక అన్నమాచార్యులు ఒక చక్కటికీర్తనతో అర్థమయేలా వివరించారు.  "నీవొక్కడివే సర్వాధారము   నిన్నే ఎరిగిన అన్నెయు నెరుగుట   అంటూనే సర్వము గురించి విశదీకరించారు.  1.నీ యందె బ్రహ్మయు రుద్రుడుఇంద్రుడు    ఆదిత్యహృదయము సైతము   ఏషబ్రహ్మాచ-విష్ణుశ్చ-శివ-స్కంద అంటూ,   దేవతలప్రసక్తి తెచ్చినది.   పరబ్రహ్మపరిపాలన నిమిత్తము తననుండి కొన్ని శక్తులను ఆవిర్భవింపచేసి వారిలో/వాటిలో తాను ప్రవేశించి పరిపాలించుచున్నాడు.  2.నీ యందె మనువులు-వసువులు-ఋషులు    సూర్యనారాయణుడు పన్నెండు సౌరమాసములకు అదే మధుమాసము-మాధవమాసము ఇత్యాది పన్నెండు విభాగములకు పన్నెండు స్వరూప-స్వభావములతో,నామరూపములతో సృష్టి-స్థితికార్యములను నిర్వహిస్తున్నాడు.ఆ విషయమునే,  3.నీ యందె ద్వ...

ADITYAHRDAYAM-SLOKAMU-29

Image
     ఆదిత్యహృదయం-శ్లోకం-29   ********************  ప్రార్థన  *******  'జయతుజయతు సూర్యం సప్తలోకైకదీపం   తిమిర హిరణ పాప  ద్వేష  దుఃఖస్య నాశం   అరుణకిరణ గమ్యం  ఆదిం ఆదిత్యమూర్తిం   సకలభువన వంద్యం భాస్కరం  తం నమామి."   పూర్వరంగం   **********  ఆదిత్య అనుగ్రహముతో నష్టశోకుడైన రాముడు ప్రియమనస్కుడై కర్తవ్యోన్ముఖుడైనాడు.రావణుని,రాజస-తామసములను నిర్మూలించుట కు,ధర్మ సంస్థాపనమునకై ధనుర్ధారియైనాడు.  శ్లోకము  ******  " రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్    సర్వ యత్నేన మహతా వధే తస్య ధృతోభవత్."  ఉత్సాహభరిత అంతరంగముతో తనతో యుద్ధముచేయుటకు వచ్చుచున్న రావణుని వధించుట కు రాముడు కృతనిశ్చయుడాయెను అన్నది కథనము.   దీనిలో దాగిన మర్మము మహాద్భుతము.  భగవద్గీతలోని గుణత్రయవిభాగమును  మనకథనమునకు అన్వయించుకుంటే మనము సూక్ష్మమును గ్రహించినట్లే.   ఇది యుద్ధరంగము.లంకాద్వీపములో జరుగుచున్నయుద్ధము.ధర్మ సంరక్షణమునకు జరుపుచున్నయుద్ధము.  రాముడు-రావణుడు యుద్ధమును చేయుచున్నవారు.   ...