Posts

AMTARDASARA CHAKRAMU-PARICHAYAMU

Image
   "వాగ్వాదినీ  వామకేశీ వహ్నిమండల వాసినీ"అని   "జ్వాలా మాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మథ్యగా"  అని శ్రీ లలితా రహస్య సహస్ర నామము అమ్మవారి అగ్నితత్త్వమును ప్రస్తుతించింది.   లోపలవైపునకు ఉన్న పది అగ్నితత్త్వ కోణములు కల ఈ ప్రాకారమును/చక్రమును "సర్వ రక్షాకర చక్రము" గాను,అంతర్దశారముగాను వ్యవహరిస్తారు.  ప్రాకామ్యసిద్ధి విరాజిత ఈ ఆవరణమును "సర్వజ్ఞా సదనము" అనికూడా సంభావిస్తారు.  ఈ ఆవరనములో పది విభిన్న అగ్ని శక్తులు "నిగర్భయోగినులుగా" సాధకునికి సహాయపడుతుంటాయి.అమ్మవారికీతి సమీపముగా సాధకుని పయనము అగుచున్నది కనుక గర్భస్థ శిశువు గా భావిస్తూ నిగర్భ యోగినులను దర్శించగలుగుతాడు అమ్మ అనుగ్రహముతో.  గర్భ అను పదమును ఆధారముగా అన్వయించుకుంటే నిగర్భ అనుపదమును నిక్షిప్తముగా ఆధారము చేయబడిన శక్తులుగా పూజింపవచ్చును.    జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఈ ప్రదేశములో నిగర్భయోగినులు ప్రక్షాళనము,జీర్ణక్రియ,శోషము,రసాయనీకరనము,విసర్జనము జరుగుటకు సహాయపడుతుంటాయి.  సర్వ అను ఉపసర్గతో నున్న, 1సర్వజ్ఞే 2.సర్వశక్తే 3.సర్వైశ్వర్యప్రదాయిని 4.సర్వజ్ఞానమయి 5.సర్వధారాస్వరూపే 6.సర్వ...

BAHIRDASAARA CHAKRAMU-PARICHAYAMU

Image
   పరమేశ్వరి అనుగ్రహముగా మనము సర్వసౌభాగ్యదాయకచక్రమును దాటి"సర్వార్థసాధకచక్రము/బహిర్దశారము అను పదికోణములు వెలుపలగా గల ఆవరణములోనికి ప్రవేశించుచున్నాము.  " శక్తిః  ఎకాం దశస్థానే స్థిత్వా సూతై జగత్రయం    విశ్వ యోనిః ఇతి ఖ్యాతాఃసా విష్ణుః దశరూపకం"   ఇదే విషయమును లలితా రహస్య సహస్రనామ స్తోత్రము,  "కరాంగుళి నఖోత్పన్నా నారాయన దశాకృతిః" అని స్తుతించింది.     వైష్ణవీ శక్తి ఒక్క స్థానములో స్థిరముగానుండిపది స్థానములలో విభిన్నముగా ఏర్పడి"కులయోగినులు"గా సహాయపడుతూ,"త్రిపురాశ్రీ" అను చక్రేశ్వరి ఆశీర్వచనముతో,ధర్మార్థ కామమోక్ష ప్రదాయకముగా కీర్తింపబడుచున్నది.  నాల్గవ చక్రమైన సర్వ సౌభాగ్యదాయక చక్రము నాడీమండలముగా నున్న చేతనాశక్తిని సాధకునికి వివరిస్తే,సర్వార్థసాధక చక్రము నాడులలో ప్రాణనాడి యైన 'సుషుమ్న" నాడి ప్రాధాన్యమును,దానిలోనిచేతనత్వమును కులయోగినుల ద్వారా సాధకునికి  పరిచయము చేస్తుంది.   స్మృతి షట్చక్రములకూటమిని"కులముగా" వివరిస్తే,ఖడ్గమాల స్తోత్రము మన శరీరములో అంతర్లీనముగా నున్న సుషుమ్నను కులముగా,దాని వివిధ శక్తులను కులయోగినులుగా కీర్తిస్తుంద...

SARVA SAUBHAAGYADAAYAKA CHAKRAMU-PARICHAYAMU

Image
   " హ్రీంకారస్తు మహామాయా భువనాని చతుర్దశా    పాలయంతు ఫలా తస్మాత్ చక్రకోణంప్రవేశ్మితే"  పదునాలుగు చక్రకోణములుగా ప్రకటింపబడుతూ,పదునాలుగు భువన భాందములను పరిపాలిస్తున్న పరమేశ్వరికి ప్రణామములు.   పరాత్వరి అనుగ్రహముతో మనము ,  1.త్రైలోక్య మోహన చక్రము  2.సర్వాశా పరిపూరక చక్రము  3.సర్వ సంక్షోభణ చక్రము నందు అధిష్ఠించి,అనుగ్రహిస్తున్న   1.ప్రకటయోగినిలు  2.గుప్త యోగినులు  3.గుప్త తర యోగినుల సహాయముతో    నాల్గవ చక్రమైన 4.చతుర్దశారము/పదునాలుగు త్రికోణములున్న చక్రము లోనికి ప్రవేశిస్తున్నాము.    మూడు ఆవరనములో నున్నప్పుడు సాధకుడు,  నేను వేరు-పరాత్పరి వేరు అన్న ద్వంద్వ భావములుకలవాడై,  అమ్మను ప్రార్థిస్తే సంతసించి,నా ఎదుట ప్రత్యక్షమై నన్ను అనుగ్రహిస్తుంది అన్న వస్తు భావన మిళితమైన వాస్తవములో ఉంటాడు.  ఆ భావనకు అనుగుణముగానే మొదటి చక్రమైన భూపురము చతురస్రాకార (ఊహా)మూడు రేఖలు,పదహారుదళముల పద్మము,అష్టదళ పద్మము సాధనా ప్రారంభమునకు వీలుగా,అత్మ తత్త్వ విచారణకు అనుగుణముగా వికసిస్తున్న జ్ఞాన రేకులతో సాధకుని బిందువు చేరుట...

SARVA SAmKSHOBHANA CHAKRAMU-PARICHAYAMU

Image
    "అష్టదళ కమలమందు నిష్ఠతో నీ ప్రతిమ నిలిపి    సృష్టికర్తవనువనుచు తెలిసి ఇష్తముగ సేవించుచుంటి      ఈశ్వరి నీకిదిగోమంగళం      త్రిపురంతకవాసిని దేవి నీకిదిగో మంగలం"    పరమేశ్వరి దయతో మనము అష్టదళ విలసితమైన సర్వసంక్షోభణ చక్రములోనికి ప్రవేశించుచున్నాము.ఇక్కడానంగశక్తులు గుప్తతర యోగినులుగా త్రిపురసుందరి సమేతులై విరాజిల్లుచున్నారు.  అమ్మవారిని లక్ష్మీ స్వరూపముగాకీర్తించేటప్పుడు,  అనంగ పాయనీ/అనంగపారగావీక్షణ శబ్దములు వింటుంటాము.   అనంగా అను శబ్దమునకు అవిభాజ్యము/అఖందము/అనంతము/అవిఛ్చిన్నము/ఆది-మధ్య-అంతరహితము అన్న భావముతో సమన్వయిస్తారు.  మనము ఇంతకుముందు "సర్వాశాపరిపూరక చక్రములో" కామాకర్షిణి మొదలగు గుప్తయోగినుల అనుగ్రహమును తెలుసుకున్నాము.  సామాన్యముగా ఆకర్షణ అనునది ఒక వస్తువుపైనగాని/ఒకమనిషిపైన కాని/ఒకప్రాంతమునందు గాని/ఒక సంఘటనమునందుగాని నిలిచి,కాలక్రమేణ తగ్గుతుంటుంది.అది ప్రాపంచిక విషయసంబంధమైతే పరిణితి చెందక ఉంటుండి.  కాని "సర్వసంక్షోభణ చక్రము"నందలి గుప్తతర యోగినులు అనంగులు.అపరిమిత శక్తి సంపన్నులు.వారి అనుగ్రహమ...

SARVASAPARIPURAKA CHAKRAMU-PARICHAYAMU

Image
    పరమేశ్వరి అనుగ్రహముతో మనము రెండవ ఆవరనమైన "సర్వాశా పరిపూరక చక్రము"లోనికి ప్రవేశించుచున్నాము.ఇక్కడ"త్రిపురేశి" చక్రేశ్వరి.పదహారు తిథినిత్యా దేవతల 'షోడశదల కమలము" గుప్తయోగినులతో,  "ఆత్మవిద్యా మహావిద్యా శ్రీవిద్యా కామసేవితా   శ్రీ- షోదశ అక్షరీ విద్యా త్రుకూట కామకోటికా" గా విరాజమానమై యుంటుంది.  పరమేశ్వరినిరుపప్లవ-అనగా వృద్ధి/క్షయములు లేని మోక్షస్వరూపము.అట్టి తల్లి మనలను అనుగ్రహించుతకై వృద్ధి/క్షయ స్వభావితములైన తిథినిత్యదేవతలతో విరాజమానమై మనలను అనుగ్రహించుచున్నది.   ఇది ఒక సంభావనమైతే.మరొక విధానములో 16 షోడశ ఉపచారములు-షోడశ సంస్కారములు-షోడశ అక్షరములు తానైనది షోదసదళాస్థిత యైనజగన్మాత.   అమ్మ అష్టమీచంద్ర విభ్రాజ-  ఏ మార్పులు లేని త్వరిత కళను శిరోభూషనముగా ధరించిప్రకాశించునది.  ఈ త్వరిత కళ ఎటువంటి మార్పులు లేని "నిర్గుణ తత్త్వమునకు"ప్రతీకగా ప్రకాశిస్తుంటుంది.  గుణములు ఉపాధిని ఆశ్రయించి ఉండునుకాని ఆత్మను చేరలేవు.   షోడశ దళ పద్మములోని పదహారు రేకులను పంచభూతములు+పంచేంద్రియములు జ్ఞాన+పంచేంద్రియములు కర్మకు+ మనసుకు అన్వయిస్తారు.  ఇవి అంతర్ముఖమున...

TRILOKAMOHANACHAKRAMU-PARICHAYAMU-03

Image
   అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా      అని శ్లాఘిస్తున్నది పరమేశ్వరిని లలితారహస్య సహస్రనామ స్తోత్రము.   న-ఇతి,ఇది కాదు ఇదికాదు అంటూ ముందుగా చిత్శక్తి ని గుర్తించే విధానములో కానిదానిని గుర్తించి,తొలగించుకొనమని "కేనోపనిషత్తు"చెబుతోంది.   " శ్రీ లలిత శివజ్యోతి సర్వకామదా     శ్రీ గిరినిలయా నిరామయా సర్వమంగళా"   ఈ మానవ ఉపాధి ఎంత విచిత్రమైనది." ఆహార నిద్రా భయ మైథునశ్చాఅన్న నాలుగు అవసరములను తీర్చుకుంటూ,తన మనసును ఇంద్రియభోగములపై కేంద్రీకరించి,తన అవసరములు ఏ విధముగా తీరుతున్నాయి? ఎవరు తీరుస్తున్నారు? బాహ్యములో కనపడుతూనా/లేక అంతః ముఖముగానుండి  అనే ఆలోచన రానీయకుండా ఆజగజ్జనని మాయ తెరలను కప్పుతూనే ఉంటుంది.అంతలోనే దయాంతరంగయైవాటిని విప్పుతుంటుంది.   ఆ ప్రక్రియలో మనకు సులభముగా అర్థమగుటకై ఎన్నోరూపములను ధరించి,ఎన్నెన్నో స్వభావములతో,సహాయకారిగా    ఆశివప్రకాసమైన శివాని సర్వాభీష్ట సిద్ధికై,సర్వ మంగళకారిణిగా,ప్రకృతిగా/ప్రపంచముగా  తనను తాను ప్రకటించుకుని,  "ఆహో పూరిషికగా" ఆవిర్భావము చెంది వాటన్నింటికి మూలముగా/ఆధారముగా అలరారుచు...

TRILOKAMOHANACHAKRA PARICHAYAMU-02

Image
   1-    అమ్మ అనుగ్రహముతో,సిద్ధిదేవతల సహకారముతో,త్రిపురా అనుగ్రహముతో సాధకుడు రెండవ చతురస్త్రాకారములోనికి ప్రవేశించగలుగుతున్నాడు.అష్టసిద్ధులు సాధకునిలోని కొంతవరకు సహాయపడి మరింతసహాయపడు "సప్తమాతృకలకు" అదియును మహాలక్ష్మి సహిత సప్తమాతృకలు పరిచయము చేస్తున్నారు.  కొందరి భావన ప్రకారము అష్టదిక్కులే అష్టమాతృకలుగా ఆరాధిస్తారు.  స్థూలలో అష్టదిక్కులు వీరైతే సూక్ష్మములో/మన మనస్సులో చెలరేగే అరిషడ్వర్గములు+పాపపుణ్యములుగాను పరిగణిస్తారు.  అమ్మతన రూపురేఖలే వీరికి ప్రసాదించినప్పటికిని ,అమ్మ అజ్ఞానుసారముగా వీరు ప్రవర్తిస్తుంటారు.  చండీసప్శతి శివుని స్వేదము నుండి ఈ ఏడుగురు తల్లులు ఉద్భవించాయని యుద్ధభూమిలో అసురసంహారము చేసి తరించారనికూడా చెబుతారు. నిశితముగాధ్యానించినమహాయోగులు అష్టసిద్ధుల పరమార్థమే సప్తమాతృక రూపమున సాధకునికి మరింత సహాయపడతారని విశ్వసిస్తారు. 1.బ్రాహ్మీ 2.మహేశి 3.కౌమారి 4.వైష్ణవి 5.వారాహి 6.మాహేంద్రి 7.చాముండా     మహాలక్ష్మి,  యుద్ధభూమిలో పరమేశ్వరి అనుగ్రహముతో సహాయకములుగామారి ధన్యతనొందినవైనప్పటికిని,  ప్రతిమనిషి/ఉపాధి అంతరంగము మంచి-చెడు...