Posts
GURUMAMDALAM AMTE?
- Get link
- X
- Other Apps
" అనంత సంసార సముద్రతార నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యాం వైరాగ్య సామారాజ్యద పూజనాభ్యాం నమోనమః శ్రీ గురుపాదుకాభ్యాం." "గు"కారో అంధకారస్య "రు" కారో తత్ నివారనం. వృత్తాకారముగా సంకేతించబడినది మండలము.అనేకానేక గురువు స్వరూపప్రకాశముగా అజ్ఞాననమనే చీకటిని తొలగించి స్వస్వరూపమును దర్శింపచేయునది గురు పాదము. పరమేశ్వరుడు ఆదిగురువు.పరమేశ్వరి ఆది శిష్యురాలు.వారు జగత్కళ్యానమునకై అనేకానేక నామరూపములతో గురు-శిష్యులుగా అజ్ఞానంధకారమును తొలగిస్తున్నారు. ఈ జగత్ సత్యమునే "దేవీఖడ్గమాల స్తోత్రము" గురుమండలముగా కీర్తిస్తున్నది. అంటే, కేంద్రస్థానమైన బిందువును చేరాలంటే ఎన్నో వృత్తములను ఆవృతము చేయగలగాలి సాధకుడు.అది గురువు సహాయములేకుండా సాధ్యము కాదు. దేవీ ఖడ్గమాల స్తోత్రము గురువులను,దైవ,సిద్ధ,మానవ అని మూడు విభాగములుగా కీర్తిస్తున్నది. ఔఘ అన్నశబ్దము సమూహము సమూహమును సూచిస్తుంది. సాక్షాత్తుగా పరమేశ్వరుడే ఆదిగురువై పార్వతిదేవి సందేహమును తీరుస్తున్నట్లు( చేతనులను ఉద్ధరించుటకై ...
tTOMMIDAVA AAVARANA-SARVANAMDAMAYA CHAKRAMU AMTE?
- Get link
- X
- Other Apps
హ్రీంకారాసన గర్భితానలశిఖాం సౌః క్లీం కళాం భిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధా ధౌతాం త్రినేత్రోజ్జ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాం ఉజ్జ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం. ఇప్పటిదాకా నాప్రయాణములో జరిగిన వింతలు ఇప్పుడు మనము ఎక్కడికి వెళుతున్నాము అని ప్రశ్నిస్తున్నాయి. "మూలప్రకృతిరవ్యకా వ్యక్తావ్యక్త స్వరూపిణి వ్యాపినీవివిధాకారా విద్యావిద్యా స్వరూపిణి" గా అమ్మ అనుగ్రహిస్తున్నది.ఇప్పటివరకు మనము అమ్మ యొక్క వ్యక్తరూపమును-విస్తరన వైభవమును దర్శించాము.ఇప్పుడు, నేను అని నేను భ్రమించిన ఉపాధి,నాలోని నేనుని కనుగొని అవ్యక్తముగా/బిందురూపముగా నున్న "సర్వానందమయ చక్రములోనికి" ప్రవేశిస్తున్నది.నేను ఇంతవరకు దర్శించిన యోగినీ మాతలు,సిద్ధి మాతలు,ముద్రా మాతలు,చక్రేశ్వరులు ,శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి" అని కీర్తిస్తూ ఆ పూర్ణ బిందువులో లీనమయిపోతున్నారు. ఆవరనములు సైతము అంతర్ధానమయిపోయినాయి. అంతలోని నన్నెవరో "శ్రీచక్రము అంటే" అని ప్రశ్నిస్తున్నారు. అమ్మదయ ఉంటే అర్థము కానిదేముంటుంది. ...
ANIMIDAVA AVARANAM-SARVASIDDHIPRADAMAMTE?
- Get link
- X
- Other Apps
"మహామహాజ్ఞప్తే-మహామహాగుప్తే మహామహానందే-మహామహాస్కందే" శ్రీచక్రధారిణి నమస్తే. "మ"కారము/మూలాధారము నుండి ప్రయాణమైన నా కుండలిని ప్రయాణము సహస్రార/ఆకాశ తత్త్వమును చేరుతున్నట్లున్నదేమో, 'మహా-మహా" అంటూ నాదము నన్ను ఆవరణములోనికి నడిపిస్తున్నది. మహాద్భుతము. పరమేశ్వరి నాదమయయై ప్రణవముగా నినదిస్తున్నది. మహేశ్వరి మంకెన పూవులా మెరిసిపోతున్నది "సర్వసిద్ధిప్రద చక్రము" అని వ్రాసియున్నది. నాపాపిటలో కదలికలు ప్రారంభమగుచున్నాయి.మహావాక్యములు వ్యతిరేకార్థములు అని ఇన్నాళ్ళు అనుకున్న నా అభిప్రాయము మారిపోతున్నది. నీవు పరమాత్మవు అనిన నేను ఇప్పుడు నేను పరమాత్మను అని అనాలనుకుంటున్నాను.నీవు-నేను ఒకటేనన్న సత్యమును బిగ్గరాగా అరచి,అందరికి వినపడేలాచెప్పాలనిపిస్తున్నది. ఆశ్చర్యముగా నాఇంద్రియములుసైతము తమప్రవృత్తిని మార్చుకుంటున్నాయి. నా కన్నులు ఆవరణ ప్రకాశమునుచూడగలుగుతున్నాయి. నాచెవులు ఓంకారమును వినగలుగుతున్నాయి. నాముక్కు సుగంధపరిమళమును ఆఘ్రాణింపగలుగుతున్నది. నా నాలుక మధ...
ADAVAMAJILEE-SARVAROGAHARACHAKRAMU AMTE?
- Get link
- X
- Other Apps
సర్వజ్ఞే సర్వశక్తే సర్వమంగళకారిణి సర్వజ్ఞానప్రదే దేవి సర్వేశ్వరి నమోస్తుతే" పరమేశ్వరి అనుగ్రహముతో ఇంకొకమెట్టుఎక్కి ఎనిమిది కోణములున్న "సంహార ఆవరణత్రయ చక్ర"మొదటి భాగమైన "సర్వరోగహరచక్రము"లోనికిప్రవేశించాను. ఏటు చూసినను బ్రహ్మశబ్దముతో కూడిన పదములు, బ్రహ్మచారి,బ్రహ్మపదార్థము,బ్రహ్మముడి,బ్రహ్మజెముడు,బ్రహ్మరాక్షసి,బ్రహ్మరథం,బ్రహ్మ అస్త్రం,బ్రహ్మ ఆనందం,బ్రహ్మాండం, ఎక్కువగా ఆకర్ష్స్తూ,"బ్రహ్మమొక్కటే అన్నది సారాంశం' అన్న పదములు నన్ను ఆశ్చర్య పరుస్తుంటే,ఎన్నెన్నో సందేహములు నన్ను ఆక్రమించాయి.
ARAVAMAJILEE-SARVARAKSHAAKARACHAKRAMU AMTE?
- Get link
- X
- Other Apps
'రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభా రాజత్కృపా రాజపీఠ నివేశిత నిజాశ్రితా" సత్యం-శివం-సుందరమయమిన స్థితికిచేరుటకు ద్వారమైన/జ్ఞానప్రదమైన "సర్వజ్ఞా సదనమూన ప్రవేశించుటకు పరమేశ్వరి వాత్సల్యము నన్నొక మెట్టు పైకెక్కించినది. ప్రాకామ్యసిద్ధిమాత-సర్వవశంకరి ముద్రా మాత నా వెంటనేఉండి నన్ను నడిపిస్తున్నారు. లోపలివైపునకు విచ్చుకొనియున్న పదితేజోమయ త్రికోణములతో వృత్తాకారముగానున్నది ఆ ఆవరనము,"అంతర్దాశము" అన్న నామము నన్ను మరింత ఆకర్షించినది.దీనినే "సర్వరక్షాకరచక్రమూ అని కూడా పిలుస్తారట. ఆశ్చర్యము.అచ్చము మా అమ్మలాగానే ఉన్న పదిమంది అమ్మలు పరమవాత్సల్యముతో నన్ను ఏం నాయినా వచ్చావా అంటూ పలుకరిస్తున్నారు.నేను వారి దగ్గరిగా వెళ్లే లోపలనే, 'గర్భము అనగా ఆధారము సర్వజీవసృష్టికి తల్లిగర్భము ఆధారము నిగర్భము అనగా నిక్షిప్తపరచబడిన ఆధారము సకలజ్ఞాన సిద్ధికి ఈ పదితల్లుల అనుగ్రహము ఆధారము" అని చెబుతున్నారు.బహుశా నన్ను ఉద్ధేశించియేనేమో. పిల్లలకు ఇష్టమైన పోషకమైన పదార్థములను దాచి తల్లి వారికి ఎలా తగినంత తినిప...
IDAVA MAJILEE-SARVAARTHASAADHAKA CHAKRAMU AMTE?
- Get link
- X
- Other Apps
" దశముద్ర సమారాధ్యా త్రిపురాశ్రీ వశంకరీ జ్ఞాన ముద్ర జ్ఞానగమ్యా జ్ఞాజ్ఞేయ స్వరూపిణీ" అని స్తుతిస్తిస్తున్నది పరమేశ్వరిని లలితరహస్య సహస్రనామ స్తోత్రము. ఇంకొక మెట్టిఎక్కిన సాధకునకు వృత్తాకారముగా బయటకు కనపడుచున్న వికసిత పది దళములుగల ఆవరణము అత్యంత మనోహరముగా కనిపించింది.పదిమందిమాతృమూర్తులు పరమవాత్సల్యముతో స్వాగతిస్తున్నారు.వారితో పాటుగా "వశిత్వసిద్ధి" మాత,సర్వోన్మాదిని ముద్రా మాత ధైర్యమునిస్తూ నడిపిస్తున్నారు.ఆ పదిమంది స్త్రీమూర్తులను కులోత్తీర్ణ యోగినులు అని గౌరవిస్తారట. కులము అన్న శబ్దమునకు సమూహము,వర్ణము అన్నార్థములే కాకుండా,జ్ఞానము అని కూడా భావిస్తారట.మనము ఏ విధముగా ఒకపరీక్షలో నెగ్గిన తరువాత అంతకుమించిన దానిని నేర్చుకునే అర్హతను సంపాదిస్తామో,అదేవిధముగా ఈ పదిమంది మాతలు జ్ఞాన ఉత్తీర్ణతకు/విస్తరణకు మరింతనేర్చుకొనుటకు సహాయపడతారట. ఈ అద్భుత ఆవరణమును బహిర్దశారము/సర్వార్థసాధక చక్రము అనిపిలుస్తారట.సర్వము అనగా తురీయ పురుషార్థమైన మోక్షము అన్నమాట.ధర్మ-అర్థ-కామ అవస్థలను దాటిన ఉపాధికి లభించేది. మాత సర్వో...