Posts

SREESUKTAM-04--KAAM SAHA-SMITAAM-SOSMITAAM

Image
   శ్లోకము   "కాం సోస్మితాం హిరణ్యప్రాకారం అర్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం     పద్మేస్థితాం పద్మవర్ణాం తాం ఇహోపహ్వయే శ్రియం.   జాతవేదుని ప్రార్థిస్తున్న భక్తుడు ప్రస్తుత శ్లోకములో,  ఇహ ఉపహ్వయే-లక్ష్మీదేవి తనకు ఎంతదగ్గరగాఉండాలంటే,తన శ్వాసలో  నిలిచియుండునట్లు సహాయపడుమని  ప్రార్థిస్తున్నాడు.    లక్ష్మీదేవి తనదగ్గరకు రావాలి,వచ్చితనను వీడకుండాలి,తన మనో సంకల్పమును దృఢపరచినిరంతరము ప్రణవమును నినదించునట్లుచేయాలి వానితో పాటుగా తనశ్వాసలో నిరంతరము నర్తిస్తుండాలి అని కోరుకుంటున్నాడు.   ప్రస్తుత శ్లోకము పరబ్రహ్మము కాం  అను శబ్దముతో సూచించబడినది.క కారము బ్రహ్మ స్వరూపము.   వాజ్మానస గోచరము కానిది "కాం" ఇది  అని విశేషించి చెప్పజాలనిది.చూపించజాలనిది.    ప్రకృతికి మూలకారణమై ఆధారభూతమైనది.   పంచదశి మంత్రమే శరీరముగా భాసించునది కనుక "కాం"     లక్ష్మీదేవి సోస్మితాం.సుందర దరహాసముతో తప్తకాంచన వర్ణముతో ప్రకాశించుచున్నది.    ఆ తల్లి పద్మములో స్థిరముగా కూర్చునియున్నది.ఆ పద్మము పద్మాసనస్థయై పద్మవర్ణమ...

SREESUKTAM-03 ASVAPURVAM

Image
  శ్లోకము   ప్రస్తుత శ్లోకములో భక్తుడు తల్లి తనను అనుగ్రహించుతకు వచ్చు సుందర దృశ్య దర్శనమును అనుగ్రహింపమని కోరుచున్నాడు.   మొదటి స్లోకములో లక్ష్మీదేవిని ఆహ్వానము చేయమనిన సాధకుడు రెండవ శ్లోకములో వచ్చ్చి తన దగ్గర శాశ్వతముగా ఉండునట్లు సహాయముచేయమని కోరాడు.మూడవ శ్లోకములో తల్లి తనను అనుగ్రహించుతకు ఏ విధముగా రావలెనో తెలియచేయుచున్నాడు.  మూడు కోరికలను కోరుచున్నాడు. 1. తల్లి రథమధ్యమున ఆసీనురాలై యుండాలి. 2.రథమునకు ముందర అశ్వములు అలంకరింపబడియుండాలి. 3.రథమునకు వెనుక భాగము ఏనుగుల ఘీంకారముతో చైతన్యప్రద సంకేతముగా ఉండాలి.    తల్లి నా హృదయమనే రథమును అధిష్ఠించి యుండాలి.    నా ద్ర్ఢసంకల్ము అశ్వములవలె అకుంఠితముగా ఉండాలి.    నా అనాహతమునిరంతరము ఏనుగుల ఘీంకారము వలె ప్రణవ నాదోపాసన చేస్తుండాలి.    ఓ జాతవేద !       నా మనోఫలకమున అట్టి సుందర దృశ్యము నిండి నన్ను 

SREESUKTAMU-02-TAAM AAVAHA JATAVEDO

Image
  శ్లోకము  "తాం మ ఆవహ జాతవేదో లక్ష్మిం అనపగామినీం   యస్యాం  హిరణ్యం  విందేయం గామశ్వం పురుషానహం.   పూర్వ శ్లోకములో లక్ష్మీదేవిని తన దగ్గరకు చేర్చమని జాతవేదుని ప్రార్థించిన భక్తుడు జాతవేదునికి మరొక విన్నపమునుచేయుచున్నాడు.   ఓ జాతవేదుడా!      నీవు నిత్యపూజలలో జ్యోతిగాను,అగ్నికార్యములలో  మేము అందించు యజ్ఞవస్తువులను దేవతలకు అనుకూలమగు హవిస్సులుగా చేర్చి,వారి అనుగ్రహమును అందించు సంధానకర్తగా కీర్తింపబడుతున్నావు.దానికి కారనము, 1ఆశ్రిత ఆశ్రయము 2.ఆర్ష వాజ్మయము 3.అనంత సంపద అను నీ మూడు శుభలక్షణములు.    లక్ష్మీదేవి ప్రసన్నతను అందచేయగల జ్ఞానచైతన్యము నీవేసుమా.   నీ ఆశ్రిత ఆశ్రయముతో నిన్ను చేరగలిగినాను.నీ ఆర్ష వాజ్మయ శక్తితో ఆ తల్లి శాశ్వతముగా నాలో నిండియుండునట్లు ,నన్ను సౌభాగ్య సౌశీల్యునిగా దీవించునట్లు చేయుము.   ప్రస్తుత శ్లోకము రాజ్యలక్ష్మి "రాజ్యలక్ష్మీ కోశనాథ చతురంగబలేశ్వరీ'గా ,భక్తుని అనుగ్రహింపమని జాతవేదుని అర్థించుచున్నాడు భక్తుడు.  ఓజాతవేద! అమ్మకు నే పలుకు ఆహ్వానము తాత్కాలికము కాదు.  నా హృదయపీఠమున శాశ్వత నివాసమ...

SREESUKTAM-01 -HIRANYAVARNAM

Image
  శ్రీసూక్తము-01  ************  "ఓం హిరణ్యవర్ణాం  హరిణీం సువర్ణరజతస్రజాం   చంద్రాం  హిరణ్మయీం లక్ష్మీం " జాతవేదో" మ ఆవహ."   ఇది అమ్మవారి సాకార సంకీర్తనము.సహాయకుడు జాతవేదుడు.అమ్మ బంగారు మేనిఛాయతో మెరిసిపోతున్నది.మేనిఛాయకు మెరుగులు అద్దుతూ సువర్ణ వెండి ఆభరణములు కదులుతూ కాంతులను వెదజల్లుతున్నవి.తల్లి బంగారు మేనిఛాయయే బంగారుమయముగా మరింత ముచ్చట గొలుపుతున్నది.దానికి తోడుగా తల్లి ధరించిన చంద్రరేఖ ఆహ్లాదమును కలిగించుచున్నది.అట్టి పరాశక్తి కరుణతో నా చుట్టు ఉన్న మాయతెరలను తొలగించివేసి,అనుగ్రహరూపముగా నన్ను నిండియుండుటకై,చైతన్యస్వరూపమైన ఓ జ్ఞానమా నీవు నా విన్నపమును అమ్మకు హవిస్సు రూపముగా అందించి,ఆమె అనుగ్రహము నాలో సంపూర్ణముగా నిండియుండునట్లు ఆశీర్వదించుటకు సహాయపడుము.  ఇది బాహ్యార్థము.సాకార దర్శనము.   ఇంకొంచము నిశితముగా అర్థము చేసుకొన కలిగితే అమ్మ "ఈం "బీజ ప్రదాయిని.సర్వానుగ్రహకారిణి.ఆమె లక్ష్మీ-హరిణీం.  హరి మనోవల్లభి కనుక హరిణి  ప్రకృతి స్వరూప-స్వభావము కనుక హరిణి  అశుభములను హరించివేసే తల్లి హరిణి.   అమ్మ ధరించిన సువర్ణ-రజత స్రజములు కే...

SREE SUKTAM-INTRODUCTION

Image
    శ్రీ సూక్తము   **********  లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం-      శ్రీరంగ ధామేశ్వరీం  దాసీభూతసమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం   శ్రీమన్మంద  కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం  త్వాం  త్రైలోక్య కుటుంబినీం సరసిజాం       వందేముకుందప్రియాం.   "శ్రీ  అను నాదము ఆరువిధములుగా అభివర్ణింపబడినది."  1.స్రీయతే ఇతి శ్రీః-చేతనులచే ఆశ్రయింపబడు పరబ్రమము "శ్రీ."  2,శ్రేయతి ఇతి శ్రీః-చేతనులకు శ్రేయోదాయకమైనది "శ్రీ"  3.శ్రుణోతి ఇతి "శ్రీః".-మొరలను ఆలకించేది "శ్రీ"  4.శ్రావయతి ఇతి శ్రీః-లక్ష్మీమాతగా చేతనుల ఆర్తిని స్వామికివిన్నవించే దయ/సహాయము "శ్రీ"  5.శ్రుణాతి ఇతి శ్రీః-పాపములను నశింపచేసేది శ్రీ"  6.శ్రీణాతి ఇతి శ్రీః-జగద్ధాత్రియై తనకరుణతో మాయ అను తెరను తొలగింపచేయునది.   శ్రేయతే లక్ష్యతే శ్రీః-శ్రేయతే దృశ్యతే శ్రీః   లక్ష్యమును మార్గమును సుగమముచేసే అవ్యాజకరుణయే "శ్రీ"    సూక్తము అనగా శక్తివంతములైన-ఫలప్రదములైన మంత్రముల కూర్పు.సూక్తములు అపౌరుషేయములు.  సు-శుభ...

SAHO SVAATAMTRAMAA-2024

Image
     సాహో  స్వాతంత్ర్యమా (78)    ***************** శ్రీ పింగళి వెంకయ్యచే మంగళ సంకేతముగా చెక్కబడిన శిల్పమురా మన చక్కనైన పతాక. అల్లూరి వీరత్వము, ఆనందుని వివేకము భారత భాగ్య విధానపు సౌభాగ్యము గాగ "తాకాలనుకుంటే పీకలు కోసేస్తాం" అను కర్తవ్యదీక్ష సాక్షి" కాషాయపు రంగు." బాపూజీ ఆశయాలు, అమ్మ థెరెస్సా ఆచరణలు తేటతెల్ల పరచుచున్న వెలిసిపోని వెల్లరా "వందేం అహింసా పరమో ధర్మ:" అను శాంతి కపోత సంకేతం "తెలుపు రంగు". పంచభూతములు శుచిగ పంచభక్ష్య రుచులుగ కర్షకునికి కూతురుగా,క్షుత్తునకు మాతగా "సుజలాం,సుఫలాం,సస్య శ్యామలాం" అను పచ్చతోరణపు కుచ్చు మెచ్చుకోలు "ఆకుపచ్చ రంగు." నిరంతర ప్రయత్నమనే నీలివృత్త నృత్యముతో వ్యాకులత నిర్మూలనమనే ఆకుల సమానతతో ధర్మపు నడిబొడ్డుయైన అశోక ధర్మ చక్రముతో జనగణమన గళముతో జనగణముల మంగళముతో "జై కిసాన్" పొలముగ,"జై జవాన్" బలముతో కోటలలో పేటలలో కోటి కోటి కాంతులతో ఎగురుతోంది పతాక- ఎద నిండిన ఏరువాక. అమ్మలార రండి రండి-అయ్యలార రారండి పిల్లా పాపలు అందరు పరుగు పరుగున రండి శ్రీ పింగళి వెంకయ్య,శ్రీ బంకించంద్ర చటర్జీ శ్రీ రవీ...

CHAKRESVARI AMTE?